జిల్లాలోని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల(అబ్జర్వర్ల)ను నియమించి నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి కడప మేయర్ సురేష్‌బాబును, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి. గురునాథరెడ్డిని నియమించారు. గతంలో గురునాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. ఆ సమయంలో అనంతపురం అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్‌గా నియమితులైన సురేష్‌బాబు ప్రస్తుతం కడప మేయర్. ఈయన వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వీరి నియామకంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.