తెలంగాణలో రుణమాఫీపై సబ్ కమిటీ భేటీ | telangana cabinet sub committee meeting | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రుణమాఫీపై సబ్ కమిటీ భేటీ

Published Sat, Sep 20 2014 11:43 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

telangana cabinet sub committee meeting

హైదరాబాద్ : తెలంగాణలో రుణమాఫీ అమలుపై మంత్రివర్గ ఉప సంఘం శనివారమిక్కడ సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ సర్కార్ ఉప సంఘాన్ని వేశారు. ఈ భేటీలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్,  జోగు రామన్న, మహేందర్ రెడ్డితో పాటు ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రుణమాఫీ విధివిధానాల ఖరారుపై చర్చలు జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement