రాజకీయంగా సంఘటితం కావాలి
రాజకీయంగా సంఘటితం కావాలి
Published Thu, Jan 19 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ పిలుపు
రావులపాలెం: బ్రాహ్మణులు రాజకీయంగా సంఘటితం కావాలని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక బ్రాహ్మణసంఘ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితుడు పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని, వేదాశీర్వచనంతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కళావెంకట్రావు సెంటర్‌లో భక్తాంజనేయ ఆలయంలో పూజలు నిర్వహించారు. అలాగే కళా వెంకట్రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళా వెంకట్రావు వంటి మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. స్వాతంత్య్ర సమరంలో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన నాయకుల్లో కళావెంకట్రావు ఒకరు అన్నారు. త్యాగాలు చేసే కాలంలో ముందున్న బ్రాహ్మణ నాయకత్వం నేడు ఏమైందని అంతా ప్రశ్నించుకోవాలన్నారు. నేడు బ్రాహ్మణులు రాజకీయాల్లోనే లేకుండా పోతున్నారని ఇప్పటికైనా సంఘటితమై రాజకీయాల్లో ్రçపధాన స్థానం పొందకపోతే భవిష్యత్ లేదన్నారు. ఈ సం దర్భంగా స్థానిక మహా త్మాగాంధీ అధ్యయన సంస్థ కార్యదర్శి దుళ్ల వెంకటేశ్వర్లు, కళా వెంకట్రావు, వావిలాల గోపాలకష్ణయ్య, జీవిత చరిత్రల రచనలను కృష్ణారావుకు అందజేశారు. ఆయన వెంట ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ డైరెక్టర్ దువ్వూరి సురేష్, రాణి శ్రీనివాసశర్మ, అమలాపురం డీఎల్‌పీఓ జేవీవీఎస్ శర్మ ఉన్నారు.
ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూస్తా
వెదురుపాక (రాయవరం) : బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి విడుదలయ్యే ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా చూడడం తన బాధ్యతని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) 81వ జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడుతూ 2014–15లో రూ.25కోట్లు, 2015–16లో రూ.35కోట్లు విడుదలైందన్నారు. 2016–17లో రూ.65కోట్లు విడుదల కాగా ఇప్పటి వరకు రూ.40కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు విడుదలైన నిధుల ద్వారా 30 వేల మందికి ప్రయోజనం చేకూరగా, ఈ ఏడాది చివరినాటికి మరో 10 వేల మందికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ నిధుల్లో 50 శాతం విద్యా సంబంధ కార్యక్రమాలకు, మిగిలినవి సం క్షే మ కార్యక్రమాలకు వినియోగి స్తున్నట్లు తెలిపారు. ము ఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే రెండేళ్లలో ఏడాదికి రూ.170కోట్ల వంతున విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు. ఈ సంఘం ఏర్పాటు ఉద్దేశం, లక్ష్యం నెరవేరేలా తాను ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అర్చకులను వివాహం చేసుకునేందుకు యువతులు ముందుకు రావడం లేదన్నారు. అందుకే చంద్రశేఖర పథకం కింద వారిని వివాహం చేసుకుంటే ఇరువురి పేరన రూ.లక్ష డిపాజిట్ చేయనున్నామని, ఆ సొమ్మును ఐదేళ్ల అనంతరం విత్‌డ్రా చేసుకుని ఖర్చు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో బ్రాహ్మణ యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సూరంపూడి కామేష్, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు దంతుర్తి సత్యప్రసాద్‌లు ఉన్నారు.
Advertisement
Advertisement