
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో దేవాదాయ శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. సుమారు 15 మంది డిప్యూటీ కమీషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
విజయవాడ కనకదుర్గ ఆలయపు డీసీ ఎం రత్నరాజును డిప్యూటీ ఈవోగా నియమించారు. అలాగే మహానందీశ్వర స్వామి దేవస్థానం డీసీ శోభారాణికి.. ఈవోగా అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. పోస్టింగ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్న విజయ రాజును కర్నూల్ ఉరుకుండ నరసింహ ఎర్రన్న స్వామివారి దేవస్థానానికి డీసీ & ఈవోగా నియమించారు.
శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం డీసీ, ఈవో డీవీఎల్ రమేష్ బాబును కాకినాడ ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్‌గా నియమించారు. ఈ మేరకు మొత్తం 15 మందికి పోస్టింగ్‌లతో పాటు బదిలీలు జారీస్తూ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ సత్యనారాయణ(ఐఏఎస్) పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇదీ చదవండి: దుష్ప్రచారంలో దిట్ట