సాక్షి, విజయవాడ: చంద్రబాబు కంటే విశ్వాస ఘాతకుడు ఎవరున్నారంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందిరా గాంధీ, ఎన్టీఆర్‌లకు విశ్వాస ఘాతుకం చేసింది చంద్రబాబు కాదా?. చంద్రబాబు బల్లాల దేవ అని సాక్షాత్తూ ప్రధాని మోదీ చెప్పారు. టీడీపీ నేతలు ఏం తిట్టినా అవి బాబుకే వర్తిస్తాయి.
నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. లోకేష్‌కి దమ్ముంటే గన్నవరం వచ్చి పోటీ చెయ్యాలి. లోకేష్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా నేను రెడీ. పరిటాల సునీతకు నా రాజీనామా ఇస్తాను. నాపై పోటీకి ఎవరొస్తారో డిసైడ్ చేసి చెప్పండి. ప్రపంచంలో ఉన్న కమ్మోళ్లంతా వచ్చి ప్రచారం చేయండి. నన్ను, నా కుటుంబంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రతీ మాటకు నేను అంతే స్థాయిలో సమాధానం చెప్తాను.
చదవండి: (ఇప్పుడే రాజీనామా చేస్తా: వల్లభనేని వంశీ)
పరిటాల రవిపై చంద్రబాబు నిరంతరం తప్పుడు ప్రచారం చేయించాడు. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం పరిటాలపై వ్యతిరేకంగా రాయించేవారు. పరిటాల రవిని దారుణంగా అవమానించింది చంద్రబాబే. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబు కారణం కాదా?. కోడెల పనులకి మాకు సంబంధం లేదని పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టించలేదా?. ఆడవాళ్లంటే చంద్రబాబు ఇంట్లో వాళ్లే ఆడవాళ్లా. మా ఇంట్లో ఆడవాళ్లని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చా?. ముఖ్యమంత్రి తల్లిని దూషించవచ్చా?.
జయప్రదంగా చంద్రబాబు సైకిల్ గుర్తు దక్కించుకోలేదా?. కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో చంద్రబాబు ఎవ్వరినైనా శిక్షించాడా. కాల్ మనీ వ్యాపారులకు పదవులిచ్చింది చంద్రబాబు కాదా. దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు కాదా. వీళ్లా మహిళల కోసం మాట్లాడేది' అంటూ వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment