
షిల్లాంగ్: మేఘాలయలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తురా నుంచి షిల్లాంగ్ వెళ్తున్న బస్సు నోంగ్‌చ్రామ్ ప్రాంతంలోని రింగ్ది నదిలో ఒక్కసారిగా పడిపోయింది. బస్సులోని ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 21 మంది ఉన్నారు.
నాలుగు మృత దేహాలను వెలికి తీయగా, మరో రెండు మృత దేహాలు బస్సులోనే చిక్కుకొని ఉన్నాయి. చిక్కుకున్న మృతదేహాలతో పాటు మరికొంతమంది ప్రయాణికులను వెలికి తీయడానికి ఈస్ట్ గారో హిల్స్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment