Gannavaram Political Tensions: MLA Vallabhaneni Vamsi Comments On Chandrababu Naidu - Sakshi
Sakshi News home page

చంద్రబాబు పెంపుడు కుక్కలతో మాపై మొరిగిస్తున్నాడు: ఎమ్మెల్యే వంశీ

Published Mon, Feb 20 2023 8:49 PM | Last Updated on Tue, Feb 21 2023 10:03 AM

Gannavaram High Tensions: Vallabhaneni Vamsi criticizes Chandrababu - Sakshi

సాక్షి, కృష్ణా: గన్నవరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సాక్షిటీవీతో మాట్లాడారు. తరచూ తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. టీడీపీ వెబ్ సైట్, సోషల్ మీడియాలలోనే తన కుటుంబసభ్యులపై అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే వంశీ. 

చంద్రబాబు చరిత్ర నాకు, కొడాలి నానికి మొత్తం తెలుసు. అందుకే మాపై చంద్రబాబు పెంపుడు కుక్కలతో మొరిగిస్తున్నాడు. బుద్ధా వెంకన్నకు స్థాయి లేదు.. అలాంటివారిని పట్టించుకోను. గన్నవరంలో నన్ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు. కేవలం మా అనుచరులే దాడికి పాల్పడినట్టు ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. సంకల్పసిద్ధితో నాకు సంబంధం లేదని ఆకేసుపై విచారణ జరపాలని నేనే డీజీపీకి ఫిర్యాదు చేసాను అని వంశీ తెలిపారు.

గన్నవరంలోకి బయటివాళ్లు వచ్చి గొడవ పెట్టారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎక్కడివారో వచ్చిన ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటని? నిలదీశారాయన. అక్కడ జరిగే ప్రతీ సంఘటనతో నాకు సంబంధం లేదని వంశీ చెప్పుకొచ్చారు. చిన్న చిన్న విషయాల్లో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement