'స్వైన్ఫ్లూ మరణాలకు సీఎం కేసీఆర్దే బాధ్యత'
తెలంగాణలో స్వైన్ఫ్లూ మరణాలకు సీఎం కేసీఆర్దే బాధ్యతని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క శుక్రవారం అన్నారు. మున్సిపల్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న కేసీఆర్ పరిసరాల పరిశుభ్రతను విస్మరించారని భట్టి పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత లేకపోవడం వల్లే స్వైన్ఫ్లూ వైరస్ ప్రబలిందని, ఈ వైఫల్యాన్ని ఆరోగ్యశాఖపై నెడుతూ సీఎం కేసీఆర్ తప్పించుకోవడం సరికాదని ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు.