నిర్లక్ష్య సర్కారు ఇదీ
నిర్లక్ష్య సర్కారు ఇదీ
Published Sat, May 13 2017 11:31 PM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM
- ఏ వర్గం సమస్యలనూ తీర్చడం లేదు
- బాబు ప్రభుత్వంపై జగన్ ధ్వజం
- జగన్ రాకతో కిక్కిరిసిపోయిన ఎయిర్‌పోర్టు
- ధాన్యానికి గిట్టుబాటు దక్కడం లేదన్న కన్నబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/మధురపూడి : పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి మధురపూడి ఎయిర్‌పోర్టులో శనివారం రైతులు, విద్యార్థులు పలు సమస్యలను ఏకరవుపెట్టారు. అన్ని వర్గాల సమస్యలను సావధానంగా విన్న జగన్ ఆ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఉదయం 11.30 గంటలకు మధురపూడి ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌ను కలిసేందుకు నేతలు, అభిమానులు పోటెత్తడంతో ఎయిర్‌పోర్టు కిక్కిరిసిపోయింది. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో ఫ్యాకల్టీని పెంచడంలో ప్రభుత్వం విఫలమైందని పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులు తాడేపల్లి విజయ కుమార్, తారకేష్, మహేశ్ కార్పొరేటర్ బొంతా శ్రీహరి ఆధ్వర్యంలో జగన్‌కు విన్నవించారు. 150 మంది అధ్యాపకులకు 52 మంది మాత్రమే ఉండటంతో విద్యార్థులు నష్టపోతున్నారని జగన్‌కు విజ్ఞప్తి చేశారు. అధ్యాపకుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తానని జగన్ చెప్పారు. ఎయిర్‌పోర్టు బయట పలువురు రైతులు కలిశారు. వరికి గిట్టుబాటు ధర లభించడం లేదని మెట్ట రైతులు జగన్‌కు వివరించారు. కోరుకొండ మండల రైతు అధ్యక్షుడు తోరాల శ్రీను, నాయకులు గణేశుల పోసియ్య, నాగవిష్ణు, సిహెచ్ దుర్గారావు, ఆకుల శ్రీను, కొల్లపు అభి తదితరులు వరికి గిట్టుబాటు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధర కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని, రైతులంతా సమన్వయంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ ఈ సందర్భంగా వారికి సూచించారు.
జిల్లా పరిస్థితులపై కన్నబాబుతో మాటామంతీ...
గడప, గడపకూ వైఎస్సార్ కార్యక్రమంపై జగన్ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతో చర్చించారు. జగన్ జిల్లాలో పార్టీ పరిస్థితిని కన్నబాబుతో సమీక్షించారు. జీజీవైఎస్సార్ కార్యక్రమం ఏ నియోజకవర్గంలో ఏ రీతిన జరుగుతోందని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జీజీవైఎస్సార్ సరైన వేదిక అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో మండల, బూత్ కమిటీలను త్వరతగతిన పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. జిల్లాలో ధాన్యానికి గిట్టుబాటు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని జగన్‌కు కన్నబాబు వివరించారు. బస్తా రూ.1400లు కొనుగోలుచేసి ఇప్పుడు హఠాత్తుగా రూ.100లు తగ్గించేశారని కన్నబాబు వివరించారు. పంట దిగుబడి బాగున్నా ధర విషయంలో అన్యాయం జరుగుతోందని వివరించగా పార్టీ తరఫున వారికి భరోసా ఇవ్వాలని జగన్ పేర్కొన్నారు.
ఘన స్వాగతం...
జగన్‌కు స్వాగతం పలికిన వారిలో ఉభయగోదావరి జిల్లాల అధ్యక్షులు కురసాల కన్నబాబు, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పీఏసీ సభ్యుడు పినిపే విశ్వరూప్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రౌతు సూర్యప్రకాశరావు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పాముల రాజేశ్వరి, ముదునూరి ప్రసాదరాజు, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, గ్రేటర్ రాజమహేంద్రవరం అధ్యక్షుడు కందుల దుర్గేష్, కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావు నాయుడు, ఆకుల వీర్రాజు, గిరిజాల బాబు, బొంతు రాజేశ్వరరావు,ముత్తా శశిధర్, వేగుళ్ల లీలాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, కొండేటి చిట్టిబాబు, ముత్యాల శ్రీనివాస్, పితాని బాలకృష్ణ, అధికార ప్రతినిధి చెల్లు బోయిన వేణు, రాష్ట్రకార్యదర్శులు గుత్తుల సాయి, నక్కా రాజుబాబు, కర్రి పాపారాయుడు, వట్టికూటి రాజశేఖర్, చెల్లుబోయిన శ్రీనివాస్, అల్లి రాజబాబుయాదవ్, గుర్రం గౌతమ్, రావిపాటి రామచంద్రరావు, మిండగుదిటి మోహన్, సుంకర చిన్ని, తాడి విజయభాస్కరరెడ్డి, పేరి శ్రీనివాసరావు, పోలు కిరణ్‌రెడ్డి, కార్పోరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి అనిల్ షర్మిలా రెడ్డి, డిప్యుటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, అనుబంధ విభాగాల అధ్యక్షలు కొవ్వూరి త్రినాథరెడ్డి, డాక్టర్ యనమదల గీత మురళీకృష్ణ, పెట్టా శ్రీనివాస్, శిరిపురపు శ్రీనివాస్, మార్తి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి, అధికారప్రతినిధి శెట్టిబత్తుల రాజుబాబు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కార్యదర్శులు విప్పర్తి వేణుగోపాల్, నేతలు జక్కంపూడి గణేష్, మజ్జి నూకరత్నం, బొంతా శ్రీహరి, పిల్లి నిర్మల, ఈతకోట బాపనసుధారాణి తదితరులు ఉన్నారు.
Advertisement