అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆం«ధ్ర సీనియర్ క్రికెట్ వన్డే జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు షోయబ్ మహమ్మద్ ఖాన్, డీ బీ ప్రశాంత్‌కుమార్ ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. డీ బీ ప్రశాంత్‌కుమార్ 2016-17 సీజన్‌లో 695 పరుగులతో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేసి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
షోయబ్ మహమ్మద్ ఖాన్ ఇటీవల చెన్నైలో టీ-20 అంతర్రాష్ట్ర పోటీల్లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో వికెట్లను పడగొట్టడంతో జట్టులో తన స్థానాన్ని నిలుపుకొన్నాడు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి చెన్నైలో జరిగే బీసీసీఐ విజయ్ హరారే ట్రోఫీలో పాల్గొంటారన్నారు. వీరి ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, బీఆర్ ప్రసన్న హర్షంవ్యక్తం చేశారు.
వన్డే జట్టులో జిల్లా క్రీడాకారులు
Published Wed, Feb 22 2017 10:36 PM | Last Updated on Sat, Aug 18 2018 4:23 PM
Advertisement
Advertisement