సాక్షి, కృష్ణా: సొంత యాప్ చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి అధికారం లేదు. యాప్‌లు చేయడం.. చంద్రబాబుకు సోపులు పూయటం ఎస్‌ఈసీ పని కాదు అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్రంగా మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వారికి అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యత మరిచి లక్ష్మణ రేఖ దాటడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ విచిత్రపోకడలతో దుందుడుకుతనంగా ముందుకు వెళ్తున్నారు. వ్యక్తిగతంగా తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అనిపిస్తోంది. ఓటర్ లిస్టు సవరించే సమయం ఇవ్వకుండా ఎన్నికలు పెడుతున్నారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాసి ఆ నెపం అధికారులపై వేస్తున్నారు. దురుద్దేశంతో ప్రభుత్వానికి లీగల్ సమస్య సృష్టించే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ వంశీ మండిపడ్డారు.
(చదవండి: ‘బాబుని సీఎం చేయాలని గవర్నర్‌కి లేఖ రాస్తారేమో’)
2011 లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు 1154 జీఓ ఇచ్చారు. 2003లో జరిగిన అలిపిరి బాంబ్ బ్లాస్ట్‌లో మెదడు చెదిరినట్టుంది గతం మరిచి ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దంటూ హూంకరిస్తున్నారు. 2000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మోదీ స్థానంలో ప్రధాని అవ్వాలని ప్రయత్నించి చంద్రబాబు బంగపడ్డాడు. కొడుకుని ఎమ్మెల్యేని కూడా చేయలేక చతికిలపడ్డాడు. పిచ్చి ముదరడంతో పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించాడు. వినేవాడు ఉంటే హరికథ అరవంలో కూడా చెబుతారన్న చందంగా బాబు మాటలు ఉన్నాయి. ఉడకబెట్టిన నాగడ దుంపలా.. పదవి పోయినా.. బాబు భ్రమల్లో నుంచి బయటకు రాలేదు. జనం షెడ్డుకి పంపినా ఉత్తరకుమార ప్రగల్బాలు పోలేదు. మోది, కేసీఆర్, జగన్‌లను చూసి వణుకుతున్నాడు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment