![YSRCP President YS Jagan Mohan Reddy Appointed Election Observers For Lok Sabha Seats - Sakshi](/styles/webp/s3/article_images/2019/03/2/ysrcpp.jpg.webp?itok=2-tAlc31)
హైదరాబాద్: త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పరిశీలకులను వైఎస్సార్‌సీపీ నియమించింది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. వీరంతా కూడా ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యేంతవరకు క్షేత్రస్థాయిలో పార్టీ విజయానికి కృషి చేస్తారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కేంద్ర కార్యాలయం నుంచి కన్వీనర్ హోదాలో పార్టీ తరపున ఎన్నికలను పర్యవేక్షిస్తారని చెప్పారు.
సంఖ్య | పార్లమెంటు నియోజకవర్గం | ఎన్నికల పరిశీలకుని పేరు |
1 | శ్రీకాకుళం | తైనాల విజయ్ కుమార్ |
2 | విజయనగరం | దాట్ల వెంకట సూర్యనారాయణ రాజు |
3 | విశాఖపట్నం | కంతేటి సత్యనారాయణ రాజు(ఎమ్మెల్సీ) |
4 | అరకు | సీతంరాజు సుధాకర్ |
5 | అనకాపల్లి | సీతంరాజు సుధాకర్ |
6 | రాజమండ్రి | వంకా రవీంద్రనాథ్ |
7 | అమలాపురం | కేవీసీహెచ్ మోహనరావు |
8 | కాకినాడ | కొయ్యె మోషేను రాజు |
9 | ఏలూరు | పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ) |
10 | నరసాపురం | పిల్లి సుభాష్ చంద్రబోస్(ఎమ్మెల్సీ) |
11 | మచిలీపట్నం | లేళ్ల అప్పిరెడ్డి |
12 | విజయవాడ | లేళ్ల అప్పి రెడ్డి |
13 | నరసరావుపేట | బత్తుల బ్రహ్మానంద రెడ్డి |
14 | గుంటూరు | మర్రి రాజశేఖర్ |
15 | బాపట్ల | నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి |
16 | ఒంగోలు | నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి |
17 | నెల్లూరు | ఎల్లశిరి గోపాల్ రెడ్డి |
18 | తిరుపతి | ఆనం విజయకుమార్ రెడ్డి |
19 | చిత్తూరు | ఆనం విజయ్ కుమార్ రెడ్డి |
20 | కడప | ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి |
21 | రాజంపేట | ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి |
22 | కర్నూలు | బి. గుర్‌నాథరెడ్డి |
23 | నంద్యాల | కడపల శ్రీకాంత్ రెడ్డి |
24 | అనంతపురం | ముండ్ల వెంకట శివారెడ్డి |
25 | హిందూపూర్ | ముండ్ల వెంకట శివారెడ్డి |
Comments
Please login to add a commentAdd a comment