డోన్‌లో స్వైన్‌ప్లూ కేసు నమోదు
Published Thu, Feb 2 2017 10:56 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో మరో స్వైన్‌ప్లూ కేసు నమోదయింది. ఇప్పటికే కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్, నందికొట్కూరు మండలంలోని ప్రాతకోటకు చెందిన ఇద్దరికి స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. తాజాగా డోన్‌కు చెందిన ఓ మహిళకు సైతం ఈ వ్యాధి ఉన్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఈ మహిళ పది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లొచ్చారు. జనవరి 31న స్వైన్‌ప్లూ లక్షణాలతో కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు. వైద్య పరీక్షల్లో స్వైన్‌ప్లూ ఉన్నట్లు నిర్థారించినట్లు ఎపడమాలజిస్టు మహేష తెలిపారు.
Advertisement
Advertisement