మోదీ సొంత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్టమైన గుజరాత్లో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 347 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం తాజాగా మరో 92 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య జనవరి నుంచి ఇప్పటివరకు 5715 కు చేరిందని గుజరాత్ ఆరోగ్యశాఖ తెలిపింది. వారిలో ఇప్పటికి 4408 మందికి నయమైందని తెలిపింది. ఒక్క అహ్మదాబాద్ లోనే 1945 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వారిలో జనవరి నుంచి ఇప్పటివరకు 103 మంది మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో గుజరాత్ లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి చెందిన సఫ్దార్ గంజ్ హాస్తిటల్ కు చెందిన డాక్టర్ శివదాస్ చక్రవర్తి, ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ పవన్ తివారీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది.