నేపాల్‌లో ఘోర ప్రమాదం | Indian bus with 40 passengers onboard plunges into Nepal river Updates | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో ఘోర ప్రమాదం

Published Fri, Aug 23 2024 12:41 PM | Last Updated on Sat, Aug 24 2024 4:38 AM

Indian bus with 40 passengers onboard plunges into Nepal river Updates

బస్సు నదిలో పడి.. 27 మంది మృతి

మరో 16 మందికి గాయాలు

బాధితులు మహారాష్ట్ర వాసులు

కఠ్మాండు: నేపాల్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మహారాష్ట్రకు చెందిన 27 మంది చనిపోగా, మరో 16 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో రిజస్టరయిన ఈ బస్సు సెంట్రల్‌ నేపాల్‌లోని మార్స్‌యాంగడీ నదిలో పడిపోయినట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా భుసాల్‌ గ్రామానికి చెందిన 104 మంది యాత్రికులు మూడు బస్సుల్లో నేపాల్‌కు వచ్చారు. 

మొత్తం 10 రోజుల యాత్రలో పొఖారాలో రెండు రోజులు గడిపారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం మూడు బస్సుల్లో కఠ్మాండు వైపు తిరుగు పయనమ య్యారు. ఇందులో ఒక బస్సు ఉదయం 11.30 గంటల సమయంలో తనహున్‌ జిల్లా ఐనా పహరా వద్ద హైవేపై అదుపుతప్పి 150 మీటర్ల లోతున్న మార్స్‌యాంగడీ నదిలో పడిపోయింది. ఈ బస్సులో డ్రైవర్, హెల్పర్‌ సహా మొత్తం 43 మంది ఉన్నారు. పరవళ్లు తొక్కుతున్న నదిలో నుంచి 16 మృతదేహాలను వెలికితీశారు.

 క్షతగాత్రులైన 11 మంది ఆస్పత్రిలో చనిపోయారు. మరో 16 మందికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. బస్సు నుజ్జునుజ్జయింది. మూడు బస్సుల్లో ఉన్న వారంతా కుటుంబసభ్యులు, బంధువులేనని పోలీసులు తెలిపారు. విషయం తెల్సిన వెంటనే ఘటనా ప్రాంతానికి యూపీ ప్రభుత్వం మహారాజ్‌గంజ్‌ సబ్‌ కలెక్టర్‌ను పంపించింది. రక్షణ, సహాయక చర్యలను ఈయన సమన్వయం చేస్తారని తెలిపింది. బాధితులను సాధ్యమైనంత త్వరగా నేపాల్‌ నుంచి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement