'మున్సిపల్ సమస్యల పరిష్కారానికి మంత్రుల కమిటీ'
హైదరాబాద్: మున్సిపాలిటీల్లోని సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారమార్గాలు అన్వేషించేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు తెలిపారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లతో సీఎం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణాల్లో చేపట్టే ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను తెప్పించుకునే అధికారం మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఇస్తామని అన్నారు. కష్టపడి పనిచేసే కమిషనర్లకు ప్రమోషన్లు ఇస్తామన్నారు.ఒకసారి ఎన్నికైతే ఐదేళ్లదాకా అవిశ్వాసం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని పట్టణాల్లో స్థిరాస్తుల విలువ తాజా అంచనాల ప్రకారం రూపొందిస్తామన్నారు. ఇకపై సినిమా థియేటర్ల నుంచి మున్సిపాలిటీలే వినోదపు పన్ను వసూలు చేయాలని కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛభారత్ అమలుచేస్తామని కేసీఆర్ తెలియజేశారు.