Gurunatha Reddy
-
రాజకీయంగా అణగదొక్కే కుట్ర ఇది
వైఎస్సార్సీపీ నేత గురునాథరెడ్డి విమర్శ హైదరాబాద్: వైఎస్సార్సీపీ నేతను దారుణంగా హతమార్చి, మళ్లీ అదే పార్టీకి చెందిన వారినే పోలీసులు అరెస్టు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని, తమ పార్టీని అణగదొక్కడానికే టీడీపీ ప్రభుత్వం ఇలా చేస్తోందని మాజీ ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైఎస్సార్సీపీ నేత శివప్రసాదరెడ్డి హత్య తరువాత చోటు చేసుకున్న సంఘటనలకు బాధ్యునిగా చేస్తూ గురునాథరెడ్డిపై కేసు నమోదు చేసిన ఆ జిల్లా పోలీసులు ఆదివారం 2 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. దీనికి ముందు గురునాథరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనలతో తనకేమీ సంబంధం లేకపోయినా కేసు నమోదు చేశారని, తాను స్వచ్ఛందంగా అరెస్టు అవుతున్నానని వెల్లడించారు. ఆ రోజున తమ పార్టీ నేత ప్రసాదరెడ్డి హత్య జరిగిన అరగంటకు తాను రాప్తాడు ఎమ్మార్వో కార్యాలయానికి చేరుకున్నానని, అక్కడ ఉన్నంత సేపూ ఎస్పీ, డీఎస్పీ, ఇతర పోలీసు అధికారుల మధ్యలోనే ఉన్నానని, ఈ సందర్భంలో ఎవరి వద్దా తాను ఒక్క మాటా మాట్లాడలేదన్నారు. పోలీసులందరూ ఉండగానే చోటు చేసుకున్న విధ్వంసకాండకు తమను బాధ్యులను చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. అధికారంలో లేని వైఎస్సార్సీపీపై కక్ష సాధింపులకు దిగడం తప్ప మరొకటి కానే కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసాదరెడ్డిని ప్రభుత్వ కార్యాలయంలోకి పిలిపించి చంపడమే కాక పోలీసులందరి సమక్షంలో జరిగిన విధ్వంసకాండకు తిరిగి తమపైనే అభియోగం మోపడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.తమ కుటుంబం ఎప్పుడూ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించలేదని, గొడవలకు దూరంగా ఉంటామని, గన్మెన్లను కూడా తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై సోమవారం గవర్నర్‌ను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కలవనున్న నేపథ్యంలో ముందు రోజు అరెస్టు చేయడం టీడీపీ కుట్రలో భాగమని గురునాథరెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గురునాథరెడ్డిని అనంతపురం తరలిస్తూ మార్గమధ్యలో ప్యాపిలి పోలీస్‌స్టేషన్‌లో కొద్దిసేపు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ హత్యలకు పాల్పడిన వారిని వదిలేసి ఆందోళనలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్ సీపీ నాయకులను అరెస్టుచేయడం బాధాకరమన్నారు. సమాధానం చెప్పని డీఎస్పీ.. ఏ అభియోగాలపై అరెస్టు చేస్తున్నారని మీడియా ప్రశ్నించినపుడు డీఎస్పీ సమాధానం ఇవ్వకుండా విసురుగా గురునాథరెడ్డిని వాహనంలో ఎక్కించుకుని తీసుకు వెళ్లారు. అరెస్టు చేస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ తెలంగాణ విభాగం ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్, పార్టీ ఏపీ ఫిర్యాదుల విభాగం ఛైర్మన్ ఎ.నాగనారాయణమూర్తి ఉన్నారు. పోలీసుల వైఖరిని వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్సీపీ నాయకుడిని చంపింది చాలక మళ్లీ ఆ పార్టీ నేతలనే అరెస్టు చేయడం ఏమిటని శివకుమార్ ప్రశ్నించారు. మండల రెవెన్యూ మెజిస్ట్రేట్ అయిన ఎమ్మార్వో కార్యాలయంలోనే అందరూ చూస్తుండగా ప్రసాదరెడ్డిని హతమార్చడం చూస్తే ప్రభుత్వ పాలన ఏ దిశగా సాగుతోందో ఇట్టే అర్థం అవుతోందని నారాయణమూర్తి విమర్శించారు. అక్రమ అరెస్టులపై నిరసన నేడు అనంతపురం నగర బంద్‌కు పిలుపు అనంతపురం: వైఎస్సార్సీపీ నాయకుడు భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి హత్యానంతరం జరిగిన విధ్వంసానికి సంబంధించి వైఎస్సార్సీసీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ పార్టీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి అరెస్టును నేతలు ఖండించారు. అరెస్టులకు నిరనసగా సోమవారం అనంతపురం నగర బంద్‌కు పిలుపునిచ్చారు. కాగా పార్టీ నేతల అరెస్టు నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు నగరంలో ఆదివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాయి. గురునాథరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డిలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రశేఖరరెడ్డిని ఆదివారం రాత్రి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. -
వైఎస్సార్సీపీ పరిశీలకుల నియామకం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: జిల్లాలోని కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకుల(అబ్జర్వర్ల)ను నియమించి నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ప్రకటించింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి కడప మేయర్ సురేష్‌బాబును, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి అనంతపురం మాజీ ఎమ్మెల్యే బి. గురునాథరెడ్డిని నియమించారు. గతంలో గురునాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఆ సమయంలో అనంతపురం అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. నంద్యాల పార్లమెంట్ అబ్జర్వర్‌గా నియమితులైన సురేష్‌బాబు ప్రస్తుతం కడప మేయర్. ఈయన వైఎస్సార్ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంతకు ముందు జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉంది. వీరి నియామకంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. -
పేదల సంక్షేమం వైఎస్సార్సీపీ లక్ష్యం
ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం వైఎస్సార్సీపీ లక్ష్యమని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అన్నారు. నగరంలోని నీరుగంటి వీధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీలు షఫీమహ్మద్, సమబేగం, సతాజ్ బేగం, అమానుల్లా, మస్తాన్‌వలి, షాషావలి, సమీర్‌ఖాన్, సఖిల్ అహ్మద్ తదితరులు గురువారం వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు. బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపారని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన మరణానంతరం రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరాయన్నారు. ఈ రెండు పార్టీలే రాష్ట్ర విభ జనకు ప్రధాన కారణమన్నారు. టీడీపీ మొదటి నుంచి మైనార్టీలను మోసం చేస్తోందన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో సమర్థ నాయకుడైన జగన్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తన తండ్రిలాగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తారన్నారు. వైఎస్సార్సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమన్నారు. పార్టీలో చేరిన షఫీమహ్మద్ మాట్లాడుతూ మైనార్టీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు. సీపీఐ నుంచి 200 మంది వైఎస్సార్సీపీలోకి బిందెల కాలనీలో సీపీఐ నుంచి 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చేరిన వారిలో నారాయణస్వామి, యల్లప్ప, ఆదెప్ప, సుంకన్న, పెద్దమారెన్న, ఆంజినేయులు, కుళ్లాయప్ప, వీరయ్య, ఎం స్వామి, చిన్నమారెన్న, సీ మల్లిక, కుళ్లాయప్ప, శంకరయ్య, మిద్దె లింగరాజు, బీబీపాతిమా, మారెక్క, సరస్వతి తదితరులు ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే గురునాథరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. -
గుర్నాథ్ రెడ్డిని అడ్డుకున్న అనంతపురం పోలీసులు!
అనంతపురంలో గుర్నాథ్రెడ్డి ర్యాలీని పోలీసులు అడ్డుకోవడం వివాదస్పదంగా మారింది. ర్యాలీని అడ్డుకోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఎస్పీ బంగళాకు వెళ్లేందుకు అనుమతి నిరాకరించడంపై గుర్నాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులతో ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి , కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. జిల్లాలో పోలీసు తీరుకు నిరసనగా తెలుగు తల్లి విగ్రహం వద్ద ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డి బైఠాయించి ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. -
వైఎస్సార్ సీపీ నేతల అరెస్టు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 10వ తేదీ వైఎస్సార్ సీపీ నేతలు శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, టీడీపీ నేతలు, వారి వర్గీయులు దాడి చేసిన ఘటనలో 47 మంది వైఎస్సార్ సీపీ నాయకులను పోలీసులు కేసు పెట్టారు. వీరిలో 37 మందిని సోమవారం అరెస్టు చేశారు. అప్పట్లో టీడీపీ వారిని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రతిఘటించే యత్నం చేశారు. ఈ క్రమంలో పరస్పరం మాటల తూటాలు పేలాయి. టీడీపీ నేతలు తొడలు చరిచి వైఎస్సార్ సీపీ నేతలను హతమారుస్తామనే స్థాయిలో బెదిరింపులకు దిగారు. అయితే వైఎస్సార్ సీపీ నాయకులపై దాడి చేసిన మూకలోని టీడీపీ నేతలతో పాటు కార్యకర్తలు కేవలం 22 మందిని మాత్రమే కేసుల్లో ఉంచి అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మినహా ఆయన సోదరులు ఎర్రిస్వామిరెడ్డి, యోగేశ్వరరెడ్డి, ఆకుల రాగువేంద్ర, జిలాన్‌బాషా, సుధీర్‌రెడ్డి, రాయపరెడ్డి, మహేంద్రరెడ్డి, గోపాల్‌రెడ్డి, నదీమ్, మారుతీనాయుడు, ప్రభాకర్‌రెడ్డి, గోపాల్, షెక్షా, సోమశేఖర్‌రెడ్డి, లక్ష్మమ్మ, శ్రీదేవి, దేవి, ఆజాద్, నాగార్జున రెడ్డి, జలందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డితో పాటు 47 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడం, గుంపులుగా ఉండడం, బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ మాధవ్, ఎస్ఐ జాకీర్ హుస్సేన్ వెల్లడించారు. 