ముస్లింలను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, నాయకుడు బి.ఎర్రిస్వామిరెడ్డి
ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి
అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం వైఎస్సార్‌సీపీ లక్ష్యమని ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి అన్నారు. నగరంలోని నీరుగంటి వీధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముస్లిం మైనార్టీలు షఫీమహ్మద్, సమబేగం, సతాజ్ బేగం, అమానుల్లా, మస్తాన్‌వలి, షాషావలి, సమీర్‌ఖాన్, సఖిల్ అహ్మద్ తదితరులు గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు విసిగిపోయారన్నారు.
బాబు తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపారని గుర్తు చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకుని వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఆయన మరణానంతరం రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు పరాకాష్టకు చేరాయన్నారు. ఈ రెండు పార్టీలే రాష్ట్ర విభ జనకు ప్రధాన కారణమన్నారు.
టీడీపీ మొదటి నుంచి మైనార్టీలను మోసం చేస్తోందన్నారు. మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు. రాష్ట్రంలో సమర్థ నాయకుడైన జగన్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. తన తండ్రిలాగా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు మేలు చేస్తారన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్‌లను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం తథ్యమన్నారు. పార్టీలో చేరిన షఫీమహ్మద్ మాట్లాడుతూ మైనార్టీలకు న్యాయం చేసే ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని అన్నారు.
సీపీఐ నుంచి 200 మంది వైఎస్సార్‌సీపీలోకి
బిందెల కాలనీలో సీపీఐ నుంచి 200 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. చేరిన వారిలో నారాయణస్వామి, యల్లప్ప, ఆదెప్ప, సుంకన్న, పెద్దమారెన్న, ఆంజినేయులు, కుళ్లాయప్ప, వీరయ్య, ఎం స్వామి, చిన్నమారెన్న, సీ మల్లిక, కుళ్లాయప్ప, శంకరయ్య, మిద్దె లింగరాజు, బీబీపాతిమా, మారెక్క, సరస్వతి తదితరులు ఉన్నారు. వీరికి ఎమ్మెల్యే గురునాథరెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.