ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది.
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కేసు విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ కేసును మంగళవారమే విచారించాలని ఎన్నికల సంఘం న్యాయవాది మనోజ్ సక్సేనా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీంతో ఈ కేసును మధ్యాహ్నం 2 గంటలకు విచారిస్తామని జస్టిస్ జ్ఞానసుధామిశ్రా, జస్టిస్ గోపాలగౌడ్‌లతో కూడిన ధర్మాసనం తొలుత ప్రకటించింది. అయితే, కేసుల విచారణ జాబితాలో ఇది లేనందున బుధవారం విచారిస్తామని న్యాయమూర్తులు తెలిపారు.