నేపాల్‌లో భారతీయులకు బంపర్‌ ఆఫర్‌ | Nepal Allows Indians to Contest Local Body Polls | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో భారతీయులకు బంపర్‌ ఆఫర్‌

Published Thu, Apr 27 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

నేపాల్‌లో భారతీయులకు బంపర్‌ ఆఫర్‌

నేపాల్‌లో భారతీయులకు బంపర్‌ ఆఫర్‌

నేపాల్‌: నేపాల్‌లో భారతీయులకు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. ఇక నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతించింది.  ఈ ఏడాది మే నెలలో నేపాల్‌ స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్‌తో సరిహద్దు ఉన్న ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ ప్రాంతాలను కలిపి టారాయి ప్రాంతంగా పిలుస్తారు. ఈ ప్రాంతంలో నివసించే భారతీయులకు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇప్పటి నుంచి దక్కనుంది.

నేపాల్‌ ఉంటున్న తమకు కూడా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని గత ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఈ విషయాన్ని భారతీయ దౌత్య వేత్తలు కూడా చర్చించారు. దీంతో దిగొచ్చిన అక్కడి ప్రభుత్వం సరిహద్దు ప్రాంతంలో పెళ్లిళ్లు ఎలా జరుగుతున్నాయో అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు అక్కడ పార్లమెంటులో కూడా సవరణ చేయనున్నారు. మదేసీలు అనే తెగ ఈ మేరకు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నేపాల్‌లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement