అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల సమస్యల సాధనకై చేస్తున్న పోరాటాల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్-1938) ప్రత్యేక పాత్ర పోషిస్తోందని అనంతపురం శాసనసభ్యుడు గురునాథరెడ్డి అన్నారు. ఆ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2014 కేలండరు, డైరీని ఎమ్మెల్యే మంగళవారం సాయంత్రం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
విద్య, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంఘం చేస్తున్న కృషిని అభినందించారు. ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష , కార్యదర్శులు బీ. జయరాంనాయక్, కరణం హరికృష్ణ మాట్లాడుతూ పీఈటీ, భాషా పండితుల పోస్టులు అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్‌కార్డుల్లోని లోపాలు సవరిస్తూ వెంటనే జీఓ ఇవ్వాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమ కారణంగా ఈ ఏడాది విద్యా సంస్థలు సరిగా పని చేయలేదన్నారు. పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఎప్పుడు పిలిచినా స్పందిస్తారని గుర్తు చేశారు.
దీర్ఘకాలంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో వాణిని వినిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు సాయిబాబా, అదనపు ప్రధానకార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేష్‌బాబు, రాంభూపాల్‌రెడ్డి, మంజునాథ్, కార్యదర్శులు జోసెఫ్, సత్యప్రసాద్, శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిలర్లు వెంకటరాముడు నాయక్, రవిశంకర్, బాలసుబ్రమణ్యం, జితేంద్ర, నాగప్ప, నూర్‌మహ్మద్, హెరాల్డ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.