observers meeting
-
ఎన్నికల అబ్జర్వర్లకు ఈసీ మార్గనిర్దేశం
ఢిల్లీ: ఎన్నికల పరిశీలకులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అయింది. రానున్న ఎన్నికల్లో పరిశీలకులు వ్యవహరించాల్సిన తీరుపై మార్గనిర్దేశం చేసింది. ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొంది. ఎన్నికల పరిశీలకుల ఫోన్ నెంబర్లు, ఇమెయిల్ విస్తృతంగా ప్రచారం చేయాలని తెలిపింది. తమకు కేటాయించిన పార్లమెంటు పరిధిలోనే తిరగాలని అధికారులకు సూచించింది. వీలైనన్ని ఎక్కువ పోలింగ్ కేంద్రాలు సందర్శించి సమస్యలు పరిష్కరించాలని అధికారులకు తెలిపింది. చదవండి: ECI: 15 నాటికి ఇద్దరు కొత్త ఎలక్షన్ కమిషనర్లు! -
AP: వైఎస్సార్సీపీ నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని ఫార్చూన్ గ్రాండ్ హోటల్లో వైఎస్సార్సీపీ 175 నియోజకవర్గాల పరిశీలకులతో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాలలో పరిస్థితులు, దొంగ ఓట్ల తొలగింపు, సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై చర్చించారు. -
వైఎస్ఆర్ సీపీ 175 నియోజకవర్గాల పరిశీలకుల సమావేశం
-
గుజరాత్‌కు బీజేపీ కేంద్ర పరిశీలకులు.. సీఎం ఎంపికపై దృష్టి
న్యూఢిల్లీ/అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇక నూతన ముఖ్యమంత్రి ఎంపికపై దృష్టి సారించింది. తాజా ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు శనివారం ఉదయం గాంధీనగర్‌లో సమావేశమై, తమ పార్టీ శాసనసభా పక్ష(సీఎల్పీ) నేతను ఎన్నుకోనున్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేయడానికి కేంద్ర పరిశీలకులుగా సీనియర్ నేతలు రాజ్‌నాథ్ సింగ్, బీఎస్ యడియూరప్ప, అర్జున్ ముండాను బీజేపీ అధిష్టానం నియమించింది. సీఎల్పీ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్ కొనసాగుతారని బీజేపీ అధిష్టానం గతంలోనే ప్రకటించింది. భూపేంద్ర పటేల్ రాజీనామా గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్కు అందజేశారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా ఆయన మంత్రివర్గం సైతం రాజీనామా సమర్పించింది. బీజేపీ నిర్ణయం ప్రకారం.. భూపేంద్ర పటేల్ ఈ నెల 12వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఇదీ చదవండి: ఇంతకీ.. గెలిచింది ఎవరు! మూడు రాష్ట్రాల తీర్పు చెప్పిందేంటి? -
వైఎస్ఆర్ సీపీ జిల్లా పరిశీలకుల సమావేశం
హైదరాబాద్ : నగరంలోని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జిల్లా పరిశీలకుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఈ 29న రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు చర్చ జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పార్టీ చేపట్టనున్న బంద్ కు నేతలు, కార్యకర్తలు మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు.