‘చంద్రబాబు ఏడుపులు.. ఆ విషయం ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారు’ | MLA Vallabhaneni Vamsi Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఏడుపులు.. ఆ విషయం ఎన్టీఆర్‌ ఎప్పుడో చెప్పారు’

Published Sat, Nov 27 2021 12:32 PM | Last Updated on Sat, Nov 27 2021 3:19 PM

MLA Vallabhaneni Vamsi Comments On Chandrababu - Sakshi

చంద్రబాబు ఏడుపు రాజకీయాలు పని చేయవని.. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు.

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ఏడుపు రాజకీయాలు పని చేయవని.. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన కంటే నటుడని ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని, వరద బాధితుల దగ్గరకు వెళ్లి నన్ను ఓదార్చండి అని అడగటం ఏంటి?. ఇంతకంటే నీచ రాజకీయం ఉంటుందా? అంటూ వంశీ దుయ్యబట్టారు.

చదవండి: నేను ఏడ్చినా మీకు పట్టదా?.. చిత్తూరు జిల్లా నేతలకు బాబు క్లాస్‌

‘‘కుప్పం ఓటమి ప్రభావం ఆయన మీద బాగా పనిచేస్తోంది. కొడుకు ప్రయోజకుడు అవుతాడనుకుంటే ఉత్తర కుమారుడయ్యాడు. ఇక అధికారం వస్తుందన్న నమ్మకమూ లేదు. ఇవన్నీ చంద్రబాబును బాగా ప్రస్టేషన్‌లోకి తీసుకెళ్లాయి. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అప్పట్లో అలిపిరి ఘటనను అడ్డుపెట్టుకుని ఎన్నికలకు వెళ్తే ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు ఏడుపు రాజకీయంతో ఎన్నికలకు వెళ్లినా అంతే.. ప్రజలకు వాస్తవాలు తెలుసు. తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని’’ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.
చదవండి: ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఊరూరా ఈదుకుంటూ వెళ్లారా?’


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement