
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ కరోనా బారినపడ్డారు. కొన్ని రోజులుగా గ్రామాల్లో పర్యటనలు, తర్వాత శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్లి వచ్చిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శనివారం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సూచనల మేరకు ఆయన 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు తెలిపాయి.