మహబూబ్‌నగర్: స్వైన్‌ఫ్లూతో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరుకు చెందిన ఓ విద్యార్థి గురువారం మృతి చెందాడు. వివరాలు... కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన ఓ కుటుంబం మండల కేంద్రానికి వచ్చి స్థిరపడ్డారు. వారి కొడుకు ప్రణయ్‌పాల్(13) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురికావడంతో స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించగా స్వైన్‌ఫ్లూతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే అతని ఆరోగ్యపరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
(కొత్తూరు)
స్వైన్‌ఫ్లూతో విద్యార్థి మృతి
Published Thu, Feb 5 2015 6:11 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
Advertisement
Advertisement