loan weivers
-
‘రుణమాఫీ’.. ఖాతాలో జమ చేయాలి
ఆదిలాబాద్‌అర్బన్: ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ డబ్బులను రైతుల ఖాతాలో జమ చేయాలని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. గురువారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్న దృష్ట్యా పలు అంశాలపై బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు రుణం తీసుకున్న ప్రతీ రైతుకు పంట రుణమాఫీ కింద రూ.25 వేలు ఖాతాలో జమ చేస్తున్నామని, ఇప్పటి వరకు 2,940 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. సుమారు రూ.4.70 కోట్లు రైతులకు చేరాయని, మిగతా రైతులకు త్వరలో జమ చేయాలన్నారు. ఈ డబ్బులను రైతులు వ్యవసాయ పనులకు వినియోగించుకోవడం జరుగుతుందని, ఈ డబ్బును ఎలాంటి రికవరీ కింద జమచేయకూడదని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఈజీఎస్ పథకం కింద జిల్లాలో లక్ష 60 వేల వరకు జాబ్‌కార్డులు ఉన్నాయని, రోజుకు 92వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని పేర్కొన్నారు. బేల మండలం మంగ్రూడ్ గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం 200 ఎకరాలను గుర్తించామన్నారు. పట్టణంలో సమీకృత మార్కెట్ ఏర్పాటుకు అనువైన స్థలం గుర్తించాలని, పట్టణాభివృద్ధికి, సుందరీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలు, ఇతర అవసరమైన పనులకు కావాల్సిన భూమిని సేకరించాలన్నారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కొనసాగించాలన్నారు. నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయాలని, హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కోవిడ్–19 నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, డేవిడ్, డీఆర్వో నటరాజ్, ఆర్డీవోలు సూర్యనారాయణ, వినోద్‌కుమార్, జెడ్పీ సీఈవో కిషన్, డీఆర్డీవో రాజేశ్వర్, ఎల్డీఎం చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
రైతే రాజు! ఎన్నికల రోజు మాత్రమే
దేశ జనాభాలో 54 శాతం మంది, మన తెలుగు రాష్ట్రాలలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినా, రైతుల ఎజెండాకు ఎప్పుడూ రాజకీయ పార్టీలు ప్రాధాన్యతనివ్వలేదు. ప్రతి రాజకీయ నాయకుడు రైతు మిత్రులమని, రైతుబిడ్డలమని చెప్పుకున్నా, రైతుల కోసం చేసింది శూన్యమే. రైతులు కులాలు, ప్రాంతాల వారీగా చీలిపోయి తమ డిమాండ్ల సాధనకు ప్రయత్నించకపోవడం ఒక కారణమైతే.. చిన్న, సన్నకారు రైతుల వ్యవసాయం ఎప్పటికీ గిట్టుబాటు కాదన్న అంచనాతో ఆ వర్గం వారిని కనీసం 10–15 శాతం తగ్గించాలన్న ఆలోచనలు రెండో కారణం. ఈ విషయాలను కొన్ని పార్టీలు సూటిగా.. ఇంకొన్ని డొంకతిరుగుడుగా చెబుతున్నాయి. మరికొన్ని ఏమీ మాట్లాడకుండా ఈ ఎజెండా అమలుకు చర్యలు తీసుకుంటున్నాయి. చిత్రం ఏమిటంటే.. వ్యవసాయం నుంచి బయటికొచ్చిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలేమిటన్న ప్రశ్నకు ఏ రాజకీయ పార్టీ వద్దా సమాధానం లేదు. నిరుద్యోగ సమస్య ఈ పదేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరింది. 2014లో 3.41 శాతమున్న నిరుద్యోగిత 2018 నాటికి 6.1 శాతానికి పెరిగింది. 2022 నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శ్రమ చేయగలిగిన వయసులో (15–59 సం.) ఉండే వారి సంఖ్య 6.12 కోట్లని అంచనా. అయితే వ్యవసాయేతర పనుల ద్వారా 2.8 కోట్ల మందికే ఉపాధి లభిస్తోందని అంచనా. కాబట్టి ఏ రకంగానైనా సరే.. వ్యవసాయ రంగమే మిగిలిన వారందరినీ ఆదుకోవాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలు ఈ రంగం సమస్యలను గుర్తించడంలో తప్పులు చేస్తుండటం, వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేయకపోవడం వల్ల సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వాల తప్పుడు విధానాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి. రుణమాఫీ మాయ.. వ్యవసాయ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని గత ఎన్నికలకు ముందు అన్ని పార్టీలు రుణమాఫీ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా సుమారు లక్ష కోట్ల రూపాయల రుణమాఫీ జరిగితే, అందులో సగం రెండు రాష్ట్రాల్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ మొత్తం రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు, ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామని హామీనిచ్చాయి. అధికారంలోకి రాగానే అనేక నిబంధనలు పెట్టి చివరికి కొంతలో కొంత అదీ నాలుగు విడతలలో ఇచ్చిన విషయం తెలిసిందే. దేశంలోనే అత్యధికంగా వ్యవసాయ రుణగ్రస్తులు (తెలంగాణ: 89.1%, ఆంధ్రప్రదేశ్: 92.9%) ఉన్నది తెలుగు రాష్ట్రాల్లోనైనా, సంస్థాగత రుణాలు పొందుతున్నది 21 శాతం మంది రైతులే. రెండు రాష్ట్రాల్లో సుమారు నలభై లక్షల మంది (ఆంధ్రప్రదేశ్–25 లక్షలు, తెలంగాణ– 15 లక్షలు) కౌలు రైతులుంటే వారిలో రుణాలు పొందేది చాలా తక్కువ. మిగతా వారంతా అధిక వడ్డీకి ప్రైవేటు రుణాలు, సూక్ష్మ రుణాలు తీసుకునే వారే. రుణమాఫీ వీరికేమాత్రం ఉపయోగపడదు. పైగా 4 విడతలుగా చేయటం వల్ల ఏటా రైతులకు అందాల్సిన రుణాలు అందక అధిక వడ్డీలకు ప్రైవేటు రుణాలు తీసుకోవాలి. రుణాలు సరైన సమయంలో అందకపోవటంతో చాలామంది రైతులు బీమా కూడా పొందలేకపోయారు. రుణాలు సకాలంలో తిరిగి చెల్లించిన వారికి రుణమాఫీ వర్తించకపోవడం అటువంటి వారిని నిరుత్సాహపరిచేలా ఉంటుంది. ఒకసారి మాఫీ చేస్తే మరో మాఫీ కోసం ఎదురు చూస్తారనీ, సక్రమంగా చెల్లించిన వారిని రాయితీ ఇవ్వకుండా శిక్షించడంవల్ల వారూ తిరిగి చెల్లించరని, ఈ రకంగా బ్యాంకుల తిరిగి చెల్లింపుల సంస్కృతి దెబ్బతిని గ్రామీణ బ్యాంకింగ్ రంగం కుప్ప కూలుతుందనీ విమర్శకుల భావన. ఇలా చేయొచ్చు.. పంట నష్టం, ప్రతికూల మార్కెట్ పరిస్థితులు, గిట్టుబాటు కాని ఆదాయం, పెరిగిన ఉత్పత్తి ఖర్చు వంటి కారణాలతో తీసుకున్న అప్పుని రైతులు తిరిగి చెల్లించలేక పోతున్నారు. సంక్షోభ కారకాల్లో ఎలాంటి మార్పు చేయకుండా కేవలం రుణాలు మాఫీ చేయడం వల్ల ఫలితం ఉండదు. తదుపరి పంటకాలాల్లో కూడా ఇదివరకటి పరిస్థితే పునరావృతమై తిరిగి కొత్త అప్పు చెల్లించలేని పరిస్థితే మళ్లీ ఏర్పడి రుణమాఫీ మరలా అడిగే పరిస్థితి వస్తుంది. దీనికంటే, కౌలు రైతులతో సహా వ్యవసాయం చేసే రైతులందరికీ పంట, మార్కెటింగ్ రుణాలు, మౌలిక సదుపాయాల కోసం రుణాలందే వ్యవస్థ ఏర్పాటు చేయటం కోసం, వారికి బ్యాంకు గ్యారెంటీగా వుంచటం కోసం ప్రభుత్వం ఒక నిధిని ఏర్పాటు చేయవచ్చు. దానిపై వచ్చే వడ్డీతో సరిగ్గా చెల్లించే రైతులకి రాయితీలు అందించవచ్చు. పూర్తిగా సంక్షోభంలో ఉన్న రైతు కుటుంబాలను గుర్తించి వారి రుణాలు మాత్రం రీషెడ్యూల్ లేదా మాఫీ చేయవచ్చు. అంతేగాని అందరికీ మాఫీ అనేది పూర్తిగా అనవసర విషయం. ‘నాన్ రి కోర్స్’ రుణాలు మేలు.. అమెరికా లాంటి దేశాలలో ఉన్న నాన్ రి కోర్స్ వ్యవసాయ రుణాల వంటివి ఇవ్వవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే తాత్కాలిక ‘మార్కెట్’ రుణాలుగా (ధర తక్కువగా ఉన్నప్పుడు పంటని నిల్వ ఉంచుకుని ధర పెరిగినప్పుడు అమ్ముకునే వెసులుబాటు కోసం) ప్రారంభించిన సౌకర్యం నాన్ రీకోర్స్ వ్యవసాయ పరపతిగా పరిణతి చెందింది. ఈ పద్ధతిలో రైతుకు పంట హామీగా రుణాన్ని స్తారు. మార్కెట్ ధర నిర్దేశిత ధరకు తక్కువగా ఉంటే నష్టాన్ని మినహాయించుకొని తిరిగి చెల్లిస్తే రుణఖాతాలో మిగులు రద్దవుతుంది. పంట నష్టం జరిగితే అప్పు చెల్లించాల్సిన పని లేదు. తక్కువగా పండితే ఆ పంటని ప్రభుత్వానికి దఖలు చేస్తే సరిపోతుంది. రుణం రద్దవుతుంది. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తన ఉచిత ఆహార ప«థకం (ఫుడ్ స్టాంప్‌లు) కోసం వినియోగించుకుంటుంది. రైతు వ్యవసాయం చేస్తే చాలు పంట సక్రమంగా ఉండి ధర పలికితేనే తిరిగి చెల్లించడం జరుగుతుంది. లేకుంటే అప్పు రద్దవుతుంది. ప్రతిసారీ రుణమాఫీ కోసం అడగాల్సిన పని లేదు. అప్పు తిరిగి చెల్లించడం లేక చెల్లించకపోవడం రైతు ఇష్టానికే వదిలేస్తారు. అమెరికా వ్యవసాయ విభాగం (యూఎస్డీఏ) ఈ రుణాలనందిస్తుంది. వాస్తవ సాగుదారులకే నగదు బదిలీ రుణమాఫీ పని చేయడం లేదని గుర్తించిన రాజకీయ పార్టీలు ప్రవేశపెట్టిన కొత్త విధానం రైతులకు నేరుగా నగదు బదిలీ చేయటం. తెలంగాణలో వ్యవసాయ ఖర్చులు తగ్గించే లక్ష్యంతో ‘రైతుబంధు’ పేరుతో ప్రతి పంటకాలానికి ఎకరానికి రూ.4 వేలు, సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మొత్తాన్ని రూ.10 వేలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికలలో తెరాస హామీనిచ్చింది. అయితే ఈ పథకం పెట్టుబడి సహాయ పథకంగా పిలవబడుతున్నా, ఇది కేవలం పట్టాదారు పాస్‌బుక్ ఉన్న భూ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. వ్యవసాయం చేస్తూ రోజు వారి కష్టనష్టాలు భరిస్తున్న లక్షల మంది కౌలు రైతులు, భూమి పట్టా లేని అనేక మంది ఈ లబ్ధి పొందలేక పోయారు. ఆ తర్వాత ఒరిస్సా ప్రభుత్వం ‘కాలియా’ (కుటుంబానికి సంవత్సరానికి పదివేలు) పేరుతోను, కేంద్ర ప్రభుత్వం కుటుంబానికి రూ.ఆరు వేలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పేరుతో (కుటుంబానికి రూ.15 వేలు) నగదు బదిలీ పథకాలు ప్రవేశపెట్టాయి.. వీటన్నిటిలోను వాస్తవ సాగుదారులను గుర్తించి సహాయం అందించటానికి ప్రయత్నం చేయక, భూమి హక్కుదారులకు మాత్రమే అందచేయటానికి ఏర్పాట్లు చేశారు. వస్తు రూపేణా ఇచ్చే సబ్సిడీలకంటే నేరుగా నగదు బదిలీ చేయటం రైతులకు ఉపయోగపడేదే. అయితే అది వాస్తవ సాగుదారులకు అందేలా చేయటం ముఖ్యం. నగదుబదిలీఇలాఉండాలి ♦ సాయం నేరుగా వాస్తవ సాగుదారులకు మాత్రమే అందాలి. వారిని గుర్తించి నేరుగా అందించేందుకు ఏర్పాట్లు చేయాలి ♦ పెట్టుబడి సహాయం అయినప్పుడు (తెలంగాణ) వర్షాధార పరిస్థితులలో ఉన్న రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఎకరం, అంతకంటే తక్కువ ఉన్నా రైతులకు అందే సహాయం మరీ తక్కువ. ♦ కుటుంబ ఆదాయ సహాయ పథకం అయినప్పుడు (ఆంధ్ర, ఒడిశా, కేంద్రం) ఇవి కుటుంబం గౌరవంగా బతకటానికి అవసరమైనంతగా ఉండాలి. ఈ మొత్తానికి ఉద్యోగులకు జీతం పెరిగినట్లు కరువు భత్యాలు కలపాలి. ♦ ఎంతివ్వాలనే దానిపై నిర్ణయాలు తీసుకోవటానికి, అందకపోతే ఫిర్యాదు చేయటానికి రాష్ట్రస్థాయిలో రైతుల ఆదాయ కమిషన్ ఉండాలి. ♦ ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు నెరవేర్చక పోతే రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకునేలా చట్టంలో మార్పులు చేయాలి. హామీలు ఎలా నేరవేరుస్తారో, దానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో పార్టీలు స్పష్టంగా ముందే చెప్పాలి. లేదంటే రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. ఇదీ రైతు ఎజెండా సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో దేశంలోని రైతు సంఘాలన్నీ ఒక్కతాటిపై నిలిచి.. తమ డిమాండ్లు ఇవీ అని పార్టీల ముందు పెట్టాయి. భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ), కర్ణాటక రాజ్య రైతు సంఘ (కేఆర్ఆర్ఎస్), తమిలగ వివసాయిగై సంఘం (టీవీఎస్), ఆదివాసీ గోత్ర మహాసభ (ఏజీఎం)లతోపాటు కొన్ని ఇతర సంఘాలన్ని గత వారం ‘ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఫార్మర్స్ మూవ్మెంట్’ పేరుతో ఏకమయ్యాయి. రైతు సమాజం డిమాండ్లు పద్దెనిమిదింటిని తమ మేనిఫెస్టోల్లో చేర్చాలని, వాటి పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని డిమాండ్ చేసింది ఈ సంస్థ! ♦ వ్యవసాయ సంక్షోభంపై చర్చించేందుకు పార్లమెంటు ఉభయ సభలు కనీసం నెల రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. ♦ 2013నాటి భూసేకరణ చట్టంలో పరిహారం చెల్లింపులు న్యాయంగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ♦ భూ సేకరణను రాష్ట్ర జాబితాలోంచి తొలగించి.. కేంద్ర జాబితాలోకి చేర్చాలి. ♦ గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు అన్ని పంట ఉత్పత్తులను వందశాతం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి. ♦ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బేషరతుగా పంట రుణాల మాఫీ.. ⇔ పంట బీమా పథకంలో సమూల మార్పులు చేయాలి.. అడవి జంతువుల వల్ల పంటలకు కలిగే నష్టాన్నీ బీమా పథకంలోకి చేర్చాలి. ⇔ ఎకరాకూ ఏటా రూ.పదివేల పెట్టుబడి సాయం. ⇔ రైతులకు రూ.ఐదు వేల నెలవారీ పింఛన్. ⇔ అన్ని రకాల వ్యవసాయ పనిముట్లకు జీఎస్టీ నుంచి మినహాయింపు.. ⇔ పాముకాట్లు వంటి వ్యాసంగిక ఇబ్బందుల నుంచి రక్షణకు ఉచితసామాజిక భద్రత పథకం. ⇔ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లో ఒక్కరికైనా ప్రభుత్వోద్యోగం.. -
హామీలిచ్చి గాలికొగ్గేశారు
కంఠం ప్రభుదాస్, పాడేరు :‘గత ఎన్నికల్లో ఎన్నో హామీలిచ్చారు. చివరకు గాలికొగ్గేశారు. రుణమాఫీసేత్తామన్నారు. ఇప్పుడు వడ్డీతో కలిపి తడిసిమోపెడైంది. పంట నష్టానికి పరిహారం కూడా ఇవ్వలేదు. కాయితాలట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరగడమే తప్ప పనులవటం లేదు. పోడు భూములకు వ్యక్తిగత పట్టాలివ్వలేదు. దీనివల్ల ఉపాధి పనులకు, బ్యాంకు రుణాలకు దూరమవుతున్నాం. గిరిజన యువతకు ఉద్యోగాలివ్వటం లేదు. ఏజెన్సీలో అనేక పోస్టులు ఖాళీ ఉన్నా.. నియామకాలు చేపట్టలేదు’ అని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పాడేరు మండలం కుజ్జెలి పంచాయతీ పరిధిలోని దిగుమోదాపుట్టు, కుజ్జెలి, రాములు పుట్టు, ఎగు మోదాపుట్టు గ్రామాల ప్రజలు ములపుట్టులో రచ్చబండ నిర్వహించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై చర్చించి.. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాబు వస్తే జాబు, రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి కల్పిస్తామని ఆశపెట్టారని.. అధికారంలోకి వచ్చాక అమలు చేయలేదని ధ్వజమెత్తారు. నిజమైన నిరుద్యోగులకు భృతి అందటం లేదని, ఐదెకరాలు దాటి ఉన్న కుటుంబాలకు పింఛన్లు ఇవ్వటం లేదని, జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే సబ్సిడీ పథకాలు ఇచ్చారని పేర్కొన్నారు. టీడీపీ వాళ్లను నమ్మి ఓటేసిన రైతులు, డ్వాక్రా మహిళలు వడ్డీల భారం మోయలేక రుణగ్రస్తులుగా మిగిలిపోయారని నిరసన తెలిపారు. రచ్చబండ కార్యక్రమంలో ఎవరేమన్నారంటే.. రైతుల కోసం ఒక్క పనీ చేయలేదు రైతులకు మేలు చేసే పనులు ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు. పంట నష్టం కలిగితే పరిహారం ఇవ్వలేదు. జన్మభూమి గ్రామసభల్లో దరఖాస్తులు తీసుకున్నారే తప్ప ఏ çపనీ చేయలేదు. ప్రతిసారి దరఖాస్తులుఇవ్వడానికి వ్యయప్రయాసలే తప్ప ప్రయోజనం లేదు. వర్షాభావం వల్ల పంటలు దెబ్బతిని పెట్టుబడులు కూడా చేతికి రావటం లేదు. అయినా ప్రభుత్వం నుంచి సాయం అందలేదు. – పాంగి దేముడు, కుజ్జెలి ఉద్యోగాల్లేక చదువులు మానేశారు చదువుకున్న గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవు.ప్రభుత్వం ఏజెన్సీలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయలేదు. ఉన్నత విద్యావకాశాలు అందుబాటులో లేవు. ఆర్థిక స్థోమత, ఉద్యోగావకాశాలు లేకపోవడంతో యువకులు ఇంటర్, డిగ్రీ తర్వాత చదువు మానేసి కూలి పనులకు వెళ్తున్నారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల్ని మెరుగుపర్చాలి. – తామర నారాయణ, కుజ్జెలి రుణమాఫీ జరగలేదు ఆరేళ్ల క్రితం నా భూమి పట్టాపై పాడేరు యూనియన్ బ్యాంకులో రూ.50 వేలు పంట రుణం తీసుకున్నాను. రుణమాఫీ అవుతుందని చెప్పడంతో బ్యాంకుకు బాకీ కట్టలేదు. నాకు ఒక విడత కూడా రుణమాఫీ జరగలేదు. వడ్డీతో కలిపి రూ.80 వేలు అయ్యిందని, వెంటనే చెల్లించాలని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. పంట రుణం మాఫీ అవుతుందని నమ్మి మోసపోయాను. – బొండా చిన్నబాలన్న, రాములపుట్టు మంచి పాలన అందించాలి ఎమ్మెల్యే సీట్లు మహిళలకు ఇస్తుంటే బినామీలు పాలిస్తున్నారు. గిరిజనులకు అన్యాయం జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తించి గిరిజనులకు మేలు చేసేవిధంగా మంచి నాయకులకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలి. – కుంతూరు సూరిబాబు, రాములపుట్టు అటవీ హక్కు పత్రాలు ఇవ్వలేదు మా పంచాయతీలో పోడు భూములు సాగు చేసుకుంటున్న కుటుంబాలు 500పైగా ఉన్నాయి. మాకు వీఎస్ఎస్ కింద ఉమ్మడి పట్టా ఇచ్చారు. వ్యక్తిగత పట్టాలివ్వాలని ఐదేళ్ల నుంచీ అడుగుతున్నాం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వ్యక్తిగత పట్టాలు ఉన్నవారికే 50 రోజులు అదనంగా ఉపాధి పనులు కల్పిస్తున్నారు. రుణాలు ఇస్తున్నారు. ఉమ్మడి పట్టా కావడంతో మాకు ఇవేమీ అందటం లేదు. – కె.నాగరాజు, రైతు,దిగుమోదాపుట్టు గ్రామ సచివాలయవ్యవస్థ మేలు అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించడం పేదలకు ఒక వరంలాంటిది. ప్రతి గ్రామంలో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడమే కాకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. నవరత్న పథకాల వల్ల పేదరికం తొలగిపోతుంది. – గబ్బాడ చిట్టిబాబు, మాజీ సర్పంచ్, కుజ్జెలి -
ఆదివారం.. హడావుడి జీవో
అనంతపురం అగ్రికల్చర్: కరువు జిల్లా..ఏటా వర్షాభావంతో పంటలు పండలేదు. ప్రత్యామ్నాయ పనులూలేవు. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంటలు చేతికందక, పెట్టుబడి తిరిగి రాక, అప్పులు అధికమై రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నా.. ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారంలేదు. 4,5 విడతల రుణమాఫీ డబ్బుల కోసం రైతులు వేయి కళ్లతో ఎదురు చూశారు.రెండేళ్లుగా పైసాకూడా చూపించని ప్రభుత్వం.. ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు హడావుడిగా ఆదివారం సెలవురోజైనా జీఓ 38 విడుదల చేశారు. ♦ రుణమాఫీ పథకంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న 4, 5వ విడత మాఫీ సొమ్ము చెల్లిస్తామంటూ జీవోలో పేర్కొన్నారు. నగదు ఇస్తారా? లేదా చెక్కులు అంటగడతారా? అనేది జీవోలో స్పష్టత ఇవ్వకుండా ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేశారు. ♦ 2014 ఓన్నికల సమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ‘బ్యాంకు మెట్లు ఎక్కే పనిలేకుండా రైతులకు సంబంధించి అన్ని రకాల వ్యవసాయ రుణాలూ మాఫీ చేసి రుణ విముక్తులను చేస్తాం’’ అంటూ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాబు మాటలు నమ్మి రైతులు ఓట్లు వేసి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాగానే చంద్రబాబు తన అసలు స్వరూపాన్ని చూపించారు. నిబంధనలు, షరతులు, కమిటీల పేరుతో ఏడాది పాటు కాలపాయన చేసి రైతులను గందరగోళంలోకి నెట్టేశారు. చివరకు పంట, బంగారు నగల తాకట్టుకు సంబంధించి కుటుంబానికి గరిష్టంగా రూ.లక్షన్నర, అది కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం చేస్తామంటూ ప్రకటించి ఇబ్బందుల్లోకి నెట్టారు. రూ.6,817 కోట్ల నుంచి రూ.2,744 కోట్లకు కుదింపు.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకు 2013 డిసెంబర్ నాటికి 10.24 లక్షల ఖాతాల్లో ఉన్న అన్ని రకాల వ్యవసాయ రుణాలూ రూ.6,817 కోట్లు మాఫీ కావాల్సి ఉంది. ఇందులో పంట రుణాలు 6.08 లక్షల ఖాతాల పరిధిలో రూ.3,093 కోట్లు, బంగారు నగల తాకట్టుపై 2.12 లక్షల ఖాతాల పరిధిలో రూ.1,851 కోట్లు, వ్యవసాయ అనుబంధ టర్మ్లోన్లు 2.03 లక్షల ఖాతాల పరిధిలో 1,873 కోట్లు మాఫీ చేయాల్సి ఉండేది. కానీ నిబంధనలు, కమిటీల పేరుతో కాలయాపన చేసి రుణమాఫీ సొమ్ముపై కొర్రీల మీద కొర్రీలు వేసి చివరకు రూ.2,744 కోట్లకు కుదించారు. ఇదైనా సక్రమంగా చేశారా? అంటే అదీలేదు. రైతులను అవస్థలపాలు చేసిన ప్రభుత్వం : విడతల వారీ, మాఫీ పత్రాల పేరుతో జాప్యం చేస్తూ నాలుగున్నరేళ్లు రైతులను ఇబ్బందుల పాలు చేశారు. రుణమాఫీ అనగానే రైతులు జడుసుకునేలా చేశారు. మాఫీ కోసం రైతులు పడిన అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మండలాలు, డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రం, రాజధాని ప్రాంతాలతో పాటు బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన రైతులు వేలల్లో ఉన్నారు. మొదటి విడతగా రూ.1,068 కోట్లు, రెండో విడతగా రూ.460.90 కోట్లు, మూడో విడతగా రూ.502.80 కోట్లు ఇచ్చినా అందులో వేలాది మందికి వడ్డీకి కూడా సరిపోలేని పరిస్థితి కల్పించారు. రెండు, మూడో విడతల కింద ఇంకా రూ.33 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఇక 4, 5వ విడత సొమ్ము విడుదల చేయకుండా రెండేళ్లుగా కాలయాపన చేస్తూ వచ్చారు. రైతులను మభ్యపెట్టి మరోసారి ఎన్నికల్లో లబ్ధిపొందే ఎత్తుగడగా ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే 4, 5వ విడత రుణమాఫీ చెలిస్తామంటూ జీవో విడుదల చేశారు. 5.50 లక్షల మంది రైతులకు ఇప్పుడు నాలుగో విడతగా రూ.544.70 కోట్లు, ఐదో విడత కింద రూ.586.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ.33 కోట్లను కలుపుకుంటే మాఫీ సొమ్ము రూ.1,164.20 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. -
రుణమాఫీ ఉచ్చులో రైతులు
అనంతపురం అగ్రికల్చర్/శింగనమల: రుణమాఫీ హామీ మాయలో రైతులు ఓడిపోయారు. చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంకుల్లో పరపతి కోల్పోయారు. ఎన్నికల ముందు అన్ని రకాల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్న బాబు.. ఆ తర్వాత మాట మార్చి సవాలక్ష నిబంధనలతో నాలుగున్నరేళ్లు దాటినా అరకొర మాఫీతో చుక్కలు చూపుతున్నాడు. రుణమాఫీ మాయలో 2014 సంవత్సరంలో దాదాపుగా రూ.4 వేల కోట్ల రుణాల రెన్యూవల్‌కు బ్రేక్‌పడింది. అదే సంవత్సరం ఖరీఫ్‌లో వేరుశనగతో పాటు ఇతర పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. పంట రుణాల రెన్యూవల్ జరగకపోవడంతో వాతావారణ బీమా కింద ప్రీమియం చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో రూ.500 కోట్ల వరకు రావాల్సిన వాతావరణ బీమా పరిహారం లభించక రైతులకు తీరని అన్యాయం జరిగింది. మొత్తం మీద అస్తవ్యస్త రుణమాఫీతో రైతులు గత నాలుగన్నరేళ్లుగా పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. అసలెంతో.. వడ్డీ ఎంతో.. మాఫీ అయినదెంతో ఇప్పటికీ అర్థంకాక సతమతమవుతున్నారు. ఇలా రుణమాఫీ మాయతో రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. చెప్పిన దానికి.. చేసిన దానికీ పొంతన లేకపోవడంతో లక్షలాది మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. కాలయాపన.. కొర్రీలు ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం 2013 డిసెంబర్ నాటికి అన్ని రకాల వ్యవసాయ రుణాలు 10.24 లక్షల ఖాతాల్లో రూ.6,817 కోట్లు. ఇందులో పంట రుణాలు 6.08 లక్షల ఖాతాల పరిధిలో రూ.3,093 కోట్లు, బంగారు నగల తాకట్టుపై 2.12 లక్షల ఖాతాల పరిధిలో రూ.1,851 కోట్లు, వ్యవసాయ అనుబంధ టర్మ్లోన్లు 2.03 లక్షల ఖాతాల పరిధిలో 1,873 కోట్లు ఉన్నాయి. ఎన్నికల హామీ మేరకు ఇవన్నీ బేషరతుగా మాఫీ చేయాలి. కానీ అలా చేయలేదు. కమిటీలు, నిబంధనలు, షరతుల పేరుతో ఏడాది పాటు కాలయాపన చేసి మాఫీ సొమ్ముపై కొర్రీలు వేశారు. తర్వాత చెప్పినట్లుగా పంట రుణాలు, బంగారు నగల రుణాలు తీసుకున్నా.. దాదాపు రూ.4,955 కోట్లు మాఫీ చేయాల్సి ఉండేది. అది కూడా చేయకుండా.. చివరకు రూ.2,744 కోట్లకు కుదించారు. అదైనా ఒకేసారి చేశారా అంటే.. చేతులెత్తేశారు. విడతల వారీగా అంటూ రుణమాఫీ పత్రాలతో మాయ చేశారు. ఇవన్నీ చూసి రైతులు కంగుతిన్నారు. మాఫీ కోసం బ్యాంకులు, వ్యవసాయ శాఖ, కలెక్టరేట్ కార్యాలయాలు తిరిగి తిరిగి అలసిపోయారు. ఇక్కడ పరిష్కారం కాకుంటే ఏకంగా హైదరాబాద్, గుంటూరు వెళ్లి వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయాలు, రుణమాఫీకి ఇన్చార్జిగా వ్యవహరించిన కుటుంబరావును కలిసి ఫిర్యాదులు సమర్పించారు. ఇందుకోసం రోజుల తరబడి పనులు మానేసి వేలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా చాలా మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదు. వేలాది మంది రైతులు అరకొర మాఫీకి నోచుకున్నారు. రూ.2,744 కోట్ల మాఫీ ఇలా.. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఎట్టకేలకు రూ.2,744 కోట్లు మాఫీకి అర్హత ఉన్నట్లు తేల్చారు. అందులో మొదటి విడతగా 2.6 లక్షల మంది రైతులకు రూ.650 కోట్లు వన్‌టైం సెటిల్మెంట్ కింద మాఫీ చేయగా, మరో 5.5 లక్షల మంది రైతులకు రూ.418 కోట్లు ఇచ్చారు. ఇక రెండో విడతగా 5.5 లక్షల అకౌంట్లకు రూ.460.90 కోట్లు విడుదల చేయగా.. ఇందులో ఇంకా రూ.10.18 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇక మూడో విడత కింద 5.5 లక్షల అకౌంట్లకు రూ.502.80 కోట్లు విడుదల చేయగా అందులో కూడా ఇంకా రూ.22.72 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ఇలా రెండు, మూడు విడతల కింద రైతులకు రూ.32.90 కోట్లు రావాల్సి ఉంది. ఇవి కాకుండా నాలుగో విడతగా రూ.544.70 కోట్లు, ఐదో విడత కింద రూ.586.60 కోట్లు విడుదల కావాల్సి ఉంది. ఇలా మొత్తంగా రూ.1,164.20 కోట్ల మాఫీ సొమ్ము విడుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిగో అదిగో అంటూ ఏడాదిగా ఊరిస్తున్నా అతీగతీ లేకపోయింది. ఎన్నికలు సమీపిస్తుండంతో ఇప్పుడు నగదు కాకుండా చెక్కుల రూపంలో రైతులను బురిడీ కొట్టించే యత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రుణమాఫీ పరిస్థితి ఇలా.. మాఫీకి అర్హత కలిగిన పంట రుణాల మొత్తం : 2,744 కోట్లు అర్హత పొందిన రైతుల అకౌంట్లు : 8.10 లక్షలు ఒకేసారి మాఫీ అయిన మొత్తం : 650 కోట్లు మొదటి విడతగా మాఫీ అయిన మొత్తం : 418 కోట్లు రెండో విడత మాఫీ అయిన మొత్తం : 461 కోట్లు మూడో విడత మాఫీ : 502 కోట్లు ఇప్పటిదాకా జమ అయిన మాఫీ సొమ్ము : 1,906 కోట్లు రెండు, మూడు విడతల్లో పెండింగ్ : 33 కోట్లు నాలుగో విడత కావాల్సిన మొత్తం : 547.70 కోట్లు ఐదో విడత రావాల్సిన మొత్తం : 586.60 కోట్లు నాలుగు, ఐదు విడతల్లో రావాల్సిన సొమ్ము : 1,131.30 కోట్లు మాఫీ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న రైతులు : 5.50 లక్షలు అర్హత ఉన్నా మాఫీకి నోచుకోని రైతులు(అంచనా) : 35వేలు అరకొరగా మాఫీకి నోచుకున్న రైతులు(అంచనా) : 85వేలు -
నాడు మాఫీ మాయ... నేడు మరో దగా...
రుణమాఫీ పేరుతో మహిళా సంఘాల ఓట్లతో గద్దెనెక్కి తానలా అనలేదని నాలుక మడతేశారు. వారి ఆగ్రహం పెల్లుబకడంతో మసిబూసి మారేడుకాయ చేసేందుకు యత్నిస్తున్నారు. పెట్టుబడి నిధికింద రూ. పదివేల వంతున ఇస్తామని చెప్పి రకరకాల నిబంధనలు పెట్టారు. తీరా వారు ససేమిరా అనడంతో వాడుకునేందుకు అవకాశం కల్పించి కొందరికే పరిమితం చేశారు. విపక్షనేత డ్వాక్రా రుణమాఫీ చేస్తామని ప్రకటించగానే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోవిడత పసుపుకుంకుమ పేరుతో మళ్లీ ఎర వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలినుంచీ బాబు తత్వం తెలిసిన మహిళలు ఈ మాయమాటలు నమ్మలేమని తెగేసి చెబుతున్నారు. విజయనగరం అర్బన్/నెట్వర్క్: అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తామంటూ తెగ ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మరచిపోయారు. వారి మాటలు నమ్మి బ్యాంకుకు బకాయిలు చెల్లించని చెల్లెమ్మలు అధికారుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలారు. కొందరైతు వడ్డీ తడిసిమోపెడవడంతో బంగారం తాకట్టుపెట్టి అప్పు తీర్చుకుని ఉసూరు మన్నారు. ఆ తరువాత రోజుకో మాటతో... పూటకో కథతో వారిని మాయచేశారు.మొత్తం కాదు.. కేవలం గ్రూపునకు రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని ఒకసారి, ఒక్కో సభ్యునికి రూ.10 వేల వంతున హామీ లేని రుణంగా ఇస్తామని మరోసారి... చివరకు పసుపుకుంకుమ కింద దానిని ఉచితంగా ఇస్తున్నానని ఇంకోసారి నమ్మబలికారు. తీరా అదీ కొందరికే ఇచ్చి సరిపెట్టారు. మాఫీ చేయాల్సిన రుణం రూ.450 కోట్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికా రం చేపట్టేనాటికి రూ. 450 కోట్ల మేర డ్వాక్రా రుణాలున్నాయి. వాటిని మాఫీ చేయాల్సి ఉంది. కానీ దానిని పట్టించుకోని ప్రభుత్వం వడ్డీ మాఫీ అంటూ ఓ కథ చెప్పారు. దానికోసం నిరీక్షించేసరికి తొలి 16 నెలలకు రూ.30 కోట్ల వరకు వడ్డీ భారం మహిళలపై పడింది. అప్పటికే గ్రేడ్–ఏలో ఉన్న 20 వేల మహిళా పొదుపు సంఘాలు అప్పట్లో ఆర్థికభారంతో కొట్టుమిట్టాడాయి. అప్పులు తీర్చుకోవడానికి వారంతా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. కొన్ని సంఘాలైతే తేరుకోలేకపోయాయి. తొలివిడత పసుపు కుంకుమపైనా ఆంక్షలు పసుపుకుంకుమ పేరుతో ఇస్తున్న సొమ్మును కూడా పొదుపు మొత్తంలాగే వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వడం డ్వాక్రా మహిళల్లో ఆగ్రహావేశానికి కారణమైంది. ప్రస్తుతానికి మాఫీ చేయలేనవి, ఒకే సారి రూ.10 వేలు పసుపు కుంకుమగా ఇస్తానంటూ బహిరంగ సభల్లో ప్రకటించిన చంద్రబాబు.. లోటు బడ్జెట్ పేరుతో తొలి విడత రూ. 3 వేలు మాత్రమే ఇచ్చి... తర్వాత విడతల వారీగా మిగతా సొమ్మును చెల్లిస్తామని పేర్కొనడంతో వారంతా ఆందోళన చెందారు. అంతేకాకుండా జమ చేసే రూ.3 వేలు కూడా వాడుకోకుండా గ్రూపు మొత్తం మీద వచ్చే సొమ్మునంతా పొదుపులాగే అకౌంట్లలో ఉంచుకొని వడ్డీని మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టడంపై తీవ్రస్థాయిలో మహిళలు మండిపడ్డారు. ఎలాగైతేనేం వారి ఆగ్రహానికి భయపడి విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. కొందరికే తొలివిడత పసుపుకుంకుమ తొలిత విడతగా 2014 మార్చిలోగా నమోదైన సంఘ సభ్యులకు రూ.పదివేలు చెప్పున ప్రభుత్వం అందించింది. అప్పట్లో నమోదైన సంఘాలు 37,450 సంఘాలుంటే వాటిలో 4,09,616 సభ్యులున్నారు. వీరికి మొత్తం రూ.413 కోట్లు అందజేసినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. అందులోనూ కొందరికి మొండిచెయ్యే మిగిలింది. కొందరికి తొలివిడత ఇస్తే మిగిలిన రెండు విడతలకు ఎసరుపెట్టారు. మరికొందరికి తొలివిడత కాదని, రెండో విడతగా ఇచ్చారు. అంతేగాకుండా 2014 ఏప్రిల్ తరువాత 3 వేల సంఘాల సభ్యులు 35,945 మందికి పసుపు కుంకుమ ఇవ్వనే లేదు. రెండో విడతపైనా అనుమానాలే... జిల్లాలో ప్రస్తుతం 4.45.571 మంది డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ పథకం రెండో విడతలో రూ.422.57 కోట్లు కేటాయిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి వరుసగా రూ.2,500, రూ.3,500, రూ.4,000 విలువ చేసే చెక్కులను ముందుగానే అందిజేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే తొలివిడత అందుకోలేనివారి పరిస్థితేమిటన్నదానిపై అధికారులవద్దా సమాధానం లేకపోవడం విశేషం. అర్హులైనవారి వివరాలు సేకరిస్తున్నాం రెండో విడత పసుపుకుంకుమ పథకానికి సంబంధించిన విధి విధానాలను అనుసరించిన సభ్యులకు వర్తింప చేస్తాం. వాటి ఆధారంగా కార్యాచరణ తయారు చేస్తాం. ముందుగా అర్హులైన పొదుపు సంఘాల మహిళలను గుర్తిస్తాం. సంఘం పేరు, బ్యాంకుఖాతా, ఆధార్ వంటివి సేకరిస్తున్నాం.– కె.సుబ్బారావు, పీడీ, డీఆర్డీఏ ఇది ఎన్నికల గిమ్మిక్కే గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు మరో మూడు నెలల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ మహిళలను ఆకట్టుకొనేందుకు పదివేలు, సెల్ ఫోన్ అంటూ మో సం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇది ఎన్నిక ల గిమ్మిక్కేనని మహిళలు ఎప్పుడో గ్రహించా రు. రాబోయే ఎన్నికల్లో మహిళలంతా తమ ఓటుతో బుద్ధి చెప్పేందుక సిద్ధంగా ఉన్నారు.– ఆనిమి ఇందిరాకుమారి, ఎంపీపీ, కురుపాం -
గుండె ఆగినా.. అండ లేదుగా!
సాగు చేయలేకపోయారు. పరిస్థితులు బాగు చేయలేకపోయారు. నిన్నటి అప్పుల భయం, రేపటి రోజుపై బెంగ, ఉన్న పరిస్థితులపై అయోమయం.. వెరసి అన్నదాత ఉసురు తీసుకున్నాడు. వ్యవసాయం చేస్తున్నంత కాలం రైతుకు సహాయ నిరాకరణ చేసిన సర్కారు ప్రాణం పోయాక కూడా ఆ నిర్లక్ష్యాన్ని వదలడం లేదు. బలవంతంగా ఊపిరి ఆపుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం లేదు. భామిని మండలంలో జిల్లాలోనే అధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఎవరికీ సక్రమంగా పరిహారం అందలేదు. కుటుంబ పెద్దను కోల్పోయి వేదన అనుభవిస్తున్న ఆ కుటుంబాలు సాయం అందక మరింత యాతన పడుతున్నాయి. శ్రీకాకుళం, భామిని: బిడ్డికి కాంతారావు, అల్లాడ ఆనంద్, సవలాపురపు వసంతరావు, మండల రామారావు, కలిశెట్టి మన్మధరావు.. వ్యవ‘సాయం’ లేక ఉసురు తీసుకున్న రైతులు. అంతేకాదు సర్కారు నిర్లక్ష్యానికి నిర్జీవ సాక్ష్యాలు వీరు. భామిని మండలానికి చెందిన ఈ కర్షకులు సాగు చేయలేక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. కానీ సర్కారు మాత్రం వారి కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారం అందించడంలో తీవ్ర అలసత్వం చూపుతోంది. సమావేశాల్లో చర్చించినా.. జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సమీక్షలో భాగంగా ఆయా వర్గాలకు చెందిన రైతుల ఆత్మహత్యలూ చర్చకు వచ్చాయి. ఆ కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని ఆదేశాలూ జారీ చేశారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. డీవీఎంసీలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీలో దళిత, గిరిజన రైతుల ఆత్మహత్యలపై, వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడంపై తీవ్రంగానే చర్చించారు. పాలకొండ ఆర్టీఓ, వ్యవసాయ జేడీలకు త్రిసభ్య కమిటీతో పరిశీలనకు ఆదేశాలు వచ్చాయి. కానీ ఇంత వరకు భామిని మండలంలో ఆ రైతు కుటుంబాల పరిస్థితిపై ఎవరూ పరిశీలన చేయలేదు. పరిహారాలూ అందించలేదు. కనీసం ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో కూడా తెలుసుకోలేదు. పోయిన ప్రాణాలివే.. ♦ భామిని మండలం బొడ్డగూడ గిరిజన గ్రామానికి చెందిన ఆదివాసీ రైతు బిడ్డికి కాంతారావు(42) 2015 ఫిబ్రవరి 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. మండలంలో మొదటి సారిగా అప్పుల బాధతో ఆదివాసీ గిరిజన రైతు చనిపోవడం సంచలనం రేకెత్తించింది. రెండున్నర ఎకరాల్లో పండించిన పత్తి పంట నష్టాలు, వేసిన కొండపోడు జీడి తోటల్లో దిగుబడి రాకపోవడం అప్పు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మృత్యుమార్గం ఎంచుకున్నాడు. మృతునికి భార్య కుసుమ, కొడుకు శ్రీనుల నలుగురు కుమార్తెలు అనాథలుగా మిగిలారు. అధికారులు మృతికి కారణాలు నమోదు చేశారు. ఐటీడీఏతో పాటు ఏ ఇతర శాఖల నుంచి కూడా ఎలాంటి పరిహారం అందలేదు. ♦ మండల కేంద్రంలోని దళిత రైతుల అల్లాడ ఆనంద్(50), 2015 జూన్ 29న ఆత్మహత్య చేసుకున్నారు. తన పూరింటిలోనే పురుగు మందు తాగి చనిపోయారు. కౌలుకు సాగు చేస్తున్న నాలుగు ఎకరాల పత్తి పూర్తిగా దెబ్బతినడం, దిగుబడి గిట్టుబాటు కాకపోవడంతో ప్రాణాలు తీసుకున్నారు. భార్య, నలుగురు కుమార్తెలను వదిలేసి అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ♦ మండలం లివిరికి చెందిన మరో దళిత యువ రైతు సవలాపురపు వసంతరావు(34) 2015లో ఆగస్టు 12న బలవంతపు మరణానికి పాల్పడ్డాడు. కౌలుకు తీసుకున్న రెండున్న ఎకరాల్లో పత్తి సాగు చేసి అప్పుల పాలై పురుగు మందు తాగి చనిపోయాడు. భార్య సుజాత, తల్లి చిన్నమ్మిలు అనాథలైపోయారు. వీరికి సాయం అందలేదు. ♦ సతివాడలో మరో రైతు పురుగు మందుకు ప్రాణాలు అర్పించాడు. రైతు మండల రామారావు(65) 2015 నవంబర్ 27న పురుగుల మందు తాగి మృతి చెందాడు. చెరువు కింంద రెండున్నర ఎకరాల జిరాయితీ భూముల్లో పంటలు పోవడం, కౌలుకు తీసుకున్న ఎకరన్నర భూమిలోనూ వరి పోవడంతో ఉసురు తీసుకున్నాడు. ఇతనికి భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ♦ బురుజోలకు చెందిన రైతు కలిశెట్టి మన్మధరావు(52) 2015 డిసెంబర్ 18న పురుగు మందు తాగి చనిపోయారు. పది ఎకరాల్లో వేసిన వరి, పత్తి పంటలు పూర్తిగా పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారు. కౌలు భూములకు కౌలు శిస్తు కూడా చెల్లించలేకపోయారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు వచ్చి వివరాలు నమోదు చేసినా సాయం అందలేదు. ఆదేశాలు వచ్చినా.. గత ఏడాది డిసెంబర్ 21న కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన డీవీఎంసీ సమావేశంలో రైతు ఆత్మహత్యలపై చర్చించాం. భామిని మండలంలో బొడ్డగూడ, భామిని, లివిరి గ్రామాల్లో ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురు ఎస్సీ, ఎస్టీ రైతుల కుటుంబాలకు కనీస పరిహారాలు అందలేదని తెలిపాం. రైతు ఆత్మహత్యలపై త్రిసభ్య కమిటీ నియమకానికి డీవీఎంసీ కమిటీ చైర్మన్, కలెక్టర్ డాక్టర్ డి.ధనంజయరెడ్డి ఆదేశించి ఉత్తర్వులు జారీ చేశారు. కానీ అధికారులు ఇంత వరకు స్పందించకపోవడం దారుణం. పంటలు పోయి ప్రాణాలు తీసుకున్న రైతులను ఆదుకోవడానికి అధికారులు స్పందించకపోవడం బాధాకరం. – బోసు మన్మధరావు, జిల్లా విజిలెన్స్ అండ్ మానటరింగ్ కమిటీ సభ్యులు, బత్తిలి, భామిని మండలం -
మాట తప్పిన సీఎం!
డ్వాక్రా రుణాలు పూర్తీగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుని హోదాలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికారిక గద్దెనెక్కిన తర్వాత రుణమాఫీ కాదు.. పెట్టుబడి నిధి ఒక్కొక్క సభ్యురాలికి మూడు విడతల్లో రూ.10వేలు చెల్లిస్తానని మాట మార్చారు. సీఎం మాట తప్పడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు అప్పుల పాలయ్యారు. ఐదేళ్ల పాలన పూర్తి కావస్తున్నా ఒక్కో సభ్యురాలికి పెట్టుబడి నిధి కింద జమ చేస్తానన్న రూ.10 వేలు కూడా జమ కాకపోగా కోర్టులో కేసులు వేసి మహిళలను కోర్టు బోను ఎక్కేలా చేశారు. సాక్షి ప్రతినిధి కడప/ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలో చంద్రబాబు హామీ ఇచ్చేనాటికి (2014 మార్చి నాటికి) 33,254 డ్వాక్రా సంఘాలున్నాయి. అందులో 3.21లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా డ్వాక్రా రుణమాఫీ చేస్తారని ఆశించారు. కాగా 2015 జూలై ఒక్కో సభ్యురాలికి రూ.3వేలు తొలివిడతగా కేటాయించారు. 2016 అక్టోబర్‌లో రెండో విడతగా మరో రూ.3వేలు కేటాయించారు. ఈ మొత్తాన్ని కూడా సభ్యులు డ్రా చేసుకునే వెసులుబాటు లేకుండా బ్యాంకర్లు అనేక చోట్ల అడ్డగించారు. ఈక్రమంలో 2018 మార్చిలో రూ.2వేలు, అక్టోబర్‌లో రూ.2వేలు పసువు కుంకుమ కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు విడతల్లో ఒక్కో సభ్యురాలికి రూ.10వేలు కేటాయించి మమ అన్పించారు. కుదేలైన డ్వాక్రా వ్యవస్థ... డ్వాక్రా సంఘాలు వ్యవస్థ బ్యాంకర్లుతో సత్సంబంధాలు కొనసాగుతూ లావాదేవీలు సక్రమంగా ఉండేవి. ఈక్రమంలో అక్కచెల్లెమ్మలు ఎవ్వరూ బ్యాంకర్లకు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటూ చంద్రబాబు ప్రకటించారు. ఆమేరకు అత్యధిక సంఘాలు రుణాలు రికవరీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించాయి. దాంతో డీఫాల్టర్లుగా అనేక సంఘాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీతో డ్వాక్రా సంఘాలకు రుణాలు అందిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. బ్యాంకర్లు గ్రూపులకు కేటాయించిన రుణాలు వడ్డీతో సహా రికవరీ చేసుకున్న తర్వాత ప్రభుత్వం గ్రూపులకు వడ్డీ కేటాయిస్తే ఆ మొత్తం తిరిగి ఆయా గ్రూపుల్లో జమచేసే వారు. ఇలా వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉంది. దాదాపు రూ.176 కోట్లు డ్వాక్రా గ్రూపులకు వడ్డీ రాయితీ జమ చేయాల్సి ఉంది. మరోమారు డ్వాక్రా సంఘాలకు అగ్రస్థానం కల్పించనున్నట్లు శుక్రవారం కడప గడపలో సీఎం నేతృత్వంలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. డబ్బు కట్టినా కోర్టునుంచి నోటీసులా..! ప్రొద్దుటూరు పట్టణంలోని 32వ వార్డులో నివాసం ఉంటున్నారు. వాసవి స్వయం సహాయక సంఘం సభ్యులు 2012 డిసెంబర్లో రూ.4లక్షలు కార్పొరేషన్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. 2013 జనవరి 1వ తేదీ నుంచి క్రమం తప్పకుండా బ్యాంకుకు రుణం చెల్లిస్తున్నారు. పుస్తకాల్లో ఉన్న రికార్డు ప్రకారం షరిఫున్నీసా రూ.40వేలు రుణం తీసుకుని రూ.28,000 అసలు చెల్లించింది. రూ.4,700 పొదుపు ఉంది. మొత్తం రూ.12 వేలు కట్టాలని ఉంది. సరితాదేవి రూ.30 వేలు రుణం తీసుకున్నారు. రూ.25,500 అసలు, రూ.5000 పొదుపు పోను రూ.500 అదనంగా చెల్లించింది. షకీలాబేగం రూ.30 వేలు రుణం తీసుకోగా రూ.23,500 అసలు, రూ.3,700 పొదుపు పోను రూ.2,750 చెల్లించాలి. ప్రభావతి రూ.40 వేలు రుణం తీసుకోని పూర్తిగా చెల్లించింది. 5,300 పొదుపు కూడా ఎస్ఎల్ ఎఫ్‌లో ఉంది. రామలక్ష్మి రూ.40 వేలు రుణం తీసుకుంది. ఇందులో రూ.22,700 అసలు, 3000 పొదుపు పోను రూ.14,300 చెల్లించాలి. మాబూచాన్ రూ.30 వేలు రుణం తీసుకొని అంతా చెల్లించింది మరో రూ.5,350 పొదుపు ఖాతాలో ఉంది. షమీమ్‌బాను రూ.40 వేలు రుణం తీసుకొని పూర్తిగా చెల్లించింది. రూ.5,320 పొదుపు ఉంది. హయాతూన్బీ రూ.30 వేలు రుణం తీసుకొని చెల్లించింది. రూ.4,700 పొదుపు ఉంది. ఎస్.ఫరీనా, పి.ఫాతిమా కూడా కొంత డబ్బు చెల్లించాలి. ఈ విధంగా రూ.4 లక్షలకు గాను దాదాపు రూ.80 వేల లోపు బాకీ పడ్డారు. ఐదేళ్ల కాలంలో ఇప్పటి వరకు ఈ గ్రూప్‌నకు కేవలం రూ.60 వేలు పెట్టుబడి నిధిగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కార్పొరేషన్ బ్యాంకు అధికారులు ఈ గ్రూప్ రూ.1,02,977 బాకీ ఉందని కోర్టులో దావా వేసి నోటీసులు పంపారు. వీరితోపాటు ఇదే వార్డులోని శ్రీకృష్ణా స్వయం సహాయక సంఘలోని సుబ్బరత్నమ్మ, శ్రీలతతో పాటు సంఘ సభ్యులకు రూ.1,47,552 డబ్బు కట్టాలంటూ నోటీసులు పంపారు. ఈ సమస్య ఆ రెండు డ్వాక్రా గ్రూపులదే కాదు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని భావించిన సభ్యులందరీ పరిస్థితి అదే. చాలా దారుణం వాసవీ స్వయం సహాయక సంఘం గ్రూప్‌లో తన భార్య çషమీమ్‌భాను, కుమార్తె మాబుచాన్ ఉన్నారు. తన భార్య రూ.40 వేలు, తన కుమార్తె రూ.30 వేలు రుణం తీసుకుంది. ఈ డబ్బును 2016 జనవరి 31 నాటికి పూర్తిగా కట్టేశాం. ఇక వీరి పొదుపు డబ్బు, చంద్రబాబు రుణమాఫీ పేరుతో ఇచ్చిన మూలధనం డబ్బు బ్యాంకు అధికారులు వడ్డీ కింద ఎలా జమ వేసుకుంటారు. పావలా వడ్డీలు, స్త్రీనిధి తదితర డబ్బులు ఎవరి ఖాతాలో జమ చేశారు. డబ్బు కట్టిన మా కుటుంబ సభ్యులకు కార్పొరేషన్ బ్యాంకు అధికారులు నోటీసులు ఎలా ఇస్తారు. మాకు న్యాయం చేయాలి. మహిళలను కోర్టు బోను ఎక్కించడానికేనా డ్వాక్రా రుణమాణఫీ చేసింది. ఇది చాలా దారుణం– నూర్ అహమద్ -
‘పసుపు’ రాసేస్తున్నారు..
పసుపు కుంకుమ – 2 పేరిట ప్రభుత్వం ప్రచారార్భాటం చేస్తోంది. పైసల్లేకుండానే హంగామా చేస్తోంది. ఎన్నికల ముందు బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తానని నమ్మబలికి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ తర్వాత ఆ హామీని అటకెక్కించేశారు. ఆ తర్వాత ఒక్కో డ్వాక్రా మహిళకు మూడు విడతల్లో రూ.10 వేలు జమ చేస్తానని చెప్పి చివరకు నాలుగు విడతల్లో అరకొరగా జమ చేశారు. డ్వాక్రా రుణమాఫీ హామీ అమలు చేయకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన అక్కాచెల్లమ్మలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల ముందు వారిని సంతృప్తి పరిచి మళ్లీ ఓట్లు దండు కోవడమే లక్ష్యంగా మరోవిడత పసుపు – కుంకుమ పేరిట జిమ్మిక్కులు చేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో 45,724 సంఘాల్లో 4,88,004 మంది సభ్యులకు పసుపు కుంకుమ కింద రూ.381. 60 కోట్లు, వడ్డీ రాయితీ కింద 36,239 సంఘాలకు రూ.66.73కోట్లు నాలుగు విడతల్లో జమ చేశారు. ఇంకా జిల్లాలో సుమారు పదివేల మంది మహిళలకు మొదటి విడత పసుపుకుంకుమ నిధులు జమకాని పరిస్థితి. జిల్లాలో వేలాది సంఘాలు మాఫీ ఉచ్చులో పడడం వలన వడ్డీలతో తడిసిమోపెడైన అప్పులు చెల్లించలేక కోర్టు నోటీసులందుకుంటున్నారు. ఈ కారణంగానే ఇటీవల ప్రభుత్వం నిర్వహించే అభిప్రాయ సేకరణలో జిల్లాలో డ్వాక్రాసంఘాల్లో సంతృప్తి శాతం 53 శాతానికి మించి లేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే మళ్లీ వీరిని ఏమార్చేందుకు పసుపుకుంకుమ పేరిట మరో హైడ్రామాకు రాష్ట్ర ప్రభుత్వం తెర తీసింది.ఎన్నికల షెడ్యూల్విడుదలకు సరిగ్గా నెల రోజుల ముందు వార్ని మళ్లీ బుట్టలో వేసుకునేందుకు ఎత్తుగడ వేస్తోంది. తొలుత ఫిబ్రవరిలో రెండువిడతల్లో రెండో విడత పసుపుకుంకుమ జమ చేస్తామని కేబినెట్ సమావేశ సమయంలో ప్రకటించిన ప్రభుత్వ పెద్దలు గతంలో మాదిరిగానే నాలుగు విడతల్లో జమ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. నెలాఖరులోగా తొలివిడత కింద రూ.2,500లు, రెండో విడత రూ.2,500లు, మూడోవిడత కింద ఎన్నికల తర్వాత రూ.5వేలు జమ చేసేలా సర్కారు ఎత్తుగడలు వేస్తోంది. ఆ విధంగా వారిని మభ్యపెట్టాలని చూస్తున్నారు. తొలి విడతతోనే సరి.. పసుపుకుంకుమ–2 కింద విశాఖ జిల్లాలో 49,883 సంఘాల పరిధిలోని 5,32,190 మంది మహిళలకు రూ.532.19కోట్లు మంజూరు చేయనున్నారు.కాగా ఈ మొత్తంలో విశాఖ సిటీలో 25,512 సంఘాల పరిధిలో ఉన్న 2.76లక్షల మంది సభ్యులకు, గ్రామీణజిల్లాలోని 39,883 సంఘాల్లోని 4,32,372 సభ్యులకు కలిపి తొలి విడత కింద ఈ నెలాఖరులోగా రూ.2500లు జమచేయనున్నారు. పసుపుకుంకుమ పథకం ప్రచారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రాంతీయ సదస్సుల్లో భాగంగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల మహిళా సంఘాలతో శుక్రవారం నిర్వహించతలపెట్టిన ప్రాంతీయ సదస్సు కోసం విశాఖ ఏయూ ఇంజనీ రింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నాలుగు జిల్లా నుంచి కనీసం 50వేలమందిని తరలించాలన్న సంకల్పంతో 1200 ఆర్టీసీ బస్సులును మళ్లించారు. ఇందుకోసం అక్షరాల రూ.2.70కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇక సభకు వచ్చే డ్వాక్రా సభ్యులకు మధ్యాహ్న, రాత్రి భోజనాల పేరిట రూ.50లక్షలు ఖర్చు చేస్తున్నారు. టెంట్లు, ఇతర ఏర్పాట్లు కోసం కోటిన్నర ఖర్చు చేస్తున్నారు.ఇక భోజన సాదర్ల కోసం ఒక్కో మహిళకు రూ.150ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ పంచాయతీల్లో మేళం ఎందుకో? ఓ పక్క ప్రాంతీయ సదస్సు విశాఖలోనే జరుగుతున్నప్పటికీ ప్రతి పంచాయతీలో సీఎం ప్రసంగాలను సభలకు రాని వారికి వినిపించేందుకు రూ.7వేల చొప్పున విడుదల చేశారు. ఈ విధంగా విశాఖ జిల్లాలోని 925 పంచాయతీలకు రూ.64.75లక్షలు సెర్ఫ్ నుంచి విడుదలయ్యాయి. వీటితో పంచాయతీల్లో టెంట్లు, కుర్చీలు, ఎల్సీడీలు ఏర్పాటు చేసి సీఎం ప్రసంగ పాటవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వారికి విన్పించనున్నారు. పసుపుకుంకుమ సొమ్ముకు కొర్రీ మా సంఘంలోని 9మంది సభ్యులు గతంలో రుణాలు పొందారు.వారి రుణాలను ప్రభుత్వం మాఫీ చేయలేదు. అసలు,వడ్డీ కలిసి రూ.9లక్షల 67వేలు చెల్లించాలని యూనియన్ బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి. సంఘంలో తనతో పాటు,గుమ్మా మాణిక్యం,గుజ్జెలి జయంతిలు అప్పట్లో రుణం తీసుకోలేదు. రుణాలు పొందని తమకు కూడా తొలి విడత పసుపు కుంకుమ సొమ్ము చెల్లించకుండా బ్యాంక్ అధికారులు కొర్రి పెట్టారు. రుణాల సొమ్ముకు, పసుపు కుంకుమ సొమ్ముకు సంబంధం లేదని చంద్రబాబు చెబుతుంటే బ్యాంక్ అధికారులు మాత్రం రుణాల సొమ్ము కట్టిన తరువాతే పసుపు కుంకుమ సొమ్ము చెల్లిస్తామన్నారు. రుణం కూడా పొందని తమకు కనీసం రెండో విడత పసుపు కుంకుమ సొమ్ము పంపిణీ చేయాలని కోరుతున్నాం.– అడ్డుమండ, హుకుంపేట మండలం వడ్డీగా మినహాయించుకున్నారు మా వీధిలో పది సంఘాలున్నాయి. ప్రతి సంఘం 4.50లక్షల వరకు రుణాలు తీసుకున్నారు. వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకోళ్లు నోటీసులు ఇచ్చారు.తొలివిడత పసుపు కుంకుమ కింద ప్రభుత్వం మంజూరు చేసిన సొమ్ములతో పాటు పొదుపు ఖాతాలోని సొమ్ములను కూడా అప్పు ఖాతాలకు మళ్లించేశారు. రెండో విడత పసుపుకుంకుమ సొమ్ములు ఇస్తుందన్న నమ్మకం లేదు.–వై.కృష్ణకుమారి,వికాస డ్వాక్రా సంఘం -
రుణమాఫీ.. రైతుకు టోపీ
పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: ‘నమ్మితి చంద్రన్నా అంటే, నట్టేట ముంచుతాను లక్ష్మన్నా’ అన్నట్టు తయారైంది రైతుల పరిస్థితి. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన రైతు రుణమాఫీని నమ్మి నిండా మునిగామని గగ్గోలు పెడుతున్నారు ఏజెన్సీ రైతులు. ఎన్నికలకు ముందు బ్యాంకుల్లో ఉన్న రుణం మాఫీ చేస్తామని చెబితే నమ్మామని అయితే అధికారంలోకి రాగానే రుణమాఫీ పథకానికి కొర్రెలు పెట్టి తమకు కష్టాలు తెచ్చిపెట్టారని ఆవేదన చెందుతున్నారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంకు అప్పులు తడిసిమోపెడయ్యాయని ఆందోళన చెందుతున్నారు. బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. రూ.70 వేలకు రూ.35 వేల వడ్డీ రూ.70 వేలు రుణం తీసుకుని ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణాలు చెల్లించలేకపోయామని, అప్పునకు వడ్డీ రూ.35 వేలు పెరిగిందని మొత్తంగా రూ.1.05 లక్షలు చెల్లించాలంటూ బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారని బుట్టాయగూడెం మండలం బెడదనూరుకు చెందిన కోర్సా బాలకృష్ణ అనే రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతంలో రూ.50 వేల వరకూ రుణం తీసుకున్న చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని అంటున్నాడు. రుణమాఫీ పత్రాలు చేతికి ఇచ్చారే తప్ప బ్యాంకుల్లో మాత్రం సొమ్ములు జమ కాలేదంటూ ఇటీవల జన్మభూమి కార్యక్రమంలో అధికారులను రైతులు నిలదీశారు. ప్రకటనలకే పరిమితం బుట్టాయగూడెం మండలంలోని అంతర్వేదిగూడెం, రెడ్డిగణపవరం, బెడదనూరు, వాడపల్లి కాలనీ, వెలుతురువారిగూడెం గ్రామాల్లో చిన్నసన్నకారు రైతులు చాలా మంది ఉన్నారు. వీరిలో రూ.30 వేలు తీసుకున్న చాలా మందికి రుణాలు మాఫీ కాలేదు. అయితే అధికారులు మాత్రం అర్హులందరికీ రుణ మాఫీ అంటూ ప్రకటనలు చేస్తున్నారు. సుమారు 36 వేల మంది వరకు బాధితులు పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో సుమారు 2,37,665 హెక్టార్లలో వ్యవసాయ భూ ములున్నాయి. వీటిలో 52 వేల మందికి పైగా రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో 16 వేల మందికి మాత్రమే రుణమాఫీ అయినట్టు సమాచారం. మిగిలిన వారందరికీ రుణమాఫీ కాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు తాము రుణాలు చెల్లించలేదని, ఇప్పుడు అసలు, వడ్డీ కలిసి తలకు మించిన భారంగా తయారైందని పలువురు వాపోతున్నారు. అంతా మాయ రుణమాఫీ అంతా మాయ. గద్దెనెక్కడం కోసం మాయమాటలు చెప్పారు. పదవులు వచ్చాక రైతుల సమస్యలను మరిచారు. నాలుగున్నరేళ్లుగా రుణమాఫీ చేయకపోగా కొత్త డ్రామాలకు తెరలేపుతూ ఎన్నికల్లో మోసం చేసేందుకు చూస్తున్నారు. టీడీపీ నాయకుల మాటలు నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు.– తెల్లం దుర్గారావు, రైతు, తెల్లంవారిగూడెం -
కొత్త ఏడాదిన రాష్ట్ర ప్రభుత్వం షాక్
సాక్షి బెంగళూరు: కొత్త ఏడాది రాష్ట్ర ప్రజలకు హెచ్డీ.కుమారస్వామి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ అమ్మకపు పన్నును పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతి లీటరు పెట్రోల్‌పై 3.27 శాతం, డీజిల్‌పై 3.27 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్ నుంచి పెట్రోల్‌పై 28.75 శాతం, డీజిల్‌పై 17.73 శాతం మేర అమ్మకపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోంది. అయితే ప్రస్తుత పెంపు నేపథ్యంలో అమ్మకపు పన్ను పెట్రోల్‌పై 32 శాతం, డీజిల్‌పై 21 శాతానికి చేరుకుంది. అమ్మకపు పన్ను పెంపు వల్ల రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో ఒక రూపాయిమేర మార్పు కనిపించనుంది. ఒకవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పన్ను పెంచుతూ ఆదేశాలు జారీచే యడం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. దీంతో కర్ణాటకలో శుక్రవారం పెట్రోల్ ధర 69.01 ఉండగా పెంపు తర్వాత రూ. 70.35కు చేరుకుంంది. అలాగే డీజిల్ కూడా రూ. 62.80 ఉండగా.. అది కాస్తా 64.13కు చేరుకుంది. ప్రతి లీటరు పెట్రోల్ రూ.70.35, డీజిల్ రూ.69.21 మేర «లభించనున్నాయి. రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.46 వేల కోట్లు రైతుల రుణమాఫీకి హామీనిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాకు ఏర్పడిన లోటును పూరించుకునేందుకు పెట్రోల్, డీజిల్ అమ్మకపు పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుందని అందరూ భావిస్తున్నారు. -
రుణమాఫీ చేస్తామన్నది రూ.లక్షన్నరే!
రామగిరి: ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదన్నారు. అది కూడా చేస్తామని చెప్పని ప్రతిపక్ష నేత జగన్ ఆయనను విమర్శించడం విడ్డూరమన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనన్నారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, నాయకులు ఎల్ నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, రంగయ్య, జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ అమరేంద్ర, దండు ఓబిలేసు, ముత్యాలరెడ్డి, రాజా, శ్రీరాములు, సర్పంచ్ వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు. -
రుణాలు చెల్లించని రైతుల బంగారం వేలం
విజయవాడ : వ్యవసాయ రుణం కోసం రైతులు తాకట్టు పెట్టిన బంగారు నగలను వేలం వేసేందుకు కృష్ణాజిల్లా చల్లపల్లి కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు సిద్ధమయ్యూరు. 207మంది రైతులు తనఖా పెట్టిన బంగారాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు వేలం ప్రక్రియను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు ...అధికారం చేపట్టిన తర్వాత మాత్రం రుణాల మాఫీలో నిర్లిప్తత వహిస్తున్న విషయం తెలిసిందే. దాంతో రాష్ట్రంలో పలుచోట్ల ప్రాంతాల్లో రైతులు తాకట్టు పెట్టిన బంగారాన్ని బ్యాంకు అధికారులు వేలం వేస్తున్నారు. -
జిల్లాలవారీగా వైఎస్ఆర్ సీపీ సమీక్షలు
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన బృందం జిల్లాల్లో పర్యటించనుంది. పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, విజయ సాయిరెడ్డిలతో వైఎస్ఆర్ సీపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నెల 25న కృష్ణా, 26న గుంటూరు, 27న ప్రకాశం, 28న నెల్లూరు, 29న తిరుపతి, 30 వైఎస్ఆర్ జిల్లా, 31న అనంతపురం, నవంబర్ 1వ తేదీన కర్నూలు జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించనుంది. నవంబర్ 5న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలతో చర్చిస్తామని పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి తెలిపారు. రుణమాఫీ, పెన్షన్లు, ప్రభుత్వ హామీలపై జిల్లా నేతలతో సమీక్షించనున్నట్లు చెప్పారు. మరోవైపు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ధర్మాన ప్రసాదరావు, పార్ధసారధి, జ్యోతుల నెహ్రు పర్యటిస్తారని ఉమ్మారెడ్డి వెల్లడించారు. -
రుణమాఫీ సరికాదన్న పిటిషన్‌పై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్ : రైతు రుణమాఫీ సరికాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల లేకపోతే మనం కూడా లేమని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. అప్పుల బాధతో పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న హైకోర్టు ...ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరికాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన హైకోర్టు రైతులు లేకపోతే మనం కూడా లేమని కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక దృక్కోణం మారాల్సిన అవసరం ఉందని, కోటీశ్వరులు, సామాన్యులు...సమాన స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల వారు రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందుతారని...చాలామంది వినోదం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ...అలాంటిది పేద రైతులకు రుణమాఫీ అమలు చేస్తే తప్పేంటని న్యాయస్ధానం ప్రశ్నించింది. -
ఆధార్ లింక్‌ను ఉపసంహరించుకోవాలి
-
ఆధార్ లింక్‌ను ఉపసంహరించుకోవాలి
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్‌పై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్‌ను ఉపసంహరించుకోవాలని ఆయన మంగళవారమిక్కడ డిమాండ్ చేశారు. ఆధార్ అనుసంధానం విషయంలో సుప్రీంకోర్టు తీర్పును చంద్రబాబు బేఖాతరు చేస్తున్నారా? అని రఘువీరా ప్రశ్నించారు. బాబు పాలనలో సంక్షేమ తలుపులకు మూతలు పడ్డాయని, రుణమాఫీ పేరుతో రైతులను చంద్రబాబు వంచిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రూ.87 వేల కోట్లు రుణాలు ఉంటే 7వేల కోట్లు రీషెడ్యూల్ చేస్తారా అని రఘువీరా ప్రశ్నించారు. అనధికారికంగా 13 నుంచి 14 లక్షల పింఛన్లపై కోత విధిస్తున్నట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎవరైనా పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయినా తమ ఫిర్యాదుల విభాగానికి ఉత్తరం రాయవచ్చని రఘువీరా తెలిపారు. రుణమాఫీ ఖరీఫ్‌కు అమలు చేస్తారా లేకా రబీకి అనే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
తెలంగాణలో రుణమాఫీపై సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్ : తెలంగాణలో రుణమాఫీ అమలుపై మంత్రివర్గ ఉప సంఘం శనివారమిక్కడ సమావేశమైంది. సార్వత్రిక ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని టీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ సర్కార్ ఉప సంఘాన్ని వేశారు. ఈ భేటీలో మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్, జోగు రామన్న, మహేందర్ రెడ్డితో పాటు ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రుణమాఫీ విధివిధానాల ఖరారుపై చర్చలు జరుపుతున్నారు.