సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేలో 3.50 కోట్ల మంది ప్రజలు వారి వివరాల్ని ఇచ్చినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కులగణన సర్వే నివేదికను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీకి ప్రణాళికాశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అందిచారు. ఆ నివేదికపై మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీతక్క, ఇతర ఉన్నతాధికారులు చర్చించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడారు. ‘ఇవాళ చారిత్రాత్మకమైన రోజు. దేశంలో ఇలాంటి సర్వే ఎక్కడా జరగలేదు. సామాజిక న్యాయం కోసం ఈ సర్వే. వెనుకబడ్డ తరగతులకు న్యాయం చేయాలనేది మా ఆకాంక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 96.9 శాతం సర్వే జరిగింది. సర్వేలో లక్షా 3వేల 899మంది సిబ్బంది పాల్గొన్నారు. 3.1శాతం మంది సర్వేకి అందుబాటులో లేరు. కులగణన సర్వేలో బీసీ- 46.25 శాతం, ఎస్సీ-17.43శాతం, ఎస్టీ -10.43 శాతం ఉన్నారు. ఫిబ్రవరి 4న ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశంలో కులగణన రిపోర్ట్ ప్రవేశ పెడతాం. అదే రోజు 11 గంటలకు అసెంబ్లీ సమావేశంలో కేబినెట్ నిర్ణయాన్ని సభలో ప్రవేశపెడతామని’ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment