safdargunj hospital
-
ఆసుపత్రిలోకి నో ఎంట్రీ.. రోడ్డుపైనే మహిళ ప్రసవం.. వీడియో వైరల్!
న్యూఢిల్లీ: పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణీని చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది ఒప్పుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మహిళ నడి రోడ్డుపైనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ అమానవీయ సంఘటన దిల్లీలోని సఫ్దార్‌గంజ్ ఆసుపత్రి వద్ద మంగళవారం జరిగింది. రోడ్డుపై కొందరు మహిళలు చీరలు అడ్డుపట్టగా.. మహిళకు పురుడు పోసిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఈ సంఘటనపై నివేదిక అందించాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీనిపై ఆసుపత్రి సైతం దర్యాప్తు చేపట్టింది. ఆ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు పట్టుకుని గర్భిణీ చుట్టు నిలుచున్నారు. అక్కడ కొందరు నర్సులు సైతం ఉన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. సోమవారం ఆసుపత్రికి రాగా చేర్చుకునేందుకు అక్కడి సిబ్బంది నిరాకరించినట్లు బాధిత మహిళ బంధువులు ఆరోపించారు. అత్యవసర విభాగం ఎదుటే రాత్రంత ఉన్నామని వాపోయారు. ఈ విషయంపై నివేదిక కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. देश की राजधानी दिल्ली के सफदरजंग अस्पताल में एक गर्भवती महिला ने सफदरजंग अस्पताल के बाहर एक नवजात शिशु को दिया जन्म इस दुर्व्यवहार को क्या कहे दिल्ली व केंद्र सरकार की लचारता कहे यह अस्पताल परिसर स्टाफ की प्रंशसा कहे ?@PMOIndia @ArvindKejriwal pic.twitter.com/smOyRs2KFZ — Ajay kanojiya Hindustani {INC} (@ajayaicc2022) July 19, 2022 గాజియాబాద్‌లోని ఖేరా ప్రాంతానికి చెందిన ఓ 30 ఏళ్ల మహిళను సఫ్దార్‌గంజ్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ మనోజ్ తెలిపారు. ‘ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించటం వల్ల రోడ్డుపైనే పాపకు జన్మనిచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం శిశువును, మహిళను ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. ఇరువురు ఆరోగ్యంగా ఉన్నారు. అయితే.. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనపై ఆసుపత్రికి ఢిల్లీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. జులై 25లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదీ చదవండి: కుక్కకు బండరాయి కట్టి వరదలో తోసేసిన కిరాతకులు -
పోలీసులు-రెడాల మధ్య ఉద్రిక్తత.. వైద్యసేవలు బంద్!
NEET PG Counselling Delay: నీట్ పీజీ అడ్మినిషన్ కౌన్సెలింగ్ ఆలస్యం అవుతుండడాన్ని నిరసిస్తూ ఢిల్లీలో రెసిడెంట్ డాక్టర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్నాయి. సోమవారం పోలీసులు రెసిడెంట్డాక్టర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా.. పలువురు రెడాలు గాయపడినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఇక ఈ ఉదయం నుంచీ అదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీట్ విషయమై వాదనలు వింటున్న సుప్రీం కోర్టుకు రెడాలు ఎయిమ్స్ పక్కనే ఉన్న సఫ్దార్జంగ్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి మార్చ్ నిర్వహించబోతుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. గేట్లు మూసేయడంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక రెడాలపై పోలీసుల తీరును ఖండిస్తూ.. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోషియేషన్(FAIMA) డిసెంబర్ 29, ఉదయం 8గం. నుంచి దేశవ్యాప్తంగా అన్నీ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి డిసెంబర్ 2020లో నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడుతూ వచ్చింది. తీవ్ర అభ్యంతరాల నడుమే ఈ సెప్టెంబర్‌లో నీట్ పరీక్షను నిర్వహించింది ప్రభుత్వం. అయితే అడ్మిషన్ ప్రక్రియ మాత్రం ఆలస్యమవుతూ వస్తోంది. ఈ తరుణంలోనే రెసిడెంట్ డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెడాలపై లాఠీఛార్జ్, అసభ్య పదజాల ప్రయోగం ఆరోపణలను పోలీసులు ఖండించారు. పైగా రెడాలే రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు. నిరసనకారుల్లో 12 మందిని అరెస్ట్ చేసి.. ఆపై రిలీజ్ చేసినట్లు ప్రకటించారు. సఫ్దార్జంగ్ ఆస్పత్రి నుంచి మార్చ్ నిర్వహించకుండా మాత్రమే అడ్డుకున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో నిన్న ఉదయం నుంచే అత్యవసర సేవల్ని మినహాయించి.. అన్ని విభాగాలను రెసిడెంట్ డాక్టర్లు బహిష్కరించారు. కరోనా, ఒమిక్రాన్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఆస్పత్రులు సైతం ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. -
మోదీ సొంత రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం
అహ్మదాబాద్: ప్రధాని నరేంద్రమోదీ సొంతరాష్టమైన గుజరాత్లో స్వైన్ ఫ్లూ స్వైరవిహారం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 347 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని అధికార వర్గాలు తెలిపాయి. సోమవారం తాజాగా మరో 92 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బాధితుల సంఖ్య జనవరి నుంచి ఇప్పటివరకు 5715 కు చేరిందని గుజరాత్ ఆరోగ్యశాఖ తెలిపింది. వారిలో ఇప్పటికి 4408 మందికి నయమైందని తెలిపింది. ఒక్క అహ్మదాబాద్ లోనే 1945 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వారిలో జనవరి నుంచి ఇప్పటివరకు 103 మంది మరణించారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో గుజరాత్ లో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడానికి న్యూఢిల్లీకి చెందిన సఫ్దార్ గంజ్ హాస్తిటల్ కు చెందిన డాక్టర్ శివదాస్ చక్రవర్తి, ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ పవన్ తివారీలను కేంద్ర ప్రభుత్వం నియమించింది.