రుణమాఫీ సరికాదన్న పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం | high court serious over loan waiver petition | Sakshi
Sakshi News home page

రుణమాఫీ సరికాదన్న పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం

Oct 20 2014 11:46 AM | Updated on Nov 6 2018 8:28 PM

రుణమాఫీ సరికాదన్న పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం - Sakshi

రుణమాఫీ సరికాదన్న పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం

రైతు రుణమాఫీ సరికాదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హైదరాబాద్ : రైతు రుణమాఫీ సరికాదంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల లేకపోతే మనం కూడా లేమని న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. అప్పుల బాధతో పేద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న హైకోర్టు ...ఇటువంటి పిటిషన్లు దాఖలు చేయవద్దని పిటిషనర్ను హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సరికాదంటూ ఓ పిటిషనర్ హైకోర్టులో పిల్ వేసిన విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన హైకోర్టు రైతులు లేకపోతే మనం కూడా లేమని కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక దృక్కోణం మారాల్సిన అవసరం ఉందని, కోటీశ్వరులు, సామాన్యులు...సమాన స్థాయిలో పన్నులు చెల్లిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. రైతులు, కూలీలు, అట్టడుగు వర్గాల వారు రుణమాఫీ వల్ల ప్రయోజనం పొందుతారని...చాలామంది వినోదం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ...అలాంటిది పేద రైతులకు రుణమాఫీ అమలు చేస్తే తప్పేంటని న్యాయస్ధానం ప్రశ్నించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement