
రామగిరి: ఎన్నికల హామీలో భాగంగా చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది లక్షన్నర రూపాయలేనని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పలేదన్నారు. అది కూడా చేస్తామని చెప్పని ప్రతిపక్ష నేత జగన్ ఆయనను విమర్శించడం విడ్డూరమన్నారు.
అన్ని రంగాలను ఆదుకున్నది తమ ప్రభుత్వమేనన్నారు. తమ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పూల నాగరాజు, నాయకులు ఎల్ నారాయణచౌదరి, రామ్మూర్తినాయుడు, రంగయ్య, జెడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, ఎంపీపీ అమరేంద్ర, దండు ఓబిలేసు, ముత్యాలరెడ్డి, రాజా, శ్రీరాములు, సర్పంచ్ వెంకట రాముడు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment