
సాక్షి, కృష్ణా: టీడీపీ మహిళా నాయకురాలు మూల్పూరి సాయికల్యాణిపై కేసు నమోదైంది. గన్నవరం, గుడివాడ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,కొడాలి నానిపై సోషల్ మీడియాలో సాయి కల్యాణి అసత్య ప్రచారం చేశారు.
చీకోటి ప్రవీణ్‌తో కొడాలి నాని, వంశీకి సంబంధాలు ఉన్నాయంటూ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి సాయి కల్యాణి పోస్టులు పెట్టారు. నిరాధార పోస్టింగ్‌లు పెట్టిన సాయి కల్యాణిపై చర్యలు తీసుకోవాలని హనుమాన్ జంక్షన్ పీఎస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రదీప్ ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment