కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి | general elections | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి

Published Thu, Apr 10 2014 3:52 AM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి - Sakshi

కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి

 హుజూర్‌నగర్, న్యూస్‌లైన్,అధికారాన్ని అడ్డం పెట్టుకొని నియంతృత్వ పాలన కొనసాగిస్తూ అవినీతికి ఊతమిచ్చిన కాంగ్రెస్ పార్టీని సాధారణ ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

 అనంతరం పబ్లిక్ క్లబ్‌లో నిర్వహించిన సభలో మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అనర్హులకు అమ్ముకొని సొమ్ము చేసుకున్న అధికార పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాపారంగా మార్చేశారన్నారు. ఇల్లు మంజూరు చేయిస్తే ఒక రేటు, బిల్లులు ఇప్పిస్తే మరో రేటు అంటూ హౌసింగ్ కార్యాల యాలను పైరవీకారులకు అడ్డాలుగా మార్చారన్నారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా రాజకీ యం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు.

 నియోజకవర్గవ్యాప్తంగా పేకాటక్లబ్‌లు, ఇసుక దందాలు నిర్వహించి అక్రమంగా సొమ్ము సం పాదించి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక, భవిష్యత్‌లో ఇబ్బంది అవుతుందని తనపై అనేక అక్రమ కేసులు పెట్టించారని ఆరోపించారు. అయినా ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు తనను ఆదరించారని, వారి ఆదరణ ఫలితంగానే గడిచిన నాలుగేళ్లుగా నియోజకవర్గంలో నిలబడగలిగామని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్ సీపీని గెలిపించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లాగా పని చేయాలని కోరారు.

ఈ ఎన్నికలలో వైఎస్సార్ సీపీని గెలిపిస్తే మీలో ఒకడిగా, మీ కుటుంబ సభ్యునిగా నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ సంక్షేమ రాజ్యం మళ్లీ రావాలంటే వైఎస్సార్ సీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

 ఈ కార్యక్రమంలో పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేములశేఖర్‌రెడ్డి, బొల్లగాని సైదులు, పోరెడ్డి నర్సిరెడ్డి, చిలకల శ్రీనివాసరెడ్డి, జాల కిరణ్‌యాదవ్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, పోతుల జ్ఞానయ్య, గాదె లూర్థుమర్రెడ్డి, పెదప్రోలు సైదులు, నాయకులు దొంతిరెడ్డి సంజీవరెడ్డి, చింతరెడ్డి కృష్ణారెడ్డి, కుందూరు సత్యనారా యణరెడ్డి, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి,గుర్రం వెంకటరెడ్డి,పులిచింతల వెంకట రెడ్డి, మర్రి రవీందర్‌రెడ్డి, శంభిరెడ్డి, పెండెం ముత్యాలుగౌడ్, గుండు రామాంజి గౌడ్, మర్ల శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement