
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో వేర్వేరు విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. కడప, ప్రకాశం జిల్లాల ఎస్పీలకు స్థానం చలనం కల్పిస్తూ వారి స్థానాల్లో రాముల్ దేశ్ శర్మ, కోయ ప్రవీణ్‌లను నియమించింది. గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్‌గా అభిషేక్ మహంతి, విజయవాడ సిటీ జాయింట్ కమిషనర్‌గా నవదీప్‌సింగ్, పర్సనల్ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్, విశాఖ గ్రేహౌండ్ గ్రూప్ కమాండర్‌గా సత్య ఏసుబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎన్నికల ముందు జిల్లా ఎస్పీలను ప్రభుత్వం వరుసగా మారుస్తూ వస్తుంది. మూడు నెలల్లోనే కడప ఎస్పీని బదిలీ చేయడం గమనార్హం.