22 మంది టీడీపీ వారి అరెస్ట్ టీడీపీ నేతల్లో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, పెనుకొండ ఎమ్మెల్యే బీసీ పార్థసారథి, అనంతపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మహాలక్ష్మీ శ్రీనివాసులు, స్వామిదాస్, నారాయణస్వామి, పీవీ వెంకటరాముడు, బుగ్గయ్య చౌదరి, పరచూరి రమణ , నదీమ్, గోపాల్, ప్రకాష్, ఆదినారాయణ, బాలాజీ వెంకటస్వామి, వెంకటప్పతో సహా 22 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా గంటల తరబడి వైద్య పరీక్షల పేరుతో వేధించారని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. -
ఉద్యమాల్లో ఏపీటీఎఫ్ది ప్రత్యేక పాత్ర
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల సమస్యల సాధనకై చేస్తున్న పోరాటాల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్-1938) ప్రత్యేక పాత్ర పోషిస్తోందని అనంతపురం శాసనసభ్యుడు గురునాథరెడ్డి అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2014 కేలండరు, డైరీని ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. విద్య, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు బీ. జయరాంనాయక్, కరణం హరికృష్ణ మాట్లాడుతూ పీఈటీ, భాషా పండితుల పోస్టులు అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్కార్డుల్లోని లోపాలు సవరిస్తూ వెంటనే జీఓ ఇవ్వాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమ కారణంగా ఈ ఏడాది విద్యా సంస్థలు సరిగా పని చేయలేదన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఎప్పుడు పిలిచినా స్పందిస్తారని గుర్తు చేశారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో వాణిని వినిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు సాయిబాబా, అదనపు ప్రధానకార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేష్‌బాబు, రాంభూపాల్‌రెడ్డి, మంజునాథ్, కార్యదర్శులు జోసెఫ్, సత్యప్రసాద్, శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు వెంకటరాముడు నాయక్, రవిశంకర్, బాలసుబ్రమణ్యం, జితేంద్ర, నాగప్ప, నూర్‌మహ్మద్, హెరాల్డ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి
పులివెందుల, న్యూస్‌లైన్: ఎక్కడ చూసినా సమస్యలు తాండవిస్తున్నాయి. ఉద్యోగాలు.. ఉపాధి కోసం చాలామంది అవస్థలు పడుతున్నారు. నాలుగు నెలలు ఓపిక పట్టండి.. అన్ని మంచి రోజులు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అనంతపురం జిల్లా గోరంట్ల, నెల్లూరుకు చెందిన ముస్లిం సోదరులతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ కొంత కాలం ఓపిక పడితే.. కచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. ప్రభుత్వంలోకి వస్తే ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరించడానికి వీలవుతుందన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే ముస్లింల అభివృద్ధికి పెద్ద పీట దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్ద పీట వేశారని వైఎస్ జగన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ఆర్కే దక్కుతుందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం వైఎస్ఆర్ అనుక్షణం పరితపించారన్నారు. ఈ సందర్భంగా నెల్లూరుకు చెందిన ముస్లిం మైనార్టీ నాయకులు ఇనయతుల్లా ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనండి : కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమంలో పాల్గొనాల వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ చేపట్టే ప్రతి ఆందోళన కాార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన కోరారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంటు చేయండి : ఆర్టీపీపీతోపాటు ఏపీ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఆర్టీపీపీతోపాటు పలు సంస్థలలో పనిచేస్తున్న సుమారు 100మందికిపైగా కాంట్రాక్టు కార్మికులు వచ్చి వైఎస్ జగన్‌ను కలవడంతోపాటు వినతి పత్రం సమర్పించారు. ఒక్క ఆర్టీపీపీలోనే 1280మంది కాంట్రాక్టు కార్మికులు అంకితభావంతో పనిచేస్తున్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని వైఎస్ జగన్ సూచించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు కార్మికులు వైఎస్ జగన్‌కు తమ గోడును వెల్లబోసుకున్నారు. ఒకనాడు నష్టాలలో ఇబ్బందులు పడుతున్న ఏపీ జెన్కో నేడు లాభాలలో పయనించడానికి కాంట్రాక్టు కార్మికుల కృషి ఎంతైనా ఉందన్నారు. జగన్‌కు వినతి పత్రం అందించిన వారిలో చైర్మన్ మూలే పుల్లారెడ్డి, కో-చైర్మన్లు రామకృష్ణారెడ్డి, మహేశ్వరరెడ్డి, కన్వీనర్ సుబ్బిరెడ్డి, కో-కన్వీనర్ సూరిబాబు, గంగయ్య, నాగార్జునరెడ్డి, సుబ్బరాయుడు, రమణమూర్తి, కోశాధికారి నారాయణమూర్తి తదితరులు ఉన్నారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో కాసేపు : వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ కాసేపు గడిపారు. పులివెందులలోని వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లిన జగన్ అక్కడ వైఎస్ భాస్కర్‌రెడ్డి, యువజన విభాగపు నాయకులు వైఎస్ అవినాష్‌రెడ్డిలతో మాట్లాడారు. జగన్‌ను కలిసిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు : పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్ సీపీ కీలక నేతలు వచ్చి చర్చించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షులు కె.సురేష్‌బాబు, సీజీసీ సభ్యులు, మాజీ మేయర్ రవీంద్రనాథరెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పురుషోత్తమరెడ్డి, కడప నియోజకవర్గ నాయకులు అంజాద్ బాషా, కాల్టెక్స్ హఫీజుల్లా, సునీల్‌కుమార్, అధికార ప్రతినిధులు చవ్వా సుదర్శన్‌రెడ్డి, నిమ్మకాయల సుధాకర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడ్డి, కర్నూలు జిల్లా బనగానపల్లె వైఎస్ఆర్ సీపీ నాయకులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, చక్రాయపేట మండల ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, యల్లనూరు మండల నాయకులు పెద్దారెడ్డి, పులివెందుల నియోజకవర్గ మండలాల కన్వీనర్లు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వై.వి.మల్లికార్జునరెడ్డి, పి.వి.సుబ్బారెడ్డి, కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, చంద్ర ఓబుళరెడ్డి, బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వేముల మండల నాయకులు నాగేళ్ల సాంబశివారెడ్డి, పరిశీలకులు బలరామిరెడ్డి, రామమునిరెడ్డి, యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు మరకా శివకృష్ణారెడ్డి, యూత్ కన్వీనర్ శివశంకర్‌రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బోనాల వెంకట్రామిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగిరెడ్డి, నీలకంఠారెడ్డి, సోమశేఖరరెడ్డిలతోపాటు పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్‌ను కలిశారు. జగన్‌తో ఎమ్మెల్యే గురున్నాథరెడ్డి, సీజీసీ సభ్యుల చర్చలు : పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో కడప ఎంపీ వైఎస్ జగన్‌తో అనంతపురం ఎమ్మెల్యే గురున్నాథరెడ్డి, సీజీసీ సభ్యులు పైలా నరసింహయ్య, గిర్రాజు నగేష్ తదితరులు భేటీ అయ్యారు. అనంతపురానికి చెందిన రాజకీయాలతోపాటు అనేక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. -
శతాబ్దంలోనే అతి పెద్ద జోక్
పయ్యావుల విమర్శపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ధ్వజం విభజన విషయం లో చంద్రబాబు నాయుడు వైఖరితో రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, బి.గురునాథరెడ్డి అన్నారు. అలాంటి పార్టీ ఆలోచనలను వైఎస్సార్ సీపీ కాపీ కొడుతోందంటూ పయ్యావుల కేశవ్ విమర్శించడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్‌గా వారు శని వారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభివర్ణించారు. టీడీపీకి చెందిన తెలంగాణ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో, అందుకు పూర్తి విరుద్ధంగా ఆ పార్టీ సీమాంధ్ర ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని వారన్నారు. తెలంగాణ ప్రకటన తరువాత సీమాంధ్రకు ప్యాకేజీ కోరిన బాబు, వైఎస్సార్ సీపీ సమైక్యవాదాన్ని చూసి ఇపుడు సమన్యాయం అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. టీడీపీ ఓవైపు తెలంగాణ వాదం, మరోవైపు సమైక్యవాదంతో రెండు కాపురాలు చేస్తోందని, దీనిని సీత, సావిత్రి కాపురం అనాలో, లేక చింతామణి కాపురం అనాలో పయ్యావుల వివరించాలన్నారు. బాబును మించిన రాజకీయ చింతామణి ఎవరు?ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో ఎన్టీఆర్ పంచన చేరి, గుంట నక్కలా కాచుకుని అదను చూసి ఆయనను దెబ్బకొట్టి పార్టీనే లాగేసుకున్న వైనాన్ని ఎవరు మర్చిపోగలరు? అని ప్రశ్నించారు. బాబు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు భరించలేక ఒక దశలో వైఎస్సార్సీపీలో చేరాలని రాయబారాలు నడపడం అబద్ధమా? ఈ విషయం బయటకు పొక్కేసరికి, మీడియా ముందు వలవలా ఏడ్చేసిన పయ్యావుల ఇపుడు తమ నాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడుతున్నారని చెప్పారు.