telangana incharge
-
'ఫోన్ 10 సార్లు ఎందుకు మార్చారు కవిత?: వాళ్ల ఇంటికి ఎందుకెళ్లారు?'
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్లో తనపై వచ్చిన ఆరోపణలన్నీ బోగస్, అసత్యాలేనన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ స్పందించారు. ఆ స్కాంతో ఎలాంటి సంబంధం లేకపోతే.. ఆ కుంభకోణంలో ఉన్న నిందితులు కవిత ఇంటికి ఎందుకు వచ్చారో ఆమె ప్రజలకు స్పష్టత ఇవ్వాలన్నారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో ఛుగ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్, ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో నిందితులతో కవిత జరిపిన చర్చల వివరాలను ఈడీ ఎందుకు చార్జిషీట్లో ప్రస్తావించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలాంటి సంబంధం లేకపోతే కవిత పేరును అన్నిసార్లు ఎందుకు ఈడీ పొందుపరిచిందని ప్రశ్నించారు. ఫోన్‌ను ఎందుకు మార్చారు? ‘కవిత తన ఫోన్‌ను పదిసార్లు ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంత అవసరం ఏముంది.? సమీర్ మహేంద్రుతో కవితకు ఏం సంబంధం? ఇద్దరి మధ్య పరిచయం ఎక్కడిది?’అని ఛుగ్ నిలదీశారు. ఫోన్లు మాటిమాటికీ మార్చాల్సినంత మాఫియా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తెలంగాణ, పంజాబ్ లిక్కర్ పాలసీలపైనా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ఆ చెక్కుల వెనుక లిక్కర్ కుంభకోణం? పంజాబ్ రైతులకు కేసీఆర్ పంపిణీ చేసిన చెక్కుల వ్యవహారం వెనుక కూడా లిక్కర్ కుంభకోణం ఉందని తరుణ్ ఛుగ్ ఆరోపించారు. లిక్కర్ వ్యవహారంలో భాగంగానే ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్లను కేసీఆర్ కలిశారని అన్నారు. చదవండి: నిధుల ‘పంచాయితీ’.. బిల్లులు పెండింగ్‌తో సర్పంచ్ల గగ్గోలు.. -
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా సునీల్ బన్సల్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. గత ఎనిమిదిన్నరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి నాలుగు భారీ విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించిన సునీల్ బన్సల్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితుల య్యారు. అదే సమయంలో ఆయనకు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అప్పగించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బన్సల్ ఇప్పటివరకు బీజేపీ యూపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మంచి వ్యూహకర్తగా గుర్తింపు ప్రస్తుత కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో 2014 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు యూపీలో అప్నాదళ్‌తో కలిసి బీజేపీ 73 స్థానాలు గెలుపొందడంలో బన్సల్ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 14 ఏళ్ల తర్వాత బీజేపీ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ పొత్తు పెట్టుకున్నప్పటికీ యూపీలో బీజేపీ 65 సీట్లు రాబట్టుకోగలిగింది. తాజాగా 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 35 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టి మళ్లీ అధికారంలోకి రావడంతో సునీల్ బన్సల్ మంచి వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో.. వచ్చే ఏడాది తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇప్పటికే బీజేపీలోకి చేరికలు ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌కు ఎక్కువ బాధ్యతలు ఉండటంతో, చేరికలు ఇతర వ్యవహారాల సమన్వయానికి వీలుగా ఆయన స్థానంలో బన్సల్‌ను నియమించినట్లు బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. చదవండి: మునుగోడుపై 16 నుంచి స్పెషల్ ఫోకస్ -
పీసీసీ చీఫ్ మార్పు గురించి చెప్పలేను
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. దుబ్బాక ఉప ఎన్నిక, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పీసీసీ మార్పు వంటి అంశాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ.. ‘మా లక్ష్యం మిషన్-2023. మోదీ, కేసీఆర్ విధానాలపై పోరాడతాం. సిస్టమేటిక్ టీం వర్క్‌తో ముందుకు వెళతాం. తెలంగాణలో సమర్థులైన నాయకులు ఉన్నారు. పార్టీ నిర్ణయాలను ప్రతి నాయకుడు పాటించాలి. దేశంలోని ప్రతి గవర్నర్ మేము ఇచ్చిన వినతి పత్రాలు తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ మాత్రం వినతి పత్రం తెలుసుకోలేదు. గవర్నర్ కార్యాలయంలో అపాయింట్మెంట్ కోరాం.. ఇవ్వలేదు. కోవిడ్ ఒక్క తెలంగాణలోనే లేదు. వినతిపత్రం మెయిల్ చేయమని చెప్పారు. కార్యకర్తల, నేతల మధ్య ఐక్యత కీలకం’ అన్నారు. (చదవండి: 2023లో అధికారమే లక్ష్యం ) దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్, బీజేపీ ప్రచారం మొదలు పెట్టాయి. దీనిపై మాణిక్యం ఠాగూర్ స్పందిస్తూ.. కుందేలు- తాబేలు కథలో.. చివరకు ఏం జరిగింది అనేది అందరికి తెలుసు అన్నారు. తెలంగాణ నేతలను ఇండియన్ క్రికెట్ టీంతో పొల్చారు. కాంగ్రెస్‌లో గ్రూపులపై స్పందిస్తూ.. ఐక్యతతో 2023 లో గెలుస్తామని స్పష్టం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో కోదండరామ్‌కి మద్దతుపై కోర్ కమిటిలో చర్చించాం అన్నారు. దాని సూచన మేరకు తుది నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఇక పీసీసీ చీఫ్ మార్పు గురించి తానేమి చెప్పలేనన్నారు మాణిక్యం ఠాగూర్. -
దేశాభివృద్ధిలో విద్యార్థుల మేథోసంపత్తి కీలకం
ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్ రామ్మోహన్ అనంతపురం : దేశాభివృద్ధిలో వి ద్యార్థుల మేధోసంపత్తి కీలక మని ఏబీవీపీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఇన్చార్జ్ రామ్మోహన్ అన్నారు. రెండు రోజులు నిర్వహించే విశ్వవిద్యాలయ విద్యార్థుల మహాసభలు స్థానిక కమ్మ భవ¯న్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ము ఖ్య అతిథులుగా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, రామ్మోహ¯ŒS, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరు రమేష్, బీజీవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధ¯ŒSరెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు తిరుమలరెడ్డి, సీఆర్ఐటీ గ్రూప్ ఆఫ్ ఇన్Ü్టట్యూట్ కరస్పాండెంట్ చిరంజీవిరెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు నేడు అరాచక, విద్రోహ శక్తులను, సంఘ వ్యతిరేక శక్తులను తయారు చేసే కేంద్రాలుగా మారాయని ఆందోâýæన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. యూనివర్శిటీల్లోని నిధులను పక్కదోవ పట్టించడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 3500 మందికి పైగా అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. వీటి భర్తీకి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడంలేదన్నారు. పరిశోధనలకు నెలవు కావాల్సిన యూనివర్శిటీలు ఆ దిశగా చొరవ చూపడం లేదన్నారు. మహాసభలలో రాయలసీమ జోనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కరుణాకర్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగార్జున, జిల్లా కన్వీనర్ కష్ణ, ఎస్కేయూ ఇ¯ŒSచార్జ్ హరికష్ణలతో పాటు 18 యూనివర్శిటీల నుంచి 360 మంది విద్యార్థులు పాల్గొన్నారు.