observers
-
ఏపీకి ముగ్గురు పరిశీలకుల నియామకం
సాక్షి, విజయవాడ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, స్పెషల్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌గా రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ నియమితులయ్యారు. వచ్చే వారం నుంచి ప్రత్యేక ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
ఎన్నికల అబ్జర్వర్లకు ఈసీ మార్గనిర్దేశం
ఢిల్లీ: ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయింది. రానున్న ఎన్నికల్లో పరిశీలకులు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొంది. ఎన్నికల పరిశీలకుల ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపింది. తమకు కేటాయించిన పార్లమెంటు పరిధిలోనే తిరగాలని అధికారులకు సూచించింది. వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపింది. చదవండి: ECI: 15 నాటికి ఇద్దరు కొత్త ఎలక్షన్ కమిషనర్లు! -
బీజేపీ సీఎంలను ఎంపిక చేసేది వీరే
న్యూఢిల్లీ: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించిన మూడు రాష్ట్రాల్లో సీఎంల ఎంపికకు బీజేపీ హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది. సీఎంల ఎంపిక కోసం ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ల కొత్త సీఎంల ఎంపిక కోసం పరిశీలకులను ఆయా రాష్ట్రాలకు పంపనుంది. రాజస్థాన్‌కు పరిశీలకులుగా వెళ్లనున్న వారిలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ముండా ఛత్తీస్‌గఢ్‌కు పరిశీలకులుగా వెళ్లనున్నారు. వీరితో కలిపి మూడు రాష్ట్రాలకు మొత్తం 9 మంది పరిశీలకులను బీజేపీ అధినాయకత్వం పంపనుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మూడు రాష్ట్రాల్లో గతంలో సీఎంలుగా పనిచేసిన వారిని కాకుండా కొత్త ముఖాలను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసే ఆలోచనలో పార్టీ హై కమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే అక్కడ సీఎంల ఎంపిక ఇంత ఆలస్యమవుతోందన్న ప్రచారం జరుగుతోంది. ఇదీచదవండి.. సహజీవనం ప్రమాదకరమైన జబ్బు -
ఏఐసీసీ ‘అసెంబ్లీ’ పరిశీలకుల నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 10 మంది క్లస్టర్ ఇన్‌చార్జ్‌లను, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకులను అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: ఎన్నికల పరిశీలకులతో ఎస్ఈసీ నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు పరిశీలకులను నియమించారు. ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఎఫ్ఎస్ అధికారి, నిర్వహణ పరిశీలకులుగా ఐఏఎస్ అధికారి బాధ్యతలు నిర్వహిస్తారు. ఎన్నికల కోడ్ నిర్వహణపై ఎస్ఈసీ నీలంసాహ్ని దిశానిర్దేశం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులకు ఎస్ఈసీ నీలంసాహ్ని సూచించారు. రాజకీయ పార్టీలతో కూడా శుక్రవారం ఉదయం ఎస్ఈసీ నీలం సాహ్ని సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో పార్టీల సహకారంపై చర్చించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నేతల అభిప్రాయాలను ఎస్ఈసీ తీసుకున్నారు. చదవండి: ఏపీ: రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ సమావేశం పరువు కోల్పోయేకంటే ఇదే బెటర్.. -
గ్రేటర్ ఎన్నికలు: పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులు నియమితులయ్యారు. ఈ మేరకు సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. శిఖా గోయల్ (ఈస్ట్ జోన్), అనిల్‌కుమార్ (వెస్ట్ జోన్), చౌహన్ (సౌత్ జోన్), అవినాష్ మొహంతి (నార్త్ జోన్), తరుణ్ జోషి (సెంట్రల్ జోన్)లను నియమించారు. (చదవండి: ప్రచారానికే పరిమితమైన జనసేన) గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.62.21 లక్షల నగదు సీజ్ చేశారు. 11 ఘటనలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. 1,899 మంది ఆయుధాలు డిపాజిట్ చేశారని, ఇప్పటివరకు 2,393 మందిని బైండోవర్ చేశామని పేర్కొంది. 148 మందికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: భారీ బందోబస్తు..) -
వైఎస్సార్సీపీ ఎన్నికల పరిశీలకులు వీరే..
హైదరాబాద్: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పరిశీలకులను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. వీరంతా కూడా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యేంతవరకు క్షేత్రస్థాయిలో పార్టీ విజయానికి కృషి చేస్తారని తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి కన్వీనర్ హోదాలో పార్టీ తరపున ఎన్నికలను పర్యవేక్షిస్తారని చెప్పారు. సంఖ్య పార్లమెంటు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుని పేరు 1 శ్రీకాకుళం తైనాల విజయ్ కుమార్ 2 విజయనగరం దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు 3 విశాఖపట్నం కంతేటి సత్యనారాయణ రాజు(ఎమ్మెల్సీ) 4 అరకు సీతంరాజు సుధాకర్ 5 అనకాపల్లి సీతంరాజు సుధాకర్ 6 రాజమండ్రి వంకా రవీంద్రనాథ్ 7 అమలాపురం కేవీసీహెచ్ మోహనరావు 8 కాకినాడ కొయ్యె మోషేను రాజు 9 ఏలూరు పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ) 10 నరసాపురం పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ) 11 మచిలీపట్నం లేళ్ల అప్పిరెడ్డి 12 విజయవాడ లేళ్ల అప్పి రెడ్డి 13 నరసరావుపేట బత్తుల బ్రహ్మానంద రెడ్డి 14 గుంటూరు మర్రి రాజశేఖర్ 15 బాపట్ల నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి 16 ఒంగోలు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి 17 నెల్లూరు ఎల్లశిరి గోపాల్ రెడ్డి 18 తిరుపతి ఆనం విజయకుమార్ రెడ్డి 19 చిత్తూరు ఆనం విజయ్ కుమార్ రెడ్డి 20 కడప ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 21 రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 22 కర్నూలు బి. గుర్నాథరెడ్డి 23 నంద్యాల కడపల శ్రీకాంత్ రెడ్డి 24 అనంతపురం ముండ్ల వెంకట శివారెడ్డి 25 హిందూపూర్ ముండ్ల వెంకట శివారెడ్డి -
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ పరిశీలకులు వీరే..
న్యూఢిల్లీ : రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండేలను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల పరిశీలకులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం నియమించారు. వీరిద్దరికీ ఆయా రాష్ట్రాల్లో సీఎల్పీ నాయకులను ఎన్నుకునే బాధ్యతను అప్పగించారు. నాయకులను ఎన్నుకోవడంతో అశోక్ గెహ్లాట్‌కు గుజరాత్లో కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్, సుశీల్ కుమార్ షిండేకు హిమాచల్ ప్రదేశ్‌లో మహారాష్ట్ర మాజీ మంత్రి బాలా సాహెబ్ తోరాట్ తోడ్పాటునందిస్తారు. ఇటీవల ఈ రెండు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన సంగతి తెలిసిందే. మేఘాలయాలో త్వరలో ఎన్నికలు జరుగనుండటంతో ఆ రాష్ట్ర బాధ్యతలను మహారాష్ట్ర ఎమ్మెల్యే యాషోమతి ఠాకూర్‌కు అప్పగించారు. అనిల్ థామస్, నెట్టా డిసౌజా, సుసాంతో బోర్గోయిన్‌అను డివిజనల్ కో-ఆర్డినేటర్లుగా నియమించారు. వీరు ఎన్నికలకు సంబంధించిన అంశాలలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సీపీ జోషి, సెక్రటరీ విజయ లక్ష్మీ సాదోలకు సహకరిస్తారు. -
‘మహా’ విజయమే లక్ష్యంగా..
- సంస్థాగత బలోపేతం - ప్రజాసమస్యలపై ఉద్యమబాట - వైఎస్సార్ కాంగ్రెస్ ప్రణాళిక సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సంస్థాగత సంస్కరణలు... వ్యవస్థాగత బలోపేతం... అన్ని వర్గాల ప్రజలతో మమేకం... ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట... పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు...అంతిమంగా మహా విశాఖ ఎన్నికల్లో విజయ బావుటా... ఇదీ ప్రణాళికగా వైఎస్సార్ కాంగ్రెస్ మహా విశాఖ ఎన్నికల దిశగా కార్యాచరణకు ఉపక్రమించింది. పార్టీ ఎన్నికల పరిశీలకులు వి.విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, తమ్మినేని సీతారాం, గొల్ల బాబూరావులు శని, ఆదివారాల్లో నగరంలోని నియోజకవర్గ సమీక్షా సమావేశాల్లో ఈ మేరకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సంస్థాగత బలోపేతం బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే అంశానికే విజయసాయిరెడ్డి, ఇతర పరిశీలకులు ప్రాధాన్యమిచ్చారు. ప్రత్యేక ప్రొఫార్మాల ద్వారా సమాచారం సేకరించి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్ణయించాలన్నది పార్టీ ఉద్దేశం. డివిజన్, బూత్ కమిటీల ద్వారా ఎక్కువ మంది కార్యకర్తలకు పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో స్థానం కల్పించాలని స్పష్టం చేశారు. మే నెలాఖరు నాటికి డివిజన్ కమిటీలను నియమించాలని స్పష్టం చేశారు. అనంతరం జూన్, జులైలో జీవీఎంసీ పరిధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపడతామని ఆయన ప్రకటించారు. ప్రజలతో మమేకం పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలని పార్టీ స్పష్టం చేసింది. ప్రతి కార్యకర్త కనీసం 60 మందితో ప్రత్యక్ష సంబంధాల ఏర్పచుకుని పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేయాలని ఆదేశించింది. విభిన్న భాషలు, ప్రాంతాల ప్రజల మనస్సు గెలుచుకునేలా పార్టీ నేతలు ఆయా సంఘాల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని విజయసాయిరెడ్డి ఉద్బోధించారు. డివిజన్లలో చిన్న చిన్న సమస్యలపై కూడా స్పందిస్తూ వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. ప్రజలతో మమేకమై వారి విశ్వాసాన్ని పొందాలని చెప్పారు. ఉద్యమబాట.. ఎన్నికల హామీల అమలులో టీడీపీ-బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక హోదా సాధనతోపాటు వ్యవసాయ, డ్వాక్రా రుణాల అమలులో వైఫల్యం, ఇతరత్రా అంశాలపై ఆందోళనకు పార్టీ సంసిద్ధమవుతోంది. విశాఖ నగరానికి సంబంధించి ఈ ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. మహిళా మహాసభ, విద్యార్థి మహాసభ తదితర భారీ ఆందోళన కార్యక్రమాలు నగరంలో నిర్వహిస్తామని ప్రకటించింది. తద్వారా విశాఖ కేంద్ర స్థానంగా పార్టీ ఉద్యమపథంలోకి సాగుతుందని ఈ రెండురోజుల సమావేశాల్లో స్పష్టం చేశారు. తదుపరి దశల్లో..: ప్రతి శని, ఆదివారాలు నగరంలో పర్యటించే విజయసాయిరెడ్డి, ఇతర ఎన్నికల పరిశీలకులు భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. నియోజకవర్గాలకు వెళ్లి అక్కడే కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. నియోజకవర్గ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే నగరంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో విశ్వాసం కలిగించడమే ధ్యేయంగా క్షేత్రస్థాయి పర్యటనలు ఉండాలని నిర్దేశించారు. ఆదివారం నిర్వహించిన సమావేశాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యేలు మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, సమన్వయకర్తలు వంశీకృష్ణ శ్రీనివాస్, అదీప్రాజ్లతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉషాకిరణ్‌లతోపాటు పార్టీ నేతలు సత్తి రామకృష్ణారెడ్డి, రవిరెడ్డి, ఆల్ఫా కృష్ణ, పక్కి దివాకర్, మూర్తి యాదవ్, డివిజన్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
జార్ఖండ్, కశ్మీర్లకు బీజేపీ పరిశీలకులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ జార్ఖండ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలకు బీజేపీ పరిశీలకులను పంపనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతలను ఎన్నుకోనున్నారు. జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లకు ఇద్దరు చొప్పున పరిశీలకులను పంపాలని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌కు అరుణ్ జైట్లీ, అరుణ్ సింగ్.. జార్ఖండ్‌కు జేపీ నద్దా వినయ్ సమస్త్రబుధేలను పరిశీలకులుగా నియమించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ జార్ఖండ్‌లో మెజార్టీ సాధించగా, జమ్మూకశ్మీర్‌లో రెండో అతిపెద్ద పార్టీగా కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. -
వైఎస్సార్సీపీ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల(అబ్జర్వర్ల)ను నియమించి నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి కడప మేయర్ సురేష్‌బాబును, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి. గురునాథరెడ్డిని నియమించారు. గతంలో గురునాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఆ సమయంలో అనంతపురం అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్‌గా నియమితులైన సురేష్‌బాబు ప్రస్తుతం కడప మేయర్. ఈయన వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వీరి నియామకంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
వైఎస్ఆర్ సీపీ ఎన్నికల పరిశీలకుల నియామకం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు జిల్లాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. మరికొందరు నాయకులకు పార్టీ కార్యవర్గంలో చోటు కల్పించారు. కడప జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డిని నియమించారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్డం ఎన్నికల పరిశీలకుడిగా షౌకత్ అలీ, ప్రకాశం జిల్లా ఎన్నికల కో ఆర్డినేటర్‌గా అబ్దుల్ ఖదీర్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడిగా జనక్ ప్రసాద్ వ్యవహరించనున్నారు. వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఓవీ రమణను నియమించారు. ఇక వైఎస్ఆర్ సీపీ క్రిస్టియన్, మైనార్టీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా జార్జి హెర్బర్ట్, సీమాంధ్ర జిల్లాల మైనార్టీ సెల్ కో ఆర్డినేటర్‌గా నజీర్ అహ్మద్, వైఎస్ఆర్ సీపీ సీఈసీ సభ్యుడిగా ఇక్బాల్ హుస్సేన్ ఫరూకిలను నియమించారు.