local body polls
-
నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే.. ఇది కరెక్ట్ కాదు!
భోపాల్: బీజేపీకి ఊహించని పరిణామం ఒకటి ఎదురైంది. మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు.. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ యంత్రాగం మొత్తాన్ని పార్టీ స్వలాభం కోసం వాడుకోవడాన్ని సహించలేకపోతున్నానంటూ బహిరంగంగా వ్యాఖ్యానించాడు ఆయన. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో అధికా పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మైహర్(సత్నా) నియోజకవర్గ ఎమ్మెల్యే నారాయణన్ త్రిపాఠి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఈ ప్రాంతంలో ప్రచారం కోసం పర్యటిస్తున్నా. పట్వారీ నుంచి టాప్ ర్యాంక్ ఆఫీసర్ దాకా అంతా పార్టీ కోసమే పని చేస్తున్నారు. బీజేపీ ఓట్ల కోసమే తాపత్రయపడుతున్నారు. నేనూ బీజేపీ ఎమ్మెల్యేనే. కానీ, ఇలాంటి పరిస్థితి ఆవేదన కలిగిస్తోంది. ఈరోజుల్లో దేశంలో ఒక ప్రభుత్వాన్ని రెండు నిమిషాల్లో పడగొడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చివరికి.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇలాంటి రాజకీయాలే కనిపిస్తున్నాయి. ఇలా జరగడానికి వీల్లేదు. పరిస్థితి మారాల్సిందే’’ అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణన్ త్రిపాఠి వ్యాఖ్యానించారు. సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్.. ఎమ్మెల్యే నారాయణన్ త్రిపాఠి(కుడి) ఇదిలా ఉంటే.. త్రిపాఠి వ్యాఖ్యలు మధ్యప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. బీజేపీలో కనీసం ఒక్కరైనా ఇప్పుడు నిజం మాట్లాడే ధైర్యం చేశారు. అందుకు నారాయణన్‌కు కృతజ్ఞతలు.. అభినందనలు కూడా. వేల మంది అభ్యర్థుల ఆవేదనను మీరు బయటపెట్టారు. ప్రెసైడింగ్ అధికారులు.. బహిరంగంగానే ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు అంటూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. మైహర్ నియోజకవర్గం నుంచి 2003లో తొలిసారి సమాజ్‌వాదీ పార్టీ నుంచి పోటీ చేశారు నారాయణన్ త్రిపాఠి. 2013లో కాంగ్రెస్ తరపున, 2016 ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా.. తిరిగి 2018లో బీజేపీ టికెట్ మీదే ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు 2019లో.. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేసిన ఇద్దరు ఎమ్మెల్యేలలో ఈయన కూడా ఒకరు. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో 2023 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. -
సీట్లు ఎక్కువ కావాలి.. ఒంటరిగానే పోటీ చేస్తాం
చెన్నై: తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై సోమవారం ప్రకటించారు. తమిళనాడు వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ కార్యకర్తలు భావిస్తున్నందున ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అభ్యర్థుల తొలి జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు. (చదవండి: చిక్కుల్లో డీఎంకే ఎమ్మెల్యే) 'ఇదేమి కష్టమైన నిర్ణయం కాదు. అన్నాడీఎంకే నేతలు ఓ పన్నీర్‌సెల్వం, ఎడప్పాడి కె. పళనిస్వామితో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయాన్ని జాతీయ నాయకులు ఆమోదించారు. ఇలాంటి ఎన్నికల్లో సీట్ల పంపకం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు 10 శాతం సీట్లు కేటాయించేందుకు అన్నాడీఎంకే ముందుకు వచ్చింది కానీ మేం ఎక్కువ శాతం సీట్లు కావాలని అడిగామ’ని అన్నామలై తెలిపారు. బీజేపీ నిర్ణయంపై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి డి జయకుమార్ మాట్లాడుతూ.. కమలం పార్టీ అడిగినన్ని సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్పారు. సీట్ల పంపకం చర్చలు సామరస్యంగా జరిగినా ఫలప్రదం కాలేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగుతుందా, లేదా అనేది ఏఐఏడీఎంకే అధినాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. కాగా.. సేలం, అవడి, తిరుచ్చి, మదురై, శివకాశి, తూత్తుకుడి మునిసిపల్ కార్పొరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు అన్నాడీఎంకే అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. (క్లిక్: డీఎంకే నేత కుమార్తె పెళ్లికి హాజరు.. ఎంపీ నవనీతకృష్ణన్‌పై వేటు) -
అరెస్ట్ చేయండి: అచ్చెన్నపై ఎస్ఈసీకి ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: తొలివిడత నామినేషన్ల సమయంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో పాల్పడుతున్న దౌర్జన్యాలపై వైఎస్సార్ సీపీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి సోమవారం అచ్చెన్నాయుడిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ‘‘అచ్చెన్నాయుడి దౌర్జన్యాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేయాలి. టీడీపీ దౌర్జన్యాలపై ఎన్నికల కమిషనర్ స్పందించాలి. చంద్రబాబు రౌడీ రాజకీయాలని పెంచిపోషిస్తున్నారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు ఫోన్లో ఏ విధంగా బెదిరించారో ఆధారాలు కూడా సమర్పించాం. గ్రామాలలో నెలకొన్న ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని టీడీపీ చూస్తోంది. ఎన్నికల నిబంధనలకి విరుద్దంగా మేనిఫెస్టో ప్రకటించిన టీడీపీపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు’’ అని ప్రశ్నించారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలి: లేళ్ల అప్పిరెడ్డి అనంతరం లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘చిత్తూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు రౌడీలతో తిరుగుతూ వైఎస్సార్సీపీ మద్దతుదారులను బెదిరిస్తున్నారు. నిమ్మాడలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దౌర్జన్యాలని చూశాం. ఆయన ప్రోద్బలంతోనే టీడీపీ మద్దతుదారు సురేష్ వైఎస్సార్సీపీపై దౌర్జన్యానికి దిగారు. సురేష్‌పై చర్యలు తీసుకోవాలి. ప్రజాస్వామిక విలువలతో వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోంది. పోలీస్ వ్యవస్ధపై టీడీపీ ఆరోపణలను ఖండిస్తున్నాం. డీజీపీ, పోలీస్ పనితీరును ఎస్ఈసీ సైతం అభినందించారు’’ అని తెలిపారు. (చదవండి: అచ్చెన్న బరితెగింపు) ఏపీ సీఎస్‌కు ఎస్ఈసీ లేఖ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ సీఎస్‌కి లేఖ రాసింది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ప్రయాణిస్తే అది ఎన్నికల ప్రచారంగానే భావిస్తామని సీఎస్‌కు రాసిన లేఖలో స్పష్టం చేసింది. ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు వినియోగించరాదని సూచించింది. చైర్మన్లతో పాటు ప్రభుత్వ అధికారులను తీసుకుని వెళ్లవద్దని.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటపుడు వారి నేమ్ బోర్డ్స్ ఉండవద్దని సీఎస్‌కు రాసిన లేఖలో సూచించింది. -
‘యాప్‌లు చేయటం ఎస్ఈసీ పని కాదు’
సాక్షి, కృష్ణా: సొంత యాప్ చేయడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి అధికారం లేదు. యాప్‌లు చేయడం.. చంద్రబాబుకు సోపులు పూయటం ఎస్ఈసీ పని కాదు అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ తీవ్రంగా మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వారికి అధికారాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. బాధ్యత మరిచి లక్ష్మణ రేఖ దాటడాన్ని రాజ్యాంగం అనుమతించదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ విచిత్రపోకడలతో దుందుడుకుతనంగా ముందుకు వెళ్తున్నారు. వ్యక్తిగతంగా తీసుకొని ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు అనిపిస్తోంది. ఓటర్ లిస్టు సవరించే సమయం ఇవ్వకుండా ఎన్నికలు పెడుతున్నారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాసి ఆ నెపం అధికారులపై వేస్తున్నారు. దురుద్దేశంతో ప్రభుత్వానికి లీగల్ సమస్య సృష్టించే ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ వంశీ మండిపడ్డారు. (చదవండి: ‘బాబుని సీఎం చేయాలని గవర్నర్‌కి లేఖ రాస్తారేమో’) 2011 లో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ చంద్రబాబు 1154 జీఓ ఇచ్చారు. 2003లో జరిగిన అలిపిరి బాంబ్ బ్లాస్ట్‌లో మెదడు చెదిరినట్టుంది గతం మరిచి ఇప్పుడు ఏకగ్రీవాలు వద్దంటూ హూంకరిస్తున్నారు. 2000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి మోదీ స్థానంలో ప్రధాని అవ్వాలని ప్రయత్నించి చంద్రబాబు బంగపడ్డాడు. కొడుకుని ఎమ్మెల్యేని కూడా చేయలేక చతికిలపడ్డాడు. పిచ్చి ముదరడంతో పంచాయితీ ఎన్నికలకు మేనిఫెస్టో ప్రకటించాడు. వినేవాడు ఉంటే హరికథ అరవంలో కూడా చెబుతారన్న చందంగా బాబు మాటలు ఉన్నాయి. ఉడకబెట్టిన నాగడ దుంపలా.. పదవి పోయినా.. బాబు భ్రమల్లో నుంచి బయటకు రాలేదు. జనం షెడ్డుకి పంపినా ఉత్తరకుమార ప్రగల్బాలు పోలేదు. మోది, కేసీఆర్, జగన్‌లను చూసి వణుకుతున్నాడు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది’’ అంటూ ఎద్దేవా చేశారు. -
‘బాబుని సీఎం చేయాలని గవర్నర్‌కి లేఖ రాస్తారేమో’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు నిమ్మగడ్డ తీరును ఎండగడుతూ.. ట్వీట్ చేశారు. ‘‘ఎస్ఈసీ వ్యవహార శైలి చూస్తే.. తక్షణమే వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా తొలగించి.. ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్‌కి లెటర్ రాసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పిచ్చి ముదిరింది’’ అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. (చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..!) తక్షణమే జగన్మోహనరెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తొలగించి,ఆ స్థానంలో చంద్రబాబుని నియమించవలసిందిగా నిమ్మగడ్డ గవర్నర్ కి లెటర్ రాసినా ఆశ్చర్యపోకండి "పిచ్చిముదిరింది" — Ambati Rambabu (@AmbatiRambabu) January 29, 2021 -
ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అనంతరపురం: ఆంధ్రప్రదేవ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన ప్రాంతాలను హైసెన్సిటివ్ ఏరియాలుగా ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో వీటిని సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ వివాదస్పద నిర్ణయంపై మీడియా నిమ్మగడ్డను ప్రశ్నించిగా.. సమాధానం చెప్పకుండా దాటవేశారు. (చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా.. ) అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సిబ్బందిపై పూర్తి విశ్వాసం ఉంది. అత్యవసరమైతేనే కేంద్ర బలగాలు కావాలని కోరాం. రాష్ట్ర సిబ్బందితోనే పంచాయతీ ఎన్నికలు జరుపుతాం. ఏకగ్రీవాలపై గవర్నర్‌కు కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఏకగ్రీవాలు గతంలో ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయి. ఏకగ్రీవాలన్నీ తప్పు అని చెప్పట్లేదు. మీడియాలో యాడ్స్ ఇవ్వటం వల్లే సమాచార అధికారులకు నోటీసులు ఇచ్చాం. బలవంతపు ఏకగ్రీవాలు ఉండకూదన్నదే మా ఉద్దేశ్యం. ఏపీ పంచాయతీ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం’’ అని తెలిపారు. ఇక సమావేశం అనంతరం విలేకరుల ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
‘అదే మమ్మల్ని గెలిపించే మంత్రం’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మత్రిభ్రమించిందో.. లేక ఎన్నికల కమిషనర్ ఇచ్చిన సలహానో తెలియదు కానీ పంచాయతీ ఎన్నికలుకు మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు అంటూ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మ్యానిఫెస్టోలో చెప్పిన నవరత్నాలని అమలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిది. చంద్రబాబుకు మ్యానిఫెస్టో అంటే గౌరవం లేదు. సీఎం జగన్ కరోనా పరిస్థితుల్లో సైతం సంక్షేమ పథకాల రూపంలో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పాలనను సీఎం జగన్ ఏపీ ప్రజలకు అందిస్తున్నారు. పేదవాడి గడప వద్దకే సంక్షేమాన్ని చేర్చారు. మ్యానిఫెస్టో అమలు చేయడం అంటే అది. లోకల్ బాడీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవని చంద్రబాబుకు తెలియదా.. ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు స్టార్ట్ చేసిన కొత్త డ్రామా మ్యానిఫెస్టో రిలీజ్ చేయడం’’ అంటూ దుయ్యబట్టారు. (చదవండి: కొంప కొల్లేరు.. టీడీపీ బెంబేలు..) ఏకగ్రీవాలు అయితే అభివృద్ధికి నోచుకుంటాయి ‘‘చంద్రబాబు 2014 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ఇచ్చిన 600 హామీలలో ఆరు కూడా అమలు చేయలేదు. ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు తయారుగా ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే 40 శాతం ఏకగ్రీవాలయ్యేవి. ప్రజల,ఉద్యోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కాబట్టే ఎన్నికల వాయిదా కోరాం. చంద్రబాబు లాగా ఎన్నికలకు భయపడి మేము వాయిదా కోరలేదు. చంద్రబాబు బై ఎలక్షన్లో చేసిన రౌడీయిజాన్ని ప్రజలు చూశారు. అదే రీతిలో మేము చేస్తామని చంద్రబాబు ఊహించుకుంటున్నారు. మేము గ్రామాల్లో ఏకగ్రీవాలు అవుతాయని ఆశిస్తున్నాము. అలా జరిగితే గ్రామల్లో సమస్యలు లేకుండా ఉంటాయి.. అభివృద్ధికి నోచుకుంటాయి. అందుకే ఏకగ్రీవాల కోసం మా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. దాంట్లో తప్పేముంది. గతంలో సైతం ఏకగ్రీవాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎవరు గ్రామాల్లో అభివృద్ధి చేస్తారో అంటువంటి నాయకులను చూసి ప్రజలు ఓటు వేస్తారు. చంద్రబాబు ఎన్ని దొంగ మ్యానిఫెస్టోలో రీలీజ్ చేసినా ప్రజలు నమ్మరు’’ అని పేర్కొన్నారు. (చదవండి: ఏకగ్రీవాలకు నజరానాలు ఆనవాయితీనే) విగ్రహాల ధ్వంసంలో టీడీపీ కుట్ర బట్టబయలైంది ‘‘రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా రాజకీయ లబ్ధి కోసం దేవుడిని కూడా వాడుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చాక దేవాలయలపై దాడులను ప్రోత్సాహించలేదు. విగ్రహాల ధ్వంసం విషయంలో కఠిన చర్యలు తీసుకున్నాము. ఈ విషయంలో టీడీపీ రాజకీయ కుట్ర బట్టబయలైంది. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడంలో చంద్రబాబు దిట్టని మరోసారి రుజువైంది. కులాలకు, పార్టీలకు అతీతంగా మేము చేస్తున్న సంక్షేమ పథకాలే మా పార్టీకి అండగా నిలుస్తాయి. అవే మా నాయకులను గ్రామాల్లో గెలిపిస్తాయి. వేరే మంత్రం అంటూ ఏదీ లేదు’’ అని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
‘ఏకగ్రీవాలను అప్పుడు ఎందుకు తప్పు పట్టలేదు?’
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏకగ్రీవాలు ఎక్కువ అయితే వాటిని వ్యతిరేకిస్తానన్నట్టుగా నిమ్మగడ్డ చెప్పడం రాజకీయం కాదా.. అసలు ఏకగ్రీవాలు ఎన్ని అవుతాయో ముందుగానే నిమ్మగడ్డ ఎందుకు ఊహించి కంగారుపడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనాలి. ప్రజల మధ్య సఖ్యత, సోదరభావం ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంలో రాజకీయం ఎక్కడ ఉందో రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పాలి. ఏకగ్రీవం అయ్యే పంచాయతీలకు నజరానా ప్రకటించడం అన్నది దశాబ్దాలుగా ఉంది. ఆ ప్రక్రియను తప్పు బట్టదలచుకుంటే టీడీపీ హయాంలో ఎందుకు తప్పుబట్టలేదు. అప్పుడు ఎన్నికలు ఎందుకు జరపలేదు. అప్పటికే ఉన్న జీవో మీద కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. నామినేషన్లు వేయకముందే నిమ్మగడ్డ ఎందుకు ప్రెస్మీట్లో దాని మీద మాట్లాడాల్సి వచ్చింది’’ అని ప్రశ్నించారు. (చదవండి: ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం) ‘‘పంచాయతీ ఎన్నికలనేవి పార్టీలకు అతీతంగా.. వాటి ప్రమేయం లేకుండా.. గుర్తులకు సంబంధం లేకుండా జరుగుతాయని తెలిసి కూడా.. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు పలానా పార్టీకి అనుకూలంగానూ, కొన్ని పార్టీలకు వ్యతిరేకంగానూ జరుగుతాయనే అభిప్రాయాన్ని కలిగించేలా నిమ్మగడ్డ మీడియా సమావేశంలో మాట్లాడ్డం ఎంతవరకు సమంజసం. ఇంతకుముందు రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ఎన్నికల కమిషనర్ అయినా నిమ్మగడ్డ మాదిరిగా ఇలా మాట్లాడారా. ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితి ఏనాడైనా తలెత్తిందా. పంచాయతీల్లో ఏకగ్రీవాలపై అటు చంద్రబాబు, ఇటు నిమ్మగడ్డ ఒకే రకమైన అభిప్రాయాలను వ్యక్తం చేయడం వెనుక కారణాలు ఏంటి. పరిమితులకు లోబడే ఏకగ్రీవాలు ఉండాలంటూ... నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన ప్రాతిపదిక ఏముందో... ఏ చట్టంలో ఇది రాసి ఉందో ఆయన వెల్లడించగలరా’’ అంటూ రామచంద్రారెడ్డి వరుస ప్రశ్నలు కురిపించారు. (చదవండి: ఆ ఇద్దరి బదిలీకి ఎస్ఈసీ ‘నో’) ‘‘ఏ చట్టంలో లేని వ్యవహారాన్ని నిమ్మగడ్డ ఒక ఉద్దేశంతో చెప్తున్నారు కాబట్టి ఆయన్ను ప్రశ్నించాల్సి వస్తోంది. పార్టీలకు సంబంధంలేని ఎన్నికలు అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి, అధికార పార్టీకి దురుద్దేశాలను అంటగట్టేలా మాట్లాడ్డం దేనికి నిదర్శనం. ఏకగ్రీవ ఎన్నికలకు నజారానా ఇస్తూ, దశాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలను జీవోల ఆధారంగా స్పష్టం చేస్తూ ఐఅండ్‌పీఆర్ కమిషనర్ ఇచ్చిన ప్రకటనను తప్పుబట్టడం కూడా నిమ్మగడ్డ రాజకీయాల్లో భాగం కాదా. అధికారులతో ఎలాంటి సమస్యాలేదంటూనే.... తనకన్నా మెరుగైన స్థితిలో రాష్ట్ర ఎన్నికల అధికారిగా, ఏకంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించి అవార్డు పొందిన అధికారికి నిబంధనలు, నియమాలు తెలియవన్నట్టుగా, అసమర్థుడు అన్నట్టుగా కించపరుస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంలో భాగం కాదా. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ, కమిషనర్ గిరిజా శంకర్లను తొలగించాలంటూ ముందు సీఎస్‌కు లేఖ రాసి, తర్వాత లేదు అది నా ఉద్దేశం కాదంటూ మరో లేఖ అదే రోజు రాసి, మరుసటి రోజు వారిని అభిసంశిస్తూ మరో లేఖ రాసి, ఈమేరకు డీఓపీటికి కూడా లేఖ రాసి.. ఇవాళ మీడియా కాన్ఫరెన్స్‌లో తాను ఏమీ చేయలేదంటూ కక్షసాధించలేదంటూ నిమ్మగడ్డ చెప్పుకోవడం... ఇది చంద్రబాబు మార్కు రాజకీయ ఎత్తుగడల్లో భాగం కాదా. వ్యవస్థలను సవ్యంగా, నిష్పక్షపాతంగా నడిపించాల్సిన వ్యక్తి ఇన్ని దురాగాతాలకు పాల్పడుతుంతే.. ఇక ఎన్నికల కమిషనర్ మీద ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లిపోవా’’ అని రామచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు, వ్యాక్సినేషన్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతం సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తదితరులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాతో మాట్లాడారు. (ఏకగ్రీవాలతో గ్రామ స్వరాజ్యం) ఎన్నికలు, వ్యాక్సినేషన్ రెండూ ఒకేసారి రావటం వల్ల.. పోలీసులకు కలిగే ఇబ్బందులను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాం అని గౌతమ్ సవాంగ్ తెలిపారు. వ్యాక్సినేషన్‌కు ఇబ్బంది రాకుండా.. ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలోచన చేస్తున్నామన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బందిలో.. ఆరోగ్య సమస్యలున్నవారి విషయంలో మినహాయింపులపై ఆలోచిస్తున్నామన్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియపై 13 జిల్లాల ఎస్పీలు.. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించామని గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
నేపాల్‌లో భారతీయులకు బంపర్ ఆఫర్
నేపాల్: నేపాల్‌లో భారతీయులకు బంపర్ ఆఫర్ తగిలింది. ఇక నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది. ఈ ఏడాది మే నెలలో నేపాల్ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్‌తో సరిహద్దు ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్ ప్రాంతాలను కలిపి టారాయి ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసించే భారతీయులకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇప్పటి నుంచి దక్కనుంది. నేపాల్ ఉంటున్న తమకు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని గత ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ దౌత్య వేత్తలు కూడా చర్చించారు. దీంతో దిగొచ్చిన అక్కడి ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు అక్కడ పార్లమెంటులో కూడా సవరణ చేయనున్నారు. మదేసీలు అనే తెగ ఈ మేరకు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నేపాల్‌లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. -
సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
-
ఖమ్మంలో వైఎస్సార్సీపీకి 5 జెడ్పీటీసీలు
సాక్షి, హైదరాబాద్: ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకుంది. మంగళవారం అర్ధరాత్రి వరకు వెలువడిన ఫలితాల్లో దాదాపు 115 ఎంపీటీసీ, 5 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టుల కంటే కూడా వైఎస్సార్సీపీ మెరుగైన ఫలితాలు దక్కించుకుంది. ఈ జిల్లాలో పార్టీ 5 జెడ్పీటీసీలు, 93 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. -
సార్వత్రికంపై వైఎస్సార్ కాంగ్రెస్ ధీమా
మున్సిపల్, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషించిన పార్టీ నేతలు గ్రామీణ ప్రాంతాలపై పార్టీ పట్టు సాధించిందని వెల్లడి ఈ ఫలితాలను చూస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ విజయం ఖాయమని ధీమా సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ఓటర్లలో కనిపించిన మార్పు ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనడానికి చిహ్నమని ఆ పార్టీ నేతలు విశ్లేషించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో పోల్చితే గ్రామీణ ఓటర్ల ప్రభావం ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో మంచి ఫలితాలను సాధించడంతో మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని మరింత పెంచిందని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలోని 92 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. మంగళవారం ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈ నేపథ్యంలో మంగళవారం పార్టీ నేతలు సమావేశమై మున్సిపల్, పంచాయతీరాజ్ ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఈ ఫలితాల సరళిని విశ్లేషించిన తర్వాత సాధారణ ఎన్నికల్లో పార్టీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తుందన్న అంచనాకు వచ్చారు. మున్సిపాలిటీల్లో ఆశించిన మేరకు ఫలితాలు రానప్పటికీ, ప్రాదేశిక ఫలితాలు అనుకూలంగా రావడాన్నిబట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పట్టు సాధించినట్టు ప్రాదేశిక ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని విశ్లేషించారు. కీలకమైన గ్రామీణ ఓటర్లు ఉండే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల సరళి వైఎస్సార్సీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని తేల్చుతున్నాయని ఆ పార్టీ నేతలంటున్నారు. సీమాంధ్రలో మొత్తం 3.68 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఎన్నికలు జరిగిన మున్సిపాలిటీలు (కార్పొరేషన్లు మినహా) 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అన్ని మున్సిపాలిటీల్లో ఉన్నది 45 లక్షల మంది ఓటర్లే. మిగతా 1.40 కోట్ల మంది మున్సిపాలిటీలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. మున్సిపాలిటీలతో సంబంధం లేని మిగతా 76 అసెంబ్లీ సెగ్మెంట్లలో మరో 1.54 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మిగతా ఓటర్లు మిగిలిన 12 నియోజకవర్గాల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2.94 కోట్ల మంది (80 శాతం) ఓటు వేశారు. మున్సిపాలిటీలు, ప్రాదేశిక ఫలితాలను విశ్లేషిస్తే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్‌కు అనుకూల ఫలితాలు వస్తున్నాయని తేటతెల్లమవుతోందని నేతలు అభిప్రాయపడ్డారు. పైగా, సీమాంధ్రలో ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు గతనెల 12న నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముందే మున్సిపల్, పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల పోలింగ్ పూర్తయింది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత రెండు రోజులకే పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఆ వెంటనే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జనభేరి పేరుతో విస్తృత ప్రచారం నిర్వహించారు. పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలకు సాధారణ ఎన్నికల పోలింగ్నకు దాదాపు నెల గడువు ఉంది. ఈ 30 రోజుల్లో సీమాంధ్రలోని అనేక జిల్లాల ప్రజల్లో ఎంతో మార్పు కనిపించిందని, ప్రతి జిల్లాలోనూ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని నేతలు పేర్కొన్నారు. ఈ సమయంలో 5 నుంచి 6 శాతం ఓటర్లలో స్పష్టమైన మార్పు కనిపించిందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో ఊహించని విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. మరోపక్క, ఎంపీటీసీ ఎన్నికల్లో పూర్తిగా స్థానిక అంశాలు, అభ్యర్థి ప్రభావమే ఉంటుంది తప్ప రాష్ట్ర, జాతీయ అంశాల ప్రభావం ఉండదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు ముడిపెట్టలేమని, ప్రజల్లో ఈ విషయంలో చాలా స్పష్టత ఉందని వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికలు, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలకు తేడా కొన్ని జిల్లాల్లో కొట్టొచ్చినట్లు కనిపించిందని నేతలు విశ్లేషించారు. ప్రకాశం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నాలుగింటిలో టీడీపీ, రెండింటిలో వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందిన విషయాన్ని ప్రస్తావించారు. మంగళవారం నాటి ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం చేజిక్కించుకోవడానికి అవసరమైన జెడ్పీటీసీ స్థానాలను గెల్చుకుంది. వైఎస్సార్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ మూడింటిలోనే గెలుపొందింది. నాలుగు చోట్ల టీడీపీ ఎక్కువ వార్డులను గెల్చుకుంది. అయితే, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని చేజిక్కించుకుంది. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల మధ్య ఎంత తేడా ఉంటుందో ఈ ఫలితాలు తెలియజేస్తున్నాయని నేతలు విశ్లేషించారు. -
సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పల్స్’ ఉండదు
* ఆయా నియోజకవర్గాల మొత్తం ఓట్లకు, ఆ పరిధిలోని మున్సిపోల్స్‌లో పోలైన ఓట్లకు మధ్య వ్యత్యాసం వివరాలు * సీమాంధ్ర మొత్తం ఓటర్లు 3.68 కోట్లు * 92 మున్సిపాలిటీల్లోని ఓటర్లు 44.83 లక్షలే * కేవలం పట్టణ ఓటరు మనోగతానికే పరిమితం * స్థానిక అంశాలకే ఓటరు ప్రాధాన్యం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్పుటమవుతాయా? లేక స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సార్వత్రిక ఫలితాలకు తేడా ఉంటుందా? సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో మొత్తం 3,67,62,975 ఓట్లుండగా... 44,82,714 ఓట్లు మాత్రమే ఉన్న 92 మున్సిపాలిటీల ఫలితాలను చూసి సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని పరిశీలకులు చెబుతున్నారు. అందులోనూ 33,49,076 ఓట్లు మాత్రమే పోలైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తే మొత్తంగా స్థానిక అంశాలే ప్రధాన పాత్ర పోషించినట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. సీమాంధ్ర మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే సాగగా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. * సీమాంధ్రలోని 13 జిల్లాల పరిధిలోని 92 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ 92 మున్సిపాలిటీలు 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అలాగే ఏడు కార్పొరేషన్లు 12 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నాయి. అంటే మొత్తం 99 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే మున్సిపాలిటీలున్నాయి. ఇవి కాకుండా 76 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ మున్సిపల్ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదు. * 92 మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 44,82,714 మాత్రమే. కానీ ఈ మున్సిపాలిటీలున్న 87 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,86,000. అంటే 87 నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో మున్సిపల్ ఓటర్లు 24 శాతమే. మిగతా 76 శాతం(1,40,03,286) మందిని పరిగణించకుండా మొత్తం ఫలితాలను విశ్లేషించడం సాధ్యం కాదు. * వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ఓటరు మనోగతాన్ని ప్రతిబింబించని మున్సిపల్ ఎన్నికల సరళినే మొత్తం ఫలితాల సరళిగా భావించడంలో అర్థం లేదని పరిశీలకులు విశ్లేషించారు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది. మొత్తం 92 మున్సిపాలిటీల్లో కలిపి వైఎస్సార్సీపీకన్నా టీడీపీకి 1,55,211 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. ఈ ఓట్లు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో పోలయ్యే ఓట్లకన్నా తక్కువే. మరోవైపు 21 మున్సిపాలిటీల్లో ఒకటి రెండు ఓట్లతో చైర్పర్సన్లు దక్కే పార్టీ మారే అవకాశాలున్నాయి. * రాష్ట్రస్థాయి అంశాలు కానీ, పార్టీల సిద్ధాంతాలు, ఆయా పార్టీల నాయకత్వాలపై ఉండే విశ్వసనీయత తదితర అంశాలు కాకుండా స్థానికాంశాలే ఎక్కువ ప్రభావం చూపించాయి.గతంలో కాంగ్రెస్ లేదా టీడీపీ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వంలోకి వచ్చినా ఆ తరువాత జరిగే స్థానిక ఎన్నికల్లో ఘోరంగా పరాభవం పాలైన సందర్భాలున్నాయని వారు గుర్తుచేస్తున్నారు. -
సీమాంధ్రలో టీడీపీ పైచేయి
* మున్సిపోల్స్‌లో కేవలం 4.64 % ఓట్ల తేడాతో వెనుకబడిన వైఎస్సార్సీపీ * 92 మున్సిపాలిటీల్లో 2,571 వార్డులకు ఎన్నికలు * టీడీపీ-1,428, వైసీపీ-941 * పోలైన ఓట్లలో టీడీపీకి 45.18%, వైసీపీకి 40.54% * 5 కార్పొరేషన్లలో సైకిల్.. కడప, నెల్లూరులో ఫ్యాన్ * పలు వార్డుల్లో స్వల్ప మెజార్టీతో నెగ్గిన టీడీపీ * సీమాంధ్రలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ముందంజలో నిలిచింది. సీమాంధ్రలోని మొత్తం 92 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో 2,571 వార్డుల్లో టీడీపీ 1,428 వార్డులను గెలుచుకుని అగ్రభాగంలో నిలిచింది. ఆ తర్వాత 941 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే 60 మున్సిపాలిటీల్లో టీడీపీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. మరో 22 మున్సిపాలిటీల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేసింది. మరో 109 వార్డుల్లో స్వతంత్రులు గెలుచుకుని కీలకంగా మారారు. కాంగ్రెస్ కేవలం 53 వార్డులను మాత్రమే గెల్చుకోగా, ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో సీపీఎం 8 వార్డులు, సీపీఐ 15 వార్డులు, బీజేపీ 12 వార్డులను దక్కించుకున్నాయి. సీమాంధ్ర 13 జిల్లాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు జరగ్గా వాటిల్లో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి వీలైన స్థాయిలో డివిజన్లు, వార్డులను టీడీపీ గెలుచుకుంది. మొత్తం వార్డుల్లో ఓట్ల మధ్య స్వల్ప తేడాతో మెజారిటీ వార్డుల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో బీఎస్పీ 5 వార్డులను గెల్చుకోవడం విశేషం. 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో నిలిచింది. 5 కార్పొరేషన్లను టీడీపీ కైవసం చేసుకోగా మరో రెండింటిలో వైఎస్సార్సీపీ గెలిచింది. కడప, నెల్లూరు కార్పొరేషన్లను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోగా, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్లను టీడీపీ దక్కించుకుంది. పార్టీ ఆవిర్భవించాక తొలిసారి పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పోటీ పడింది. మొత్తం ఏడు కార్పొరేషన్ల పరిధిలో 363 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. 202 డివిజన్లను టీడీపీ గెలుచుకోగా 124 డివిజన్లను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏడు కార్పొరేషన్లలో కలిపి కాంగ్రెస్ 2 డివిజన్లలో మాత్రమే నెగ్గింది. బీజేపీ నాలుగు డివిజన్లలోనూ, సీపీఎం మూడు డివిజన్లలోనూ, బీఎస్పీ ఒక్క డివిజన్‌లోనూ గెలిచింది. -
స్థానిక సమరం: జిల్లాల వారీగా తొలి విడత ఎన్నికల విశేషాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 556 జెడ్పీటీసీ, 8250 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబి రంగు బ్యాలెట్ పత్రాలను వాడుతున్నారు. 6,370 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 95,031 మంది పోలీసులను భద్రత కోసం మోహరించారు. జిల్లాల వారీగా విశేషాలు.. అనంతపురం: 31 జెడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభం 5 వేల మందితో పోలింగ్ భద్రత ఏర్పాటు 33 మందిపై బైండోవర్ కేసులు ఎన్నికల సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం ఉరవకొండ, బెళుగుప్పలో పోలీసుల అదుపులో వైఎస్ఆర్ సీపీ ఎన్నికల ఏజెంట్లు రాయదుర్గంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి హౌస్ అరెస్ట్ ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు కూడేరు పోలింగ్ కేంద్రంలో గందరగోళం. ఓటరు జాబితా తారుమారు. ఎన్నికల అధికారులతో ఓటర్ల వాగ్వాదం ఇంకా ప్రారంభం కాని పోలింగ్ కూడేరు చేరుకున్న ఎస్పీ సెంథిల్‌కుమార్. ఆగిన పోలింగ్ వివరాలు తెలుసుకున్న ఎస్పీ కుందుర్తి మండలం బండమీదపల్లి ఎన్నికల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విధి నిర్వహణ కోసం వచ్చి ఎన్నికల అధికారి అంజిబాబును పాటు కాటేసింది. దాంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. హిందూపురం మండలం మలుగూరులో టీడీపీకే ఓటు వేయంటి అంటూ ఓటర్లపై ఎన్నికల అధికారి అన్నపూర్ణమ్మ ఒత్తిడి చేస్తున్నారు. అ విషయాన్ని గమనించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరపి... అన్నపూర్ణమ్మను విధుల నుంచి తప్పించారు. రాయదుర్గంలో ఓటర్లను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి జిల్లా కలెక్టర్,ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులకు కాపు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం మండలం ఉడేగోళంలో బ్యాలెట్ పేపర్లు తారుమారు వేరే గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు రావడంపై ఆందోళన వైఎస్ఆర్ కడప : రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లిలో టీడీపీ, కాంగ్రెస్ నేతల దౌర్జన్యం కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై వైఎస్ఆర్ సీపీ ఏజెంట్‌ను బయటకు పంపించిన నేతలు ఆకేపాడులో ఓటు వేసిన వైఎస్ఆర్సీపీ నేత ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆకేపాడులో ఓటర్లను కార్లలో తరలిస్తున్న టీడీపీ నేతలు బి.కోడూరులో ఓటర్లను టీడీపీ నేతలు తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పోరుమామిళ్ల రంగసముద్రంలో టీడీపీ,వైఎస్ఆర్ సీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏజెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చినమండెంలో కాంగ్రెస్ నేత రామ్‌ప్రసాద్ రెడ్డి ఒకరు హల్చల్ సృష్టించారు. సదరు నేత జనరల్ ఏజెంట్ అంటూ గన్మెన్లను వెంటేసుకుని బూత్‌లలో తిరుగుతున్నారు. గోపవరం మండలం రామన్న పల్లెలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాజీపేట మండలం నందిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రంలో నుంచి బయటకు పంపారు. ఎన్నికల అధికారులు టీడీపీతో కుమ్మకై తమను బయటకు పంపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఆరోపించారు. చిత్తూరు: 31 జెడ్పీటీసీ, 445 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఎన్నికలు కుప్పం మండలం డీకేపల్లిలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఓటర్లు తమ ఓట్ల గల్లంతైనాయిన ఆందోళన చేపట్టడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. సోమం మండలం ఇరికిపెంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ సర్పంచ్ దాడి చేశారు.ఆ ఘటనలో వైఎస్ఆర్ సీపీ నేతకు తీవ్రగాయాలు... ఆసుపత్రికి తరలించారు. మాజీ ముఖ్యమంత్రి సీఎం కిరణ్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఓటర్లను రానివ్వకుండా ... పోలింగ్ కేంద్రం వద్ద కిరణ్ అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు. పుంగనూరు మండలం కుమ్మరగుంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌పై పోలీసులు దాడి చేశారు. కర్నూలు: 36 జెడ్పీటీసీ, 496 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఎన్నికలు బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో 100 బ్యాలెట్ పేపర్లు గల్లంతు, అధికారుల విచారణ గోస్పాడు మండలం నెహ్రునగర్ పోలింగ్ కేంద్రంలోకి గన్మెన్లతో వెళ్లిన టీడీపీ నేత సీపీ నాగిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయని ఎన్నికల అధికారులు ఆత్మకూరులో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. స్థానిక నేత శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 8 ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆళ్లగడ్డ మండలం యాదవాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్ ప్రదర్శించారు. 22,23 పోలింగ్ కేంద్రాలలో సీలింగ్ ఫ్యాన్లును తొలగించాలని ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు.అయితే ఫ్యాన్లు తొలగించడం సాధ్యం కాదని అధికారులు టీడీపీ నేతలకు తేల్చి చెప్పారు. వెల్దుర్తి మండలం బుక్కాపురంలో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్‌కు ఓటేయాలని చెప్పడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. అవుకులో టీడీపీ నేతల అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను బలవంతంగా ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. నందికొట్కూరు మండలం కొణదేలలో ఓటు వేయడానికి వెళ్తున్న శేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీ కొని మరణించాడు. మహానంది మండలం సీతారాంపురంలో టీడీపీ నేతల ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్నారు. అయితే వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదు. పగిడాల ఎన్నికలలో అపశ్రుతి చోటు చేసుకుంది.బూత్ నెంబర్ 18లతో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్ గుండె పోటుతో మృతి చెందాడు. గుంటూరు: నాదెండ్ల మండలం గణపవరం రాజీవ్‌గాంధీ కాలనీలో చీరలు పంచుతున్న టీడీపీ నేతల అరెస్ట్ పిట్టలవానిపాలెం మండలం అల్లూరు రెడ్లపాలెంలో పోలింగ్ బూత్‌ను అధికారులు మార్చారు. పోలింగ్ కేంద్రాన్ని 2 కి.మీ దూరంలోకి మార్చినందు వల్ల ఓటర్లు అక్కడికి వెళ్లి ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నారు. రొంపిచర్ల మండలం మునమాకలో మైనార్టీలపై టీడీపీ కార్యకర్తల దాడులు చేశారు. ఆ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. ప్రకాశం: ఎర్రగొండపాలెం మండలం అమానుగుడిపాడులో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. దాంతో ఎస్సీ ఓటర్లును భయభ్రాంతులకు గురి చేశారు. దాంతో ఎస్సీ ఓటర్లు ఆందోళనకు దిగారు. పుల్లలచెరువు మండలం ముటుకులలో స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు ఓవరాక్షన్ చేస్తున్నారు. ఒక వర్గానికి ఆ కొమ్ము కాస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మార్టూరు మండలం బొబ్బేపల్లిలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. అద్దంకి మండలం రెడ్డిపాలెంలో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ స్పృహ తప్పిపడిపోయింది. సంతమాగులూరు మండలం చౌటపాలెంలో వృద్ధుల ఓటేసే విషయమై ఏజెంట్ల మధ్య ఘర్షణ. దాంతో పోలింగ్ నిలిచిపోయింది. పశ్చిమ గోదావరి: 22 జెడ్పీటీసీ, 413 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం వట్లూరు పోలింగ్ కేంద్రంలో చీకట్లోనే పోలింగ్.. విద్యుత్ లేకపోడవంతో ఉక్కపోత. బ్యాలట్ పేపర్లో గుర్తులు కనిపించక ఇబ్బందులు జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సమస్యలు జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో ఓటర్ల లిస్ట్‌లో గందరగోళం నెలకొంది.దాంతో పోలింగ్ ప్రారంభం కాలేదు. పెంటపాడు పోలింగ్ స్టేషణ్ వద్ద టీడీపీ కార్యకర్తలకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు. మహబూబ్‌నగర్: 5 జెడ్పీటీసీ, 512 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లను ప్రలోభపెడతారనే అనుమానంతో..టీఆర్ఎస్ ఇంఛార్జ్ కృష్ణమోహన్రెడ్డిను గద్వాల మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి గృహ నిర్బంధించారు. ఖమ్మం: 27 జెడ్పీటీసీ, 375 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల పేరుతో.. 50కి పైగా పోలింగ్ కేంద్రాలను దూరప్రాంతాలకు మార్పు రవాణా వ్యవస్థ లేకపోవడంతో 15 కి.మీ నడిచివెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి రవాణా సదుపాయం కల్పించాలని ఓటర్ల డిమాండ్ నల్గొండ: జిల్లాలోని వేములపల్లిలో 33 వ పోలింగ్ బూత్ లో నిలిచిన పోలింగ్ తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఓటర్లు ఆందోళన -
అదివారం తొలిదశ పరిషత్ ఎన్నికలు
-
‘స్థానిక’ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీలు ఓటేయొచ్చు: ఈసీ
సాక్షి, హైదరాబాద్: పరోక్ష పద్ధతిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉన్నప్పటికీ.. అసెంబ్లీ రద్దు కాలేదని సుప్తచేతనావస్థలో మాత్రమే ఉందని, అందువల్ల వారి పదవీ కాలం ఉన్నంత వరకు ఓటు వేయడానికి అర్హులేనని వివరించింది. వీరంతా కార్పొరేషన్, మున్సిపాలిటీ, జెడ్పీ, మండల పరిషత్‌లలో ఏదో ఒక్కచోట మాత్రమే ఓటు వేయడానికి అర్హులని, దేనిని ఎంపిక చేసుకోవాలన్నది వారి ఇష్టమని ఈసీ తెలిపింది. మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు సంబంధించి దేనిని ఎంపిక చేసుకుంటారో పేర్కొంటూ ఏప్రిల్ మూడులోగా లేఖలు పంపాలని పేర్కొంది. -
‘స్థానిక’ ఎన్నికల కేసు విచారణ నేడు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసును మంగళవారమే విచారించాలని ఎన్నికల సంఘం న్యాయవాది మనోజ్ సక్సేనా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ కేసును మధ్యాహ్నం 2 గంటలకు విచారిస్తామని జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడ్లతో కూడిన ధర్మాసనం తొలుత ప్రకటించింది. అయితే, కేసుల విచారణ జాబితాలో ఇది లేనందున బుధవారం విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు. -
టెన్త్ సైన్స్ పరీక్షలకు ‘స్థానిక’ అడ్డంకి
సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి జనరల్ సైన్స్ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఏప్రిల్ 7న పదో తరగతి సైన్స్ మొదటి పేపర్, 9న సైన్స్ రెండో పేపర్ పరీక్షలున్నాయి. అన్ని కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగి, రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం రాకుంటే.. పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొదటి, రెండో విడతల్లో ఏవైనా గొడవలు జరిగి పోలింగ్‌కు అంతరాయం ఏర్పడితే, మరుసటి రోజు రీపోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. పాఠశాలలనే పోలింగ్ కేంద్రాలుగా వినియోగిస్తున్నందున.. రెండింటినీ ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదు. ఇదే విషయాన్ని వివిధ జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాఠశాల విద్యా కమిషనర్‌తో ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడారు. పరీక్షల వాయిదా వల్ల ఇబ్బందులు ఉంటాయని, రీపోలింగ్ అవసరమైన ప్రాంతాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. విద్యాశాఖ అధికారుల విజ్ఞప్తికి ఎన్నికల సంఘం కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి జిల్లాల అధికారులతో చర్చిస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఇబ్బందులు ఉండవని సమాచారం వస్తే సైన్స్ పరీక్షలు వాయిదా వేయాల్సిన అవసరం ఉండదని ఎన్నికల సంఘం చెప్పినట్లు తెలిసింది. లేని పక్షంలో సైన్స్ పేపర్లు రెండూ వాయిదా వేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ అంశంపై వచ్చే వారం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ పరీక్షలు వాయిదా వేస్తే.. ఏప్రిల్ 13, 14 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. -
జానారెడ్డితో దిగ్విజయ్ భేటీ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం మధ్యాహ్నం మాజీమంత్రి కె.జానారెడ్డి నివాసానికి వెళ్లారు. టీపీసీసీ అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ పెద్దలు వ్యవహరించిన తీరుపట్ల జానారెడ్డి తీవ్ర ఆవేదనకు లోనైన నేపథ్యంలో దిగ్విజయ్‌సింగ్ ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్.రఘువీరారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రులు డి.శ్రీధర్‌బాబు, దానం నాగేందర్, షబ్బీర్‌అలీ కూడా దిగ్విజయ్‌తోపాటు జానారెడ్డిని కలిశారు. టీపీసీసీ అధ్యక్ష నియామకం విషయంలో హైకమాండ్ అనుసరించిన తీరు, ఈ విషయంలో ఏర్పడిన గందరగోళంపై చర్చించుకున్నట్లు తెలిసింది. తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు రాహుల్‌గాంధీ కార్యాలయం ఫోన్‌చేసి ఢిల్లీ రావాలని కోరారని, ఆ సమయంలో జానారెడ్డికి ఫోన్‌చేసినప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష నియామకం జరిగిందని దిగ్విజయ్ చెప్పినట్లు తెలిసింది. జరిగినదంతా మర్చిపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్తో పొత్తు, కేసీఆర్ ప్రతిపాదనలపైనా వారి మధ్య చర్చకొచ్చినట్లు తెలిసింది. కేసీఆర్ గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారని, పొత్తు సాధ్యంకాని పక్షంలో ఒంటరిగా పోటీచేసేలా కార్యకర్తలను సన్నద్ధం చేయాలని దిగ్విజయ్‌సింగ్ సూచించినట్లు సమాచారం. -
వైఎస్సార్ పథకాలే గెలిపిస్తాయి
సూర్యాపేట, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సూర్యాపేట నియోజకవర్గ ఇన్చార్జ్ బీరవోలు సోమిరెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులు శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రతి ఓటరు ఏదో ఒక సంక్షేమ పథకంతో లబ్ధి పొందుతున్నారన్నారు. పట్టణ ప్రజల్లో తమపార్టీ పట్ల ఆదరణ ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చిత్తశుద్ధి గల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభివృద్ధి చేయని నాయకులను ఓడించాలన్నారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ నుంచి డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో బయలు దేరి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొంతిరెడ్డి సైదిరెడ్డి, జిల్లా నాయకుడు దండ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు దంతాల భారతి, తండు భాస్కర్, కట్టా జ్ఞానయ్య, ఎండీ ఎజాస్, ఎస్కే నయీం, కొండ రవి, గోరెంట్ల సంజీవ, పిడమర్తి కల్యాణ్, శ్రీనివాస్,నాగుల్ మీరా, వెంకటేష్, పాండు, శ్రావణ్‌కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు. -
మణికొండ మినహా 15 పంచాయతీలు గ్రేటర్లో విలీనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఉత్కంఠకు ప్రభుత్వం తెరదించింది. శివార్లలోని 15 పంచాయతీలను హైదరాబాద్ మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న ఈ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని భావించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. శుక్రవారం ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనుకున్న తరుణంలో అనూహ్యంగా ప్రభుత్వం గ్రేటర్లో పంచాయతీలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. రాజధానిని ఆనుకొని ఉన్న 36 గ్రామ పంచాయతీలను నగరీకరణ నేపథ్యంలో గ్రేటర్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు కొన్నాళ్లుగా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. అయితే, జీహెచ్ఎంసీలో గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలువురు కోర్టుకెక్కడంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ కేసుల్లో చాలావరకు హైకోర్టు కొట్టివేయడం ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. ఈ తరుణంలో ఇటీవల 20 పంచాయతీలను గ్రేటర్లో కలుపుతూ... మిగతా 16 పంచాయతీలకు ఎన్నికల నగారా మోగించింది. ఈ నెల 21న ఎన్నికల ముహూర్తాన్ని ఖరారు చేసిన ఎలక్షన్ కమిషన్... 6వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించనున్నట్లు ప్రకటించింది. నగరానికి చేరువలో ఉన్న పంచాయతీలు పక్కనపెట్టి.. దూరంగా ఉన్న పల్లెలను జీహెచ్ఎంసీలో విలీనం చేశారనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఎన్నికలతో పాలకవర్గాలు కొలువుదీరితే ఐదేళ్లవరకు ఈ పంచాయతీలు గ్రేటర్లో కలపడం కుదరదని భావించే ఎన్నికల క్రతువుకు మరికొన్ని హడావుడిగా ప్రభుత్వం ఈ వివాదాస్పద నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు విలీనంపై ఎలాంటి సంకేతాలివ్వని సర్కారు.. చివరి నిమిషంలో ఉత్తర్వులు జారీ చేయడం ఆశావహులను నైరాశ్యంలో పడేసింది. మణికొండ మినహా.. వాస్తవానికి మణికొండలో అడ్డగోలుగా జరిగిన నిర్మాణాల నేపథ్యంలోనే శివారు పంచాయతీలను గ్రేటర్లో కలపాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది. అనుమతుల్లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నప్పటికీ నియంత్రించే సామర్థ్యం పంచాయతీలు లేకపోవడంతో వీటిని జీహెచ్ఎంసీ పరిధిలోకి తేవడమే ఉత్తమమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భావించారు. ఈ తరుణంలో కొన్నాళ్ల క్రితం అనుమతిలేని బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం జరిగి పలువురు మృత్యువాత పడడం ప్రభుత్వాన్ని ఆలోచింపజేసింది. ఈ క్రమంలోనే ఇబ్బడిముబ్బడిగా విస్తరించిన మణికొండను గ్రేటర్లో మిళితం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గ్రేటర్లో కలిస్తే తమ ఆటలు సాగవని భావించిన కొందరు కోర్టుకెక్కి ‘స్టే’ పొందారు. తాజాగా మిగతా పంచాయతీల విషయంలో న్యాయస్థానం లైన్‌క్లియర్ చేసిన ప్పటికీ, మణికొండ విలీనంపై ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు. దీంతో ప్రతిపాదిత 35 పంచాయతీలు జీహెచ్ఎంసీలో కలిసినప్పటికీ, విలీన ప్రతిపాదనకు ఆజ్యంపోసిన మణికొండ మాత్రం విలీనం నుంచి తప్పించుకుంది. కాగా, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాల్లోని గ్రామాలన్నీ నగరరూపు సంతరించుకున్నాయి. రాజేంద్రనగర్‌లోని మణికొండ మినహా మగతా గ్రామాలన్నీ గ్రేటర్ పరిధిలో చేరగా.. సరూర్‌నగర్‌లోని కొన్ని గ్రామాలు నగర పంచాయతీ (బడంగ్పేట్) పరిధిలో మరికొన్ని జీహెచ్ఎంసీలో కలిసిపోయాయి. దీంతో ఈ మండలాలను ఇక జిల్లా పరిషత్ జాబితా నుంచి తొలగించనున్నారు. గ్రేటర్లో విలీనమైన పంచాయతీలు ఇవే.. రాజేంద్రనగర్ : గండిపేట్, మంచిరేవుల, కోకాపేట్ శంషాబాద్ : శంషాబాద్ శామీర్‌పేట: జవహర్‌నగర్ కుత్బుల్లాపూర్ : ప్రగతినగర్, బాచుపల్లి, కొంపల్లి, దూలపల్లి ఘట్కేసర్ : బోడుప్పల్, మేడిపల్లి, చెంగిచర్ల కీసర : నాగారం, దమ్మాయిగూడ మేడ్చల్ : గుండ్లపోచంపల్లి ఎన్నికలకు బ్రేక్ గ్రేటర్లో పంచాయతీల విలీనంతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకు 15 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకూడదని కలెక్టర్‌ను ఆదేశించింది. నామినేషన్ల స్వీకరణ పర్వానికి కొన్ని గంటల ముందు పంచాయతీలను విలీనం చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంతో డైలమాలోపడ్డ జిల్లా యంత్రాంగం... దీనిపై స్పష్టతను కోరుతూ ఈసీ అధికారులను సంప్రదించింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియను పక్కనపెట్టాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను జారీచేసింది. కాగా, మణికొండ పంచాయతీకి మాత్రం యథావిధిగా ఈ నెల 21న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. -
సర్పంచ్ల పవర్‌కు చెక్!
ఘట్‌కేసర్‌టౌన్/కుల్కచర్ల/యాచారం,న్యూస్‌లైన్: గ్రామ ప్రథమ పౌరులుగా ఎన్నికైన వారికి ఇంకా ‘పవర్’ దక్కలేదు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎన్నికైన సర్పంచ్‌లందరూ ఈ నెల 2వతేదీన బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గ్రామాల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఉవ్విళ్లూరుతున్న కొత్త సర్పంచ్ల ఉత్సాహంపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. ప్రత్యేకాధికారులు, కార్యదర్శుల నుంచి ఇప్పటికీ వీరికి పంచాయతీ రికార్డులు అందకపోవడంతో నిస్సహాయ స్థితిలో పడ్డారు. గతంలో సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల్లో ఒక్కరికి చెక్‌పవర్ అధికారాన్ని కల్పించేవారు. కాగా ఈ సారి ఎవరికి, ఏ విధంగా చెక్‌పవర్ ఇవ్వాలో ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో కార్యదర్శులు నూతన సర్పంచ్‌లకు రికార్డులు అప్పగించలేదు. దీంతో చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు వీధి దీపాల ఏర్పాటుకు, మురుగు కాల్వల శుభ్రానికి అలాగే తాగునీటి సరఫరాకు సొంత డబ్బులు వెచ్చించి పనులు చేయిస్తున్నారు. ఉత్సవ విగ్రహాల్లా... బాధ్యతలు చేపట్టిన రోజునే పంచాయతీ రికార్డులు అందజేయాల్సి ఉండగా వారంరోజులు దాటినా అవి అందకపోవడంతో ఏ పని చేపట్టాలో తెలియక సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాల్లా మారారు. అసలు పంచాయతీలో జనరల్ ఫండ్ ఎంతుంది.. ప్రభుత్వమిచ్చిన నిధులెన్ని.. వసూలైన పన్నులు... వేటికి ఎంత ఖర్చు చేశారు, ఎవరికెంత చెల్లించాలి? వంటివి తెలియక సర్పంచ్‌లు అయోమయానికి గురవుతున్నారు. ప్రత్యేకాధికాధికారుల పాలనలో గ్రామాలకు వచ్చిన నిధులు, చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయనున్నట్టు కుల్కచర్ల మండలంలోని పలువురు సర్పంచ్‌లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు నిలిచిపోయిన వేతనాలు ప్రతి నెల మొదటి వారంలో పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన వేతనాలు ఆగిపోయాయి. పంచాయతీల్లో పన్నుల రూపంలో వసూలైన డబ్బులను బ్యాంకుల్లో జమ చేస్తారు. ప్రతి చెల్లింపు చెక్కుల రూపేణా జరగాలి. అయితే సర్పంచ్‌లకు చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో నిధులను డ్రా చేసే అవకాశం లేకుండాపోయింది. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెండింగ్‌లో పడ్డాయి. లెక్కల్లేవ్... ఇదిలా ఉంటే ప్రత్యేకాధికారుల పాలనలో చాలా పంచాయతీలో నిధులు, ఖర్చుల లెక్కలు సక్రమంగా లేనట్టు తెలుస్తోంది. యాచారం మండలంలో అంతోఇంతో ఆదాయం ఉండే యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, నక్కర్తమేడిపల్లి, చింతపట్ల, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో రికార్డుల నమోదు గందరగోళంగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. యాచారం గ్రా మంలో రికార్డులు ఇవ్వకుండా సర్పంచ్‌కు బోరుబావుల మోటార్లు, పైపులు చూపించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ప్రత్యేకాధికారుల్లో ఆందోళన... నూతన సర్పంచ్‌లు రికార్డులు అందజేయాలని పట్టుపడుతుండటంతో ప్రత్యేకాధికారుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా యాచారం, మాల్, గునుగల్, నందివనపర్తి, తక్కళ్లపల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలనలో వెంచర్లకు అనుమతులు ఇవ్వడం, అవి కూడ పాత సర్పంచ్ల సంతకాలతో రికార్డులు నమోదు చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రికార్డులు ఇవ్వకుండా... వాటిని ప్రత్యేకాధికారులు కార్యదర్శులతో తమ వద్దకు తెప్పించుకొని సరిచేయిస్తున్నట్టు కూడా ఆరోపణలు వినవస్తున్నాయి. బోరు మోటార్లు మాత్రమే చూపించారు పంచాయతీలో పైసలు ఎన్ని ఉన్నాయని అడిగితే లెక్క చెప్పకుండా వీటికి ఖర్చయినాయని బిగించిన బోరుమోటార్లు, వేసిన పైపులు చూపించారు. ఎన్ని వెంచర్లకు అనుమతులు ఉన్నాయి, చేపట్టిన అభివృద్ధి పనులు, ఖర్చు చేసిన నిధుల రికార్డులు త్వరలోనే ఇస్తామని అన్నారు. - మారోజ్ కళమ్మ, యాచారం సర్పంచ్ ప్రభుత్వం స్పందించాలి రికార్డులు ఇవ్వకపోవడంతో ఏ పని చేపట్టాలో తెలియం లేదు. ఖర్చయిందెం త, ఎన్ని నిధులు ఉ న్నాయో కూడా చెప్ప డం లేదు. చెక్‌పవర్ ఎవరెవరికిస్తారోనన్నది కూడా అధికారుల దగ్గరే సమాచారం లేదు. ప్రభుత్వం స్పందించి చెక్ పవర్ ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలి. - గాంధారి లక్ష్మీనారాయణ, పోచారం సర్పంచ్, ఘట్కేసర్ -
ప్రాదేశిక కసరత్తు షురూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : స్థానిక సంస్థల ఎన్నికలపై జిల్లా యంత్రాంగం కసరత్తును వేగవంతం చేసింది. మండల ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ) పునర్విభజన ప్రక్రియను చకచకా పూర్తి చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలపై అనుమానాలున్నప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఎంపీటీసీల లెక్కలు తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 13వ తేదీలోగా ఎంపీటీసీల స్థానాల డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు నిర్దేశించింది. ఈ నెల 14న ప్రాథమిక నోటిఫికేషన్, అనంతరం సూచనలు, అభ్యంతరాలు స్వీకరించిన పిదప 28న తుది జాబితా ప్రకటించాలని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ క్రమంలోనే ఎంపీటీసీ స్థానాల పునర్విభజనలో జిల్లా యంత్రాంగం తలమునకలైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో.. ఆ మేరకు పునర్విభజనను చేపడుతోంది. 3500మంది జనాభాకు ఓ స్థానం.. సగటున 3500 మంది జనాభాకు ఒక ఎంపీటీసీ స్థానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో 2011 జనాభా ప్రకారం జిల్లావ్యాప్తంగా 639 ఎంపీటీసీ స్థానాలు వస్తాయి. గతంలో 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 500 ఎంపీటీసీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా జనాభా 22,36,329 ఉంది. ఈ మేరకు ఈ సారి అదనంగా 139 ఎంపీటీసీలు పెరగనున్నాయి. అయితే, సరూర్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లోని గ్రామాలను నగరపంచాయతీ/జీహెచ్ఎంసీ పరిధిలో కలిపారు. ఇవికాకుండా మరో 50 పంచాయతీలను గ్రేటర్లో విలీనం చేసే అంశం ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో వీటిని పంచాయతీరాజ్ శాఖ జాబితానుంచి తొలగించాల్సి ఉంటుంది. దీంతో జిల్లాలో ఎంపీటీసీల సంఖ్య 550 కు పరిమితమయ్యే అవకాశముందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా.. ఎంపీటీసీల పునర్విభజన ప్రక్రియను ఈ నెల 13లోగా పూర్తి చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. 14న ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసి 21వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరించి 26వ తేదీవరకు పరిశీలిస్తారు. 28న ఎంపీటీసీ స్థానాల తుది జాబితాను ప్రకటిస్తారు. అదే రోజూ రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతారు. ఎంపీటీసీ స్థానాలతోపాటు జెడ్పీటీసీ స్థానాల జాబితాను కూడా ఏకకాలంలో రూపొందిస్తారు. కాగా, గ్రేటర్లో విలీనమయ్యే పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఇదివరకే కోర్టు తీర్పు వెల్లడించినందున.. ఆ జనాభాను కూడా పరిగణనలోకి తీసుకునే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఎన్నికలు జరిగేనా.? గత నెల 30న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన అనంతరం.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారిపోయింది. సీమాంధ్రలో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్నాయి. ఈ పరిస్థితులు స్థానిక ఎన్నికల నిర్వహణకు అనువుగా లేవు. అయి తే, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారుపై గత నెలాఖరులో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇవి జిల్లా యంత్రాంగాలకు చేరేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. యంత్రాం గం మాత్రం వీటిపై కసరత్తు పూర్తి చేస్తున్నప్పటికీ, ఎన్నికల నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నెలాఖరులో నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన మున్సిపల్ ఎన్నికలపై ప్రభుత్వం వెనకడుగు వేసిం ది. మంత్రివర్గంలో సగంమంది రాజీనామాలు చేయడం, పాలన స్తంభించడంతో ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. ఈ క్రమంలో స్థానిక ఎన్నికలకు ఇప్పట్లో మోక్షం కలిగే అవకాశ ం కనుచూపు మేరలో కనిపించడం లేదు. -
పల్లె పీఠంపై ఆడబిడ్డలుదశ మార్చండి!
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : పంచాయతీ ఎన్నికల్లో మహిళలు విజయభేరి మోగించారు. గత నెల మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో తమ సత్తాచాటారు. జిల్లావ్యాప్తంగా ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 866 పంచాయతీ, 8,732 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొదటి, రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరగగా 480 మంది మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం మహిళల రిజర్వేషన్‌ను 33 శాతం నుంచి 50 శాతానికి పెంచడంతో అవకాశాన్ని వినియోగించుకున్నారు. 50 శాతం రిజర్వేషన్ అంటే 433 సర్పంచ్ స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. 433 రిజర్వేషన్ స్థానాలతోపాటు మరో 47 జనరల్‌లో సర్పంచ్ స్థానాలను దక్కించుకున్నారు. అంటే కోటా కంటే 10 శాతం అధికంగా అధికారం సాధించారు. కాగా, ఏకగ్రీవ పంచాయతీల్లోనూ మహిళలే అధికంగా అధకారం కైవసం చేసుకున్నారు. సుమారు 50 శాతం పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్ పదవుల్లో మహిళలే ప్రాతినిధ్యం వహిస్తుండడం ఆసక్త్తికరంగా మారింది. కాగా వర్షం, వరదల కారణంగా ఇంకా 25 పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో కూడా ఐదారు సర్పంచ్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మహిళలు అధికారం మీదే.. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రజలు భావిస్తున్నారు. రాజకీయంగా అన్ని అధికారాలను వినియోగించుకుని పల్లెలను ప్రథమ స్థానంలో నిలుపుతారని ఆశిస్తున్నారు. భర్త చాటు భార్యలు కాకుండా సొంతంగా పాలన చేయాలని కోరుతున్నారు. తమకు పదవులు ఇచ్చినందుకు గ్రామాల్లో పారిశుధ్యం, వీధిదీపాలు, రహదారులు, మంచినీటి సౌకర్యం వంటి తదితర సౌకర్యాలపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పాలన భేష్‌గా చేస్తే 50 శాతం రిజర్వేషన్‌కు సార్థకత చేకూరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, కొత్తగా ఎన్నికైనా మహిళా సర్పంచ్‌లకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ పరిపాలన విధానంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని, విధుల నిర్వహణ, వివిధ అభివృద్ధి పనుల కోసం మంజూరు చేయబడే నిధుల ఖర్చులపై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య తెలిపారు. -
బిగుసుకుంటున్న ఉచ్చు
ఇందూరు, న్యూస్‌లైన్ :పంచాయతీ ఎన్నికల విధులకు డుమ్మా కొట్టిన సిబ్బంది మెడకు ఉచ్చు బిగుస్తోంది. గైర్హాజరును తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ఎన్నికల సంఘం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా ఉన్నతాధికారులను అదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ బాబు విధులకు డుమ్మా కొట్టిన సిబ్బంది వివరాలు తయారు చేయాలని అన్ని డివిజన్ల ఆర్డీఓలకు, మండలాల ఎంపీడీఓలకు సూచించారు. ఈ మేరకు అధికారులు ఎన్నికల విధులకు గైర్హాజరైన వారి జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి సిద్ధం చేశారు. వారు తయారు చేసిన జాబితా ప్రకారం 450 మందికి పైగా సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. వీరందరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాల వారు చెబుతున్నారు. అయితే ఇతర జిల్లాల్లో ఇపాటికే గైర్హాజరు సిబ్బందిపై కేసులు నమోదు చేసి కోర్టులో ప్రాసిక్యూషన్ కూడా చేశారు. జిల్లాలో అధికారులు కొద్దిగా అలస్యం చేసినప్పటికీ మరో వారం రోజుల్లో కేసులు నమోదు చేయనున్నట్టు సమాచారం. జిల్లా కోర్టులో ప్రాసిక్యూషన్ చేయించాలన్న ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలకు సమాయత్తమవుతున్నారు. లోలోపలే కేసుల నమోదు ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎంతమంది ఉద్యోగులున్నారు అనే విషయాన్ని అధికారులు బయటకు పొక్కనివ్వడంలేదు. అదేవిధంగా మరోపక్క క్రిమినల్ కేసుల నమోదు, క్రమ శిక్షణ చర్యలతో పాటు వారి రెండు రోజుల వేతనాన్ని కట్ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. విధులకు హాజరుకాని వారిని శిక్ష నుంచి తప్పించే ప్రయత్నాలు చేసిన అధికారులపై కూడా ఇలాంటి చర్యలుంటాయని ఎన్నికల కమిషనర్ హెచ్చరించారు. అలాగే విధులకు హాజరుకాని ఉద్యోగులు తమపై ఎలాంటి ప్రభావం పడకుండా అధికార పార్టీ నాయకులతో, ఎమ్మెల్యేలతో జిల్లా ఉన్నతాధికారులపై ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో డీలా పడుతున్నారు. ఎన్నికల కమిషనర్‌తో జోకులొద్దు అంటూ అధికారులు నేతల మాట వినకుండా తమ పని చేసుకుపోయినట్లు సమాచారం. మొన్నటి వరకు గైర్హాజరైనా ఉద్యోగులను ముట్టుకుంటే ఊరుకోమ ని అధికారులను, ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఉద్యోగ సంఘాలు కూడా చల్లబడ్డాయి -
ఏడు పంచాయతీల్లో వైఎస్సార్సీపీ విజయం
సాక్షి, నరసరావుపేట: గుంటూరు జిల్లాలో ఎన్నికలు వాయిదా పడిన 12 పంచాయతీల్లో గురువారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో 11, గుంటూరు డివిజన్లో ఒక పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. గత నెల 31న జరిగిన ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఎత్తుకెళ్లి బావిలో పడేయడంతో వాటికి తిరిగి ఎన్నికలు నిర్వహించారు. అయితే, ఈ ఎన్నికలను కాంగ్రెస్‌పార్టీ మద్దతుదారులు బహిష్కరించారు. పల్నాడులో ఎన్నికలు జరిగిన 11 పంచాయతీల్లో రొంపిచర్ల, ఇక్కుర్రు, తూబాడు, కండ్లకుంట, ఊడిజెర్ల, గోగులపాడులలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. పెదరెడ్డిపాలెం, శిరిగిరిపాడు గ్రామాల్లో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు, అందుగులపాడు, ముత్తనపల్లిలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. సారంగపల్లి అగ్రహారంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. గుంటూరు డివిజన్లోని గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలో వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. -
రాజుకుంటున్న వేడి
కామారెడ్డి, న్యూస్‌లైన్: మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో గెలుపు గుర్రాల కోసం పార్టీల అన్వేషణ మొదలైంది. పంచాయతీ ఎన్నిక లు ముగియడం, చేస్తామన్నారు. వైద్య కళాశాల ఏర్పాటు ద్వారా 120 మంది డాక్టర్లు రానున్నారని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విప్ అనిల్ మాట్లాడుతూ వైద్యకళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరిందన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు చేయడంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఉందన్నారు. అనంతరం కళాశాల ఏర్పాటు సంబంధించి మంత్రి సుదర్శన్‌రెడ్డి రాత్రింబగళ్లు కష్టపడ్డారని అన్నారు. ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మెడికల్ కళాశాల, ఆస్పత్రికి అనుబంధంగా 200 పడకలతో మెటర్నిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరారు. ఇన్చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ మంత్రి పట్టుదలతోనే వైద్య కళాశాల త్వరగా ప్రారంభమైందన్నారు. ఏ చిన్నసమస్యకైన మంత్రి నేరుగా వచ్చి పరిష్కరించినట్లు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొత్త కళాశాలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ రమణి విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి వినోద్‌కుమార్ ఆగర్వాల్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుమన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.