![Five IPS Officers Appointed As GHMC Election Observers - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/20/Five-IPS-Officers-Appointed.jpg.webp?itok=D5DLtBBN)
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శిఖా గోయల్ (ఈస్ట్ జోన్), అనిల్‌కుమార్ (వెస్ట్ జోన్), చౌహన్ (సౌత్ జోన్), అవినాష్ మొహంతి (నార్త్ జోన్), తరుణ్ జోషి (సెంట్రల్ జోన్)లను నియమించారు. (చదవండి: ప్రచారానికే పరిమితమైన జనసేన)
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.62.21 లక్షల నగదు సీజ్ చేశారు. 11 ఘటనలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 1,899 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని, ఇప్పటివరకు 2,393 మందిని బైండోవర్ చేశామని పేర్కొంది. 148 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: భారీ బందోబస్తు..)
Comments
Please login to add a commentAdd a comment