అసెంబ్లీలో నిలదీస్తా..!
అసెంబ్లీలో నిలదీస్తా..!
Published Thu, Nov 24 2016 12:16 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
తెలుగుజాతి చిరకాల స్వప్నం ‘పోలవరం’ బహుళార్థ సాధక ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామంటూనే చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల కోసం ఆరాట పడుతోంది. అలాంటి పథకమే పురుషోత్తపట్నం ఎత్తిపోతలు. అది కార్యరూపం ధరిస్తే భూములను కోల్పోయి, నష్టపోయే రైతులు బుధవారం రాజమహేంద్రవరంలో విపక్షనేత జగన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
‘పురుషోత్తపట్నం ఎత్తిపోతల’ బాధితులకు జగన్ భరోసా
2018 నాటికి ‘పోలవరం’పూర్తి చేస్తామంటూనే ఈ పథకం
కాసులు దండుకోవడానికేనని ధ్వజం
భూములు కోల్పోయే రైతుల ఉద్యమాలకు దన్నుగా ఉంటానని హామీ
సాక్షి, రాజమహేంద్రవరం : పోలవరం ప్రాజెక్టును మరో రెండేళ్లలో పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఇంతలోనే రూ.1,638 కోట్ల ఖర్చుతో, బంగారం పండే 200 ఎకరాల రైతుల భూములు తీసుకుని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిర్మిస్తుందో అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. దివీస్ ల్యాబొరేటరీస్ ఏర్పాటుకు బలవంతంగా భూసేకరణ చేస్తున్న తుని నియోజకవర్గం కోన ప్రాంతంలో బాధిత గ్రామాల్లో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మంగళవారం జిల్లాకు వచ్చిన జగ¯ŒS బుధవారం రాజమహేంద్రవరం రోడ్లు, భవనాల అతిథి గృహంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.
‘ఎత్తిపోతల’తో బతుకు కుదేలు..
కాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వల్ల భూములు కోల్పోతున్న బాధిత రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు యలమళ్ల సుజిరాజు, యలమళ్ల రమాదేవి, రొంగల భాస్కరరావు, కుంచే బాబూరావు, వలవల వెంకటరాజు, వలవల రాజా, ముదునూరి ప్రసాదరాజు, చీకట్ల వీర్రాజు, గెద్దాడ త్రిమూర్తులు, పత్తిపాటి రమేష్‌బాబు, నళ్లల అబ్బులు, శ్రీనివాస్ తదితరులు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో జగన్ కు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఎత్తిపోతల పథకం ఏర్పాటుతో తమకు కలిగే నష్టాన్ని వివరిస్తూ వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే పుష్కర, పోలవరం, తొర్రిగెడ్డ, సత్యసాయి పథకాల నిర్మాణాలకు తమ భూములు తీసుకున్నారని, ఇక మిగిలిన ఎకరం, అరెకరం భూమి కూడా తీసుకుంటే తాము జీవనాధారం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి వేదనను ఆలకించిన జగన్ అండగా ఉంటామని భరోసానిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న పాలకులు కాసుల కక్కుర్తి కోసం పట్టిసీమ తరహాలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారని ధ్వజమెత్తారు. భూములు కోల్పోయే రైతుల ఉద్యమాలకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముస్లిం విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని అబ్దుల్ కలామ్ ఆజాద్ అసోసియేషన్ సభ్యులు జగ¯ŒSకు వినతిపత్రం ఇచ్చారు. వైఎస్ రాజÔóశేఖరరెడ్డి ముస్లింలకు విద్యా, ప్రభుత్వ ఉద్యోగాలలో నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుర్తు చేశారు. అనంతరం జగ¯ŒS విమానాశ్రయానికి వెళుతూ..కొంతమూరులో ప్రమాదంలో గాయపడిన పార్టీ కార్యకర్తలు యండ్రా ఈశ్వరరావు, ప్రేమ్‌కుమార్, విజయ్‌లను పార్టీ నాయకుడు యామన రామకృష్ణ గౌడ్ నివాసంలో పరామర్శించారు.
వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, సీజీసీ సభ్యులుజక్కంపూడి విజయలక్ష్మి, కుడుపూడి చిట్టబ్బాయి, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పర్వత ప్రసాద్, ముత్యాల శ్రీనివాస్, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభిరామయ్య, బొంతు రాజేశ్వరరావు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, అనుబంధ విభాగాల అధ్యక్షులు అనంత ఉదయభాస్కర్, పెట్టా శ్రీనివాస్, సిరిపురం శ్రీనివాస్, కొల్లి నిర్మలాకుమారి, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, తాడి విజయభాస్కర్‌రెడ్డి, మిండగుదిటి మోహన్, పెంకే వెంకట్రావు, వట్టికూటి రాజశేఖర్, పోలు కిరణ్‌కుమార్‌రెడ్డి, మురళీరాజు, దంగేటి వీరబాబు, అడపా శ్రీహరి, గుర్రం గౌతమ్, రైతు విభాగం ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల ఇన్ చార్జి కొవ్వూరి త్రినాథరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, రాజమహేంద్రవరం కౌన్సిల్‌లో పార్టీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు గుత్తుల మురళీధర్, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, నాయకులు వాసిరెడ్డి జమీలు, జున్నూరి బాబి, అడ్డగళ్ళ సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement