అనంతపురంలో బంద్ పాక్షికం | cpi calls for ananthpuram distirict bandh | Sakshi
Sakshi News home page

అనంతపురంలో బంద్ పాక్షికం

Published Sat, Mar 14 2015 1:14 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

cpi calls for ananthpuram distirict bandh

అనంతపురం:  అనంతపురం జిల్లాలో సీపీఐ పిలుపు మేరకు శనివారం నిర్వహిస్తున్న బంద్ పాక్షికంగా జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా సీపీఐ పలువురు ప్రజాప్రతినిధుల నివాసాలు ముట్టడించినందుకు పోలీసులు పలువురు కార్యకర్తలను శుక్రవారం అరెస్ట్ చేశారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సీపీఐ బంద్‌కు పిలుపునిచ్చింది.

బంద్ సందర్భంగా జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొంతమంది నిరసనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా సీపీఐ పిలుపునిచ్చిన బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసన వ్యక్తం చేసిన సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ ఖండించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement