నేడు ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏజెన్సీ పర్యటన
Published Thu, May 25 2017 12:20 AM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
రంపచోడవరం :
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ గురువారం ఏజెన్సీలో పర్యటించనున్నారని ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటలు వరకు ఐటీడీఏ సమావేశపు హాలులో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటలు వరకు మారేడుమిల్లిలో ఫిర్యాదులు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం చట్లవాడ గ్రామంలో జరిగే పర్ణశాల పండగలో పాల్గొంటారని తెలిపారు.
Advertisement
Advertisement