స్వైన్ఫ్లూ అరికట్టడంలో వ్యాక్సిన్తో ప్రయోజనం ఉండదని, పరిసరాల పరిశుభ్రతే ఉత్తమ మార్గమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్ అన్నారు. స్వైన్ఫ్లూ సంబంధిత ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ (104) ఏర్పాటు చేశామని నిమ్స్ డైరెక్టర్ చెప్పారు. స్వైన్ఫ్లూ వ్యాధిపై వైద్యులకు, సిబ్బందికి కౌన్సెలింగ్ ఇచ్చాం, అన్ని జిల్లా ఏరియా ఆస్పత్రులకు స్వైన్ఫ్లూ మందులు చేరాయని నరేంద్రనాథ్ తెలిపారు. స్వైన్ఫ్లూతో ఇప్పటివరకూ 20 మృతిచెందారని ఆయన తెలిపారు. 754 మందికి టెస్టులు జరపగా 249 మందికి స్వైన్ఫ్లూ ఉన్నట్లు తేలిందని నరేంద్రనాథ్ చెప్పారు.