స్థానిక సమరం: జిల్లాల వారీగా తొలి విడత ఎన్నికల విశేషాలు | Local body polls.. district wise details | Sakshi
Sakshi News home page

స్థానిక సమరం: జిల్లాల వారీగా తొలి విడత ఎన్నికల విశేషాలు

Published Sun, Apr 6 2014 4:34 PM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM

స్థానిక సమరం: జిల్లాల వారీగా తొలి విడత ఎన్నికల విశేషాలు - Sakshi

స్థానిక సమరం: జిల్లాల వారీగా తొలి విడత ఎన్నికల విశేషాలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తొలివిడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మొదటి దశలో 556 జెడ్పీటీసీ, 8250 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు‌, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబి రంగు బ్యాలెట్‌ పత్రాలను వాడుతున్నారు. 6,370  పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 95,031 మంది పోలీసులను భద్రత కోసం మోహరించారు. జిల్లాల వారీగా విశేషాలు..

అనంతపురం:
31 జెడ్పీటీసీ, 438 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభం
5 వేల మందితో పోలింగ్ భద్రత ఏర్పాటు
33 మందిపై బైండోవర్ కేసులు
ఎన్నికల సందర్భంగా పోలీసుల అత్యుత్సాహం
ఉరవకొండ, బెళుగుప్పలో పోలీసుల అదుపులో వైఎస్ఆర్ సీపీ ఎన్నికల ఏజెంట్లు
రాయదుర్గంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి హౌస్ అరెస్ట్
ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు
కూడేరు పోలింగ్ కేంద్రంలో గందరగోళం. ఓటరు జాబితా తారుమారు. ఎన్నికల అధికారులతో ఓటర్ల వాగ్వాదం
ఇంకా ప్రారంభం కాని పోలింగ్‌
కూడేరు చేరుకున్న ఎస్పీ సెంథిల్‌కుమార్. ఆగిన పోలింగ్‌ వివరాలు తెలుసుకున్న ఎస్పీ
కుందుర్తి మండలం బండమీదపల్లి ఎన్నికల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. విధి నిర్వహణ కోసం వచ్చి ఎన్నికల అధికారి అంజిబాబును పాటు కాటేసింది. దాంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
హిందూపురం మండలం మలుగూరులో టీడీపీకే ఓటు వేయంటి అంటూ ఓటర్లపై ఎన్నికల అధికారి అన్నపూర్ణమ్మ ఒత్తిడి చేస్తున్నారు. అ విషయాన్ని గమనించిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ జరపి... అన్నపూర్ణమ్మను విధుల నుంచి తప్పించారు.    
రాయదుర్గంలో ఓటర్లను టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి జిల్లా కలెక్టర్,ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కల్పించాలని ఉన్నతాధికారులకు కాపు విజ్ఞప్తి చేశారు.

రాయదుర్గం మండలం ఉడేగోళంలో బ్యాలెట్ పేపర్లు తారుమారు

వేరే గ్రామానికి చెందిన బ్యాలెట్ పేపర్లు రావడంపై ఆందోళన


వైఎస్ఆర్ కడప :

రైల్వేకోడూరు మండలం లక్ష్మింగారిపల్లిలో టీడీపీ, కాంగ్రెస్ నేతల దౌర్జన్యం
కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై  వైఎస్ఆర్ సీపీ ఏజెంట్‌ను బయటకు పంపించిన నేతలు
ఆకేపాడులో ఓటు వేసిన వైఎస్ఆర్‌సీపీ నేత ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి
ఆకేపాడులో ఓటర్లను కార్లలో తరలిస్తున్న టీడీపీ నేతలు
బి.కోడూరులో ఓటర్లను టీడీపీ నేతలు తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
పోరుమామిళ్ల రంగసముద్రంలో టీడీపీ,వైఎస్ఆర్ సీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ ఘర్షణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఏజెంట్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చినమండెంలో కాంగ్రెస్ నేత రామ్ప్రసాద్ రెడ్డి ఒకరు హల్చల్ సృష్టించారు. సదరు నేత  జనరల్ ఏజెంట్ అంటూ గన్మెన్లను వెంటేసుకుని బూత్లలో తిరుగుతున్నారు. గోపవరం మండలం రామన్న పల్లెలో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.
కాజీపేట మండలం నందిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను ఎన్నికల అధికారులు పోలింగ్ కేంద్రంలో నుంచి బయటకు పంపారు. ఎన్నికల అధికారులు టీడీపీతో కుమ్మకై తమను బయటకు పంపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఆరోపించారు.
 


చిత్తూరు:

31 జెడ్పీటీసీ, 445 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఎన్నికలు  
కుప్పం మండలం డీకేపల్లిలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఓటర్లు తమ ఓట్ల గల్లంతైనాయిన ఆందోళన చేపట్టడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు.
సోమం మండలం ఇరికిపెంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ సర్పంచ్ దాడి చేశారు.ఆ ఘటనలో వైఎస్ఆర్ సీపీ నేతకు తీవ్రగాయాలు... ఆసుపత్రికి తరలించారు.
మాజీ ముఖ్యమంత్రి సీఎం కిరణ్ అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఓటర్లను రానివ్వకుండా ... పోలింగ్ కేంద్రం వద్ద కిరణ్ అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారు.
పుంగనూరు మండలం కుమ్మరగుంటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్పై పోలీసులు దాడి చేశారు.


కర్నూలు:

36  జెడ్పీటీసీ, 496 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన ఎన్నికలు
బండి ఆత్మకూరు మండలం లింగాపురంలో 100 బ్యాలెట్ పేపర్లు గల్లంతు, అధికారుల విచారణ
గోస్పాడు మండలం నెహ్రునగర్ పోలింగ్ కేంద్రంలోకి గన్‌మెన్లతో వెళ్లిన టీడీపీ నేత సీపీ నాగిరెడ్డి
అభ్యంతరం వ్యక్తం చేయని ఎన్నికల అధికారులు
ఆత్మకూరులో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. స్థానిక నేత శిల్పా చక్రపాణి రెడ్డి అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 8 ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆళ్లగడ్డ మండలం యాదవాడలో టీడీపీ నేతల ఓవరాక్షన్ ప్రదర్శించారు. 22,23 పోలింగ్ కేంద్రాలలో సీలింగ్ ఫ్యాన్లును తొలగించాలని ఎన్నికల అధికారితో వాగ్వాదానికి దిగారు.అయితే ఫ్యాన్లు తొలగించడం సాధ్యం కాదని అధికారులు టీడీపీ నేతలకు తేల్చి చెప్పారు.  
వెల్దుర్తి మండలం బుక్కాపురంలో కాంగ్రెస్, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.
అవుకులో టీడీపీ నేతల అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను బలవంతంగా ట్రాక్టర్లలో పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు.  
నందికొట్కూరు మండలం కొణదేలలో ఓటు వేయడానికి వెళ్తున్న శేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీ కొని మరణించాడు.
మహానంది మండలం సీతారాంపురంలో టీడీపీ నేతల ఓటర్లకు ప్రలోభాలు పెడుతున్నారు. అయితే వైఎస్ఆర్ సీపీ నేతల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదు.
పగిడాల ఎన్నికలలో అపశ్రుతి చోటు చేసుకుంది.బూత్ నెంబర్ 18లతో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్ గుండె పోటుతో మృతి చెందాడు.



గుంటూరు:
నాదెండ్ల మండలం గణపవరం రాజీవ్‌గాంధీ కాలనీలో చీరలు పంచుతున్న టీడీపీ నేతల అరెస్ట్
పిట్టలవానిపాలెం మండలం అల్లూరు రెడ్లపాలెంలో పోలింగ్ బూత్‌ను అధికారులు మార్చారు. పోలింగ్ కేంద్రాన్ని 2 కి.మీ దూరంలోకి మార్చినందు వల్ల ఓటర్లు అక్కడికి వెళ్లి ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నారు.
రొంపిచర్ల మండలం మునమాకలో మైనార్టీలపై టీడీపీ కార్యకర్తల దాడులు చేశారు. ఆ దాడిలో ముగ్గురు గాయపడ్డారు.



ప్రకాశం:
ఎర్రగొండపాలెం మండలం అమానుగుడిపాడులో టీడీపీ నేతల దౌర్జన్యానికి దిగారు. దాంతో ఎస్సీ ఓటర్లును భయభ్రాంతులకు గురి చేశారు. దాంతో ఎస్సీ ఓటర్లు ఆందోళనకు దిగారు.
పుల్లలచెరువు మండలం ముటుకులలో స్థానిక ఎస్‌ఐ శ్రీనివాసరావు ఓవరాక్షన్‌ చేస్తున్నారు. ఒక వర్గానికి ఆ కొమ్ము కాస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
మార్టూరు మండలం బొబ్బేపల్లిలో వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.దాంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.
అద్దంకి మండలం రెడ్డిపాలెంలో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ స్పృహ తప్పిపడిపోయింది.
సంతమాగులూరు మండలం చౌటపాలెంలో వృద్ధుల ఓటేసే విషయమై ఏజెంట్ల మధ్య ఘర్షణ. దాంతో పోలింగ్ నిలిచిపోయింది.


పశ్చిమ గోదావరి: 
22 జెడ్పీటీసీ, 413 ఎంపీటీసీ  స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం
వట్లూరు పోలింగ్ కేంద్రంలో చీకట్లోనే పోలింగ్.. విద్యుత్ లేకపోడవంతో ఉక్కపోత. బ్యాలట్‌ పేపర్లో గుర్తులు కనిపించక ఇబ్బందులు
జిల్లాలో పలుచోట్ల విద్యుత్ సమస్యలు
జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో ఓటర్ల లిస్ట్లో గందరగోళం నెలకొంది.దాంతో పోలింగ్ ప్రారంభం కాలేదు.
పెంటపాడు పోలింగ్ స్టేషణ్ వద్ద టీడీపీ కార్యకర్తలకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు.


మహబూబ్‌నగర్:

5 జెడ్పీటీసీ, 512 ఎంపీటీసీ  స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది.
ఓటర్లను ప్రలోభపెడతారనే అనుమానంతో..టీఆర్ఎస్ ఇంఛార్జ్ కృష్ణమోహన్‌రెడ్డిను గద్వాల మాజీ ఎమ్మెల్యే భరత సింహారెడ్డి గృహ నిర్బంధించారు.



ఖమ్మం:

27 జెడ్పీటీసీ, 375 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు
మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల పేరుతో.. 50కి పైగా పోలింగ్ కేంద్రాలను దూరప్రాంతాలకు మార్పు
రవాణా వ్యవస్థ లేకపోవడంతో 15 కి.మీ నడిచివెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి
రవాణా సదుపాయం కల్పించాలని ఓటర్ల డిమాండ్

నల్గొండ:

జిల్లాలోని వేములపల్లిలో 33 వ పోలింగ్ బూత్ లో నిలిచిన పోలింగ్

తిరిగి పోలింగ్ నిర్వహించాలని ఓటర్లు ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement