Vallabhaneni Vamsi Mohan
-
తప్పు చేసినోళ్లు.. ఎక్కడున్నా వదలం: వైఎస్ జగన్
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసేటప్పుడు తాను ఏడాదిన్నర తర్వాత రిటైర్ అవుతానని సీఐ అన్నాడట..! రిటైర్ అయినా.. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా.. మొత్తం అందరినీ పిలిపిస్తాం.. చట్టం ముందు నిలబెడతాం. న్యాయం జరిగేటట్లు చేస్తాం.2023లో పోలీసులు సత్యవర్థన్ నుంచి రికార్డు చేసిన 161 స్టేట్ మెంట్లోనూ వంశీ పేరు లేదు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రెండోసారి తీసుకున్న 161 స్టేట్మెంట్లోనూ తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వంశీ లేడని సత్యవర్థన్ స్పష్టంగా చెప్పాడు. న్యాయమూర్తి ముందు హాజరైనప్పుడూ అదే విషయాలను చెప్పాడు.దీంతో ఆయన కుటుంబ సభ్యులను బెదిరించి.. తప్పుడు ఫిర్యాదు ఇప్పించి కేసు పెట్టారు. వంశీని తెల్లవారుజామున అరెస్ట్ చేస్తే.. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేసి బలవంతంగా పేరు చెప్పించారు. చంద్రబాబు పాలనలో ప్రతి కేసూ ఇల్లీగలే... ప్రతి కేసులోనూ వీరే బెదిరిస్తారు.. మళ్లీ తిరిగి తమను బెదిరిస్తున్నారంటూ తప్పుడు కేసులు పెడతారు. అసలు ఎవరు.. ఎవరిని బెదిరిస్తున్నారు? రాజకీయ నేతలతోపాటు పారిశ్రామికవేత్తలనూ వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరినీ వీరే బెదిరిస్తూ అవతలి వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ఊరికే పోవు. వారికి తప్పకుండా చుట్టుకుంటాయి. అప్పుడు వారి పరిస్థితి అతి దారుణంగా తయారవుతుంది.. – మీడియాతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిసాక్షి, అమరావతి: చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులను వదిలిపెట్టేది లేదని.. వారు ఎక్కడున్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీసి చట్టం ముందు నిలబెడతామని వైఎస్సార్సీపీ(YSRCP)అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హెచ్చరించారు. అన్యాయం చేసిన అధికారులు, నాయకులు ఎవరినీ వదిలి పెట్టబోమన్నారు. ‘మీ టోపీలపై కనిపించే మూడు సింహాలకు సెల్యూట్ చేయండి..! టీడీపీ నాయకులకు కాదు..! మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి..’ అని పోలీసులకు హితవు పలికారు. ‘టీడీపీ నాయకులు ఆడించినట్లల్లా ఆడుతూ అన్యాయాలు చేస్తే.. ఎల్లకాలం ఆ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి..! రేపు మేం అధికారంలోకి వస్తాం.. అన్యాయం చేసిన అధికారులు, నాయకులను చట్టం ముందు నిలబెడతా..’ అని హెచ్చరించారు. అక్రమ కేసులో అరెస్టై విజయవాడలోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు. వంశీ సతీమణి పంకజశ్రీతో కలిసి జైలు లోపలికి వెళ్లారు. పార్టీ సీనియర్ నేతలు, నాయకులెవరినీ జైలు అధికారులు లోపలకు అనుమతించలేదు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బయటే నిలువరించారు. మరోవైపు పెద్ద సంఖ్యలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడంతో జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వారందరినీ పోలీసులు చాలా దూరంలోనే అడ్డుకున్నారు. వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలను సాక్ష్యాధారాలతో ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. విజయవాడ గాందీనగర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌ను చూడడానికి తరలివచ్చిన అశేష జనసందోహంలో ఓ భాగం వంశీ ఏ తప్పూ చేయకున్నా.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన తీరు, ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అద్దం పడుతోంది. వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనిస్తే.. అత్యంత దారుణంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది. ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ(TDP) ఆఫీస్‌లో పని చేస్తున్నారు. ఆ వ్యక్తి సాక్షాత్తూ తానే న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని అందులో ఆయన చెప్పినప్పటికీ తప్పుడు కేసు బనాయించారు. మేం ఏనాడూ ఏకపక్షంగా వ్యవహరించలేదు.. 2023 ఫిబ్రవరి 19న మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీని భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తిట్టించారు. ‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళ్తా.. ఎవడేం పీకుతాడో చూస్తా... ఆ వంశీ సంగతి చూస్తా... నియోజకవర్గం నుంచి బయటకు విసిరేస్తా..’ అని పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మర్నాడు ఫిబ్రవరి 20న కూడా అదే పట్టాభిని చంద్రబాబు గన్నవరం పంపాడు. అక్కడ పట్టాభి మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి వంశీని తిట్టాడు. అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పోగేసిన మనుషులను వెంట బెట్టుకుని పట్టాభి ఒక ప్రదర్శనగా వైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడికి బయలుదేరాడు. వైఎస్సార్సీపీ ఆఫీస్ వద్దకు చేరుకుని అక్కడ శీనయ్య అనే దళిత సర్పంచ్‌పై దాడి చేశారు. దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సీఐ కనకారావుపైనా వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది. ఆయన కూడా దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. టీడీపీ వారు పెద్ద సంఖ్యలో దాడికి సిద్ధం కావడంతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఘటించేందుకు గట్టిగానే ప్రయత్నించారు. దీంతో పోలీసులు ఇరువైపుల వారిపై కేసులు నమోదు చేశారు. నిజానికి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు. పోలీసుల చర్యలను అడ్డుకోలేదు. కేసు నుంచి బయటపడే ప్రయత్నమూ చేయలేదు. ఎక్కడా వంశీ ప్రమేయం, పేరు లేకున్నావైఎస్సార్సీపీ ఆఫీస్‌పై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేతలు మూడు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు. అయితే వాటిలో ఎక్కడా వంశీ పేరు లేదు. ఆ ఫిర్యాదుల్లోనూ, పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుల్లోనూ ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదు. కారణం.. ఆ ఘటన జరిగినప్పుడు వంశీ అక్కడ లేరు. అది జరిగిన రెండు రోజుల తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్‌లో డీటీపీ ఆపరేటర్‌గా పని చేస్తున్న సత్యవర్థన్ అనే దళిత యువకుడిని మంగళగిరిలోని తమ కార్యాలయానికి చంద్రబాబు మనుషులు పిలిపించారు. సత్యవర్థన్‌తో తెల్ల కాగితంపై సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు. దాని ఆధారంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే ఆ కేసులో కూడా వంశీ పేరు లేదు. 2023 ఫిబ్రవరి 23న పోలీసులు సత్యవర్థన్ నుంచి 161 స్టేట్మెంట్ రికార్డు చేశారు. అందులోనూ వంశీ పేరు, ప్రసావన లేదు. టార్గెట్ వంశీ... కేసు రీ ఓపెన్ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. 2024 జూలై 10న ఆ కేసును రీ ఓపెన్ చేశారు. ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏమిటంటే.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇదే సత్యవర్థన్‌తో రెండోసారి 161 స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే అందులో కూడా తనను ఎవరూ దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేడని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ ఘటన జరుగుతున్నప్పుడు తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తొలి స్టేట్మెంట్లో చెప్పిందే రిపీట్ చేశాడు. అయినా సరే.. చంద్రబాబు ఆక్రోశం, కోపం ఏ స్థాయిలో ఉందంటే.. ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని, ఘటనా స్థలంలో లేకపోయినా కూడా ఆయన్ను ఈ కేసులో 71వ నిందితుడిగా చేర్చారు. అయితే ఆ కేసులోవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కుట్రను మరింత ముందుకు తీసుకెళ్లారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌ను తగలబెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు. నిజానికి అలాంటిది జరగకపోయినా చంద్రబాబు కట్టుకథ అల్లారు. ఎందుకంటే.. ఆ ఆఫీస్ భవనం యజమానులు ఎస్సీ, ఎస్టీలైతే వారితో ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించవచ్చని భావించి ఆ భవనం అదే సామాజిక వర్గానికి చెందిన వారిదంటూ దొంగ వాంగ్మూలం కూడా ఇచ్చేశాడు. వాస్తవానికి టీడీపీ ఆఫీస్‌ను ఎవరూ తగలబెట్టే ప్రయత్నం చేయలేదు. ఆ బిల్డింగ్ కూడా చంద్రబాబుకు సంబంధించిన కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందినది. అంటే వంశీపై ఎస్సీ, ఎస్టీ కేసు బనాయించి బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ప్రయత్నమిది అని అర్థమవుతోంది. కుట్రతో బెయిల్‌నూ అడ్డుకుంటున్నారుమొత్తం 94 మందిపై కేసు పెడితే, నెలల తరబడి వైఎస్సార్సీపీ వారిని వేధించేందుకు ఇంకా 44 మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారు. ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్థన్ మేజి్రస్టేట్ ముందు హాజరై వాంగ్మూలం ఇస్తే వారికి కూడా బెయిల్ వస్తుందనే ఆందోళనతో చంద్రబాబు, పోలీసులు కలిసి కుట్ర పన్నారు. ఇందులో భాగంగానే సత్యవర్థన్‌కు 20 సార్లు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చినా.. ప్రతిసారీ దాటవేస్తూ కోర్టుకు రాలేదు. చివరకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతో సత్యవర్థన్ తనంతట తానే న్యాయమూర్తి ముందు హాజరయ్యాడు. గతంలో తాను పోలీసులకు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో.. అదే విషయాలను చెప్పారు. ఘటన జరిగిన సమయంలో తాను లేనని, తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశాడు. అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టుకు మొర పెట్టుకున్నాడు.ప్రజాస్వామ్యం ఖూనీ..ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూనీ అవుతోంది. పిడుగురాళ్ల మునిసిపాలిటీలో మొత్తం 33 కౌన్సిలర్ స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటే.. సోమవారం జరిగిన ఉప ఎన్నికలో ఒక్క సభ్యుడు కూడా లేని టీడీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. టీడీపీకి సంఖ్యా బలం లేకున్నా.. ఒక్క సభ్యుడు కూడా లేకున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా తామే ఆ ఎన్నికలో గెల్చామని చెప్పుకుంటోంది. చంద్రబాబు హయాంలో పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనం.⇒ తిరుపతి కార్పొరేషన్‌లోని 49 డివిజన్లలో 48 చోట్ల వైఎస్సార్సీపీ గెలుపొందగా కేవలం ఒక్క డివిజన్లో మాత్రమే టీడీపీ నెగ్గింది. అలాంటి చోట.. పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ పీఠాన్ని సాధించామని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది. దీన్నిబట్టి అక్కడ కూడా పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ⇒ తుని మున్సిపాలిటీలో మొత్తం 30 స్థానాలను వైఎస్సార్సీపీ గెల్చుకుంది. మరి అలాంటి చోట టీడీపీ వైస్ ఛైర్మన్ పదవిని ఎలా గెల్చుకుంటుంది? అక్కడ దౌర్జన్యం చేసి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి టీడీపీ ఒత్తిడితో ఎన్నికనే వాయిదా వేయించారు. అంటే వారికి అనుకూల పరిస్థితి వచ్చే వరకు ఆ ఎన్నిక జరపరు. పోలీసులతో కలసి తండ్రీ కుమారుల కుట్ర..తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకు వచ్చానని, తన స్టేట్మెంట్ వెనక ఎవరి బలవంతమూ లేదని సత్యవర్థన్ మొన్న.. ఫిబ్రవరి 10న న్యాయమూర్తి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో మనశ్శాంతి కరువైన చంద్రబాబు, లోకేశ్ మళ్లీ పోలీసులతో కలసి కుట్ర పన్నారు. అందులో భాగంగా ఆ మర్నాడే.. సత్యవర్థన్ కోర్టును తప్పుదోవ పట్టించడంతో పాటు తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడంటూ ఫిబ్రవరి 11న విజయవాడ పటమట పీఎస్‌లో ఆయనపై ఒక ఎఫ్ఐఆర్ పెట్టి కుటుంబ సభ్యులను బెదిరించారు. ఆ వెంటనే ఫిబ్రవరి 12న.. సత్యవర్థన్ వద్ద ఉన్న రూ.20 వేలు లాక్కుని అతడిని కిడ్నాప్ చేశారని, దాన్ని ఎవరో చూసి తనకు చెప్పారంటూ సత్యవర్థన్ అన్నతో పోలీసులకు ఒక ఫిర్యాదు ఇప్పించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు. ఇక ఆ మర్నాడు.. ఫిబ్రవరి 13 తెల్లవారుజామున వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అదే రోజు సాయంత్రం సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేశారు. అందులో వంశీ పేరు చెప్పించారు. అంటే.. ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో అతడి నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోకుండానే వంశీని తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. ఆ సాయంత్రం తాపీగా సత్యవర్థన్ స్టేట్మెంట్ నమోదు చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతోంది. ఒక మనిషి తప్పు చేస్తే.. అతడిని శిక్షిస్తే పోలీసులకు గౌరవం ఉంటుంది. కానీ ఈరోజు రాష్ట్రంలో తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాలు సృష్టించి, దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్లలో ఉంచుతున్నారు. వంశీపై పెట్టిన కేసే దీనికి నిదర్శనం.వంశీ రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే..‘‘వంశీని ఇంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే.. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టి! చంద్రబాబు, లోకేశ్ కంటే ఆయన గ్లామరస్‌గా ఉన్నారనే..! వల్లభనేని వంశీతో పాటు కొడాలి నానిపై వారికి జీరి్ణంచుకోలేని ఆక్రోశం. ఇక అవినాశ్ కూడా లోకేశ్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారు... ఇదీ చంద్రబాబు మనస్తత్వం! ఆ సామాజిక వర్గంలో చంద్రబాబు, ఆయన కుమారుడు మాత్రమే లీడర్లుగా ఉండాలనుకుంటారు! వారికి అనుకూలంగా లేని వారిని ఆ సామాజికవర్గం నుంచి వెలి వేస్తారు..!’’ అని మరో ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. అదో మాఫియా సామ్రాజ్యం!‘‘చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 కలిసి చేసేవన్నీ కుట్రలు, కుతంత్రాలే..! అది ఒక మాఫియా సామ్రాజ్యం. చంద్రబాబును సీఎంను చేయడం కోసం.. ఆయనకు ఓట్లు వేయించడం కోసం వారు ఒక మాఫియా సామ్రాజ్యంలా తయారయ్యారు. వారి సామాజిక వర్గంలో ఎవరైనా వ్యతిరేకంగా నిలబడితే వారి పని ఇక అంతే. వారిపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు. బురద చల్లడంతో పాటు దారుణంగా ట్రోలింగ్ చేస్తారు. ఇవన్నీ చంద్రబాబు, లోకేశ్ నైజానికి అద్దం పడుతున్నాయి’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, ఎం.అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, నల్లగట్ల స్వామిదాసు, పార్టీ ఎనీ్టఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ తదితరులు ఉన్నారు. -
వంశీతో ముగిసిన జగన్ ములాఖత్.. జైలు బయట ఆంక్షల వలయం
ఎన్టీఆర్, సాక్షి: కూటమి నేతల అక్రమ కేసులతో అరెస్టయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)కి వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించేందుకు మంగళవారం ఉదయం విజయవాడ సబ్ జైలుకు వెళ్లారు. వంశీతో వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. జరిగిన పరిణామాలన్నీ వంశీని అడిగి తెలుసుకుంటున్నారాయన. జగన్ వెంట వంశీ భార్య పంకజశ్రీ లోపలికి వెళ్లారు. ములాఖత్ ముగిశాక బయటకు వచ్చి వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జగన్ రాక సందర్భంగా జైలు వద్ద కోలాహలం నెలకొంది. వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. జైలు వద్ద అప్రకటిత ఆంక్షలు అమలు చేస్తున్నారు. బారికేడ్లు ఉంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. జైలు పరిసరాలకు 500 మీటర్లలోపు ఎవరినీ ఉండనివ్వకుండా వెళ్లగొడుతున్నారు. తొలుత జైలు వద్దకి వచ్చిన వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ కారును అడ్డుకుని.. ఆమెను నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు సూచించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు జైలు వద్దకు చేరుకునే ప్రయత్నం చేయగా.. వాళ్లనూ అడ్డుకున్నారు. పోలీసుల ‘అతి’పై వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంకోవైపు.. మీడియా ప్రతినిధులను కూడా అక్కడ ఉండనివ్వకుండా పోలీసులు దూరంగా పంపించి వేస్తుండడం గమనార్హం. -
బాబు డేంజర్ గేమ్.. కంట్రోల్ తప్పిన లోకేష్!
ఎలాగైతేనేం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు.. మంత్రి అయిన లోకేష్‌లు తమ కక్ష తీర్చుకున్నారు. కాకపోతే వారు ధైర్యంగా కాకుండా చాటుమాటు కేసులు పెట్టి ప్రత్యర్ధులను దెబ్బతీసే యత్నం చేశారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేసి జైలుకు పంపించి వారు ఆనందపడుతుండొచ్చు. దావోస్‌లో తాను చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ మూడును ప్రయోగించానని లోకేష్ సంతోషపడుతుండొచ్చు. కానీ ఆయన ఒక ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. రాజకీయాలలో ఇది ఏ మాత్రం పనికిరాదు. చంద్రబాబు ఇంతకాలం ఇలాంటి ఆటలు ఎన్ని ఆడినా.. తనకేమీ సంబంధం లేదన్నట్లు నటించేవారు. లోకేష్ అలాకాకుండా పచ్చిగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఏదైనా ఆపదలో చిక్కుకుంటే తనను తాను రక్షించుకోలేని పరిస్థితి రావచ్చు. ఆ సంగతిని గుర్తు పెట్టుకోవడం మంచిదని హితవు చెప్పినా.. అధికార కైపులో ఉన్న ఆయనకు వినిపించకపోవచ్చు. రెచ్చగొట్టే మీడియా, భజంత్రీగాళ్ల మాటలు సమ్మగా ఉంటాయి. కాని అవి ఎక్కువకాలం ఉపయోగపడవు. వల్లభనేని వంశీ తప్పు చేశాడా? లేదా? అనేది ఇక్కడ చర్చకాదు. తప్పు చేసి ఉంటే అరెస్టు చేయడం, జైలులో పెట్టడం సాధారణంగా జరిగేవి. కాని అసాధారణమైన రీతిలో ఏపీ పోలీసులు స్పందిస్తున్న తీరు, డీజీపీ స్థాయిలో ఉన్నవారు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న వైనం మాత్రం ఏపీ సమాజానికి మంచిది కాదు. ఇలాంటి వాటివల్ల జనంలో ఫస్ట్రేషన్ పెరిగితే అనర్ధాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ సంగతిని అంతా గుర్తుంచుకోవాలి. వంశీ గన్నవరం టీడీపీ ఆఫీస్(Gannavaram TDP Office)పై దాడి చేయించారన్నది అభియోగం కావొచ్చు. అంతవరకు కేసు పెడితే పెట్టవచ్చు. కాని అంతకుముందు.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి?. వంశీనికాని, గన్నవరం వైఎస్సార్సీపీ కార్యకర్తలను కాని టీడీపీ నేతలు రెచ్చగొట్టారా? లేదా?. వంశీని అనరాని మాటలు అన్నారా? లేదా?. అయినా టీడీపీ ఆఫీస్ పై దాడి చేయాలని ఎవరూ చెప్పరు. అప్పట్లో విజయవాడ నుంచి ఒక టీడీపీ నేత గన్నవరం దండెత్తివెళ్లారా? లేదా?. ఫలితంగా ఉద్రిక్తతలు ఏర్పడ్డాయా? లేదా?. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభ్యంతరకర భాషలో ఆ టీడీపీ నేత దూషించారా? లేదా?. చివరికి ఈ గొడవలు చిలికి, చిలికివానగా మారి వంశీ కుటుంబ సభ్యులను టీడీపీ సోషల్ మీడియాలో అనరాని మాటలతో వేధించారు. ఆ క్రమంలో చంద్రబాబు(Chandrababu) కుటుంబ సభ్యులపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత ఆయన రియలైజ్ అయి క్షమాపణ కూడా చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఆయనను వెంటాడుతూనే ఉన్నారు. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే.. టీడీపీ ముఖ్యనేతల కుటుంబాలలోని వారిని ఎవరైనా ఏమైనా అంటే గోలగోలగా ప్రచారం చేసే ఆ పార్టీవారు.. ఎదుటివారి కుటుంబాలపై నీచంగా కామెంట్స్ పెడుతుంటారు. టీడీపీ చంద్రబాబు కబ్జాలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి రాజకీయ పార్టీలవారిని వ్యక్తిగత హననం చేయడం ఒక లక్షణంగా మార్చుకుంది. చంద్రబాబు తాను సత్యసంధుడనైనట్లు, ప్రత్యర్దులు విలువలు లేని వ్యక్తులన్నట్లు మాట్లాడుతూ మీడియాలో వార్తలు వచ్చేలా చేసుకోవడంలో నేర్పరి అని చెప్పాలి. తొలుత ఆయనే రెచ్చగొడతారు. లేదా ఆయన పార్టీవారితో రెచ్చగొట్టిస్తారు. దానికి ప్రతిస్పందనగా ప్రత్యర్ధి పార్టీవారు తీవ్ర స్థాయిలో స్పందిస్తే.. దానినే విస్తారంగా వ్యాప్తి చేసి.. ‘చూశారా!నన్ను అంత మాట అన్నారో?’ అంటూ సానుభూతి పొందే యత్నం చేస్తుంటారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా తాన అంటే తందానా అంటాయి. గత సీఎం జగన్‌ను చంద్రబాబు కాని, లోకేష్ కాని ఎన్నేసి మాటలు అన్నారు!. ‘సైకో’ అనే పదంతో మొదలు పెడితే.. అనేక అభ్యంతరకర పదాలు వాడడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. అయినా అప్పటి ప్రభుత్వం వారి జోలికి వెళ్లలేదు. నిజానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆరోజుల్లో రెడ్ బుక్ పేరుతో అనేక చోట్ల పోలీసు అధికారులను, ఆయా నేతలను లోకేష్ బెదిరించిన వైనంపైనే ఎన్నో కేసులు పెట్టి ఉండవచ్చు. కాని అప్పుడు దానికి సంబంధించిన కేసులే పెట్టలేదు. పోలీసు అధికారులు కోర్టులో దీనిపై పిటిషన్ వేసినా అది విచారణకే వచ్చినట్లు లేదు. కానీ, చంద్రబాబు ప్రభుత్వంలో లోకేష్(Lokesh) పేరుతో సాగుతున్న ఈ అరాచకం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. వచ్చేసారి టీడీపీ ప్రభుత్వం ఓడిపోయి.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందంటే ఇంతకన్నా ఎక్కువగా రెడ్ బుక్ టీడీపీవారికి చుట్టుకుంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దీనిని వైఎస్సార్సీపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతూ మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. అన్యాయంగా ,అక్రమంగా తమ పార్టీవారిని వేధించేవారందరి సంగతి తేల్చుతామని జగన్ చెబుతున్నారు. చట్టబద్దంగానే చేస్తామని ఆయన కూడా అన్నారు. చంద్రబాబుకు ఈ విషయాలు తెలియనివి కావు. కాని ఆయన చేతిలో ఏమి ఉన్నట్లు లేదు. లోకేష్ బ్యాచ్ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నా.. వారించలేకపోతున్నారు. ఫలితంగా ఆయన కూడా బాధ్యత వహించవలసి వస్తోంది. తద్వారా ఏపీ ఇమేజీనే చంద్రబాబు, లోకేష్‌లు నాశనం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. వీరి కక్షలకు తోడు ఎల్లో మీడియా పనిలో పనిగా తమ కక్షలు తీర్చుకుని టీడీపీని మరింత గబ్బు పట్టిస్తోంది. ఎల్లో మీడియా రాసే చెత్త వార్తలకు ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. అందులో వాస్తవం ఉంటే తప్పు లేదు. కాని వారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిసినా.. కూటమి ప్రభుత్వం నిస్సహాయంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి యాజమాన్యాలు లేదంటే ఆ ప్రతినిధులు ఆడించినట్లు ఆడక తప్పడం లేదు. వంశీ విషయానికి వస్తే ఆయనపై ఏ కేసు పెట్టాలి. చంద్రబాబు,లోకేష్ లు నిజంగానే తమ మనోభావాలు గాయపడ్డాయని అనుకుంటే తమ కుటుంబంలోని వారిపై చేసిన వ్యాఖ్యల మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఆ పాయింట్‌ను తమ రాజకీయ అవసరాల కోసం అదే పనిగా వాడుకున్నారు కనుక. ఆ క్రమంలో తమ కుటుంబానికి ఇబ్బంది అని తెలిసినా పదే,పదే ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ విషయం జోలికి వెళ్లలేదు. చంద్రబాబు, లోకేష్‌లను ఎవరో ఏదో అన్నారని, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు కుటుంబానికి జరిగిన పరువు నష్టంపై మనోభావాలు దెబ్బతిన్నాయా, లేదా? దీనిపై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. నిజంగానే ఆ పాయింట్‌ను పైకి తీసుకువస్తే.. వంశీ కుటుంబ సభ్యులపై టీడీపీవారు చేసిన అసభ్యకర, అసహ్యకర పోస్టింగ్‌లు, మాజీ సీఎం జగన్ కుటుంబంపై పెట్టిన నీచాతినీచ పోస్టింగులు అన్ని జనం దృష్టికి వస్తాయని సందేహించారా?. చంద్రబాబు,లోకేష్ లకు చిత్తశుద్ది ఉంటే తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై కేసు పెట్టి ఉండాలి. అలాగే వంశీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కూడా తీసుకోవాలని చెప్పగలగాలి. ఆ పని చేయకుండా ఏదో ఒక పిచ్చి కేసులో వంశిని ఇరికించాలని చూడడం పిరికితనంగా కనిపిస్తుంది. టీడీపీ ఆఫీస్(TDP Office) పై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఆ మీదట కారణం ఏమైనా కాని దాడి కేసు ఫిర్యాదుదారు అసలు తనకు సంబంధం లేదని, తనను ఎవరూ దూషించలేదని కోర్టులో అఫిడవిట్ వేయడంతో ప్రభుత్వం పరువు పోయింది. నిజానికి చాలా కేసులలో రెడ్ బుక్ ఆదేశాల ప్రకారం ఎవరో ఒకరితో బలవంతంగా కేసులు పెట్టించి విపక్షంవారిని అరెస్టులు చేస్తుంటారు. ఈ కేసులో ఫిర్యాదుదారు ఎదురుతిరిగారు. దానిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు-లోకేష్ రెడ్‌బుక్ సర్కార్ హుటాహుటిన పోలీసులపై గుడ్లురిమి, ఫిర్యాదుదారు సోదరుడు ఒకరిని పట్టుకుని వంశీపై కిడ్నాప్ తదితర కేసులు పెట్టించి ఆగమేఘాలపై అరెస్టు చేసింది. తద్వారా తన అహాన్ని లోకేష్ తీర్చుకుని ఉండవచ్చు. కాని అది చట్టబద్దంగా చేయాలి తప్ప మొరటుగా ఇలా చేస్తే అది ఫ్యాక్షన్ రాజకీయంగా మారుతుంది. రాయలసీమలోనే ఈ తరహా ఫ్యాక్షన్ రాజకీయం ఉంటుందని అనుకుంటారు. కాని దానిని ప్రభుత్వమే కృష్ణా జిల్లాకు కూడా తీసుకు వచ్చినట్లు విమర్శలు వస్తున్నాయి. వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో రాశారట. 2019 ఎన్నికలలో టీడీపీ ప్రభుత్వ ఓటమి వరకు ఆయన ఆ పార్టీ తరపునే పని చేశారు కదా!. ఒకసారి ఎంపీగా పోటీచేసి ఓడిపోయినా.. తదుపరి రెండుసార్లు ఎమ్మెల్యేగా టీడీపీ పక్షాన గెలిచారు కదా?. మరి అన్ని కేసుల వ్యక్తిని ఎందుకు టీడీపీ ప్రోత్సహించింది?.. అంటే దానికి జవాబు ఉండదు. టీడీపీ నేతలు కొందరు ఆయనను పశువు అని, అదని తిడుతున్నారు. మరి అదే నిజమైతే ఆ పశువుతో పాటు సుమారు రెండు దశాబ్దాలు కలిసి నడిచినవారు ఏమవుతారు!. అసలు దాడి కేసు ఏమిటి?. ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం ఏమిటి?ఈ చట్టం కింద అయితే వెంటనే బెయిల్ రాకుండా చేయవచ్చన్నది వ్యూహం. ఇందుకోసం పనికట్టుకుని ఆ వర్గానికి చెందినవారిని తీసుకు వచ్చి కేసులు పెట్టిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం అధికారం ఉంది కనుక టీడీపీ-జనసేన కూటమికి నేతలు ఎన్ని అరాచకాలు చేసినా పోలీసులు కేసులు పెట్టకపోవచ్చు. కానీ అది పోయిన రోజు వారిపై కూడా ఇలాంటి కేసులు వచ్చే అవకాశం ఉంటుంది కదా!. పోలీసులు తన పట్ల అనుచితంగా వ్యవహరించారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని వంశీ మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టువారు ఎలా స్పందిస్తారో తెలియదు. ఏది ఏమైనా వంశీని ఇప్పుడు అరెస్టు చేసినా.. రేపు కొడాలి నాని ,పేర్ని నాని వంటివారిపై రెడ్ బుక్ ప్రయోగించినా అది తాత్కాలికమే అవుతుంది. మరి జగన్ ప్రభుత్వం(Jagan Government) కూడా టీడీపీ నేతలపై కేసులు పెట్టింది కదా? అని అనవచ్చు. వాటిలో మెజార్టీ కేసులు పూర్తి ఆధారాలతో పెట్టినవే. దర్యాప్తులో వాస్తవం అని తేలిన తర్వాతే ఆ కేసులు పెట్టారు. ఉదాహరణకు స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ నిధులు అక్రమ మార్గాల ద్వారా టిడిపి ఆఫీస్ అక్కౌంట్ కు చేరాయని సిఐడి విచారణలో తేలిందా?లేదా?. ఆ విషయంపై ఇంతవరకు టీడీపీ సమాధానం ఎందుకు ఇవ్వలేదు. ఆ మాటకు వస్తే 2019లో టీడీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత చంద్రబాబు పీఎస్ ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి.. రూ.2 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ప్రకటించిందా? లేదా?. దానిపై ఇంతవరకు నోరు తెరిచారా?. అలాగే రాజధానికి సంబంధించిన అనేక కేసులలో సాక్ష్యాలు సేకరించడానికే కొన్ని సంవత్సరాలు తీసుకున్నారు. ఆ తర్వాతే చర్యలు చేపట్టారు. అంతే తప్ప ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎవరినిపడితే వారిని అరెస్టు చేయలేదు. అయినా ఆ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారే. ఇప్పుడు అసలు వాస్తవాలు,విచారణలతో నిమిత్తం లేకుండా.. ఏదో రకంగా కేసులు పెట్టడం, విధ్వంసాలకు పాల్పడడం, వేధింపులకు గురి చేయడం నిత్యకృత్యంగా మార్చుకున్నారే. పైగా రెడ్ బుక్ చాప్టర్ 3 ప్రారంభించామని ఏ మాత్రం భీతి లేకుండా చెప్పుకున్నారే!. ఇదేనా ప్రజాస్వామ్యం. సూపర్ సిక్స్,ఇతర హామీలు నెరవేర్చలేక.. ఇలాంటి రాజకీయాలు చేయడం శోచనీయం. అసలు పని మానేసి ప్రభుత్వం ఈ విధంగా రాజకీయ రాక్షసపాలన సాగిస్తే ఏదో ఒక రోజు అదేవారి పతనానికి హేతువు అవుతుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాతఇదీ చదవండి: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ -
రెడ్‌బుక్ రాజ్యాంగం.. న్యాయ ప్రక్రియ అపహాస్యం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/విజయవాడ లీగల్/ పటమట (విజయవాడ తూర్పు) : రెడ్‌బుక్ రాజ్యాంగంతో విధ్వంసం సృష్టించడం, అక్రమ అరెస్టులకు తెగబడటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం చెలరేగిపోతోంది. అందుకు జీ.. హుజూర్ అంటూ పోలీసు వ్యవస్థ ప్రభుత్వ కుట్రలకు వత్తాసు పలుకుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులకు భంగం కలిగిస్తూ, అత్యంత కీలకమైన న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను కూడా ఉల్లంఘిస్తూ బరి తెగిస్తున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అక్రమ అరెస్ట్ ద్వారా తమ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల తీవ్రత.. రాజ్యాంగ ఉల్లంఘనలో బరితెగింపును మరోసారి బాహాటంగా చాటి చెప్పారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు పేరుతో వల్లభనేని వంశీపై నమోదు చేసిన అక్రమ కుట్ర కేసు బెడిసి కొట్టడంతో ప్రభుత్వ పెద్దలు తమ కుతంత్రానికి మరింత పదును పెట్టారు. పోలీసు దర్యాప్తు ప్రాథమిక విధి విధానాలు, న్యాయ విచారణ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘిస్తూ మరో అక్రమ కేసుతో విరుచుకు పడటం పట్ల సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సత్యవర్థన్‌ను విచారించకుండానే వంశీ అరెస్ట్ సత్యవర్థన్‌ను వల్లభనేని వంశీ బెదిరించి న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇప్పించారనే కట్టుకథను పోలీసులు తెరపైకి తెచ్చారు. అందుకోసం ఆయన తమ్ముడు కిరణ్‌ను తమదైన శైలిలో బెదిరించి మరీ రంగం సిద్ధం చేశారు. ఆయన్ను ఏకంగా మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి, బెదిరించి మరీ తాము చెప్పింది చెప్పినట్టుగా చేసేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఆయన తన అన్న సత్యవర్థన్‌ను బెదిరించి వాంగ్మూలం ఇప్పించి కేసు ఉపసంహరింపజేశారని ఫిర్యాదు ఇప్పించడం గమనార్హం. కానీ ఆ ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు బాధ్యతాయుతంగా ముందుగా సత్యవర్థన్‌ను విచారించాలి. ఆయన అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు సరైందా కాదా అన్నది నిర్ధారించుకోవాలి. ఈ దర్యాప్తు ప్రమాణాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. విశాఖపట్నంలో ఉన్న సత్యవర్థన్‌ను తీసుకువచ్చేందుకు పోలీసు బృందాలు అక్కడకు వెళ్లాయి. మరోవైపు సత్యవర్థన్‌ను విచారించకముందే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నాయి. తనను ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారన్న కనీస సమాచారం ఇవ్వకుండానే నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి బలవంతంగా విజయవాడకు తరలించారు. 164 సీఆర్పీసీ వాంగ్మూలం అంటే లెక్కేలేదుదర్యాప్తు, విచారణ ప్రక్రియలో సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఎంతో కీలకమైంది. పోలీసులు అక్రమ అరెస్టు్టలు, బెదిరింపులకు పాల్పడకుండా నిరోధించేందుకు రాజ్యాంగం సీఆర్పీసీ 164 వాంగ్మూలానికి అవకాశం కల్పించింది. అంటే సాక్షులు, బాధితులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ధైర్యంగా, స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వొచ్చు. న్యాయ విచారణ ప్రక్రియలో ఆ వాంగ్మూలానికి అత్యంత విలువ ఉంటుంది. స్వచ్ఛందంగానే వాంగ్మూలం ఇస్తున్నారు కదా అని న్యాయమూర్తి అడిగి మరీ నమోదు చేస్తారు. ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా వాంగ్మూలం ఇస్తే అది క్రిమినల్ నేరం కూడా అవుతుందన్నది పోలీసులకు పూర్తి అవగాహన ఉంది. అయినా సరే చంద్రబాబు మెప్పు కోసం రాజ్యంగ నిబంధనలు, న్యాయ ప్రక్రియ ప్రమాణాలను ఉల్లంఘించి మరీ బరితెగించారు. సత్యవర్థన్ స్వచ్ఛందంగా న్యాయమూర్తి ఎదుట సీఆర్పీసీ 164 వాంగ్మూలం ఇస్తే... ఆ వాంగ్మూలం తప్పని ఆయన అన్నయ్యతో ఫిర్యాదు చేయించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం.కస్టడీ పిటిషన్‌పై సోమవారం విచారణకృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ మోహన్‌ను పోలీసు కస్టడీకి కోరుతూ శుక్రవారం విజయవాడ పటమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం వంశీమోహన్ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ను పది రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలని, అతని సెల్ ఫోన్‌ను సీజ్ చేసేందుకు అనుమతివ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఇదిలా ఉండగా ఈ కేసులో పెద్ద అవుటపల్లికి చెందిన వేల్పూరు వంశీని, గన్నవరానికి చెందిన వీర్రాజులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు పటమట సీఐ పవన్ కిషోర్ తెలిపారు. కుట్ర బట్టబయలు.. చంద్రబాబు, లోకేశ్ ఆగ్రహంగన్నవరం టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్థన్ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అక్రమ కేసు బనాయించిన కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు, లోకేశ్ పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ కాగితాలపై తన సంతకం తీసుకుని తనకు తెలియకుండానే తన పేరిట ఫిర్యాదు చేశారని, ఆ ఫిర్యాదుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని సత్యవర్థన్ న్యాయమూర్తి ఎదుట 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు. దాంతో రెడ్‌బుక్ కుట్రలో భాగంగానే వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు చేశారన్నది న్యాయస్థానం సాక్షిగా బట్టబయలైంది. తమ కుట్ర బహిర్గతం కావడంతో చంద్రబాబు, లోకేశ్‌లు ఆగ్రహంతో చిందులు తొక్కినట్టు సమాచారం. ఎలాగైనా వంశీని అరెస్ట్ చేయల్సిందేనని స్పష్టం చేశారు. దాంతో డీజీపీ కార్యాలయం కేంద్రంగా అప్పటికప్పుడు కొత్త కుట్రకు తెరతీశారు. వంశీది పైచేయి అయిందని అక్కసుముదునూరి సత్యవర్ధన్ కోర్టులో ఇచ్చిన కీలక వాంగూ్మలం కూటమి ప్రభుత్వానికి అవమానభారంగా మారింది. గత సోమవారం ఆయన స్వచ్ఛందంగా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టుకు హాజరై కేసును వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఆఫిడవిట్ సమర్పించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన ప్రభుత్వ పెద్దలు.. ఈ కేసును పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేపై చిందులు తొక్కారు. ఈ కేసులో కీలకమైన ఫిర్యాదుదారుడిని కంట్రోల్లో ఉంచుకోవడంలో వైఫల్యం చెందారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వల్లభనేని వంశీమోహన్ ఈ కేసులో పైచేయి ఎలా సాధిస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ఎలాగైనా సరే వంశీమోహన్‌ను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయాల్సిందేనని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని సమాచారం. దీంతో పోలీసులు సత్యవర్ధన్ తల్లిదండ్రులు, సోదరుడిని తమ అధీనంలోకి తీసుకుని.. వారిని తీవ్రంగా బెదిరించి, ప్రలోభపెట్టి కథ నడిపించారు. తమకు అనుకూలంగా ఫిర్యాదు తీసుకుని బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కుట్రలో భాగంగా సత్యవర్ధన్ కేసు వాపసు తీసుకోవడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు టీడీపీ మహిళా అధ్యక్షురాలు మేడేపల్లి రమాదేవితో కూడా ఫిర్యాదు చేయించి, ఆ మేరకు వంశీమోహన్‌పై ఇంకో కేసు నమోదు చేశారు. హైకోర్టు తీర్పునూ ఖాతరు చేయలేదురెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని వంశీమోహన్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. ఏ కేసు నిమిత్తం వంటి వివరాలు, ఎఫ్ఐఆర్ కాïపీ ఇవ్వకుండానే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆయన్ను విజయవాడకు తీసుకువచ్చిన తర్వాత కనీస వైద్య సాయం అందించేందుకు కూడా పోలీసులు నిరాకరించారు. ఆయన సతీమణి పంకజ శ్రీ, న్యాయవాదులను కలిసేందుకు కూడా అంగీకరించలేదు. తుదకు ఆమె ఆందోళనకు దిగడంతో కలిసేందుకు అంగీకరించారు. ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లే విషయంలో, కోర్టు నుండి రిమాండ్‌కు తరలించే సమయంలో ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లుగా ఆయన్ను ఇబ్బందులకు గురిచేశారు. కాగా, ఈ కేసులో వంశీపై ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందరపాటు చర్యలొద్దన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం, పోలీసులు ఏమాత్రం పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేయడం తగదని వైఎస్సార్సీపీ నేతలు, ఆయన అభిమానులు, నియోజకవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అధికారముందనే అహంకారమా?: వంశీ అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్
గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ.. అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని కూటమి ప్రభుత్వంపై మండిడ్డారు. మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi ) అరెస్ట్, కొఠారు అబ్బయ్య చౌదరిపై పెట్టిన అక్రమ కేసు వ్యవహారంపై తాజాగా ఆయన స్పందించారు. .. వంశీ విషయంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్(Kutami Prabhutvam) వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి, తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తూ జడ్జిగారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి, అధికారపార్టీ కుట్రను బట్టబయలు చేస్తే, తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక, దాన్నికూడా మార్చేయడానికి చంద్రబాబుగారు దుర్మార్గాలు చేస్తున్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడ్ని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్టు? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి, భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా?. మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్నిరకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో, వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్నంగా కేసును విచారిస్తుంటే, పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారముందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా ఇది? అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ‘నాకు వీళ్ల నుంచి ప్రాణ హాని ఉంది..’ జడ్జితో వల్లభనేని వంశీ.. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి(Kotaru Abbaya Chowdary)పై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టి.. తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గం. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లమంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి?. తప్పులు టీడీపీ వారు చేసి, వారిపై చర్య తీసుకోమని కోరితే.. పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307, అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన. రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా? చంద్రబాబుగారూ! .. ప్రజలకు ఇచ్చిన సూపర్-6, సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్నీ కూడా అమలు చేయక, అంతకుముందున్న పథకాలను సైతం రద్దుచేసి, ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులుతో అక్రమ అరెస్టులకు(Illegal Arrests) దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నాం అని ఎక్స్‌లో వైఎస్ జగన్(YS Jagan) పోస్ట్ చేశారు.ఇదీ చదవండి: మళ్లీ అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం -
పోలీసుల తీరుతో వల్లభనేని వంశీ భార్యకు ఇక్కట్లు
ఎన్టీఆర్, సాక్షి: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ క్రమంలో ఆయన భార్య పంకజ శ్రీ(Pankaja Sri) సైతం ఇబ్బందికి గురయ్యారు. అడుగడుగునా పోలీసులు ఆమెను అడ్డుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గురువారం ఉదయం వల్లభనేని వంశీ(Vallabhaneni Vamsi)ని విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని అప్పటికప్పుడు ఆయన భార్య చేతిలో నోటీసులు పెట్టి తెలియజేశారు. ఆ పరిణామంతో ఆమె కంగారుపడిపోయారు. భర్త కోసం పోలీసుల వెనకాలే హైదరాబాద్ నుంచి విజయవాడకు బయల్దేరారు. ఈ క్రమంలో నందిగామ(Nandigama) వై జంక్షన్ వద్ద ఆమె కారును పోలీసులు అడ్డుకున్నారు. కారు ముందు సీటులో ఉన్న వ్యక్తిని బలవంతంగా దించేసి.. కంచికచర్ల సీఐ ఆ వాహనంలో కూర్చున్నారు. ఇదేమిటని అడిగితే.. వాళ్ల నుంచి స్పందన లేదు. ఆపై వంశీ భార్య ఉన్న ఆ కారుని పోలీసులు దారి మళ్లించి ముందుకు తీసుకెళ్లారు. మునగచర్ల వద్ద పర్వతనేని సుభాష్ చంద్రబోస్ మెమోరియల్ ట్రస్ట్ డ్రైవింగ్ స్కూల్ వద్ద ఆమెను, డ్రైవర్‌ను పోలీసులు కాసేపు అదుపులోకి తీసుకుని.. ఆపై విడిచిపెట్టారు. అక్కడి నుంచి ఆమె నేరుగా కృష్ణలంక పీఎస్‌కు చేరుకోగా.. అక్కడా ఆమెను వంశీని చూసేందుకు అనుమతించకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: వల్లభనేని వంశీ అరెస్ట్.. అసలు జరిగింది ఇదే..! -
మహిళ అని చూడకుండా.. పోలీసుల పైశాచికత్వం
రామవరప్పాడు: కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు కావస్తున్నా టీడీపీ గూండాల దాడులకు అడ్డుకట్ట పడటం లేదు. వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులను టార్గెట్ చేస్తూ దౌర్జన్యకాండ సాగిస్తున్నారు. టీడీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు వీధి రౌడీల్లా ప్రవర్తించి మహిళ అని కూడా చూడకుండా దుర్బాషలాడుతూ అనుచితంగా ప్రవర్తించడం తీవ్ర దూమారం రేపింది. విజయవాడరూరల్ మండలం ప్రసాదంపాడు కొమ్మా రాము వీధిలో నివాసం ఉంటున్న గంధం వెంకటలక్ష్మికు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు గంధం సంతోష్, రెండో కుమారుడు రవి.సంతోష్ వైఎస్సార్సీపీలో యువ నేత. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గెలుపు కోసం అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేశాడు. ఓ కేసు నిమిత్తం వంశీమోహన్ విజయవాడ కోర్టులో వాయిదాకు వచ్చిన సమయంలో సంతోష్ కలవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని ప్రసాదంపాడుకు చెందిన టీడీపీ నాయకుడు, ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య టీడీపీ నాయకులను, పోలీసులను ఉసికొల్పాడు. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంతోష్ నివాసం ఉంటున్న ఇంట్లోకి మంగళవారం చొరపడి ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. తొలుత సంతోష్ తల్లి తలుపు తీయగా.. దౌర్జన్యంగా నెట్టుకుంటూ ఇంట్లోకి చొరబడి ఆమెతో అనుచితంగా ప్రవర్తిస్తూ ఆమెను వెనక్కి నెట్టేశారు.వైఎస్సార్సీపీ నాయకులను చూసుకుని మిడిసిపడుతున్నారని.. మీ పెద్ద కుమారుడిని అరెస్టు చేయాలంటూ హడావుడి చేశారు. సంతోష్ నిద్రిస్తున్నాడని చెబుతున్నా వినకుండా దౌర్జన్యంగా ఇంట్లోకి ప్రవేశించి సంతోష్‌పై దాడి చేస్తూ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జరుగుతుండగానే చిన్న కుమారుడు రవి తన సెల్ఫోన్లో ఈ ఘాతుకాన్ని వీడియో తీస్తుండగా బలవంతంగా ఫోన్ లాక్కుని దుర్భాషలాడారు. తన కుమారుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ వెంకటలక్ష్మి పోలీసులను ప్రశ్నించగా.. ‘నీకు చెప్పాల్సిన అవసరం లేదు.. టీడీపీ నాయకులకు ఎదురెళితే ఇలానే ఉంటుంది’ అంటూ పోలీసులు సంతోష్‌ను ఈడ్చుకెళ్లారు. స్టేషన్లో విచక్షణా రహితంగా దాడిటాస్క్ఫోర్స్ పోలీసులు సంతోష్‌ను బలవంతంగా పటమట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం అక్కడి పోలీసులు.. వంశీని ఎందుకు కలవడానికి ప్రయత్నించావని ప్రశ్నించారు. తన అభిమాన నేతను కలవడంలో తప్పేముందని సంతోష్ బదులిచ్చాడు. దీనికి ఆగ్రహించిన ఎస్ఐ హరికృష్ణ సంతోష్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. కాగా, తన కుమారుడిపై అకారణంగా దాడి చేశారని సీసీ ఫుటేజ్‌ను ఆధారంగా చూపుతూ సంతోష్ తల్లి వెంకటలక్ష్మి పటమట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. సమస్యను సీపీ, ఏసీపీ, పడమట సీఐ దృష్టికి తీసుకొచ్చినా స్పందించలేదని వాపోయింది. కాగా బాధితుడు సంతోష్ పోలీసులు పాల్పడిన దుశ్చర్యపై ప్రైవేట్ కేసు కూడా పెట్టడం గమనార్హం. -
మళ్లీ అదే పచ్చ ఉత్సాహం!
అమరావతి, సాక్షి: టీడీపీ కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయం హత్యలు, దాడులతోనే ఆగిపోవడం లేదు. అక్రమ కేసులు పెట్టైనా సరే వైఎస్సార్సీపీ నేతల్ని కటకటాలపాలు జేయాలని ప్రయత్నిస్తోంది. తాజాగా.. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలో చంద్రబాబు దుష్ట రాజకీయానికి ఎల్లో మీడియా తోడైంది.వల్లభనేని వంశీ షయంలో టీడీపీ అనుకూల మీడియా ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ పేరును పోలీసులు ఏ-71 నిందితుడిగా చేర్చారు. ఇప్పటికే ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. అయితే.. ఎల్లో మీడియా ఛానెల్స్, వెబ్‌సైట్స్ మాత్రం రెండ్రోజులుగా మరోలా హడావిడి చేస్తున్నాయి. ఒకానొక దశలో వంశీపై తప్పుడు ప్రచారానికి సైతం దిగాయి. ఇంతకు ముందు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు రాష్ట్రమంతా చూసింది. ఈవీఎం కేసులో ఆయనకు న్యాయస్థానం ఊరట ఇచ్చినప్పటికీ.. అక్రమ కేసులు బనాయించి మరీ ఆయన్ని జైలుకు పంపేదాకా వదల్లేదు. అయితే.. ఆ టైంలోనూ ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. ఇదీ చదవండి: ఇంతకీ మంత్రి లోకేష్ ఎక్కడ?ఇక ఇప్పుడు వంశీ.. హైదరాబాద్‌లో ఉన్నారని ఓసారి, అమెరికా వెళ్లిపోయారని మరోసారి, ఏకంగా అరెస్ట్ అయ్యారంటూ ఇంకోసారి.. కథనాలు ఇచ్చేశాయి. అయితే పోలీసులు మాత్రం ఆ వార్తలన్నింటినీ ఖండించారు. దీంతో ప్రత్యేక బృందాలతో ఆయన కోసం గాలింపు కొనసాగుతోందంటూ మళ్లీ కథనాలు మొదలుపెట్టాయి. అంతేకాదు.. ఏ 71గా ఉన్న ఆయన్ని ఈ కేసులో ఏ1గా మార్చేయబోతున్నారంటూ పోలీసుల తరఫున నిర్ణయాల్ని కూడా భవిష్యవాణి తరహాలో ప్రచురిస్తున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగిలేదు. వంశీ కుటుంబ సభ్యులు, అనుచరులను సైతం ఇందులోకి లాగుతూ అడ్డగోలు రాతలు రాస్తున్నాయి. -
బెజవాడలో టీడీపీ విధ్వంసకాండ
విజయవాడ: బెజవాడలో పట్టపగలే టీడీపీ కార్యకర్తలు విధ్వంసకాండకు దిగారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై దాడికి విఫలయత్నం చేశాయి. నగరంలోని లబ్బీపేట మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీలోని వంశీ నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన రాత్రి వరకు ఈ విధ్వంసకాండ కొనసాగింది.అరుపులు, కేకలు, బూతులతో ఆ ప్రాంతాన్ని అట్టుడికించారు. పోలీసులనూ తరిమేశారు. చివరకు సీఆర్పీఎఫ్ పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచి్చంది. ఇటీవలి ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అక్కడికి వచ్చి అల్లరి మూకలకు మరింతగా రెచ్చగొట్టడం గమనార్హం. ముందస్తు వ్యూహంతోనే దాడి టీడీపీ అధినాయకత్వం అండతో, ముందస్తు వ్యూహంతోనే విజయవాడ సెంట్రల్, తూర్పు, గన్నవరం నియోజకవర్గాల నుంచి గంజాయి, మద్యంతో పాటు ఇతర మత్తు పదార్థాలు సేవించిన టీడీపీకి చెందిన యువకులు ఈ దాడిలో పాల్గొన్నట్లు సమాచారం. తొలుత మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాలుగు కార్లలో కత్తులు, ఇటుకలు, కంకర రాళ్లు, కర్రలతో కొందరు టీడీపీ కార్యకర్తలు వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ వద్దకు చేరుకున్నారు. వస్తూనే బూతులు తిడుతూ కార్లలో తెచ్చుకున్న రాళ్లను విసిరారు. రాళ్ల దాడిలో వంశీ కారుతో పాటు ఆ ప్రాంతంలోని కొన్ని కార్లు, ద్విచక్ర వాహనాలు, సమీపంలోని ఇళ్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.కొందరు సమీపంలోని ఇళ్లలోకి చొరబడి కర్రలతో కుండీలు, కిటికీలు పగలకొట్టి భీభత్సాన్ని సృష్టించారు. టీడీపీ జెండాలను పట్టుకుని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవి్వంపు చర్యలకు దిగారు. బూతులు, అరుపులతో అక్కడున్న అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. అపార్ట్మెంట్ గోడ దూకి సెల్లార్లో ఉన్న పలు కార్ల అద్దాలను పగులగొట్టారు. ప్రతి అర గంటకు మరికొందరు అక్కడకు చేరుకోవడంతో ఆ ప్రాంతం పూర్తిగా టీడీపీ వారితో నిండిపోయింది. 300 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారు. ఒక్కసారిగా భీభత్సం సృష్టించడంతో స్థానికులు భయకంపితులయ్యారు.పలువురు మహిళలు భయాందోళనకు గురయ్యారు. పోలీస్ కమిషనర్ పీహెచ్డీ రామకృష్ణ ఆదేశాలతో పోలీసులు భారీ సంఖ్యలో చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. పోలీసులను చూడగానే అల్లరి మూకలు మరింతగా రెచి్చపోయాయి. విధ్వంసాన్ని అదుపు చేసేందుకు వచి్చన పోలీసులను వెంటబడి తరిమారు. పరిస్థితి అదుపు తప్పడంతో సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి.సీఆర్పీఎఫ్ పోలీసులు వచ్చీ రాగానే లాఠీచార్జీ ప్రారంభించడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు. దాడులకు పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొందరు సమీపంలోని ఇళ్లలోకి దూరి దాక్కున్నారు. పోలీసులు వారిని వెతికి పట్టుకుని మరీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విధ్వంసానికి ఆజ్యం పోసిన యార్లగడ్డ టీడీపీ కార్యకర్తలను పోలీసులు స్టేషన్‌కు తరలిస్తున్న సమయంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అక్కడకు చేరుకుని విధ్వంసానికి ఆజ్యం పోసేందుకు ప్రయత్నించారు. అదుపులోకి తీసుకుంటున్న వారిని అక్కడే వదిలేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. పోలీసులు ససేమిరా అనడంతో వారితో వాగ్వాదానికి దిగారు.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆదేశాలతోనే ఈ దాడికి దిగినట్లు చెప్పడంతో అక్కడున్న పోలీసులు సైతం నివ్వెరపోయారు. స్వయంగా చంద్రబాబు వచ్చి విడిపిస్తారంటూ అరెస్ట్ అయిన వారిని మరింత రెచ్చగొట్టేందుకు వెంకట్రావు ప్రయత్నం చేశారు. పోలీసులు అక్కడివారిని తరిమేస్తున్నా అక్కడే తిరుగుతూ కవి్వంపు చర్యలు కొనసాగించారు. అర్ధరాత్రి వరకు పరిస్థితి ఇలానే కొనసాగింది. గవర్నర్ కార్యాలయ ఉద్యోగి వాహనం ధ్వంసం టీడీపీ కార్యకర్తలు మద్యం, గంజాయి మత్తులో విచక్షణరహితంగా చేసిన దాడిలో గవర్నర్ కార్యాలయ ఉద్యోగి కారు కూడా ధ్వంసమైంది. ఆ ఉద్యోగి అదే అపార్ట్మెంట్లో ఉంటున్నారు. సెల్లార్లో పార్క్ చేసిన ఆయన కారుపై టీడీపీ వారు రాళ్లు రువ్వడంతో అద్దాలన్నీ పూర్తిగా పగిలిపోయాయి.దేవినేని అవినాశ్‌కు భద్రత పెంపు గుణదల (విజయవాడ తూర్పు): విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాశ్‌కు పోలీసులు భద్రత పెంచారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద మాచవరం పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఆయన్ని కలిసేందుకు వచ్చే అభిమానులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.సమీపంలో అనుమానంగా సంచరించే వారిని గమనిస్తున్నారు. యువకులు గుంపులుగా ఉండకుండా, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. టీడీపీ అల్లరి మూకలు రాష్ట్రవ్యాప్తంగా విచక్షణరహితంగా విధ్వంసం సృష్టిస్తుండటంతో అవినాశ్‌కు భద్రత పెంచినట్లు మాచవరం పోలీసులు తెలిపారు. -
ఆగని టీడీపీ దాడులు.. వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇళ్ల వద్ద ఉద్రిక్తత
కృష్ణా, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ అరాచక కాండ కొనసాగుతోంది. శుక్రవారం కూడా వైఎస్సార్సీపీ శ్రేణుల్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడింది. మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీల ఇళ్లపై దాడులకు యత్నించింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు.. శుక్రవారం మధ్యాహ్నాం కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లు విసిరారు. ఆపై టపాసులు కాల్చి నానా హంగామా చేశారు. ఇంటిలోకి చొచ్చుకునిపోయే ప్రయత్నమూ చేశారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు.. వాళ్లను అడ్డుకుని అక్కడి నుంచి పంపించే యత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతోనూ వాళ్లు వాగ్వాదానికి దిగారు. కృష్ణాజిల్లా గుడివాడలో మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటిపై దాడి..ఇంటి లోపలకి చొరబడే ప్రయత్నం చేసిన టీడీపీ గుండాలు.#TDPGoons pic.twitter.com/yDo1iT7yql— YSR Congress Party (@YSRCParty) June 7, 2024ఇక.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటిపైనా దాడి జరిగింది. టీడీపీ గుండాలు వంశీ ఉండే అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి.. వాహనాల్లో అటు ఇటు తిరుగుతూ హల్ చల్ చేశారు. వంశీ ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో పార్కింగ్‌లో ఉన్న ఆయన వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఆపై పోలీసులు రంగంలోకి దిగి టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టి.. చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అయితే.. సీఆర్పీఎఫ్, పోలీస్ బలగాలు మోహరించినప్పటికీ.. టీడీపీ యువత మరోసారి వల్లభనేని వంశీ ఇంటి పైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైనా టీడీపీ గుండాలు దాడికి యత్నించారు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు. దీంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగి టీడీపీ రౌడీలను చెదరగొట్టాయి. ఆపై వంశీ ఇంటి వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.ఇక విజయవాడలోనే గత అర్ధరాత్రి రాజీవ్ నగర్‌లోని వైఎస్సార్సీపీ నేత పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటి పై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి బయట ఫర్నీచర్‌ను పూర్తిగా నాశనం చేశారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు.. భయంతో వణికిపోయారు. ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ వాళ్లంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఈ ఉదయం టీడీపీ నేతల దాడిపై నున్న పోలీస్ స్టేషన్లో పెద్దిరెడ్డి శివారెడ్డి ఫిర్యాదు చేశారు.రాజమండ్రిలో టీడీపీ గూండాలు.. ఫ్లైఓవర్ శిలా ఫలకం ధ్వంసంతూర్పు గోదావరి: రాజమండ్రిలో టీడీపీ నేతలు అరాచకానికి దిగారు. మోరంపూడి ఫ్లై ఓవర్ శిలాఫలకం నాశనం చేశారు. సమాచారం అందుకున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న రాజమండ్రిలో.. ఇలాంటి ఘటనలు సరికాదని టీడీపీ శ్రేణుల్ని ఉద్దేశించి హితవు పలికారాయన. అలజడులు సృష్టించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని అన్నారాయన. -
టీడీపీ నేత సాయికల్యాణిపై కేసు నమోదు
సాక్షి, కృష్ణా: టీడీపీ మహిళా నాయకురాలు మూల్పూరి సాయికల్యాణిపై కేసు నమోదైంది. గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,కొడాలి నానిపై సోషల్ మీడియాలో సాయి కల్యాణి అసత్య ప్రచారం చేశారు. చీకోటి ప్రవీణ్‌తో కొడాలి నాని, వంశీకి సంబంధాలు ఉన్నాయంటూ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సాయి కల్యాణి పోస్టులు పెట్టారు. నిరాధార పోస్టింగ్‌లు పెట్టిన సాయి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పీఎస్‌లో వైఎస్సార్సీపీ నాయకుడు ప్రదీప్ ఫిర్యాదు చేశారు. -
జూ.ఎన్టీఆర్‌ను టీడీపీలోకి లోకేశ్ ఆహ్వానించడం పెద్ద జోక్
గన్నవరం: ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీలో కలిసి పనిచేద్దామని జూనియర్ ఎన్టీఆర్‌ను లోకేశ్ ఆహ్వానించడం అతి పెద్ద జోక్ అని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. నందమూరి వంశీకుల పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడం అంటే అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్.. జూనియర్ ఎన్టీఆర్‌కు తాత అని, లోకేశ్ తాత ఖర్జూర నాయుడని చెప్పారు. 2009 ఎన్నికల్లో లోకేశ్ గాలికి తిరుగుతున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కోసం ప్రాణాలొడ్డి పనిచేశారని గుర్తుచేశారు. అటువంటి ఎన్టీఆర్‌కు ఎవరి దయ అవసరం లేదన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలకు ఖండన గన్నవరం పాకిస్తాన్లో ఉందా.. అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యాలను వంశీ తీవ్రంగా ఖండించారు. దేశంలో ఎవరైనా, ఎక్కడికైనా నిరభ్యంతరంగా వెళ్లొచ్చని, సెక్షన్ 144 అమలులో ఉన్నప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎవరినైనా నియంత్రించొచ్చని గుర్తుచేశారు. ముద్రగడ పద్మనాభంను మూడేళ్లు ఇంటి నుంచి బయటకు రాకుండా, మంద కృష్ణమాదిగను ఐదేళ్లపాటు రాష్ట్రంలోకి రాకుండా చంద్రబాబు ఏ చట్టం, ఏ రాజ్యాంగం ప్రకారం అడ్డుకున్నారో చెప్పాలన్నారు. తనను పశువుల డాక్టర్ అని హేళన చేస్తున్న చంద్రబాబు ఏమైనా ఆర్ఈసీ వరంగల్‌లో, లోకేశ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివారా.. అని ప్రశ్నించారు. -
టీడీపీ ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ పార్టీనే: వంశీ
సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. ఓ పని చంద్రబాబు చేసే సంసారం.. వేరే వారు చేస్తే మరొకటా? అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కావాలనుకుంటే గన్నవరం కాకపోతే అసోం కూడా వెళ్లొచ్చు అంటూ సెటైరికల్ పంచ్ ఇచ్చారు. కాగా, వంశీ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సెక్షన్ 144, 30 అమలులో ఉన్నప్పుడు పోలీసులు ఎవరినైనా నియంత్రిస్తారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లొచ్చు. నడుముకి రాకెట్ కట్టుకుని పైకెళ్లొచ్చు.. గోదాట్లో దూకి కుక్కతోక పట్టుకుని ఈదొచ్చు. ముద్రగడను ఇంట్లోంచి బయటకు రాకుండా మూడేళ్లు నియంత్రించారు. మందకృష్ణ మాదిగను ఏపీలోకి రాకుండా ఐదేళ్లు నియంత్రించారు. అప్పుడు ఏ రాజ్యాంగం ప్రకారం చంద్రబాబు చేశాడు?. చంద్రబాబు చేస్తే సంసారం.. వేరే వారు చేస్తే మరొకటా?. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటాననడం బాధాకరం. చంద్రబాబు.. బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా చూసినట్లన్నాడు. అందుకే బాలయ్య సినిమా డైలాగులు చెబుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని లోకేష్ పిలవడం అతిపెద్ద జోక్. టీడీపీ ఎప్పటికైనా ఎన్టీఆర్ పార్టీనే. లోకేష్‌కు బొడ్డు ఊడనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రచారం చేశారు. వాళ్ల తాతగారి పార్టీని జూనియర్ ఎన్టీఆర్ చూసుకోగలడు. తిరుపతిలో శిశువుల డాక్టర్‌ను చంద్రబాబు మోసం చేసిన కథ బయటపెడతాను’ అంటూ కౌంటర్ ఇచ్చారు. -
చంద్రబాబు వ్యూహం ప్రకారమే గన్నవరం అల్లర్లు
గన్నవరం: ప్రశాంతంగా ఉన్న గన్నవరంలో జరిగిన అల్లర్ల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్యూహం ఉందని స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ చెప్పారు. పట్టాభి నేతృత్వంలో సంఘ విద్రోహ శక్తులను ఇక్కడికి పంపించి అల్లర్లకు కారణమయ్యారని తెలిపారు. వంశీమోహన్ గురువారం గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. గన్నవరంలో గొడవలు సృష్టించిన వారిలో విజయవాడ ఈస్ట్, సెంట్రల్, వెస్ట్, పెనమలూరు నియోజకవర్గాలకు చెందిన 60 మంది వరకు టీడీపీ గూండాలు ఉన్నారని చెప్పారు. వీరందరూ గన్నవరంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించి విఫలం కావడంతో చంద్రబాబుకు, టీడీపీకి గట్టి షాక్ తగిలిందన్నారు. ఇక్కడ జరిగిన గొడవలకు సంబంధించి కేసుల నమోదుపై టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తప్పుపట్టారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగినట్లు చెబుతున్న ఆ పార్టీ నేతలు బుధవారం రాత్రి వరకు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు . ఎస్పీ జాషువా మీడియాతో మాట్లాడిన తర్వాత మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును వెంట పెట్టుకుని వచ్చి ఫిర్యాదులు చేశారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్‌పై ఏమీ చేయలేని చంద్రబాబు ఇప్పుడు ప్రపంచం తలక్రిందులైనట్లు చెబుతుండటం సిగ్గుచేటన్నారు. లేస్తే మగాడిని కాదంటూ లోకేశ్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. టీడీపీ లేదు, బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు ఓ ఐపీఎస్ అధికారిణితో అసభ్యకరంగా ప్రవర్తించి చంద్రబాబు కాళ్లు పట్టుకున్నారని చెప్పారు. అచ్చెన్నాయుడు ఇంకా మాట్లాడితే చిట్టా మొత్తం విప్పుతానని అన్నారు. గతేడాది కోవిడ్ కారణంగా ఐఎస్బీ ఒక సెమిస్టర్ రాయలేదని, దానిని పూర్తి చేసేందుకు మొహాలీ వెళ్తున్నట్లు తెలిపారు. -
రెచ్చగొట్టి మరీ రచ్చ రచ్చ
‘‘వాడో పిల్ల సైకో. నేనే గన్నవరం వెళతా!. ఎవడేం పీకుతాడో చూస్తా. ఆ వంశీ సంగతి తేలుస్తా. నియోజకవర్గంలోంచి బయటకు విసిరేస్తా’’ అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ముందు రెచ్చగొట్టింది... టీడీపీ నాయకుడు పట్టాభి. ‘‘దొంతు చిన్నా ఇంటికి వచ్చి వంశీ మనుషులు బెదిరించారని మీరంతా కేసు పెట్టండి. నేనూ వస్తా. వంశీ సంగతి తేలుస్తా’’ అని గన్నవరం టీడీపీ నేతలతో చెప్పింది... పట్టాభి. అన్నట్టుగానే వెళ్లాడు. తనతో పాటు కొంతమందిని అక్కడికి తీసుకువెళ్లటంతో పాటు స్థానిక తెలుగుదేశం నాయకులను కూడా వెంటేసుకుని... దండయాత్రకు బయలుదేరాడు. అక్కడ అలజడి సృష్టించబోయాడు. వంశీ అనుచరులు, అభిమానులు దీన్ని అడ్డుకోబోయారు. అప్పుడే ఇరువర్గాలకూ ఘర్షణ జరిగింది. తెలుగుదేశం నేతలు ముందే ఘర్షణకు సిద్ధమై మారణాయుధాల్లాంటి పరికరాలు తీసుకెళ్లటం వల్లే... స్థానిక సీఐ కనకారావు నుదుటిపై తీవ్ర గాయమైందనేది ప్రత్యక్ష సాక్షుల మాట. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటో తెలుసా? బాధితులను పరామర్శించటానికంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బయలుదేరారు. ఆయన అనుకూల మీడియా రభస మొదలెట్టింది. మొత్తానికి అందరూ కలిసి... అసలిక్కడ ప్రజాస్వామ్యమే లేదంటూ ఆక్రందనలు మొదలుపెట్టారు. అదీ కథ. (సాక్షి ప్రతినిధి, విజయవాడ): అసలిక్కడ బాధితులెవరు? చంద్రబాబు నాయుడు ఓదార్చాల్సింది ఎవరిని? ఓదార్చటం కన్నా ముందు తెలుగుదేశం నేతల్ని మందలించాలి కదా? ఇలాంటి సవాళ్లు, బెదిరింపులు రాజకీయాల్లో సరికాదని చెప్పాలి కదా? గన్నవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన బచ్చుల అర్జునుడు దురదృష్టవశాత్తూ ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రిలో చేరితే... ఆ స్థానాన్ని ఆక్రమించడానికి ఇంత అత్యుత్సాహం తగదని పట్టాభికి చెప్పాలి కదా? అవేమీ లేకుండా పట్టాభికి తోడుగా మీరంతా ఎందుకు వెళ్లలేదని పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడే క్లాసు తీసుకున్నారంటే ఆయన మానసిక స్థితిని ఎలా అంచనా వేసుకోవాలి? రాజకీయ పునర్వైభవం కోసం ఏ స్థాయికైనా దిగజారుతున్నారనేగా అర్థం!!. పట్టాభి కూడా అంతే. అవును మరి! ఆవు చేలో మేసినపుడు దూడ గట్టున మేస్తుందా!!? విజయవాడే కాదు. కృష్ణా జిల్లాలో అందరికీ ఇటీవల సంకల్పసిద్ధి అనే ఫైనాన్స్ కంపెనీ చేసిన మోసం గురించి తెలిసే ఉంటుంది. నిర్వాహకులను పట్టుకోవటంతో పాటు పోలీసులు కేసులూ పెట్టారు. అయితే దాన్ని అదునుగా తీసుకున్న తెలుగుదేశం నేతలు కొన్నాళ్లుగా సంకల్పసిద్ధి నిర్వాహకులతో సంబంధం ఉందంటూ గన్నవరం ఎమ్మెల్యే వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తమకు ఆ సంస్థ వివరాలు గానీ, నిర్వాహకుల ఊరూపేరూ గానీ ఏమీ తెలియవని వారిద్దరూ పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. అయినా సరే తెలుగుదేశం నేతలు తమ విమర్శలు కొనసాగిస్తుండటంతో... దీనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశారు వల్లభనేని వంశీ. కాకపోతే దీన్ని కూడా తెలుగుదేశం నేతలు ఎగతాళి చేశారు. అసలు వంశీకి పరువంటూ ఉంటే కదా... కేసులు వెయ్యాల్సింది? అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. వంశీని విమర్శిస్తూ... ఆయన సంగతి తేలుస్తానని టీడీపీ నేత దొంతు చిన్నా ఆవేశంతో ఊగిపోయాడు. ఇదిగో... ఇదే కారణంతో వంశీ అనుచరులు చిన్నా ఇంటికి వెళ్లారు. ఆ సమయానికి ఆయన లేకపోవటంతో... ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని, నోరు అదుపులో ఉంచుకోమని ఆయనకు చెప్పాలంటూ చిన్నా భార్యతో మాట్లాడి వెళ్లిపోయారు. ఇది తెలుసుకున్న పట్టాభి... దీన్నో అవకాశంగా మార్చుకుని అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలనుకున్నారు. విజయవాడ నుంచి మనుషులను తీసుకుని వెళ్లి మరీ అక్కడ వారందరితో కలిసి ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు చెయ్యడానికి వెళ్లారు. అయినా పోలీసులకు ఫిర్యాదు చెయ్యాలంటే బాధితులు వెళితే సరిపోదా? ఇన్ని వందల మంది ర్యాలీగా వెళ్లాలా? అలా వెళ్లారంటే ఏమిటర్థం? వాళ్లు వెళ్లింది దండయాత్రకనేగా? క్లుప్తంగా గన్నవరంలో ఘర్షణలకు దారితీసిన ఘటనలు ఇవే. సోమవారం టీడీపీ మూక పోలీసులకు ఫిర్యాదు చేసి వస్తుండగా ఇరు వర్గాలూ ఎదురుపడటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అడ్డుకుని పరిస్థితిని చల్లబరిచారు. తరవాత టీడీపీ కార్యాలయానికి చేరుకున్న ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి ముందే పగలగొట్టిన నాపరాళ్లతో పాటు చేతికందిన కర్రలు, రాడ్లు సిద్ధం చేసుకున్నారు. అంతలో అటుగా వెళుతున్న వంశీ అనుచరులను చూసి రెచ్చగొట్టేలా అరవటంతో... అక్కడ ఇరువర్గాలూ ఘర్షణకు దిగాయి. వీరిని వారించబోయిన పోలీసులకూ టీడీపీ నేతల చేతిలో గాయాలయ్యాయి. ఎస్పీ జాషువా అప్రమత్తంగా వ్యవహరించి, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా కఠిన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి కుదుట పడింది. అదీ జరిగిన కథ. దూషణల్లో నెంబర్–1 చంద్రబాబే... వాస్తవానికి కొన్నాళ్లుగా ముఖ్యమంత్రితో సహా ఆయన కుటుంబాన్ని తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. వీరందరిలోనూ చంద్రబాబే ముందుంటూ... ఎక్కడకు వెళ్లినా, ఏ సభలోనైనా పదుల సార్లు ‘సైకో’ అంటూ ముఖ్యమంత్రిపై తీవ్ర దూషణకు దిగుతున్నారు. అదే కోవలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాల్సిందిగా తన పార్టీ కార్యకర్తలకు, జీతగాళ్లకు కూడా చెబుతున్నారు. ఏ చిన్నఘటన జరిగినా వారిని ఉసిగొల్పుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయిస్తున్నారు. తనకు వంత పాడే మీడియా సహకారంతో అధికార పార్టీనే తిరిగి వేలెత్తి చూపిస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ, అభివద్ధి పాలనలో వేలెత్తి చూపే అంశాల్లేక... ప్రజల్లోకి వెళ్లడానికి మొహం చెల్లక ఇలాంటి రచ్చకు దిగుతున్నారనేది తెలియనిదేమీ కాదు. ఈ నెలలోనే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుడివాడ, గన్నవరంలో మూడు ఘటనలు జరిగాయంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. చిన్న విషయాలను పెద్దవి చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు టీడీపీ నేతలు ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థమవుతుంది. మచిలీపట్నం, గుడివాడలోనూ.. మచిలీపట్నంలో ఈ నెల 7న ఇదే విధంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. నిబంధనలు పాటించాలని కోరిన పోలీసులపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర రెచ్చిపోయారు. ప్రభుత్వ భూమిలో వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మిస్తున్నారని, దానిని అడ్డుకొంటామంటూ రవీంద్ర కార్యకర్తలతో కలిసి వచ్చి అమలులో ఉన్న 30 పోలీస్ యాక్ట్‌ను ఉల్లంఘించారు. పోలీసులు ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతుందని, ధర్నాకు అనుమతి లేదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పారు. దీంతో రవీంద్ర, ఇతర టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రవీంద్ర పోలీసులను నెట్టుకుంటూ, దుర్భాషలాడుతూ, నడి రోడ్డులో ఎస్సైపై చెయ్యి చేసుకున్నారు. ఆ మరునాడే గుడివాడలోనూ టీడీపీ నాయకులు బరితెగించారు. కోర్టు ఆదేశాలను అమలు చేస్తూ, ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్ ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు మునిసిపల్ అధికారులకు వేలు చూపిస్తూ బూతులతో రెచ్చిపోయారు. కోర్టు ఆదేశాలను అడ్డుకోవడం నేరమని చెప్పిన పోలీసులు, అధికారులపై జులుం ప్రదర్శించారు. -
గన్నవరం రణరంగం.. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టాభి వీరంగం
సాక్షి ప్రతినిధి, విజయవాడ/గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ను లక్ష్యంగా చేసుకుని మూడు రోజులుగా టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభితో పాటు ఆ పార్టీ నియోజకవర్గ నేతలు పక్కా వ్యూహంతో చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. టీడీపీ నేతల వైఖరికి నిరసనగా ఆ పార్టీ కార్యాలయం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన వంశీ అభిమానులు, అనుచరులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. దీంతో వారు ఆత్మరక్షణ కోసం ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పట్టాభి పలు అసత్య ఆరోపణలు, తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీంతో పట్టాభిపై స్థానిక కోర్టులో ఎమ్మెల్యే వంశీ పరువు నష్టం దావా వేశారు. దీంతో మూడు రోజులుగా ఎమ్మెల్యేను టార్గెట్‌గా చేసుకుని పట్టాభితో పాటు స్థానిక టీడీపీ నేతలు మీడియా సమావేశాల్లో విమర్శలను, ఆరోపణలను తీవ్రతరం చేస్తూ రెచ్చకొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పథకం ప్రకారం సోమవారం గన్నవరం వచ్చిన పట్టాభి.. మరోసారి ఎమ్మెల్యేను తిడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. అప్పటికే ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశానికి, వివిధ పనుల నిమిత్తం వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు.. టీడీపీ నేతల వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ ర్యాలీగా ఆ పార్టీ కార్యాలయం వద్దకు వెళ్లారు. వీరిపై టీడీపీ నేతలు రాళ్లు విసురుతూ. జెండా కర్రలతో దాడికి దిగడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాల నేతలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో టీడీపీ నేత విసిరిన రాయి తగలడంతో సీఐ పి.కనకారావు తలకు బలమైన గాయమైంది. వెంటనే పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ఏడు కుట్లు వేశారు. డీఎస్పీ కె.విజయపాల్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలను ఆక్కడ మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలు పట్టాభి రెచ్చగొట్టడం వల్లే.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి గన్నవరంలో ఓ గుంపును వెనకేసుకుని తిరుగుతూ వారిని రెచ్చగొట్టడం వల్లే ఘర్షణకు కారణమైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఉద్దేశ పూర్వక దాడికి దిగడం ద్వారా వారిని నియంత్రించి, వంశీ వర్గీయులపై తీవ్ర దాడికి కుట్ర పన్నారని తెలిపారు. గన్నవరానికి చెందిన వారు కాకుండా, బయటి నుంచి ఇతరులను రప్పించి దాడికి పాల్పడ్డారని స్పష్టమవుతోంది. టీడీపీ కార్యాలయంలో పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వంద మందితో గుంపుగా మోహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే ఇందుకు నిదర్శనం. నా పని నేను చేసుకుంటున్నా.. గన్నవరం నియోజకవర్గంలో గడపగడపకు తిరుగుతూ నా పని నేను చేసుకుంటున్నా. టీడీపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. సంకల్పసిద్ది మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు సంబంధించి ఆధారాలు లేకుండా నాపై అత్యంత దారుణంగా అసత్యాలు ప్రచారం చేశారు. అయినప్పటికీ నేను ఎంతో సంయమనంతో వ్యవహరించాను. ప్రత్యక్ష గొడవల జోలికి పోకుండా న్యాయం కోసం వారిపై కోర్టులో కేసు వేశాను. కొంత మంది కిరాయి జీతగాళ్లు వారి జీతం పెంచుకోవడం కోసం.. ఏరా.. ఒరేయ్.. బోస్డికే.. అంటూ ఇక్కడికొచ్చి నన్ను అతి దారుణంగా తిడుతుంటే నన్ను అభిమానించే వారికి బాధేసింది. అందుకు నిరసన తెలుపుదామని వెళ్లిన వారిపై దాడికి పాల్పడ్డారు. బయట నుంచి టీడీపీ నాయకులు వచ్చి గన్నవరం ప్రజలను రెచ్చగొట్టడం ఎంత వరకు సబబు? ఇక్కడ టీడీపీ నాయకులు లేరా? – మీడియాతో వల్లభనేని వంశీమోహన్, గన్నవరం ఎమ్మెల్యే -
చంద్రబాబు చరిత్ర నాకు మొత్తం తెలుసు: వల్లభనేని వంశీ
సాక్షి, కృష్ణా: గన్నవరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సాక్షిటీవీతో మాట్లాడారు. తరచూ తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. టీడీపీ వెబ్ సైట్, సోషల్ మీడియాలలోనే తన కుటుంబసభ్యులపై అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే వంశీ. చంద్రబాబు చరిత్ర నాకు, కొడాలి నానికి మొత్తం తెలుసు. అందుకే మాపై చంద్రబాబు పెంపుడు కుక్కలతో మొరిగిస్తున్నాడు. బుద్ధా వెంకన్నకు స్థాయి లేదు.. అలాంటివారిని పట్టించుకోను. గన్నవరంలో నన్ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు. కేవలం మా అనుచరులే దాడికి పాల్పడినట్టు ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. సంకల్పసిద్ధితో నాకు సంబంధం లేదని ఆకేసుపై విచారణ జరపాలని నేనే డీజీపీకి ఫిర్యాదు చేసాను అని వంశీ తెలిపారు. గన్నవరంలోకి బయటివాళ్లు వచ్చి గొడవ పెట్టారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎక్కడివారో వచ్చిన ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటని? నిలదీశారాయన. అక్కడ జరిగే ప్రతీ సంఘటనతో నాకు సంబంధం లేదని వంశీ చెప్పుకొచ్చారు. చిన్న చిన్న విషయాల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. -
డీజీపీని కలిసిన వల్లభనేని వంశీ.. టీడీపీ నేతలకు వార్నింగ్
సాక్షి, విజయవాడ: సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్కాంలో తనకు ప్రమేయం ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు, పచ్చ మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ డీజీపీని కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డికి గురువారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘సంకల్ప సిద్ధి స్కాంలో ఓలుపల్లి రంగా ద్వారా నాకు, మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి సంబంధం ఉందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రెస్మీట్లో చెప్పారు. 3 నెలలుగా నేను గన్నవరంలో ఉండటంలేదని, హైదరాబాద్‌లో ఉంటూ రూ.600 కోట్లతో బెంగళూరులో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టానంటూ నిరాధార ఆరోపణలు చేశారు. చదవండి: (రాయలసీమ ప్రగతికి మరో ‘హైవే’.. రూ.1,500.11 కోట్లతో 4లేన్ల రహదారి) ఈ స్కాంలో వందల కోట్లు సంపాదించానంటూ పుకార్లు పుట్టించారు. ఈ అసత్య ప్రచారాన్ని టీవీ 5, ఏబీఎన్ ఛానళ్లు గత నెల 26, 27 తేదీల్లో లైవ్ టెలికాస్ట్‌గా, 27, 28 తేదీల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కథనాలుగా ఇచ్చాయి. గతంలోనూ గల్ఫ్‌లో కాసినోలు పెట్టించానని, చీకోటి ప్రవీణ్‌తో సంబంధాలున్నాయని టీడీపీ నేతలు ప్రచారం చేసి నా ప్రతిష్టకు భంగం కలిగించాలని విఫలయత్నం చేశారు. చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో నాకు, కొడాలి నానికి ఎలాంటి ప్రమేయం లేదని ఈడీ తేల్చిన తరువాత తోక ముడిచారు. సంకల్ప స్కాంలో నాపై చేసిన ఆరోపణలకు వారి వద్ద ఉన్న ఆధారాలు వెంటనే బయటపెట్టాలి’ అని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక అసత్య ప్రచారాలతో ప్రజలను నమ్మించేందుకు పచ్చ మీడియా పని చేస్తోందన్నారు. ఈ కేసులో తన అనుచరులు ఉంటే అరెస్ట్ చేయాలని, సీబీఐ, స్వతంత్ర సంస్థలతో విచారించాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన టీవీ5, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడుపై పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. -
ప్రాణాపాయ స్థితిలో ఉన్న మహిళకు ఎమ్మెల్యే వంశీ ఆపన్నహస్తం
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): ‘రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. నాకు బతకాలని ఉంది.. నా ప్రాణాలు కాపాడండి..’ అంటూ ఓ మహిళ కన్నీటితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను వేడుకుంది. చలించిన ఆయన తాను న్నానంటూ ఆమె భరోసా ఇచ్చారు. అతిక్లిష్టమైన శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయటంతో పాటు, అందుకు అయ్యే ఖర్చును భరించారు. బాపులపాడు మండలం హనుమాన్జంక్షన్కు చెందిన దుట్టా ఉదయ కిరణ్ రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య పావని (22), ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. గతే డాది గన్నవరం మండలం కేసరపల్లి వద్ద పావని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఆమె తల రోడ్డుకు బలంగా తగలడంతో మెదడులో రక్తం గడ్డకట్టింది. ఎడమవైపు పుర్రె భాగం తీవ్రంగా దెబ్బతింది. దీంతో పావనిని కుటుంబ సభ్యులు ఎనికేపాడులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. ఆస్పత్రి వైద్యులు రెండు సార్లు పావని బ్రెయిన్‌కు ఆపరేషన్లు చేశారు. తలలో దెబ్బతిన్న పుర్రె భాగాన్ని శస్త్రచికిత్స చేసేందుకు కొద్దిరోజులు భద్రపరిచినా, ఆ తర్వాత పూర్తిగా దెబ్బతిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో కృత్రిమ పుర్రె (ప్లాస్టిక్ సింకుల్) అమర్చాల్సి ఉందని, ఈ సర్జరీ తమ వల్ల కాదని వైద్యులు తేల్చి చెప్పారు. అప్పటికే రూ.10 లక్షలకు పైగా ఖర్చు కావటంతో ఉదయకిరణ్‌కు ఏమి చేయాలో పాలుపోలేదు. ఈ తరుణంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వద్దకు వెళ్లి తన ప్రాణాలు కాపాడాలని పావని కన్నీటి పర్యంతమైంది. చిన్న వయస్సులో ఆమెకు వచ్చిన కష్టాన్ని చూసి చలించిన ఎమ్మెల్యే వంశీమోహన్ తనకు తెలిసిన కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమెను పరీక్షించాల్సిందిగా సూచించారు. పావని తలను పూర్తిస్థాయిలో పరిశీలించిన వైద్యులు ఆమె తలలో కొప్పా త్రీడీ టెక్నాలజీతో కూడిన కృత్రిమ పుర్రె భాగాన్ని పెట్టి, దానిలో మెదడును అమర్చితే ప్రాణాలు కాపాడొచ్చని వైద్యులు తెలిపారు. పుర్రె తయారీకి రూ.3 లక్షల ఖర్చవుతుందని చెప్పారు. ఆ మొత్తాన్ని ఎమ్మెల్యే వంశీమోహన్ తక్షణమే అందించి, ప్రత్యేకంగా పుర్రె భాగాన్ని సిద్ధం చేయించారు. త్వరలోనే పావని తలకు ఆపరేషన్ పూర్తి చేసి పుర్రె అమర్చనున్నారని ఎమ్మెల్యే కార్యాలయం తెలిపింది. -
వెన్నుపోటు తప్ప ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిందేం లేదు..
ఉంగుటూరు: మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని లాక్కోవడం మినహా ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిందేమీ లేదని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులో తన తండ్రి రమేష్‌చంద్ వర్ధంతి సందర్భంగా స్మారకఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వంశీ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో గన్నవరం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా ఏర్పడినా ఎన్టీఆర్ పేరు పెట్టడం గానీ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదనలు చేయలేదని మండిపడ్డారు. అలాంటిది నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని చెప్పారు. వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడంతో పాటు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన వైఎస్సార్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టారని చెప్పారు. యూనివర్సిటీకీ ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడం వలన ఎవరి స్థాయి తగ్గదని, ఇద్దరూ మహానుభావులని చెప్పారు. వైజాగ్‌లో మంత్రుల వాహనాలపై జనసేన నాయకులు దాడికి పాల్పడటం దారుణమన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని 2024లో తాను గన్నవరం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. -
చంద్రబాబు ఇప్పటికీ తన తప్పును కప్పిపుచ్చే దశలోనే ఉన్నారు: ఎమ్మెల్యే వల్లభనేని
-
ఆ నియోజకవర్గంలో పచ్చపార్టీకి సరైన నాయకుడే లేడు!
కృష్ణా జిల్లాలోని ఆ నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా చెబుతారు. కాని అక్కడే పచ్చ పార్టీకి సరైన నాయకుడు లేడు. బయటి నుంచి వచ్చి పెత్తనం చేస్తున్న నేతను అక్కడి వారు పట్టించుకోవడం మానేశారట. కాని బీసీ కార్డుతో టిక్కెట్ తెచ్చుకోవాలని ఆ నాయకుడు ప్రయత్నిస్తున్నారు. అధినేత మాత్రం వేరే నేత కోసం అన్వేషిస్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అసలక్కడ ఏం జరుగుతోంది? కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు కమ్యూనిస్టుల కేంద్రమైన గన్నవరం ... తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి అడ్డాగా మారింది. ఐతే ఇదంతా గతం ... ఇప్పుడు గన్నవరంలో సైకిల్ పార్టీ శ్రేణులను పట్టించుకునే నాధుడే లేడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. 2019లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడై ప్రభుత్వానికి మద్దతు పలికారు. దీంతో గన్నవరం టీడీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. దీంతో మచిలీపట్నం నుంచి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని తీసుకొచ్చి నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు కట్టబెట్టింది అధిష్టానం. బచ్చుల రూపంలో తమకో నాయకుడు దొరికాడని గన్నవరం టీడీపీ క్యాడర్ సంబరపడిపోయింది. కట్ చేస్తే పేరుకి ఇంఛార్జిగా ఉన్నాడన్నమాటే కానీ బచ్చుల కార్యకర్తలకు అండగా నిలవలేకపోతున్నారట. ఓ వర్గాన్ని మాత్రమే తన వెంటేసుకుని తిరుగుతున్నారని టాక్. పార్టీ కార్యక్రమాల్లో తన కోటరీని తప్ప మిగిలిన వారిని కలుపుకుపోవడం లేదట. గతంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చక్రం తిప్పిన గన్నవరం మండల టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు బచ్చుల వెంటే ఉంటూ అంతా తానై నడిపిస్తున్నారట. ఇంచార్జ్‌గా ఉంటున్న బచ్చుల అర్జునుడు తీరు నచ్చని చాలామంది గన్నవరం టీడీపీ ఆఫీస్ గుమ్మం తొక్కడం కూడా మానేశారట. మరికొందరైతే బచ్చులకు నాయకత్వ లక్షణాలే లేవు అంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. ఇంకొందరైతే లీడర్ షిప్ క్వాలిటీస్ లేని ఈ బచ్చులతో మనకేల కామ్ గా ఉంటే పోలా అని సైడైపోతున్నారట. మరోవైపు గన్నవరంలో ప్రధాన సామాజిక వర్గం, టీడీపీకి అండగా ఉండే కమ్మవారిని సైతం బచ్చుల దూరం పెడుతూ వస్తున్నారట. అటు కమ్మ సామాజికవర్గం నేతలు, శ్రేణులు కూడా బచ్చుల వైఖరితో టచ్ మీ నాట్ అనేలా వ్యవహరిస్తున్నారట. పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా దూరంగా ఉండి చూస్తున్నారే కానీ..ప్రత్యక్షంగా పాల్గొనడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఎవరైనా ముఖ్యనేతలు లేదా పార్టీ అధినేత చంద్రబాబు గన్నవరం వస్తే ఎయిర్ పోర్టులో కలిసి కామ్ గా వెళ్లిపోతున్నారట . ఇదిలా ఉంటే నియోజకవర్గ ఇంఛార్జిగా క్యాడర్ కు అండగా నిలబడలేకపోతున్న బచ్చుల ఈసారి గన్నవరం టిక్కెట్టు తనకే ఇస్తారని ఆశలు పెట్టుకున్నాడట. ఏ సందర్భం దొరికినా వైసీపీ ప్రభుత్వాన్ని , సీఎంను తిడుతూ చంద్రబాబు దృష్టిలో పడేందుకు నానా తిప్పలు పడుతున్నారని అక్కడి కేడర్ చెప్పకుంటున్నారు. తాను బీసీ నాయకుడిని కాబట్టి... టీడీపీలో బీసీలకు పెద్ద పీట వేస్తామని పదే పదే డబ్బాలు కొట్టుకునే అధినేత మాట నిజమే అనుకుని గన్నవరం టిక్కెట్ తనకే ఇస్తారని ఇప్పట్నుంచే కర్చీప్ వేసుకుని రెడీగా ఉన్నాడట బచ్చుల అర్జునుడు. చంద్రబాబు ఆలోచనలు మాత్రం బచ్చుల ఆశలకు గండికొట్టేలా కనిపిస్తున్నాయని వినికిడి. చాలా రోజుల నుంచి చంద్రబాబు గన్నవరంలో టీడీపీ తరపున పోటీ చేసే క్యాండేట్ కోసం భూతద్ధంతో వెతుకుతున్నారట. తనదగ్గరకి వచ్చే వారిని సీటిస్తా ... గన్నవరం పోతావా అంటూ అడుగుతున్నారట. ఇదిలా ఉంటే ప్రస్తుతం నియోజకవర్గంలోని తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మొదట్నుంచి పార్టీనే నమ్ముకున్న తెలుగుదేశం క్యాడర్ మాత్రం అర్జంట్ గా సరైన నాయకుడిని ఇంఛార్జిగా నియమించకపోతే గన్నవరంలో ఉన్న కొద్దిపాటి పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని బాహాటంగానే చెప్పేస్తున్నారట. ప్రస్తుత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తెలుగుదేశానికి దూరం కావడంతో...అక్కడి ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన వెంటే నడిచారు. అందువల్లే గన్నవరంలో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో అభ్యర్థే కనిపించడంలేదు. -
మీ ప్రతీ మాటకు నేనంతే స్థాయిలో సమాధానం చెప్తా: వల్లభనేని వంశీ
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కంటే విశ్వాస ఘాతకుడు ఎవరున్నారంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్ అయ్యారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇందిరా గాంధీ, ఎన్టీఆర్లకు విశ్వాస ఘాతుకం చేసింది చంద్రబాబు కాదా?. చంద్రబాబు బల్లాల దేవ అని సాక్షాత్తూ ప్రధాని మోదీ చెప్పారు. టీడీపీ నేతలు ఏం తిట్టినా అవి బాబుకే వర్తిస్తాయి. నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నాను. లోకేష్‌కి దమ్ముంటే గన్నవరం వచ్చి పోటీ చెయ్యాలి. లోకేష్ వచ్చినా, చంద్రబాబు వచ్చినా నేను రెడీ. పరిటాల సునీతకు నా రాజీనామా ఇస్తాను. నాపై పోటీకి ఎవరొస్తారో డిసైడ్ చేసి చెప్పండి. ప్రపంచంలో ఉన్న కమ్మోళ్లంతా వచ్చి ప్రచారం చేయండి. నన్ను, నా కుటుంబంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రతీ మాటకు నేను అంతే స్థాయిలో సమాధానం చెప్తాను. చదవండి: (ఇప్పుడే రాజీనామా చేస్తా: వల్లభనేని వంశీ) పరిటాల రవిపై చంద్రబాబు నిరంతరం తప్పుడు ప్రచారం చేయించాడు. ఆంధ్రజ్యోతిలో ప్రతి వారం పరిటాలపై వ్యతిరేకంగా రాయించేవారు. పరిటాల రవిని దారుణంగా అవమానించింది చంద్రబాబే. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు చంద్రబాబు కారణం కాదా?. కోడెల పనులకి మాకు సంబంధం లేదని పార్టీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్ పెట్టించలేదా?. ఆడవాళ్లంటే చంద్రబాబు ఇంట్లో వాళ్లే ఆడవాళ్లా. మా ఇంట్లో ఆడవాళ్లని ఇష్టమొచ్చినట్టు మాట్లాడొచ్చా?. ముఖ్యమంత్రి తల్లిని దూషించవచ్చా?. జయప్రదంగా చంద్రబాబు సైకిల్ గుర్తు దక్కించుకోలేదా?. కాల్ మనీ సెక్స్ రాకెట్లో చంద్రబాబు ఎవ్వరినైనా శిక్షించాడా. కాల్ మనీ వ్యాపారులకు పదవులిచ్చింది చంద్రబాబు కాదా. దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు కాదా. వీళ్లా మహిళల కోసం మాట్లాడేది' అంటూ వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదవండి: (చంద్రబాబు చరిత్ర వింటేనే అసహ్యం: మంత్రి బాలినేని) -
‘యాప్‌లు చేయటం ఎస్ఈసీ పని కాదు’
సాక్షి, కృష్ణా: సొంత యాప్ చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి అధికారం లేదు. యాప్‌లు చేయడం.. చంద్రబాబుకు సోపులు పూయటం ఎస్ఈసీ పని కాదు అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్రంగా మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వారికి అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యత మరిచి లక్ష్మణ రేఖ దాటడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ విచిత్రపోకడలతో దుందుడుకుతనంగా ముందుకు వెళ్తున్నారు. వ్యక్తిగతంగా తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అనిపిస్తోంది. ఓటర్ లిస్టు సవరించే సమయం ఇవ్వకుండా ఎన్నికలు పెడుతున్నారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాసి ఆ నెపం అధికారులపై వేస్తున్నారు. దురుద్దేశంతో ప్రభుత్వానికి లీగల్ సమస్య సృష్టించే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ వంశీ మండిపడ్డారు. (చదవండి: ‘బాబుని సీఎం చేయాలని గవర్నర్‌కి లేఖ రాస్తారేమో’) 2011 లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు 1154 జీఓ ఇచ్చారు. 2003లో జరిగిన అలిపిరి బాంబ్ బ్లాస్ట్‌లో మెదడు చెదిరినట్టుంది గతం మరిచి ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దంటూ హూంకరిస్తున్నారు. 2000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మోదీ స్థానంలో ప్రధాని అవ్వాలని ప్రయత్నించి చంద్రబాబు బంగపడ్డాడు. కొడుకుని ఎమ్మెల్యేని కూడా చేయలేక చతికిలపడ్డాడు. పిచ్చి ముదరడంతో పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించాడు. వినేవాడు ఉంటే హరికథ అరవంలో కూడా చెబుతారన్న చందంగా బాబు మాటలు ఉన్నాయి. ఉడకబెట్టిన నాగడ దుంపలా.. పదవి పోయినా.. బాబు భ్రమల్లో నుంచి బయటకు రాలేదు. జనం షెడ్డుకి పంపినా ఉత్తరకుమార ప్రగల్బాలు పోలేదు. మోది, కేసీఆర్, జగన్‌లను చూసి వణుకుతున్నాడు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు. -
నీ ఇంటికి రమ్మంటావా?: వంశీ
సాక్షి, విజయవాడ: చంద్రబాబు డ్రామా కంపెనీ నడుపుతున్నారని, అందులో కుక్కలు, పందులు వంటి వివిధ రకాల జంతువులున్నాయని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. అందులో దేవినేని ఉమ ఒక రకమని ఎద్దేవా చేశారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తీవ్రంగా హెచ్చరించారు. మంగళవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఏ సీఎం చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ మళ్లీ ఎప్పటికీ అధికారంలోకి రామనే భయంతోనే చంద్రబాబు, దేవినేని ఉమ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ఆరోపణలు సహజమని, కానీ వ్యక్తిగత ఆరోపణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. 2014కి ముందు చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎన్ని హామిలిచ్చారు? ఎన్ని నేరవేర్చారని నిలదీశారు. ఇక ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, దేవినేనిలకు ఆయన విగ్రహాన్ని ముట్టుకునే అర్హతే లేదని తేల్చి చెప్పారు. అసలు దేవినేని సిగ్గు లేని మనిషని, సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి ఆయనకెక్కడిదని దుయ్యబట్టారు. బహిరంగచర్చకు రమ్మంటే గొల్లపూడిలో నిరసన అంటూ డ్రామాలాడారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నామని, నీ ఇంటికి రమ్మంటే అక్కడే చర్చిద్దాం.. లేదంటే కొడాలి నాని ఇంటి దగ్గర చర్చకు రమ్మని సవాలు విసిరారు. మరోవైపు చంద్రవాబుకి, లోకేష్‌కు రాష్ట్రంలో ఇల్లు లేదంటూ వారిని అజ్ఞాతవాసులుగా అభివర్ణించారు. వీళ్లిద్దరు తప్ప రాష్డ్రంలో సీఎం వైఎస్ జగన్ పాలనపై అందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. (చదవండి: ఆనాడు బాబు మంగమ్మ శపథం చేశారు) -
బాబు పసుపు కుంకుమ ఇస్తే ఉప్పు కారం పెట్టారు
సాక్షి, విజయవాడ: గతంలో జరిగిన కార్యక్రమాలకు, ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీకి చాలా వ్యత్యాసం ఉందని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన 31 లక్షల మందికి ఇళ్లిస్తున్నారని తెలిపారు. కోర్టు అనుమతి తరువాతే వీటికి రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారని స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనాడు టీడీపీ హయాంలో రెండు లక్షల ఇళ్ళకు చంద్రబాబు మంగమ్మ శపథాలు చేశాడని విమర్శించారు. ఇప్పుడేమో ప్రభుత్వం ఇచ్చే పట్టా అమ్ముకోకూడదని కోర్టులకు వెళ్ళి ఆపారని మండిపడ్డారు. (చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’) మంచి రోజున ఈ ఇళ్ళపట్టాల కార్యక్రమం చేయడం చాలామందికి కడుపునొప్పిగా ఉందని ఎద్దేవా చేశారు. టీడిపీ ఇచ్చిన పట్టాల భూములకు రాయి కూడా కనిపించడం లేదన్నారు. చంద్రబాబు పసుపు, కుంకుమ ఇస్తే ఎన్నికల్లో మహిళలు ఉప్పు కారం పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేవినేని ఉమ ఇంటికి కాంట్రాక్టర్లు తిరుగుతున్నారని, ఆయన తక్కువ ధరలకు భూములు చూపించగలడా? అని ప్రశ్నించారు. వ్యవసాయ భూమి పల్లం కాకపోతే ఇంకెలా ఉంటుంది, బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నారని ఉమ మీద మండిపడ్డారు. ఇళ్ళపట్టాల పంపిణీని అడ్డుకునే నాయకులను ప్రజలే నిలదీయాలని వంశీ కోరారు. (చదవండి: బీజేపీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి ఓవరాక్షన్) -
ఎమ్మెల్యే వంశీకి పాజిటివ్
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
రమేశ్‌కు పారిపోవాల్సిన అవసరం ఏముంది?..
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కరోనా వచ్చిన 5 నెలల్లో 4 రోజులు మాత్రమే ఏపీలో ఉన్నారని, రాష్ట్రంలో పనిలేని బాబు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని వల్లభనేని వంశీ ప్రశ్నించారు. ఆంధ్రా వదిలి రూంలో కూర్చున్న చంద్రబాబు జూమ్‌లో మాట్లాడుతున్నారని, మానసిక భ్రాంతితో తన ఫోన్ ట్యాప్ అయిందంటున్నారని మండిపడ్డారు. బుధవారం వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రమేష్ హాస్పిటల్లో ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టడంలో తప్పేముంది?. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవడం కక్ష సాధింపు ఎలా అవుతుంది?. రమేష్ హాస్పిటల్‌కు ఆరోగ్యశ్రీ కింద నగదు చెల్లించినప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచితనం కనపడలేదా ?. ( ‘జగన్ మాట ఇచ్చారంటే.. నిలబెట్టుకుంటారు’) విశాఖ ఎల్.జి పాలిమర్స్‌లో ప్రమాదం జరిగినప్పుడు యాజమాన్యం మీద చర్యలు తీసుకోమని చంద్రబాబు, లోకేష్ లేఖలు రాయలేదా?. తప్పు చేయని రమేష్ పారిపోవాల్సిన అవసరం ఏముంది?. 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలో హాస్పిటల్ యాజమాన్యంపై కేసులు పెట్టడం ప్రభుత్వం విధి. రమేష్ హాస్పిటల్ ఏమైనా పేదవాళ్లకు ఉచితంగా వైద్యం చేసిందా?. కోవిడ్ కేర్ సెంటర్లు పెట్టి కరోనా లేని వాళ్ల వద్ద కూడా లక్షల రూపాయలు వసూలు చేశారు. తెలంగాణలో కోవిడ్ హాస్పిటళ్లు తప్పు చేస్తే కేసీఆర్ చర్యలు తీసుకోలేదా ?. చంద్రబాబు,లోకేష్‌లు జాతీయ పార్టీ వాళ్లుగా తెలంగాణలో ఎందుకు మాట్లాడరు. కమ్మ సామాజిక వర్గాన్ని భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు తయారయ్యాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాబు కులం రంగు పూస్తున్నాడు. చట్టం ముందు అందరూ సమానులే’’ అని అన్నారు. -
టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ..
సాక్షి, విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వంశీ మోహన్ కూడా ఏ మాత్రం తగ్గకుండా ఎదురుదాడికి దిగుతున్నారు. నువ్వు ఒకటంటే.. నేను రెండంటాను అన్నట్లు తెలుగుదేశం నేతల లోపాయికారి బాగోతం మొత్తాన్ని బహిర్గతం చేస్తున్నారు. పోలీసు స్టేషన్లకు చేరిన వివాదం.. గురువారం సాయంత్రం ఓ టీవీ చానల్లో జరిగిన డిబేట్లో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌పై వంశీమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైవీబీ వర్గీయులు ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా సోషల్ మీడియాలో టీడీపీ నేతలు తన ఫొటోలు మార్ఫింగ్ చేసి తమ క్యారెక్టర్‌ను, కుటుంబ పరువును దెబ్బ తీసే విధంగా పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ వంశీ మోహన్ విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం టీడీపీతో సహా రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీని ఏకిపారేస్తున్న వంశీ.. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విలేకరుల సమావేశం నిర్వహించి వంశీ వ్యవహార శైలిని దుయ్యపట్టారు. అలాగే టీడీపీ నాయకులు వర్ల రామయ్య, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధలు కూడా విలేకరుల సమావేశం నిర్వహించి వంశీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన కూడా ఎదురుదాడికి దిగారు. తనను కలిసిన విలేకరులతో తెలుగుదేశం పార్టీలో జరిగిన.. జరుగుతున్న బాగోతాలను పూసగుచ్చినట్లు వివరించారు. టీడీపీకి చెందిన ఒక నాయకుడు ఎన్నికల్లో గెలవలేరని, అయితే 25 లీటర్ల డీజిల్, బిర్యానీ ప్యాకెట్లు, ఐదు వేలు నగదు ఇస్తే ఎవరినైనా తిడతారంటూ ఘాటుగా విమర్శించారు. మరొక నాయకుడు కొనకళ్ల నారాయణ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసి బాడిగ రామకృష్ణ వద్ద డబ్బులు తీసుకున్నారంటూ బాంబు పేల్చారు. మాజీ మంత్రి ఒకరు వేస్ట్ ఫెలో అని.. ఆయన వల్లే జిల్లాలో పార్టీ నాశనం అవుతోందంటూ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఇక చంద్రబాబు, నారా లోకేష్‌లపై ముప్పేట దాడి చేశారు. సోషల్ మీడియాలో తన క్యారెక్టర్‌ను నాశనం చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, అందువల్లే అక్కడ జరిగిన వాస్తవాలన్ని బయట పెడుతున్నానని వంశీ ఆగ్రహంతో చెప్పారు. పరువు పాయే.. వంశీ మోహన్ తెలుగుదేశం పార్టీ వీడిపోతుంటే ఆయనను వ్యక్తిగత విమర్శలతో ఇరికిద్దమనుకున్న టీడీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పారీ్టలోని అంతర్గత విషయాలను వంశీ ఒక్కొక్కటిగా బయటపెడుతుండటంతో ఏమి పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు తాను చెప్పింది 10 శాతమేనని అవసరమైతే ఇంకా అనేక విషయాలు బయటపెడతానని చెప్పడంతో పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పటికే పరువు పోయిందని, వంశీ చేస్తున్న వ్యాఖ్యలతో పార్టీ పరువు బజారన పడుతోందన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
‘ఇసుకపై చంద్రబాబు దీక్షలు సిగ్గుచేటు’
గన్నవరం: ఇంకా పురిటి వాసన కూడా పోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు దీక్షలు, ధర్నాల పేరిట బురద జల్లే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ మండిపడ్డారు. కనీసం ఐదు నెలలు అధికారం లేకుండా చంద్రబాబు ఉండలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పేద ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియనివారు టీడీపీని నడపడం సిగ్గుచేటని వంశీ విమర్శించారు. స్థానిక దావాజిగూడెం రోడ్డులోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో చంద్రబాబుపై ఆయన ధ్వజమెత్తారు. వరదల్లో ఇసుక తీసే టెక్నాలజీ కనిపెట్టండి బాబు గారు! ‘వరదలు, అకాల వర్షాలు, ప్రకృతి వైపరిత్యాల సమయంలో నదుల నుంచి ఇసుక తీసే టెక్నాలజీ దేశంలో ఎక్కడ లేదు. అయినా ఇసుక కొరతపై చంద్రబాబు దీక్షలు, ధర్నాలు చేయడం సిగ్గుచేటు. సెల్‌ఫోన్ నేనే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు వరదల్లో ఇసుక తీసే టెక్నాలజీని తీసుకువస్తే మంచిది’ అని వంశీ సలహానిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలనే సీఎం జగన్ నిర్ణయాన్ని తాను పూర్తిగా సమరి్ధస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు కొడుకు, మనవడు ఇంగ్లిష్ మీడియం చదివితే తప్పులేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన పేదలు చదివితే ఆయనకు అంత బాధ ఎందుకని ప్రశ్నించారు. 2009 తర్వాతి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఏమయ్యారు? ఇకపై తన రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్‌తోనని, వైఎస్సార్సీపీలో చేరే విషయంపై త్వరలో స్పష్టత ఇస్తానని వంశీ తెలిపారు. 2009 ఎన్నికల్లో తన కెరీర్‌ను ఫణంగా పెట్టి టీడీపీకి ప్రచారం చేసిన జూనియర్ ఎనీ్టఆర్ ఆ తర్వాత పారీ్టలో ఎందుకు కనిపించడం లేదని ప్రశి్నంచారు. తెలంగాణాలో ఆర్టీసీ ఉద్యమం జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు నోరువిప్పడం లేదని నిలదీశారు. ‘మీ పుత్రరత్నం, మీ సలహాదారులు ముంచేసే టీడీపీ పడవను ధర్మాడి సత్యం కూడా బయటికి తీయలేడు.వర్ధంతికి, జయంతికి తేడా తెలియనివారు టీడీపీని నడుపుతుండడం సిగ్గుచేటు’ అని విమర్శించారు. నియోజకవర్గంలోని ఇళ్లులేని పేదలకు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయడం, ప్రజలకు మంచి చేయడమే తన ముందున్న లక్ష్యాలుగా పేర్కొన్నారు. మాజీ ఏఎంసీ ఛైర్మన్లు పొట్లూరి బసవరావు, కొమ్మా కోటేశ్వరరావు, మాజీ ఎంపీపీ పట్రా కవిత, టీడీపీ జిల్లా మాజీ అధికార ప్రతినిధి అనగాని రవి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
సీఎం జగన్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా: వంశీ
-
అప్పుడే ధర్నాలు, దీక్షలా: వల్లభనేని వంశీ
సాక్షి, గన్నవరం: తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతుందని..చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. టీడీపీ తన తీరు మార్చుకోకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. ఆయన గురువారం గన్నవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నలభై అయిదు సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం అయిదారు నెలలు కూడా అధికారం లేకుండా ఆగలేకపోతున్నారు. ఎంతో అపార అనుభవం కల మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా ఇప్పుడు సమర్ధవంతంగా పోషించలేకపోతున్నారు. ప్రజలకు మంచి చేయాలనుకునే ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రోత్సహించాలి. ప్రజాతీర్పును గౌరవించాలే కానీ, దాన్ని అపహాస్యం చేయకూడదని అన్నారు. త్వరలోనే వైఎస్సార్ సీపీలో చేరతా.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తన మద్దతు తెలియజేస్తున్నానని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో కలిసి నడుస్తానని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తన నియోజకవర్గ ప్రజల కోసం, ఇళ్ల పట్టాల కోసం, తన కోరిక సఫలం అవడం కోసం ముఖ్యమంత్రిని కలిసిన మాట వాస్తవమేనని అన్నారు. అందరికీ మంచి చేయాలనే సీఎం జగన్‌కు మద్దతు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. తనపై విమర్శలు చేసేవారు నారా లోకేష్‌ను ఎందుకు సీఎంను చేయలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. పదవులు ముఖ్యం కాదని, ప్రజల్లో ఉండటమే ముఖ్యమన్నారు. అప్పుడే ధర్నాలు, దీక్షలా? ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ...‘కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. అప్పుడే ధర్నాలు, దీక్షలు చేయడమేంటి?. డబ్బున్నవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. మీ పిల్లలు, నా పిల్లలు, డబ్బున్నవారందరి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నాం. మరి ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆర్ధికశక్తి లేనివారి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలా? ప్రభుత్వం ఉచితంగా చదివిస్తానంటే మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోం అని చెబుతున్నారా? లేక తల్లిదండ్రులు వారి పిల్లలకు ఇంగ్లీష్ అవసరం లేదని మీకు చెబుతున్నారా?. తెలుగును కాపాడే ధర్మం, బాధ్యత మనమీద లేదా? పేదవాళ్ళు ఒక్కరిమీదే ఉందా? నీతులు చెప్పడానికేనా? ఆచరించడానికి కాదా? మన పిల్లలకు ఒక న్యాయం, పేదపిల్లలకు మరో న్యాయమా? చదవండి: టీడీపీకి వంశీ ఝలక్ 23 సీట్లతో సరిపెట్టారు.. 2004 ఎన్నికలకు ముందు మీరు కోటి వరాలు ప్రకటించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని 47 సీట్లకు పరిమితం చేశారు. 2009 లో రాష్ట్రం మొత్తం ఏటీఎం కార్డులు ఇచ్చారు. ప్రజలు సుమారు 90 స్థానాలకే పరిమితం చేసి మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. 2019 లో కోటిమందికి పసుపుకుంకుమ ఇచ్చారు. వాళ్ళు మనను హాయిగా విశ్రాంతి తీసుకోమని దిండు దుప్పటి ఇచ్చి 23 సీట్లతో సరిపెట్టారు. దీన్నిబట్టి ప్రజల్లో మనం విశ్వసనీయత కోల్పోయిన మాట యదార్ధమా? కాదా?. 2014 ఎన్నికలకు ముందు రైతు రుణమాఫీని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీని ఎన్నికల వాగ్ధానంగా ప్రకటించాం. మన చేతిలో ఉన్న ఈ పనులని ఎప్పుడు ఎలా ఎంతకాలంలో అమలు చేశామన్నది బుర్ర, బుద్ధి, ఇంగితజ్నానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. మరి మన చేతిలో లేని ప్రకృతి మీద ఆధారపడ్డ ఇసుక లభ్యతని, కొరతని రాజకీయం చేయడం సమంజసమా?.అకాల వర్షాలు, అతివృష్టి, వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా నదులు, కాలువలు నిండి ఇసుకను వెలికితీసే సాంకేతిక పరిజ్ఞానాన్ని కనిపెట్టే శక్తిని ఆ సెల్‌ఫోన్, కంప్యూటర్ని కనిపెట్టినట్లుగానే ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని నేను ప్రార్ధిస్తున్నాను. ఆర్టీసీ సమ్మెపై మాట్లాడరే? తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో మీరు, మీ కుమారుడు ఎందుకు పాల్గొనడంలేదు? కారణం ఓటుకు నోటు కేసు కాదా?,ఆంధ్రప్రదేశ్ లో ఇసుక గురించి ఇంత దీక్ష అవసరమా? ఈ ప్రభుత్వానికి పురిటి వాసన అయినా పోయిందా? ఆ రాష్ట్రంలో ఒక ధర్మం, ఈ రాష్ట్రంలో మరో ధర్మమా?. తెలంగాణలో మాదిరిగానే ఏపీలోనూ టీడీపీ పరిస్థితి మారుతుంది. ఇటీవల జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీకి కనీసం రెండువేల ఓట్లు కూడా రాలేదు. వర్థంతికి, జయంతికి తేడా తెలియనివారు పార్టీని లీడ్ చేస్తున్నారు. ప్రాణం పెట్టి ఎన్నికల ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఎందుకు పక్కన పెట్టారు. ఈనాటి ఇసుక దీక్ష కూడా ఆనాటి ధర్మపోరాట దీక్ష బాటలోనే ఉందా? లేదా?. పార్టీ నాశనం అయిపోతుంది. బీజేపీతో ఘర్షణ వద్దని సుజనా చౌదరి, అనేకమంది ప్రముఖులు చెబితే వారి మాటలను పెడచెవిన పెట్టి భజనపరులు చెప్పిన మాయమాటలను చెవికెక్కించుకుని ధర్మపోరాట దీక్షలు చేయడమే తెలుగుదేశం పార్టీ ఈనాటి దుస్థితికి కారణం కాదా? మంచి మాటలు చెప్పినవారందరు పార్టీకి గుడ్‌బై చెప్తే మాయమాటలు చెప్పినవారు చెవిలో జోరీగల్లా హల్‌ఛల్ చేస్తున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేయకూడదు 2019 ఎన్నికలలో ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. మనకు ఇష్టంలేదని ఇప్పటికిప్పుడు అధికార పార్టీని దించగలమా. ప్రభుత్వం చేసే మంచిని మంచిగాను, చెడును చెడుగాను చూడాలి. మంచిని కూడా గుడ్డెద్దు వెళ్ళి చేలో పడ్డట్లు మీరు వ్యతిరేకిస్తే మీ వెనక మేము దూడల్లాగా అనుసరిస్తే పార్టీ, మనం ప్రజల్లో అభాసుపాలు కామా? ప్రభుత్వం చేసే మంచిని ఎందుకు మంచిగా అంగీకరించలేము? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలు. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం సబబా? ఇదే విధంగా నడక సాగిస్తే ప్రతిపక్ష హోదా కూడా పోయి తెలంగాణాలో టీడీపీకి వచ్చిన పరిస్థితి ఇక్కడ కూడా దాపురించదా? అందుకే తప్పులు సరిదిద్దుకుని ప్రభుత్వం చేసే మంచి పనులకు గుడ్డిగా వ్యతిరేకించకుండా మద్దతు పలుకుదాం. లేకుంటే మీరు, మీ పుత్రరత్నం, మీ సలహాదారులు ముంచేసే ఈ టీడీపీ పడవను సాక్షాత్తు ధర్మాడి సత్యం కూడా వెలికితీయలేరు. ఎన్నికల తర్వాత ఏమయ్యారు.. ప్రతి ఎన్నికలకు ముందు ఒక కొత్త పొత్తు, ఎన్నికల తర్వాత పూర్తిగా వేరొక తంతు?. 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ 2014 ఎన్నికలలో మద్దతు పలికిన పవన్‌కల్యాణ్ ఆయా ఎన్నికల తర్వాత ఏమయ్యారు? ఇది వాడుకుని వదిలేయడం కాదా?. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ...బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి రావచ్చా? ఆయన చేస్తే సంసారం... మిగిలినవారు చేస్తే వ్యభిచారమా?. పేపర్లో ఎన్నిసార్లు వ్యతిరేకంగా వార్తలు రాయలేదు. నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకోవాలా?. బ్లాక్మెయిల్ చేసి పార్టీలో ఉంచాలని చూస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్ధతిస్తే నాకు వ్యక్తి గతంగా ఎటువంటి లాభం లేదు. పేద ప్రజలకు మాత్రం మంచి జరుగుతుంది, మంచి చేయగలుగుతాను. నియోజకవర్గ అభివృద్ధి, పేదవాడికి చేసే సహాయం మాత్రమే నాకు జరిగే లాభం. పేద ప్రజల మంచికి, నియోజకవర్గ అభివృద్ధికి నా శాసనసభ్యత్వమే అడ్డు అనుకుంటే అందుకోసం రాజీనామా చేసైనా వారికి సేవకుడిగా మిగులుతా.’ అని తెలిపారు. -
చంద్రబాబుకు ఎమ్మెల్యే వంశీ వాట్సప్ లేఖ
సాక్షి, విజయవాడ : జిల్లా తెలుగుదేశం పార్టీలో భారీ కుదుపు.. 2019 ఎన్నికల్లో కృష్ణాజిల్లా నుంచి ఎన్నికైన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో ఒకరైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆ పార్టీని వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ.. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకి వాట్సాప్‌లో లేఖ పంపారు. అయితే ఎమ్మెల్యే పదవిని, పార్టీని వీడవద్దంటూ ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ద్వారా వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యే.. గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీమోహన్ రెండుసార్లు గెలుపొందారు. వల్లభనేని అరుణా మెమోరియల్ ట్రస్టు ద్వారా గన్నవరంలో సేవా కార్యాక్రమాలు ప్రారంభించిన వంశీ 2009లో గన్నవరం టీడీపీ టికెట్ ఆశించారు. అయితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా లగడపాటి రాజగోపాల్‌పై పోటీగా బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో వంశీ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినప్పటికీ తిరిగి గన్నవరం రాజకీయాలపై దృష్టి సారించారు. 2014లో గన్నవరం టీడీపీ సీటు సంపాదించి గెలుపొందారు. 2019లో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఆయన తీవ్రంగా విభేదించారు. ఒకటితో సరి.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం ముందు టీడీపీ యోధులంతా మట్టికరిచారు. అయితే గన్నవరం నుంచి వల్లభనేని వంశీ మోహన్, విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దెరామ్మోహన్ మాత్రం గెలిచి టీడీపీ పరువు నిలబెట్టారు. ఒకప్పుడు టీడీపీ కంచుకోటగా పేరుపొందిన జిల్లాలో ఎంపీ కేశినేని నాని తర్వాత ఈ ఇద్దరు నేతలే కీలకమయ్యారు. ప్రస్తుతం వంశీ పార్టీకి రాజీనామా చేయడంతో జిల్లాలో ఎమ్మెల్యేల సంఖ్య ఒకటికి పడిపోయింది. ప్రస్తుతం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సొంత జిల్లాలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. చంద్రబాబుకు వాట్సాప్‌లో లేఖ.. వంశీమోహన్ తాను పార్టీ వీడేందుకు గల కారణాలను వాట్సాప్‌లో ఇప్పటి వరకు రెండు లేఖల్లో తెలియజేశారు. వీటిపై చంద్రబాబు స్పందిస్తున్నారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండమంటూ వంశీకి సర్థి చెప్పే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలను రంగంలోకి దింపి వంశీని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కాగా తాను పార్టీ పదవుల్ని, ఎమ్మెల్యే పదవిని వదిలి రాజకీయాలకు దూరంగా ఉంటానని వంశీ చెబుతున్నారు. టీడీపీని వీడుతున్న వంశీ అనుచరులు.. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీకి బలమైన అనుచరగణం ఉంది. ప్రతి మండలంలోనూ ప్రతిగ్రామంలో ఆయనకు అనేక మంది కార్యకర్తలతో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. వారికి ఏ కష్టం వచ్చినా వంశీ ఆదుకుంటారనే నమ్మకం కార్యకర్తల్లో ఉంది. అయితే ఇప్పుడు వంశీ తెలుగుదేశం పార్టీనీ వీడుతూ ఉండటంతో ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆయన అనుచరులు పార్టీని వీడుతున్నారు. దీంతో గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి భారీగా నష్టం వాటిల్లనుంది. -
‘పానీ’పట్టు యుద్ధం
సాక్షి, విజయవాడ: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. పోలవరం కుడికాలువ పట్టిసీమపై ఏర్పాటు చేసిన పంపుసెట్లకు విద్యుత్ సరఫరా విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. మంత్రి ఉమా సొంత నియోజకవర్గం మైలవరంలో నీరు ఇచ్చి గన్నవరం నియోజకవర్గంలోని రైతులకు నీరు ఇవ్వకుండా తెర వెనుక రాజకీయం చేశారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరోసారి రోడ్డెక్కారు. త్వరలోనే ఈ వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానంటూ వెల్లడించారు. ఉమా ద్వంద్వనీతి.. పోలవరం కుడి కాల్వ మైలవరం, గన్నవరం నియోజకవర్గాల మీదుగా కృష్ణానదికి చేరుతుంది. ఈ కాల్వ కోసం గన్నవరం రైతులు భూములు ఇచ్చారు. దీనికి ప్రభుత్వం రూ.700 కోట్లు చెల్లించింది. ఇక్కడ కాల్వల కంటే వ్యవసాయ భూములు ఎత్తుగా ఉండటంతో నీరు ఎక్కదు. పట్టిసీమ నీరు ఈ కాల్వ లో వెళ్తుండడంతో గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్లు పెట్టుకుని నీరు తోడుకుంటారు. అదే తరహాలో మైలవరం నియోజకవర్గంలోనూ రైతులు చేస్తారు. మంత్రి ఉమాకు, ఎమ్మెల్యే వంశీకి ఉన్న మనస్పర్ధల కారణంగా గన్నవరం నియోజకవర్గ రైతులు మోటార్ల ద్వారా నీరు తీసుకోవడం మంత్రికి మనస్కరించడం లేదు. తన నియోజకవర్గ రైతులకు మోటార్ల ద్వారా నీరు తోడుకునేందుకు అనుమతిచ్చే ఉమా గన్నవరం రైతుల విషయంలో మాత్రం పక్షపాత ధోరణి వహిస్తున్నారనే విమర్శలు ఆపార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఆది నుంచి వివాదమే.. పట్టిసీమ నీరు వచ్చిన తొలి ఏడాది నుంచి నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. మొదటి ఏడాది గన్నవరం రైతులు మోటార్లు పెట్టగానే ఇరిగేషన్ అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు వివాదం అవ్వడంతో అనుమతించారు. రెండో ఏడాది అదే తంతు. దీంతో ఎమ్మెల్యే వంశీ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లిన తరువాత ఆ ఏడాది అనుమతిచ్చారు. మూడో ఏడాది మోటార్లకు కరెంటు ఇవ్వకుండా విద్యుత్ అధికారులు మోకాలు అడ్డుపెట్టి చివరకు విద్యుత్ ఇచ్చారు. ఈ ఏడాది తిరిగి మోటార్లకు విద్యుత్ ఇవ్వబోమంటూ తెగేసి చెప్పారు. ఎస్పీడీసీఎల్ అధికారి నాయక్‌తో ఎమ్మెల్యే వంశీ ఫోన్లో మాట్లాడినా విద్యుత్ చార్జీలు చెల్లిస్తామని చెప్పినా లాభం లేకపోయింది. దీంతో సాగునీరు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా సోమవారం ఉదయం టీడీపీ నాయకులు ధర్నా చేసి విద్యుత్ అధికారులకు మెమోరండం ఇచ్చినా ఫలితం లేకపోయింది. మైలవరం నియోజకవర్గంలో మోటర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చి..గన్నవరం నియోకవర్గంలో మోటార్లకు విద్యుత్ ఇవ్వకపోవడంతో పై ఎమ్మెల్యే వంశీ సీరియస్ అవుతున్నారు. మంత్రి దేవినేని ఉమా వల్లనే తమకు ఈ ఏడాది సాగు నీరు అందడం లేదని రైతాంగం అభిప్రాయపడుతోంది. సీఎం దృష్టికి సమస్య.. విద్యుత్‌బిల్లులు చెల్లిస్తామని చెప్పినా మోటార్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడాన్ని నిరసిన్తూ ఎమ్మెల్యే వంశీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవనున్నారు. రైతులపై మంత్రి వ్యవహరిస్తున్న తీరును ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దనే తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఏమైనా అధికారపార్టీకి చెందిన ఈ ఇద్దరి నేతల కుమ్ములాటల మధ్య రైతన్నలు అల్లాడిపోతున్నారు. విద్యుత్ సరఫరా కోరుతూ ధర్నా గన్నవరం: మండలంలోని మెట్ట ప్రాంతాల్లో సాగునీటి చెరువులకు పట్టిసీమ నీటిని పంపింగ్ చేసుకునేందుకు వీలుగా మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతూ స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు సోమవారం ఆందోళన చేపట్టారు. పోలవరం కాలువ భూసేకరణకు సహకరించిన రైతులకు పట్టిసీమ నీటి సరఫరా చేసేందుకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీచేసినప్పటికి ఆ శాఖ అధికారులు లెక్కచేయడం లేదని ఆ పార్టీ నేతలు అగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న మైలవరం నియోజకవర్గంలో నీటి పంపింగ్‌కు విద్యుత్ సరఫరా ఇస్తున్న అధికారులు, ఇక్కడే ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు. అధికారుల వైఖరి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికైన అధికారులు వైఖరి మార్చుకోకపోతే ఎమ్మెల్యే ద్వారా సీఎంకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. -
నిర్వాసితులపై టీడీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం
సాక్షి, గన్నవరం : విమానాశ్రయ భూనిర్వాసితులు శనివారం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం నుంచి పరిహారం కోరుతూ పది రోజులుగా ఆందోళన చేస్తున్న తమను చర్చల పేరుతో ఎమ్మెల్యే ఇంటికి పిలిచి దుర్భాషలాడుతూ కాలర్ పట్టుకుని బయటకు గెంటివేయడంతోపాటు వ్యక్తిగత సిబ్బందితో దాడి చేయించారని మైనార్టీ వర్గానికి చెందిన బాధితులు ఆరోపించారు. వివరాల్లోకెళ్తే.. పెద్దఅవుటపల్లికి చెందిన గ్రామ రెవెన్యూ సహాయకులు షేక్ హైదర్‌సాహెబ్, మేడూరి తిరుపతయ్య, ఆయన కుమారుడు వినోదరావుకు 1974లో అప్పటి తహసీల్దార్ చిన్నఅవుటపల్లి గ్రామ పరిధిలో 1.10 ఎకరాల చొప్పున రెండు ఎకరాల ఇరవై సెంట్లు ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పటి నుంచి రెండు కుటుంబాల వారసులు ఆ భూమికి శిస్తు కట్టుకుంటూ సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం వీరి భూములను కూడా ప్రభుత్వం సేకరించింది. అయితే ఎటువంటి పరిహారం చెల్లించకపోవడంతో గత పది రోజులుగా సదరు భూముల్లో పనులు జరగకుండా నిర్వాసితులు అడ్డుకుంటున్నారు. దీంతో సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే ఇంటికి రావాల్సిందిగా నిర్వాసితులను కాంట్రాక్టర్ పిలిపించారు. దీంతో అక్కడికి చేరుకున్న నిర్వాసితులు మల్లవల్లి, కొండపావులూరు, వీరపనేనిగూడెంలో ప్రభుత్వ భూముల సాగుదారులకు పరిహారం చెల్లించారని మాకెందుకు ఇవ్వరని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీంతో అసహనానికి గురైన వంశీ నిర్వాసితుల్లో ఒకరైన షేక్ అబ్దుల్లాను కాలర్ పట్టుకుని ఈడ్చుకువెళ్లి బయటకు నెట్టేశారని అక్కడే ఉన్న వీరి బంధువులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే వ్యక్తిగత సిబ్బంది దాడిచేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నిర్వాసితులు ఆయన ఇంటి ముందే గన్నవరం–పుట్టగుంట ఆర్ అండ్ బీ రోడ్డుపై కూర్చొని ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం వరకు స్టేషన్లోనే నిర్బంధించారు. రోడ్డుపై ధర్నాకు దిగినందుకు 15 మందిపై కేసులు నమోదు చేశారు. కాగా, చర్చల పేరుతో తమను ఇంటికి పిలిచి దౌర్జన్యానికి పాల్పడడంతోపాటు దుర్భాషలాడి, సిబ్బందితో కొట్టించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిర్వాసితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరికి సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతుగా నిలిచారు. పోలీస్‌స్టేషన్ ముందు బాధితుల ధర్నా నిర్వాసితులపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, ఆయన గన్‌మెన్‌పై కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి శనివారం రాత్రి ఆమె పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. రాస్తారోకో చేసిన బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. బాధితులను స్టేషన్లో నిర్బంధించి ఆహారం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. బాధితులకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ముదిరిన ‘ఇన్నర్’ వివాదం
* బెయిలొద్దు.. జైలుకే వెళ్తానన్న ఎమ్మెల్యే వంశీ * బుజ్జగించిన ఎంపీ కొనకళ్ల, బచ్చుల అర్జునుడు * టీడీపీలో అంతర్మథనం సాక్షి, విజయవాడ : ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో చిచ్చురేపింది. దీనికి కావాల్సిన స్థల సేకరణ నిమిత్తం రామవరప్పాడులోని పేదల ఇళ్ల తొలగింపునకు అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఆదివారం విధి నిర్వహణలో భాగంగా అక్కడికొచ్చిన అధికారులను అడ్డుకున్నారంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పటమట పోలీసులు కేసు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులకు సర్దిచెప్పడానికి వెళ్లిన తనను ఏ-1 నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేయడంతో వంశీ తీవ్ర మనస్తాపం చెందారు. ఆ వెంటనే గన్మెన్లను వెనక్కిపంపాలని నిర్ణయించడం పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..తనపై పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా తానే పోలీసు స్టేషన్‌కు వెళ్లి స్వచ్ఛందంగా సరెండరై జైలుకు వెళతానని, బెయిల్ కూడా తీసుకోనని చెప్పారు. దీంతో పార్టీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. ఎంపీ కొనకళ్ల బుజ్జగింపులు ఈ పరిణామ క్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణ వంశీతో ఫోన్లో మాట్లాడి బుజ్జగించారు. ఎంపీ సోదరుడు కొనకళ్ల జగన్నాథరావు (బుల్లయ్య), పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు వంశీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తనపై కేసు పెట్టడాన్ని వంశీ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి తనపై కేసులు పెట్టించడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నేతలెవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దేవినేని బాజీకి చెందిన ఇన్నోటెల్ హోటల్ గురించి మాట్లాడడంతో ఈ విధంగా తనపై అక్రమ కేసులు పెట్టించారని వంశీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. శనివారం రాత్రి తాను మంత్రి ఉమాతో ఫోన్లో మాట్లాడితే పాకలు తీసేందుకు ఇప్పుడే నోటీసులు ఇవ్వరని హామీ ఇచ్చారని, తెల్లవారేసరికి రెవెన్యూ, పోలీసులు వెళ్లి నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తనకు, గ్రామ సర్పంచ్‌కు, ఎంపీపీలకు కూడా ముందుగా సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారని బచ్చులను నిలదీశారు. మంత్రి ఉమాతోనూ సమావేశం రామవరప్పాడులో పేదలకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన అధికారులు హడావుడి చేయడంపై చర్చించేందుకు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే వంశీమోహన్, అర్జునుడు, బుల్లయ్యలు ఉమా క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఉమా ఫోన్లో తొలుత వంశీతో మాట్లాడిన తరువాత ఆయన వెళ్లారు. అధికారులు తొందర పడి నోటీసులు ఇచ్చేందుకు రావడం సరికాదని ఉమా అభిప్రాయపడినట్లు తెలిసింది. కలెక్టర్, ఎంపీలతో.. సోమవారం రాత్రి ఎంపీ కొనకళ్ల నారాయణ, కలెక్టర్ బాబు.ఎ.లతో ఎమ్మెల్యే వంశీమోహన్ సమావేశమయ్యారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ఇప్పటికే 159 ఇళ్లు తొలగించడమే కాకుండా మరో 500 ఇళ్లు తొలగించాలని అధికారులు తీసుకున్న నిర్ణయంపై చర్చించారు. ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే పేదల ఇళ్లు తొలగించాలని వంశీ చేసిన డిమాండ్‌కు వారు సానుకూలంగా స్పందించారు. -
బెయిల్ వద్దు.. జైలుకు వెళ్తా: వంశీ
పోలీసులు తన మీద పెట్టిన అక్రమ కేసుకు నిరసనగా... స్వచ్ఛందంగా లొంగిపోవాలని, స్టేషన్ బెయిల్ కూడా తీసుకోకుండా జైలుకు వెళ్లాలని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆయన తన ఇద్దరు గన్‌మెన్‌ను కూడా వెనక్కి పంపారు. తన మీద కేసు పెట్టడం వెనక పార్టీలో జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఒత్తిడి ఉందని ఆయన వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వంశీని బుజ్జగించేందుకు మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చల అర్జునుడు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. అధికారులు ఏ ధైర్యంతో తన మీద కేసు పెట్టారని ఈ సందర్భంగా వంశీ వాళ్లను అడిగారు. ధర్నాను విరమింపజేయడానికి తాను వెళ్తే.. ధర్నాలో తనను ఎ1గా పేర్కొంటూ కేసు పెట్టడం ఏంటని నిలదీశారు. కలెక్టర్ ద్వారా తన మీద కేసు పెట్టించడానికి ప్రయత్నించిన అధికార పార్టీ నేతలు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. దాంతో ఎంపీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీకి ఎలాగోలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మొత్తం విషయాన్ని నేరుగా సీఎంకు వివరిస్తామని, ఆందోళన కార్యక్రమాన్ని విరమించాలని, పోలీసు స్టేషన్‌కు కూడా వెళ్లొద్దని కోరారు. కాసేపట్లో సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో కలిసి అన్ని విషయాలనూ వంశీ ఆయన దృష్టికి తీసుకెళ్తారని అంటున్నారు. జిల్లా కలెక్టర్‌ను కూడా క్యాంపు కార్యాలయం వద్ద అందుబాటులో ఉండాలని ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. -
గన్మెన్లను వెనక్కి పంపిన టీడీపీ ఎమ్మెల్యే
సాక్షి, విజయవాడ(రామవరప్పాడు): కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ శివారు రామవరప్పాడులో ఇన్నర్ రింగ్‌రోడ్డు పనులు నిమిత్తం రైవస్ కాల్వకట్టపై ఇళ్లు తొలగించాలంటూ రెవెన్యూ అధికారులు ఆదివారం ఉదయం స్థానికులకు నోటీసులు జారీ చేయడానికి వెళ్లారు. సమాచారం అందుకున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్కడికి చేరుకొన్నారు. అధికారులు, గ్రామ పెద్దలతో ఎమ్మెల్యే మాట్లాడుతుండగా కొందరు స్థానికులు విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూలుస్తున్న ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినదించారు. ఎమ్మెల్యే వంశీ ఈ రాస్తారోకోలో పాల్గొనకుండా అధికారులతో చర్చలు కొనసాగించారు. ఆయన నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే, ఎమ్మెల్యే వంశీపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను రెచ్చగొట్టారని, జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించారనే అభియోగాలతో వివిధ సెక్షన్ల కింద ఎమ్మెల్యేతోపాటు 200 మందిపై కేసు నమోదు చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా ఎమ్మెల్యే వంశీ తనకు ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్మెన్లను వెనక్కి పంపారు. -
అయోమయం
విమానాశ్రయ విస్తరణకు భూసేకరణపై కొరవడిన స్పష్టత అసంపూర్తిగా ముగిసిన చర్చలు నాలుగు గ్రామాలకు ఒకే విధమైన పరిహారం చెల్లించాలని కోరిన రైతులు ఇళ్లు వదిలి వెళ్లబోమని స్పష్టంచేసిన దావాజీగూడెం నిర్వాసితులు భూములు ఇచ్చేది లేదన్న కొందరు రైతులు విజయవాడ : గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం జరిగే భూసేకరణపై ఇప్పట్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపించడంలేదు. నష్టపరిహారంపై అధికారులు చెబుతున్న మాటలు, నిర్వాసితుల డిమాండ్లు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కొందరు రైతులు తమ భూములను ఇవ్వబోమని స్పష్టంగా చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వాసితులు, అధికారులకు మధ్య జరిగిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, మాజీ ఎమ్మెల్యే ముసునూరు రత్నబోస్, జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు, సీపీఎం నాయకుడు వై.నరసింహారావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎంవీఎల్ ప్రసాద్ సమక్షంలో భూములు కోల్పోతున్న వారితో నష్టపరిహారంపై కలెక్టర్ రఘునందన్‌రావు చర్చలు జరిపారు. నిర్వాసితుల అభిప్రాయాలు ఇవి... కొందరు నిర్వాసితులు మాట్లాడుతూ తమ భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు.ఎయిర్‌పోర్టు విస్తరణకు అధికారులు చెబుతున్నంత భూమి అవసరం లేదని మరికొందరు వాదించారు. గతంలో సేకరించిన భూమి నిరుపయోగంగానే ఉందని, ముందుగా దాన్ని వినియోగించుకుని ఆ తర్వాత అసరమైన మేర తీసు కోవాలని కోరారు. టెక్నికల్ కమిటీని నియమించి సర్వే చేయించి ఎంత భూమి అవసరమనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించాలని కొందరు నిర్వాసితులు సూచించారు. కేసరపల్లి, అజ్జంపూడి, దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల పరిధిలో సేకరించే భూములకు ఒకే ధర చెల్లించాలని ఆయా గ్రామాల నిర్వాసితులు డిమాండ్ చేశారు . కేసరపల్లిలో ఎకరం ధర రూ.60లక్షలు ఉందని, అజ్జంపూడిలో రూ.38 లక్షలు, దావాజీగూడెం, బుద్ధవరం గ్రామాల్లో రూ.40లక్షలు ఉందని, నష్టపరిహారం మాత్రం కేసరపల్లిలో ధర ప్రకారం చెల్లించాలని కోరారు. ల్యాండ్ పూలింగ్ పద్ధతి అనుసరిస్తే కొత్త రాజధాని తుళ్లూరులో తమకు భూములు కేటాయించాలని పలువురు ప్రతిపాదన చేశారు. రాజధాని కోసమే ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్నందున తమకు తుళ్లూరులో భూములు ఇవ్వాలని వారు వాదించారు. దావాజీగూడెం ఎస్సీ కాలనీలో రోడ్డు పక్కన ఇళ్లు కోల్పోయే వారికి ఊరికి దూరంగా అప్పారావుపేటలో గృహాలు నిర్మించి ఇస్తామని చెప్పడంపై నిర్వాసితులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేశారు. తాము ఇళ్లు ఖాళీ చేయబోమని చెప్పారు. భూముల స్వాధీనానికి రంగం సిద్ధం! ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు భూములు స్వాధీనం చేసుకునేందుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పూర్తిచేసి ఫైనల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది.ఎయిర్‌పోర్టు విస్తరణకు 464.61 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. దీనిలో 47.35 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 417.26 ఎకరాల భూమిని సేకరించేందుకు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 150 మంది రైతులు, 88 మంది ఇళ్లు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు. భూసేకరణకు సంబంధించి చివరి అంశంగా వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు సర్వే నిర్వహించి మొక్కలు, పంటలు, ఇతర చరాస్తుల వివరాలు సేకరించి పరిహారంపై అంచనాలు సిద్ధం చేసేందుకు సమాయత్త మవుతున్నారు. రైతులకు న్యాయం చేయాలి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. రైతులతోపాటు ఇళ్లు కోల్పోతున్న వారికి గరిష్ట పరిహారం చెల్లించాలి. ఇళ్లు కోల్పోతున్న వారికి సకల సౌకర్యాలు కల్పించాలి. ఊరికి దూరంగా ఇళ్లు నిర్మించి ఇస్తే ఇబ్బందులు పడతామని ప్రజలు చెబుతున్నారు. నిర్వాసితుల డిమాండ్లను లిఖిత పూర్వకంగా రాసి అధికారులకు ఇస్తా . - డాక్టర్ వల్లభనేని వంశీమోహన్, గన్నవరం ఎమ్మెల్యే భూములివ్వడం ఇష్టంలేదు ఎయిర్‌పోర్టు విస్తరణకు భూములు ఇవ్వడానికి రైతులు సంసిద్ధత వ్యక్తంచేసినట్లు కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తల్లో నిజం లేదు. భూములు ఇచ్చేందుకు రైతులు ఇష్టపడడం లేదు. ఇళ్లు వదిలి వెళ్లడానికి ఎవరూ అంగీకరించడం లేదు. విమానాశ్రయ విస్తరణకు అంత భూమి అవసరం లేదు. ముందుగా టెక్నికల్ సర్వే జరగాలి.నాలుగు గ్రామాలకు ఒకే రేటు చెల్లించాలి. చింతపల్లి సీతారామయ్య, బుద్ధవరం -
‘మా డిమాండ్లు ఒప్పుకుంటేనే ‘భూములిస్తాం’
బుద్ధవరం,(గన్నవరం) : తమ డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకుంటేనే గన్నవరం విమానాశ్రయ భూసేకరణకు ఒప్పుకుంటామని బుద్ధవరం, కేసరపల్లి గ్రామస్తులు తెగేసి చెప్పారు. ఆయా పంచాయతీ కార్యాలయాల్లో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్, తహశీల్దారు ఎం. మాధురి, పలు శాఖల అధికారులు రైతులు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కేసరపల్లి రైతులకు చెల్లించే పరిహారాన్నే మిగిలిన రెండు గ్రామాల రైతులకూ ఇవ్వాలని కోరారు. విస్తరణ వల్ల బుద్ధవరం, దావాజిగూడెం, కేసరపల్లి గ్రామాల మధ్య నిలిచిపోనున్న రహదారి మార్గాలను, రక్షిత మంచినీటి పథకం పైపులైన్లను పునరుద్ధరించాలని చింతపల్లి సీతారామయ్య, సీపీఎం డివిజన్ కార్యదర్శి వై. నరసింహారావు కోరారు. వారు వచ్చి ఉండాల్సింది.. రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు మంత్రి దేవినేని, జిల్లా కలెక్టర్, ఆర్డీవో కూడా వచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్యే వంశీ అభిప్రాయపడ్డారు. అప్పుడే రైతుల సందేహలు నివృత్తి కావడంతో పాటు న్యాయం చేకూరుతుందని చెప్పారు. అయినప్పటికీ అందరికీ న్యాయం జరిగేలా రైతుల పక్షాన నిలుస్తానని హామీ ఇచ్చారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగాను టెక్నికల్ కమిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. తహశీల్దారు మాధురి మాట్లాడుతూ కొత్త భూసేకరణ చట్ట ప్రకారం గత మూడేళ్లలో జరిగిన అధిక ధర రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగా పరిహరం చెల్లిస్తామన్నారు. విస్తరణ అనంతరం రోడ్లను పునరుద్ధరించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు ఆర్అండ్బీ డీఈ మహదేవ్ చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ కడియాల రాఘవరావు, వైస్ ఎంపీపీ గొంది పరంధామయ్య, సర్పంచి తిరివీధి మరియమ్మ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎం.వి.ఎల్. ప్రసాద్ పాల్గొన్నారు. బుద్ధవరం, కేసరపల్లి గ్రామాల రైతుల డిమాండ్లు గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భూములు కోల్పోతున్న రైతులందరికీ కొత్త భూసేకరణ చట్ట ప్రకారం సమానమైన పరిహారం చెల్లించాలి. ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో అయితే రాజధానికి 10 కిలోమీటర్ల పరిధిలో ఎకరాకు 1,250 గజాల స్థలం కేటాయించాలి. పేదల ఇళ్లను భూసేకరణ నుంచి మినహాయించాలి. ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు టెక్నికల్ కమిటీని నియమించాలి. వి.కె.ఆర్ కళాశాలకు సేకరించనున్న భూమికి బదులు భూమిని ప్రభుత్వమే కేటాయించాలి. అప్పటి వరకు కళాశాలను ఇక్కడే కొనసాగించాలి. విస్తరణలో భూమి పోతున్న రైతులకు మెరుగైన ప్యాకేజి ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, రైతుల కుటుంబాల్లో ఒకరికి చొప్పున ఉద్యోగ ఆవకాశం కల్పించాలి. విస్తరణ అనంతరం ప్లయింగ్ జోన్లు పేరుతో ఎయిర్‌పోర్టు అధికారులు పెట్టే నిబంధనలపైనా అవగాహన కల్పించాలి. -
నేనున్నాగా.. కొట్టండి.. చెప్పుతో కొట్టండి
కార్యకర్తలను రెచ్చగొట్టిన టీడీపీ అభ్యర్థి వంశీ దాడిలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలకు, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు హనుమాన్ జంక్షన్ నేను ఉన్నాగా.. కొట్టండి... చెప్పుతో కొట్టండి...’అంటూ కృష్ణా జిల్లాలోని గన్నవరం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ బాహాటంగానే పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. నియోజకవర్గ పరిధిలోని కొత్త మల్లవల్లిలో మంగళవారం టీడీపీ కార్యకర్తలు చేసిన ఈ దాడిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు నలుగురు, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కొత్త మల్లవల్లిలో వంశీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు గన్నవరంలో జరిగిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ సభకు హాజరై ఆటోలో తిరిగివస్తున్నారు. వంశీ ప్రచారాన్ని గమనించి.. ఆ ఆటోను మరో మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తుండగా టీడీపీ కార్యకర్తలు వారిని దూషించారు. దీంతో వాగ్వివాదం చోటుచేసుకుంది. ప్రచార వాహనంపై ఉన్న వంశీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ... ‘నేనున్నానుగా.. కొట్టండి.. చెప్పుతో కొట్టండి’ అంటూ టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టారు. ఇదే అదనుగా వారు రాళ్లతో దాడి చేశారు. -
ఆయనొస్తే బతకలేం..!
వంశీ తీరుపై టీడీపీ నేతల్లో ఆందోళన వెన్నుపోటుకు రంగం సిద్ధం సొంత పార్టీలోనే ఏకమవుతున్న వ్యతిరేక వర్గం తన సామాజికవర్గంలోనే సహాయనిరాకరణ! పద్మవ్యూహంలో గన్నవరం టీడీపీ అభ్యర్థి రోజురోజుకీ నీరుగారుతున్న గెలుపు ఆశలు సాక్షి, విజయవాడ : గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. ఆయన దుందుడుకు స్వభావం వల్ల గతంలో ఇబ్బందులు పడ్డవారంతా ఇప్పుడు ఏకమవుతున్నారు. వంశీని ఓడించేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా సొంత సామాజికవర్గంలోనే ఆయనకు వ్యతిరేకంగా ఒక బలమైన వర్గం పనిచేస్తోంది. వంశీ గెలిస్తే నియోజకవర్గంలో ఆయన వర్గం మినహా మిగిలినవారిని ఇబ్బందులకు గురిచేస్తారనే భయం వారిలో నెలకొంది. నియోజకవర్గంలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి వంశీ గతంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపైనే దాడులు చేయించారు. ఆయా వర్గాల వారితో ఆయన ఇప్పుడు సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ గతంలో జరిగిన ఘటనలను వారు జ్ఞప్తికి తెచ్చుకుని రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏవిధంగా ఉంటుందోనని భయపడుతున్నారు. రెండు దశాబ్దాల కాలంగా నియోజకవర్గంలో మైన్స్, వైన్స్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వంశీని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వంశీ అధికారంలోకి వస్తే తాము తట్టుకోలేమని, తమ వ్యాపారాలు గుల్ల అవుతాయని వారు బహిరంగంగానే చెబుతున్నారు. చంద్రబాబు పర్యటన సమయంలోనే దాడులు వరద బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు 2006లో మానికొండ గ్రామానికి రాగా, టీడీపీలోని జి.కృష్ణబాబు వర్గ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ సమయంలో వచ్చిన వంశీమోహన్ తన అనుచరులతో కలిసి మానికొండలో తమకు వైద్య శిబిరానికి అనుమతించలేదంటూ తనతోపాటు కృష్ణబాబు, సూరిబాబు, సత్యనారాయణ తదితరులపై దాడి చేసినట్లు వల్లూరి వెంకటేశ్వరరావు అనే టీడీపీ కార్యకర్త అప్పట్లో ఉంగుటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తరువాత రాజీ కుదరడంతో కేసులు ఎత్తేసుకుని వంశీ తిరిగి పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు పైకి కృష్ణబాబు వర్గంతో వంశీ సఖ్యతగా ఉన్నా పాత విభేదాలు నివురుగప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం వంశీతో పాటు ప్రచారంలో పాల్గొంటున్నవారే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేసరికి ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దాసరితో పొసగని వైనం... సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, వంశీలు నిన్నటి వరకు కత్తులుదూసుకున్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల వల్ల రాజేంద్రనాథ్‌రెడ్డి పోలీసు కమిషనర్‌గా ఉన్న సమయంలో బైండోవర్ కేసులు పెట్టారు. ఏడాది పాటు ఇరువర్గాల నేతలు కమిషనరేట్ చుట్టూ తిరిగారు. తనవంటి శాంతస్వభావం కలిగిన వ్యక్తిపై బైండోవర్ కేసు పెట్టటం అన్యాయమని దాసరి అప్పట్లో ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు టికెట్ రాకపోవడం ఎలా ఉన్నా.. వంశీ గతంలో చేసిన అల్లర్లకు దాసరి బాలవర్ధనరావు కుటుంబం, ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. గత దశాబ్దకాలంగా పక్కలో బల్లెంలా ఉన్న వంశీమోహన్‌ను దెబ్బతీసేందుకు తగిన సమయం వచ్చిందని వారు భావిస్తున్నారు. దీంతో పైకి వంశీకి సహకరిస్తున్నట్లు కనపడుతున్నా... లోలోపల మాత్రం వ్యతిరేకంగా లాబీయింగ్ నడుపుతున్నారు. దేవినేని కుటుంబంతో విభేదాలు... మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఆయన సోదరుడు, టీడీపీకి చెందిన దేవినేని బాజీప్రసాద్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావుకు, వంశీకి మధ్య విభేదాలు ఉన్నారుు. పార్టీలో ఆధిపత్యం కోసం దేవినేని ఉమాతో విభేదించగా, నగరంలోనూ ఆధిపత్యం కోసం దేవినేని నెహ్రూతో గొడవలకు దిగారు. ఈ క్రమంలో దేవినేని నెహ్రూ వర్గీయులపై వంశీ అనుచరులు కేసులు కూడా పెట్టారు. దేవినేని కుటుంబ సభ్యులు కూడా వంశీ ఓటమికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రచారంలోనూ అదే పోకడ.. వంశీ తన ఎన్నికల ప్రచార పర్వంలోనూ దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. కుర్రకారుతో తప్పతాగించి ఊరూ వాడా తిప్పటం ఆయనకు మైనస్‌గా మారింది. ప్రచార సమయంలో కూడా గొడవలు, అల్లర్లు చెలరేగుతుండటంతో ప్రజలు భయూందోళనలకు గురవుతున్నారు. డబ్బే ప్రధాన ఆయుధం..! అన్నివైపుల నుంచి ఎదురుదాడిని ఎదుర్కొంటున్న వంశీ చివరకు డబ్బే ప్రధాన ఆయుధంగా మార్చుకున్నట్టు సమాచారం. చివరకు డబ్బును వెదజల్లి గెలవాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. స్వపక్షంలో అసంతృప్తులు, వెన్నుపోట్ల నడుమ వంశీ ధనరాజకీయం ఎంతవరకు పనిచేస్తుందన్నది వేచిచూడాల్సిందే. -
గన్నవరం టీడీపీలో గందరగోళం
హనుమాన్‌జంక్షన్‌రూరల్, న్యూస్‌లైన్ : గన్నవరం టీడీపీ టికెట్ తనకే ప్రకటించారని వల్లభనేని వంశీమోహన్ ఉదయం ప్రకటించగా... కాదు టికెట్ నాదేనని సాయంత్రం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు పేర్కొనడంతో కార్యకర్తలు అయోమయానికి గురయ్యారు. బాపులపాడు మండల పరిషత్ కార్యాలయంలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమాల్లో గురువారం దాసరి, వల్లభనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంశీ చేసిన ప్రకటనపై దాసరి స్పందిస్తూ... రెండు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని, ఏ కారణంగా నన్ను పార్టీ కాదంటుందని ప్రశ్నించారు. కార్యకర్తలను అయోమయానికి గురిచేయడానికి వంశీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. మండలపార్టీ అద్యక్షుడు కలపాల జగన్మోహనరావు, వేలేరు మాజీ సర్పంచి వేములపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ చెన్నుబోయిన శివ్వయ్య తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. -
గన్నవరం టీడీపీలో...మూడో కృష్ణుడు
గన్నవరం టీడీపీలో...మూడో కృష్ణుడు ఇప్పటికే దాసరి, వంశీ మధ్య పోటీ తాజాగా తెరపైకిచలసాని ఆంజనేయులు తెరవెనుక చక్రం తిప్పుతున్న దేవినేని ఉమా! సాక్షి, విజయవాడ : గన్నవరం టీడీపీలో సీట్ల సిగపట్లు తారస్థాయికి చేరుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో సీటు తమదేనంటే... తమదేనంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, విజయవాడ అర్బన్ మాజీ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్లు పోటీ పడుతుంటే తాజాగా జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు తెరపైకి వచ్చారు. ఇప్పటికే దాసరి-వంశీల మధ్య తెలుగుదేశం కార్యకర్తలు నలిగిపోతుండగా, తాజాగా మరో నేత తెరపైకి రావడంతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. నేతల మధ్య ఉన్న విభేదాలే పార్టీ కొంప ముంచుతాయని ఆందోళన చెందుతున్నారు. దాసరికి తిరిగి టిక్కెట్ ఇస్తే తనకు అభ్యంతరం లేదని, లేనిపక్షంలో పార్టీలో సీనియర్ నేతనైన తనకు టిక్కెట్ ఇస్తే రైతులకు న్యాయం చేసినట్లు అవుతుందని చలసాని ఆంజనేయులు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దాసరి పోటీ నుంచి తప్పుకోవాల్సివస్తే ఆయన వంశీ కంటే చలసానికే మద్దతు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల తుపాన్లు వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు హనుమాన్‌జంక్షన్, గన్నవరం ప్రాంతాల్లో పర్యటించారు. అప్పుడు చలసాని ఆంజనేయులు పక్కనే ఉండి జిల్లా రైతులకు జరుగుతున్న నష్టాన్ని, రైతుల పక్షాన నిలబడి తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటాలను వివరించినట్లు సమాచారం. దీంతో చలసాని అభ్యర్థితాన్ని కూడా చం ద్రబాబు పరిశీలిస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. తెరవెనుక ఉమా మంత్రాంగం... ఒకవేళ దాసరి బాలవర్ధనరావు తప్పుకోవాల్సివస్తే గన్నవరం సీటు వంశీకి దక్కకుండా చలసాని ఆంజనేయులును జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమానే తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సీటు కావాలంటూ చలసానితో ఆయనే మెలిక పెట్టించారని తెలిసింది. దేవినేని ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీల మధ్య ఇప్పటికే పొరపొచ్చాలు ఉన్నాయి. ఇద్దరూ మొదటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు. వంశీ దూకుడును ఉమా ఎప్పుడూ అంగీకరించలేదు. దాసరికి కాని పక్షంలో వంశీ కంటే చలసాని ఆంజనేయులే మంచి అభ్యర్థి అవుతారని ఉమా వర్గం ప్రచారం చేస్తోంది. చలసాని ఆంజనేయులుకు టిక్కెట్ ఇవ్వడం వల్ల జిల్లా రైతాంగం పార్టీకి దగ్గరవుతారని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. చలసానిని రంగంలోకి దింపడం ద్వారా వంశీని ఇబ్బందిపెట్టవచ్చని ఉమా వర్గం భావిస్తోంది. ఒకవేళ చలసానిని కాదని వంశీకి టిక్కెట్ ఇస్తే రైతులు వంశీకి వ్యతిరేకంగా పనిచేసేందుకు వీలుంటుదంటున్నారు. సీటు తనదేనంటున్న దాసరి... దాసరి బాలవర్ధనరావు విజయా డెయిరీ డెరైక్టర్‌గా ఎన్నిక కావడంతో ఆయన త్వరలోనే చైర్మన్ అవుతారని, అప్పుడు గన్నవరం సీటు ఖాళీ అయితే అది వంశీమోహన్‌కే దక్కుతుందని గన్నవరంలో ప్రచారం జరుగుతోంది. దీన్ని దాసరి బాలవర్ధనరావు తీవ్రంగా ఖండిస్తున్నారు. చంద్రబాబు సిట్టింగ్‌లకే అవకాశం ఇస్తున్నారని, అందువల్ల ఈసారి తనకే సీటు వస్తుందని ఆయన బలంగా చెబుతున్నారు. కేవలం రైతుల మీద ఉన్న అభిమానంతోనే విజయా డెయిరీ డెరైక్టర్ పదవి తీసుకున్నాను తప్ప ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకోనని చెబుతున్నారు. చంద్రబాబు వద్ద తనకు క్లీన్ చిట్ ఉండటంతో తన అభ్యర్థిత్వానికి డోకా ఉండదని అంటున్నారు. దూకుడు పెంచుతున్న వంశీ మోహన్... గన్నవరం సీటు ఇక తనదేనన్న ధీమాలో వల్లభనేని వంశీ ఉన్నారు. చంద్రబాబు తనను పిలిచి పనిచేసుకోమని చెప్పారని, త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని సమస్యలు సమసిపోతాయని చెబుతున్నారు. దీనికి తోడు తనకు సీటు ఇచ్చినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతూ తన అభిమానుల చేత పత్రికా ప్రకటనలు ఇప్పిస్తున్నారు. ఇక యువతను పోగు చేసి నియోజకవర్గంలో హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో భారీస్థాయిలో ప్రచారానికి సిద్ధమౌతున్నారు. వంశీ దూకుడుకు బ్రేక్ వేయడానికి చలసానిని తెరపైకి తెచ్చి రాష్ట్రస్థాయిలో సీనియర్ నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. నన్ను కాదని ఎవరికీ ఇవ్వరు : దాసరి గన్నవరం : సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని గన్నవరం అసెంబ్లీ టీడీపీ టిక్కెట్ ఎవరికీ ఇవ్వరని శాసనసభ్యుడు డాక్టర్ వెంకట బాలవర్ధనరావు స్పష్టం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించే విషయమై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటనా చేయలేదన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన తొందరపడి ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోరని చెప్పారు. ముఖ్యంగా గన్నవరం సీటు విషయమై బాబు ఎవరికీ హామీ ఇవ్వలేదన్నారు. టిక్కెట్ తనకే కేటాయించారంటూ వంశీ చేస్తున్న దుష్ర్పచారం కారణంగా నియోజకవర్గంలో పార్టీకి తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మరని తెలిపారు. 1994 నుంచి పార్టీ టిక్కెట్ విషయమై నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసినా 2014 ఎన్నికల బరిలో టీడీపీ నుంచి తిరిగి పోటీ చేసి తీరుతానని దాసరి ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికి టిక్కెట్లు కేటాయిస్తానని ప్రకటించారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో విస్తరించి ఉన్న కృష్ణామిల్క్ యూనియన్ సేవలను పార్టీకి ఉపయోగించాలనే యూనియన్ డెరైక్టర్‌గా పోటీచేశాను కానీ, ఆ డెయిరీకి చైర్మన్ కావాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ రాద్ధాంతంపై పార్టీ అధినేతకు ఎటువంటి ఫిర్యాదూ చేయబోనని, ఆయనకు ఎప్పటికప్పుడు సమాచారం వెళ్తుందని చెప్పారు. చివరకు అధినేత ఆదేశాల మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. బాబు వాగ్దానం చేశారు : వంశీ గన్నవరం : గతంలో కుదిరిన ఒప్పందం మేరకు గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ తనకే ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వాగ్దానం చేశారని ఆ పార్టీ విజయవాడ అర్బన్ మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర నాయకుడు డాక్టర్ వల్లభనేని వంశీమోహన్ తెలిపారు. స్థానిక వల్లభనేని అరుణ ట్రస్టులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2009 ఎన్నికలలో గన్నవరం అసెంబ్లీ టిక్కెట్ కోసం దాసరి, తాను పోటీపడగా స్వయంగా బాబు ఇద్దరి మధ్య రాజీ చేశారని, దాసరి ఇవే చివరి ఎన్నికలు అనడంతో ఆయనకు గన్నవరం టిక్కెట్, తనకు విజయవాడ పార్లమెంట్ టిక్కెట్ కేటాయించారని తెలిపారు. ఎన్నికల తర్వాత ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటామని దాసరి సోదరులు ప్రకటించారని గుర్తుచేశారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేగా దాసరి ఉండడంతో నాలుగేళ్లుగా నియోజకవర్గ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాలకే పరిమితమయ్యానని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ముందు మళ్లీ ఒప్పందం... పంచాయతీ ఎన్నికల ముందు తిరిగి బాబు సమక్షంలో దాసరి విజయ డెయిరీ చైర్మన్‌గా, తనను గన్నవరం శాసనసభ్యునిగా పోటీ చేసే విధంగా ఒప్పందం జరిగిందన్నారు. ఈ విషయమై విజయవాడలో జరిగిన చర్చలో దివంగత ఎర్రంనాయుడు, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, కాగిత వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు కూడా పాల్గొన్నారని తెలిపారు. దీనిలో భాగంగానే సర్పంచ్ల ఎన్నికలలో అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. కొంతమంది గిట్టనివాళ్లు తాను పార్టీ మారుతున్నట్లు చేస్తున్న ప్రచారం నేపథ్యంలో గతంలో చేసుకున్న ఒప్పందాన్ని బయటపెట్టానని, ఏదేమైనా బాబుపై పూర్తి నమ్మకముందని చెప్పారు. 2014 ఎన్నికలలో నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు.