
న్యూఢిల్లీ: నేపాల్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 14మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సింధుపాల్‌చౌక్ జిల్లాలో ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో బస్సు కలిన్‌చౌక్ ఆలయం నుంచి తిరిగి వస్తుండగా బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలోకి పడిపోయింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 40మంది ఉన్నారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.