సీఎం జగన్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా: వంశీ | Vallabhaneni Vamsi Support CM jagan Decision On English Medium In Schools | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌తో కలిసి నడవాలని నిర్ణయించుకున్నా: వంశీ

Published Thu, Nov 14 2019 7:12 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో విశ్వాసం పోతుందని..చంద్రబాబు నాయుడు కనీసం ప్రతిపక్ష నేత పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. టీడీపీ తన తీరు మార్చుకోకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని అన్నారు. ఆయన గురువారం​ గన్నవరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... నలభై అయిదు సంవత్సరాల ప్రత్యక్ష రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు కనీసం అయిదారు నెలలు కూడా అధికారం లేకుండా ఆగలేకపోతున్నారు. ఎంతో అపార అనుభవం కల మీరు కనీసం ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా ఇప్పుడు సమర్ధవంతంగా పోషించలేకపోతున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement