కర్నూలు(హాస్పిటల్) : కర్నూలులో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ సోకింది. ఇందులో ఒకరు మహిళ కాగా, మరొకరు 5 సంవత్సరాలు బాలుడు. అలాగే తుగ్గలి మండలానికి చెందిన మరో మహిళ స్వైన్‌ఫ్లూ లక్షణాలతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతోంది. వివరాల మేరకు కర్నూలు నగరానికి చెందిన ఒక మహిళ స్వైన్‌ఫ్లూ లక్షణాలతో రెండు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.
అనుమానిత కేసుగా గుర్తించిన వైద్యులు ఆమెకు స్వాప్ పరీక్ష చేసి శాంపిల్స్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల్లో ఆమె స్వైన్‌ఫ్లూతో బాధ పడుతున్నట్లు ఆసుపత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆసుపత్రిలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వైన్‌ఫ్లూ వార్డుకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అలాగే కర్నూలు పట్టణానికి చెందిన 5 సంవత్సరాల బాలుడు స్వైన్‌ఫ్లూ లక్షణాలతో సోమవారం ఆసుపత్రిలోని పీడియాట్రిక్ విభాగంలో చేర్పించారు. కాగా బాలుని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మంగళవారం ఉదయం ఈ బాలున్ని ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డుకు తరలించారు. అలాగే తుగ్గలి మండలం పెండేకల్ గ్రామానికి చెందిన ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు సమాచారం. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధ పడుతున్న ఆమెను అక్కడినుంచి మంగళవారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్యపరీక్షలు చేసిన వైద్యులు స్వాప్ పరీక్షలు నిర్వహించి గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. ఈమెను క్యాజువాలిటీ నుంచి స్వైన్‌ఫ్లూ వార్డుకు తరలించారు.
కర్నూలులో రెండు స్వైన్‌ఫ్లూ కేసులు
Published Wed, Mar 11 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM
Advertisement
Advertisement