న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక లోక్‌సభ ఎన్నికలు జరగనన్ను నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ పార్టీలు.. చిన్న పల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని ఆదేశించింది. పార్టీ అభ్యర్థికి సంబంధించిన పోస్టర్లు అంటించటం, కరపత్రాలు పంచటం, ఎన్నికల ర్యాలీల్లో చిన్న పిల్లల చేత నినాదాలు చేయించటం వంటి పనులకు చేయరాదని పేర్కొంది.
ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో చిన్న పిల్లలను భాగం చేస్తే సహించబోమని ఈసీ వెల్లడించింది. రాజకీయనేతలు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారంలో చిన్న పిల్లలను ఎత్తుకోవటం, ర్యాలీలో పాల్గొనే ప్రచార వాహనాలపై పిల్లలను ఎక్కించటం, వారికి పార్టీ జెండాలు ఇచ్చి ప్రచారం చేయించటం వంటి చర్యలకు పాల్పడకూడదని ఆదేశించింది.
పిల్లలు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఏదైనా రాజకీయ నేత, అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే మాత్రం తమ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు కాదని స్పష్టం చేసింది. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈసీ మార్గదర్శకాలను పాట్టించాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment