దేశాభివృద్ధిలో విద్యార్థుల మేథోసంపత్తి కీలకం | abvp ap, telangana incharge in anantapur | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో విద్యార్థుల మేథోసంపత్తి కీలకం

Published Mon, Dec 12 2016 12:01 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

abvp ap, telangana incharge in anantapur

ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్‌ రామ్మోహన్ 
అనంతపురం : దేశాభివృద్ధిలో వి ద్యార్థుల మేధోసంపత్తి కీలక మని ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్‌ రామ్మోహన్ అన్నారు. రెండు రోజులు నిర్వహించే విశ్వవిద్యాలయ విద్యార్థుల మహాసభలు స్థానిక కమ్మ భవ¯న్లో  ఆదివారం  ప్రారంభమయ్యాయి. ము ఖ్య అతిథులుగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రామ్మోహ¯ŒS, భారత్‌ వికాస్‌ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరు  రమేష్, బీజీవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధ¯ŒSరెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలరెడ్డి, సీఆర్‌ఐటీ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌Ü్టట్యూట్‌ కరస్పాండెంట్‌ చిరంజీవిరెడ్డి  హాజరయ్యారు.

 వారు  మాట్లాడుతూ  విశ్వవిద్యాలయాలు నేడు అరాచక, విద్రోహ శక్తులను, సంఘ వ్యతిరేక శక్తులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆందోâýæన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో  విద్యార్థులకు కనీస సౌకర్యాలు  లేవని మండిపడ్డారు. యూనివర్శిటీల్లోని నిధులను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 3500 మందికి పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.  వీటి భర్తీకి  ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడంలేదన్నారు.

పరిశోధనలకు నెలవు కావాల్సిన యూనివర్శిటీలు ఆ దిశగా చొరవ చూపడం లేదన్నారు. మహాసభలలో రాయలసీమ జోనల్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కరుణాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగార్జున, జిల్లా కన్వీనర్‌ కష్ణ, ఎస్కేయూ ఇ¯ŒSచార్జ్‌ హరికష్ణలతో పాటు 18 యూనివర్శిటీల నుంచి 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement