స్వైన్ ప్లూ వ్యాధితో గాంధీ ఆసుపత్రిలో ఓ మహిళ(58) మంగళవారం రాత్రి 10గంటల సమయంలో మృతి చెందిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది.
స్వైన్‌ప్లూతో మహిళ మృతి
Jan 18 2017 4:14 PM | Updated on Sep 4 2018 5:07 PM
హైదరాబాద్: స్వైన్ ప్లూ వ్యాధితో గాంధీ ఆసుపత్రిలో ఓ మహిళ(58) మంగళవారం రాత్రి 10గంటల సమయంలో మృతి చెందిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌కు చెందిన మహిళ ఈ నెల 12వ తేదీ నుంచి మెడిసిటీ, మాక్స్ క్యూర్ ఆసుపత్రులలో చికిత్స పొందింది. సోమవారం పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యులు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లమని సూచించారు.
దీంతో మంగళవారం రాత్రి 7గంటల సమయంలో గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ కాసేపటికి బాధితురాలు మృతి చెందింది. దీంతో స్వైన్ ప్లూతో ఈ ఏడాది మరణించిన వారి సంఖ్య మూడుకు చేరింది. గాంధీలో మరో వృద్ధురాలు కూడా స్వైన్‌ప్లూ వ్యాధికి చికిత్స పొందుతోంది.
Advertisement
Advertisement