ఢిల్లీ: ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయింది. రానున్న ఎన్నికల్లో పరిశీలకులు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొంది.
ఎన్నికల పరిశీలకుల ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపింది. తమకు కేటాయించిన పార్లమెంటు పరిధిలోనే తిరగాలని అధికారులకు సూచించింది. వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment